
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇటీవల భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటారు. దాంతోపాటు ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ రికార్డు సృష్టించారు. అదెలా అనుకుంటున్నారా.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియోహాట్‌స్టార్ భారత్-పాక్ మ్యాచ్‌ను ప్రసారం చేసే ప్రత్యేక హక్కులను కలిగి ఉంది. దాంతో కొన్ని గంటలపాటు సుమారు 12 కోట్ల మందికిపైగా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. కంపెనీకి ఇతర ప్రసార హక్కులు, యాడ్ రెవెన్యూ ద్వారా బారీగానే ఆదాయం సమకూరినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో భారత్-పాక్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతోపాటు దీన్ని అందరూ వీక్షించేందుకు ప్రసార హక్కులు సాధించిన ముఖేశ్ అంబానీ కూడా విజేతగానే నిలిచినట్లు భావిస్తున్నారు.
రిలయన్స్ ఇటీవలే అధికారికంగా హాట్‌స్టార్‌తో కలిసి జియోహాట్‌స్టార్‌ను ఆవిష్కరించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు కంపెనీలకు ఎంతో లాభదాయకమని రెండు సంస్థలు గతంలో తెలిపాయి. ఇటీవల జరిగిన ఒక్కమ్యాచ్‌లోనే భారీగా రెవెన్యూ సంపాదించినట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని ముందే గ్రహించిన కోట్లాదిమంది వ్యూయర్స్ జియోహాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించారు. ఇది ప్లాట్‌ఫామ్ వ్యూయర్‌షిప్‌ను పెంచడమే కాకుండా ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్లను, సంస్థ ఆదాయాన్ని కూడా పెంచింది. అంతేకాకుండా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని మరో ఛానెల్ స్పోర్ట్స్ 18 ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో ప్రసారం చేసే హక్కులను కలిగి ఉంది. దీంతో అంబానీ కంపెనీ ఆన్‌లైన్, టీవీ వ్యూయర్‌షిప్ రెండింటి నుంచి లాభపడింది.
ఇటీవల భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటారు. 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో కోహ్లీ సెంచరీ (111 బంతుల్లో 100) చేశారు. మరో 7.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో భారత్ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం సెమీఫైనల్లో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే కాకుండా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వన్డేల్లో పాకిస్థాన్‌పై రికార్డు నెలకొల్పింది.
ఇదీ చదవండి: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..! ధర ఎంతంటే..
జియోహాట్‌స్టార్ ప్లాన్లు ఇలా..
రూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్‌ల మాదిరిగా ఈ ఆఫర్‌లో వాయిస్ లేదా ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్‌స్టార్‌ను మొబైల్‌లో మాత్రమే వీక్షించగలరు.
రీచార్జ్ ఇలా..
వినియోగదారులు ఈ ఆఫర్‌ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్‌సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.
మరో ప్లాన్
రూ.195 డేటా ప్లాన్‌తోపాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment