తన వ్యాపార నైపుణ్యాలతో అనేక రంగాల్లో అగ్రగామిగా రాణిస్తూ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన ముఖేష్ అంబానీ గురించి అందరికీ తెలిసిందే. రూ.17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా అనేక స్టార్టప్ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. అలా వాటికి యాజమానిగా ఉన్నారు. ఈ సార్టప్ కంపెనీల్లో మిల్క్‌బాస్కెట్ కూడా ఒకటి. ఇది త్వరలో కనుమరుగు కానుంది.
మిల్క్‌బాస్కెట్ అనేది 2015లో ప్రారంభించిన ఒక సబ్‌స్క్రిప్షన్ ఆధారిత గ్రోసరీ డెలివరీ స్టార్టప్. ఈ కంపెనీలో ముఖేష్ అంబానీ 2021లో 96 శాతం వాటాను కొనుగోలు చేశారు. అలా మిల్క్‌బాస్కెట్ యాజమాన్య సంస్థగా మారిన రిలయన్స్ రిటైల్.. ఆ కంపెనీని తనలో కలిపేసుకోనుంది. తద్వారా మిల్క్‌బాస్కెట్ బ్రాండ్ శాశ్వతంగా కనుమరుగు కానుంది. దీన్ని జియో స్మార్ట్ డైలీ పేరుతో పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి ➤ JioBharat phone: సక్సెస్‌ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే..
మిల్క్‌బాస్కెట్ కంపెనీని జియోమార్ట్‌తో కలిపేస్తున్న నేపథ్యంలో అందులో పనిచేస్తున్న సిబ్బంది భవితవ్యం ప్రశ్నాత్నకంగా మారింది. ప్రస్తుతం ఈ సంస్థలో ఆఫ్‌లైన్ మార్కెటింగ్, సేల్స్, హెడ్ ఆఫీస్ టీమ్‌తో సహా దాదాపు 600 మంది ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, గుర్గావ్, నోయిడా, గ్రేటర్ నోయిడా సహా పలు ప్రాంతాల్లో మిల్క్‌బాస్కెట్ బిజినెస్ టు కస్టమర్ (B2C) స్పేస్‌లో సేవలు అందిస్తోంది. దీనికి పోటీగా కంట్రీ డిలైట్, డైలీ నింజా వంటి సంస్థలు ప్రస్తుతం వ్యాపారం నిర్వహిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment