Startup Company
-
ఒత్తిడిలో ఉన్నారా...? ఉద్యోగం ఉఫ్
సంస్థలో సరదాగా అంతర్గత సర్వే అంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా స్పందిస్తారు. సర్వేలో అడిగే ప్రశ్నలు వివాదాస్పదమైనవి కాకుండా సాధారణంగా ఉంటే ఏ ఉద్యోగి అయినా స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా సమాధానమిస్తారు. తమ అభిప్రాయాలను సంస్థ యాజమాన్యంతో పంచుకుంటారు. అలా ఉద్యోగులు చెప్పిన విషయాలే తమ ఉద్యోగం ఊడటానికి కారణమని సదలు ఉద్యోగులు తెల్సుకుని షాక్‌కు గురయ్యారు. ఉద్యోగుల్ని తొలగించే ఉద్దేశ్యం ఉంటే నేరుగా ఆ ఉద్యోగులకు చెప్పాలిగానీ ఇలా సర్వే వంకతో ఉద్యోగం నుంచి తొలగించడమేంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నోయిడా కేంద్రంగా పనిచేసే ఒక అంకుర సంస్థ చేసిన నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. యస్ అని చెబుతున్నారా? పనివేళల్లో పని కారణంగా మీరు ఒత్తిడికి గురి అవుతున్నారా? అంటూ ‘యస్మేడమ్’అనే అంకురసంస్థ తన ఉద్యోగులతో అంతర్గత ఈమెయిల్ సర్వే చేపట్టింది. ఈ సంస్థ ఇంటి వద్ద హెయిర్ కటింగ్, మసాజ్, ఇతరత్రా బ్యూటీ, వెల్నెస్ సేవలను అందిస్తోంది. ఈ సర్వేలో భాగంగా చాలా మంది ఉద్యోగులు తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేశారు. వీటిని సేకరించిన సంస్థ.. ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాం అని సమాధానం చెప్పిన వారందరినీ తొలగిస్తున్నట్లు వాళ్లకు విడిగా ఈమెయిల్ సందేశాలు పంపింది. ఇతర ఉద్యోగులకు వివరణ సందేశాలు పంపింది. ‘‘ఒత్తిడి ఉందా అని మేం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి సర్వేలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ స్పందనకు మేం చాలా విలువ ఇస్తున్నాం. పనిచేసేటప్పుడు ఒక్కరు కూడా ఒత్తిడిగా ఫీల్ అవ్వకూడదు అనేది సంస్థ సిద్ధాంతం. ఈ మేరకు ఉద్యోగుల విషయంలో సంస్థ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తదుపరి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని కంపెనీ పేర్కొంది. కంపెనీ మానవవనరుల విభాగ సారథి అషు అరోరా ఝా పేరిట వచ్చిన ఈమెయిల్ సందేశాలను చూసి సదరు ఉద్యోగులు అవాక్కయ్యారు. ‘‘ఒత్తిడిగా ఉందని చెబితే పిలిచి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలిగానీ ఇలా ఏకంగా ఉద్యోగం ఊడపీకేస్తారా? అంటూ జాబ్ కోల్పోయిన ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేలో ‘యస్’అని చెప్పిన దాదాపు 100 మందిని సంస్థ తొలగించిందని తెలుస్తోంది. ఇండిగో డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ డైరెక్టర్ శితిజ్ డోగ్రా చేసిన ఒక పోస్ట్‌తో ఈ ‘ఉద్యోగుల ఉద్వాసన పర్వం’వెలుగులోకి వచ్చింది. ‘‘నిజాయతీగా సమాధానం చెబితే సంస్థ ఇలాంటి మతిలేని నిర్ణయం తీసుకుంటుందా?’’అని చాలా మంది నెటిజన్లు సంస్థ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ఆలిండియా ఎంప్లాయీ అసోసియేషన్ స్పందించింది. ‘‘కార్మిక వ్యవస్థలోని లోపాలను కొన్ని సంస్థలు పూర్తిగా దురి్వనియోగం చేస్తున్నాయి. ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్తోమత లేకపోతే ముందుగా అసలు ఉద్యోగాల్లోకి తీసుకోకండి. ఆరోగ్యకరమైన ఉద్యోగ వాతావరణాన్ని కల్పించలేకపోతే ఎవరికీ ఉద్యోగం ఇవ్వకండి. పిచ్చిపిచ్చి కారణాలు చెప్పి ఉద్యోగులను మానసికంగా వేధించకండి’’అని వ్యాఖ్యానించింది. ‘‘హేతుబద్దత లోపించిన అనైతిక నిర్ణయం ఇది. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు సంస్థలు ఇలాంటి చవకబారు నిర్ణయాలు తీసుకుంటారని ఇప్పుడే చూస్తున్నాం. ఉద్యోగలు పనిసమయాల్లో ఒత్తిడిగా ఫీల్ అయ్యారోలేదో తెలీదుగానీ ఈ వార్త తెల్సి నిజంగా చాలా ఒత్తిడికి గురై ఉంటారు. ఇది అందరూ ఒత్తిడిగా ఫీల్ అయ్యే ఘటన’’అని పలువురు పెదవి విరిచారు. -
అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లకు మద్దతు
న్యూఢిల్లీ: అంతరిక్షరంగంలో స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రూ.1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని∙మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్‌తో దాదాపు 35 స్టార్టప్ కంపెనీలకు మద్దతు లభించే అవకాశం ఉంది. దీనివల్ల అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీలో ఆధునిక పరిశోధనలతోపాటు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో భారత్ నాయకత్వం బలోపేతం కావడానికి ఈ నిధి దోహదపడతుందని చెబుతున్నారు. వేయి కోట్లతో నిధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ నిధి నుంచి అర్హత కలిగిన స్టార్టప్‌ల్లో రెండు దశల్లో పెట్టుబడులు పెడతారు. మొదటి దశలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, రెండో దశలో రూ.10 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 57 కిలోమీటర్ల నూతన రైలు మార్గంతోపాటు ఉత్తర బిహార్‌లో 256 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ డబ్లింగ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల విలువ రూ. 6,798 కోట్లు. ఇందులో అమరావతిలో రైల్వే లైన్‌కు రూ.2,245 కోట్లు ఖర్చు చేయనున్నారు. -
Netherlands: విద్యుత్ విమానం వచ్చేస్తోంది...
ప్రపంచమంతటా విద్యుత్ వాహనాల హవా పెరిగిపోతోంది. అదే బాటలో త్వరలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం కూడా రానుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 805 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగేలా దీన్ని తయారు చేస్తున్నట్టు నెదర్లాండ్స్‌కు చెందిన ఎలిసియాన్ అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. ఈ9ఎక్స్‌గా పిలుస్తున్న ఈ విమానంలో 90 మంది ప్రయాణించవచ్చు. దీన్ని 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ చెబుతోంది. ‘‘అప్పటికల్లా విద్యుత్ బ్యాటరీల సామర్థ్యం బాగా పెరుగుతుంది. కనుక మా విమానం ప్రయాణ రేంజ్, మోసుకెళ్లగలిగే ప్రయాణికుల సంఖ్య కూడా కచ్చితంగా పెరుగుతాయి’’ అని కంపెనీ డిజైన్, ఇంజనీరింగ్ డైరెక్టర్ రేనార్డ్ డి వ్రైస్ వివరించారు. వీలైనంత తక్కువ బరువు, అదే సమయంలో పూర్తిస్థాయి భద్రత, గరిష్ట సామర్థ్యం ఉండేలా విమానాన్ని డిజైన్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘‘ఈ9ఎక్స్ చూసేందుకు 1960ల నాటి జెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో 8 ప్రొపెల్లర్ ఇంజన్లు, బోయింగ్ 737, ఎయిర్‌బస్ ఏ230లను కూడా తలదన్నేలా 42 మీటర్ల పొడవైన రెక్కలుంటాయి’’ అని తెలిపారు. ఒక్కసారి మార్కెట్లోకి వచ్చిందంటే దేశీయంగా తక్కువ దూరాలకు తమ విమానమే బెస్ట్ ఆప్షన్‌గా మారుతుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘అంతేకాదు, వాయు, శబ్ద కాలుష్యం కారణంగా విమా నాల రాకపోకలపై ఆంక్షలున్న ద్వితీయశ్రేణి నగరాలకు మా విమానం వరప్రసాదమే కాగలదు. పైగా ప్రయాణ సమయంలో విమానం లోపల ఎలాంటి శబ్దాలూ విని్పంచవు. ఇది ప్రయాణికులకు చక్కని అనుభూతినిస్తుంది. ప్రస్తుత విమానాల్లో క్యాబిన్ లగేజీ పెద్ద సమస్య. మా విమానంలో క్యాబిన్ లగేజీ సామర్థ్యాన్ని బాగా పెంచడంపైనా డిజైనింగ్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాం. అదనపు క్యాబిన్ లగేజ్ ప్రయాణికులకు బాగా ఆకట్టుకునే అంశంగా నిలుస్తుంది’’ అని చెబుతున్నారు.అరగంటలో చార్జింగ్ ఎలక్ట్రిక్ వాహనం అనగానే ప్రధానంగా ఎదురయ్యే సమస్య చార్జింగ్. విపరీత మైన పోటీ నెలకొని ఉండే దేశీయ వైమానిక రంగంలో విమానం ఎంత త్వరగా తర్వాతి ప్రయాణానికి సిద్ధమవుతుందన్నది చాలా కీలకం. ముఖ్యంగా చౌక విమానయాన సంస్థలకు ప్రయాణికుల ఆదరణను నిర్ణయించడంలో దీనిదే కీలక పాత్ర. ‘‘ఈ అంశంపైనా ఇప్పట్నుంచే దృష్టి సారించాం. అరగంటలోనే విమానం ఫుల్ చార్జింగ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని వ్రైస్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డెవిన్‌కు చెప్తే.. అంతా రెడీ!.. ఏఐకి చెప్తే.. వెబ్సైట్ రెడీ!
కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్‌లకు చిన్న సూచన చేస్తే.. మనకు కావాల్సినట్టుగా ఫొటోలను తయారు చేసి పెడుతున్నాయి.. కావాల్సినట్టుగా వీడియోలనూ రూపొందిస్తున్నాయి.. అడిగిన డేటాను నెట్లో సెర్చ్ చేసిపెడుతున్నాయి.. అనుమానాలు ఉంటే తీరుస్తున్నాయి.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడే ఏకంగా వెబ్సైట్లను, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసిపెట్టగల ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’ వచ్చేసింది. ‘డెవిన్’ పేరుతో.. టెక్నాలజీ ప్రపంచంలో ఇటీవల వచ్చిన చాట్ జీపీటీ ఏఐ ప్రోగ్రామ్ ఎంతో కలకలం రేపింది. అది విద్యార్థులకు కావాల్సిన ఆర్టికల్స్ రాసిపెట్టడం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అవసరమైన కోడ్లనూ సిద్ధం చేసి ఇవ్వడం సంచలనం సృష్టించింది. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన కాగ్నిషన్ అనే స్టార్టప్ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’ను సృష్టించింది. దానికి ‘డెవిన్’’అని పేరు పెట్టింది. వెబ్సైట్లను, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసి ఇవ్వగలదని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల ఇంటర్వ్యూలను, వివిధ బెంచ్‌మార్క్ టెస్టులను ఇది విజయవంతంగా పాస్ అయిందని తెలిపింది. ఇలాంటి పూర్తిస్థాయి ఏఐ ప్రోగ్రామ్ ప్రపంచంలోనే ఇదే మొదటిది కావడం గమనార్హం. కోడ్ నుంచి డిప్లాయ్ దాకా.. సాధారణంగా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, వెబ్‌సైట్‌ను రూపొందించడంలో చాలా ప్రక్రియలు ఉంటాయి. కోడ్ రాయడం దగ్గరి నుంచి టెస్టింగ్, డీబగ్గింగ్ చేయడం, చివరికి దాన్ని డిప్లాయ్ చేయడం దాకా ఎన్నో క్లిష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న చాట్ జీపీటీ వంటి ఏఐ ప్రోగ్రామ్‌లు.. కొంతవరకు సాఫ్ట్వేర్ కోడ్లను రాసిపెట్టగలుగుతున్నాయి కూడా. అయితే తాము అభివృద్ధి చేసిన ‘డెవిన్’.. సాఫ్ట్వేర్ కోడ్ రాయడంతోపాటు.. టెస్టింగ్, డీబగ్గింగ్, డిప్లాయ్ కూడా చేయగలదని ‘కాగ్నిషన్’ కంపెనీ ప్రకటించింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగల స్థాయిలో పూర్తిస్థాయిలో పనిచేసే వెబ్‌సైట్‌ను రెడీ చేసి పెడుతుందని వివరించింది. అది కూడా జస్ట్ ఒక చిన్న కమాండ్ ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోగలదని వివరించింది. -
ఏఐకి చెప్తే..వెబ్సైట్ రెడీ!
కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్‌లకు చిన్న సూచన చేస్తే.. మనకు కావాల్సినట్టుగా ఫొటోలను తయారు చేసిపెడుతున్నాయి.. కావాల్సినట్టుగా వీడియోలనూ రూపొందిస్తున్నాయి.. అడిగిన డేటాను నెట్లో సెర్చ్ చేసిపెడుతున్నాయి.. అనుమానాలు ఉంటే తీరుస్తున్నాయి.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఏకంగా వెబ్సైట్లను, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసిపెట్టగల ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’ వచ్చేసింది. ‘డెవిన్’ పేరుతో.. టెక్నాలజీ ప్రపంచంలో ఇటీవల వచ్చిన చాట్ జీపీటీ ఏఐ ప్రోగ్రామ్ ఎంతో కలకలం రేపింది. అది విద్యార్థులకు కావాల్సిన ఆర్టికల్స్ రాసిపెట్టడం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అవసరమైన కోడ్లనూ సిద్ధం చేసి ఇవ్వడం సంచలనం సృష్టించింది. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన కాగ్నిషన్ అనే స్టార్టప్ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’ను సృష్టించింది. దానికి ‘డెవిన్’ అని పేరు పెట్టింది. వెబ్సైట్లను, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసి ఇవ్వగలదని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల ఇంటర్వ్యూలను, వివిధ బెంచ్‌మార్క్ టెస్టులను ఇది విజయవంతంగా పాస్ అయిందని తెలిపింది. ఇలాంటి పూర్తిస్థాయి ఏఐ ప్రోగ్రామ్ ప్రపంచంలోనే ఇదే మొదటిది కావడం గమనార్హం. కోడ్ నుంచి డిప్లాయ్ దాకా.. సాధారణంగా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, వెబ్‌సైట్‌ను రూపొందించడంలో చాలా ప్రక్రియలు ఉంటాయి. కోడ్ రాయడం దగ్గరి నుంచి టెస్టింగ్, డీబగ్గింగ్ చేయడం, చివరికి దాన్ని డిప్లాయ్ చేయడం దాకా ఎన్నో క్లిష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న చాట్ జీపీటీ వంటి ఏఐ ప్రోగ్రామ్‌లు.. కొంతవరకు సాఫ్ట్వేర్ కోడ్లను రాసిపెట్టగలుగుతున్నాయి కూడా. అయితే తాము అభివృద్ధి చేసిన ‘డెవిన్’.. సాఫ్ట్వేర్ కోడ్ రాయడంతోపాటు.. టెస్టింగ్, డీబగ్గింగ్, డిప్లాయ్ కూడా చేయగలదని ‘కాగ్నిషన్’ కంపెనీ ప్రకటించింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగల స్థాయిలో పూర్తిస్థాయిలో పనిచేసే వెబ్‌సైట్‌ను రెడీ చేసి పెడుతుందని వివరించింది. అది కూడా జస్ట్ ఒక చిన్న కమాండ్ ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోగలదని వివరించింది. కేవలం కంప్యూటర్లో సృష్టించడం కాకుండా.. వాస్తవంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయనేది తేల్చే ‘ఎస్‌డబ్ల్యూఈ–బెంచ్‌మార్క్’లో డెవిన్ మంచి పనితీరు చూపడం గమనార్హం. ఈ బెంచ్‌మార్క్‌లో.. చాట్ జీపీటీ–3.5 ప్రోగ్రామ్ 0.52%, చాట్ జీపీటీ–4 ప్రోగ్రామ్ 1.74%, క్లాడ్ 4.8% సాఫ్ట్వేర్ సమస్యలను పరిష్కరించగలిగితే.. డెవిన్ ఏకంగా 13.86% పరిష్కరించగలిగింది. తప్పులను గుర్తించి సరిదిద్దుకునేలా.. ‘డెవిన్’ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా పనిచేస్తుందన్న దానిపై కాగ్నిషన్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ ఏఐ ప్రోగ్రామ్‌కు కొన్నేళ్లుగా శిక్షణ ఇస్తున్నామని.. తాను చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే సామర్థ్యం కూడా ఉందని ఆయన వెల్లడించారు. ‘ఏఐ’ ప్రోగ్రామ్‌ల రాకతో భారీగా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలపైనా ఆయన స్పందించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉపయుక్తంగా ఉండేందుకు ‘డెవిన్’ను రూపొందించామని.. దీనినే పూర్తిస్థాయిలో ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’గా వినియోగించాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. వెబ్సైట్లతోపాటు మనకు కావాల్సిన విధంగా వీడియో దృశ్యాలనూ ‘డెవిన్’ రూపొందించగలదని వెల్లడించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
అంకురాల అభివృద్ధిలో మనమెక్కడ..?
భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. స్టార్లప్‌ల రూపంలో కొత్తదనాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు అందిస్తున్నాయి. అందుకు అనువుగా ఒడుదొడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నాయి. యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు మేధాహక్కులూ వేగంగా మంజూరు అవుతున్నాయి. భారత్‌లో దాదాపు 110 యూనికార్న్ కంపెనీలు.. ప్రపంచంలో అంకురాల సంఖ్యలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023 అక్టోబరు నాటికి దేశంలోని 763 జిల్లాల్లో డీపీఐఐటీ గుర్తింపు పొందిన 1,12,718 అంకురాలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రపంచంలో నవీకరణ, నాణ్యత పరంగా చూస్తే మన స్టార్టప్‌లు రెండో స్థానంలో నిలుస్తున్నాయి. 100 కోట్ల డాలర్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. అలాంటివి భారత్‌లో 110 వరకు ఉన్నాయి. అమెరికా, చైనాల తరవాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్‌లు ఉన్నది భారత్‌లోనే. ఒక్క 2022లోనే భారత్‌లో 42 టెక్నాలజీ అంకురాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ వెన్నుదన్నుతో ఇవి సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐదు విభాగాల్లో డీపీఐఐటీ ర్యాంకింగ్‌లు.. స్టార్టప్‌ల వృద్ధికి అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇటీవల ఐదు రకాల ర్యాంకులను ఇచ్చింది. ఇందులో బెస్ట్ పర్ఫార్మర్స్, టాప్ పర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింజ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ విభాగాల్లో గుర్తింపు ఇస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి జనాభా ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్నవి, కోటి కంటే తక్కువ ఉన్నవిగా వర్గీకరించారు. ‘లీడర్స్’ కేటగిరీలో ఏపీ టాప్.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను 'లీడర్స్' కేటగిరీలో చేర్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆంత్రప్రెన్యూర్ల కోసం బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్ణాటకలు బెస్ట్ పర్ఫార్మర్లుగా ర్యాంకులు తెచ్చుకున్నాయి. ఇదే లిస్టులో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ తరువాత స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ వరుసగా నాలుగోసారి బెస్ట్ స్టేట్‌గా నిలిచింది. కర్ణాటక ఈ విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలు టాప్ పర్ఫార్మర్స్గా ఎంపికయ్యాయి. బిహార్, హరియాణా, అండమాన్ నికోబార్ దీవులు, నాగాలాండ్‌లు ఆస్పైరింగ్ లీడర్స్ విభాగంలో వరుస స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, దిల్లీ, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లద్ధాఖ్, మిజోరాం, పుదుచ్చేరి , సిక్కింలు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ విభాగంలోకి చోటుసాధించాయి. ఇదీ చదవండి: తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! వీటి ఆధారంగానే ర్యాంకింగ్‌లు.. ఇన్నోవేషన్లను ప్రోత్సహించడం, మార్కెట్ యాక్సెస్, ఇంక్యుబేషన్ ఫండింగ్ సపోర్ట్ వంటి 25 యాక్షన్ పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు ఎలాంటి సాయం అవసరమో తెలుసుకోవాలని అధికారులను కోరారు. స్టార్టప్‌లు పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌ల వంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్‌లు) నమోదు కోసం డీపీఐఐటీ సాయం తీసుకోవాలని అన్నారు. -
గోవాలో స్టార్టప్ సీఈఓ దారుణం.. ఆపై బెంగళూరుకు..
పనాజీ: బెంగళూరులో ఓ స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తున్న మహిళా సీఈఓ గోవాలో దారుణానికి ఒడిగట్టింది. తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసి మృతదేహాన్ని కర్ణాటక వరకు తీసుకువెళ్లింది. బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెల్సిజెన్స్‌కు సంబంధించిన మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీకి సుచనా సేథ్ సీఈఓగా ఉన్నారు.అయితే ఆమె గోవాలోని ఓ అపార్టుమెంట్ భవనంలో తన నాలుగెళ్ల కుమారుడిని చంపినట్లు తెలుస్తోంది. తర్వాత ఆమె తన కొడుకు మృతదేహాన్ని బ్యాగ్‌లో మూటకట్టి టాక్సీలో కర్ణాటకకు తీసుకువెళ్లింది. మంగళవారం జరిగిన ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు. టాక్సీలో ఉన్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఆరెస్ట్ చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బెంగళూరు చెందిన మహిళ.. గోవాలో తన కొడుకును హత్య చేయడానికి గల కారణాలపై లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. చదవండి: రూ.45 వేలకోట్లతో రివర్‌క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా.. -
ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్!
ఆధునిక కాలంలో ఫుడ్, కూరగాయలు వంటి వస్తువులను డోర్ డెలివరీ పొందుతున్నారు. వీటి కోసం ప్రస్తుతం అనేక సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ (పెట్రోల్ అండ్ డీజిల్) కూడా డోర్ డెలివరీ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ప్రస్తుతం దేశంలో స్టార్టప్ కల్చర్ పెరిగిపోతోంది. కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. స్విగ్గి, జొమాటో తరహాలోనే వాహన వినియోగదారులకు అవసరమైన పెట్రోల్ డోర్ డెలివరీ చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఒక భార్యాభర్తల జంట (చేతన్ వాలుంజ్ & అదితి భోసలే) రెపోస్ ఎనర్జీ (Repos Energy) ప్రారంభించారు. రెపోస్ ఎనర్జీ పెళ్లి తరువాత ఎలాగైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనతో అదితి, చేతన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అనుకున్నట్లుగానే సంస్థను పూణేలో ప్రారంభించారు. ప్రస్తుతం ఇది భారతదేశం మొత్తం మీదే సుమారు 65 నగరాల్లో విస్తరించి ఉంది. డోర్ టు డోర్ పెట్రోల్ డెలివరీ చేసి బాగా ఆర్జిస్తున్నారు. రెపోస్ ఎనర్జీ ద్వారా వినియోగదారులకు, కంపెనీలకు పెట్రోల్ సరఫరా చేసి నెలకు రూ. 2.2 కోట్లు వరకు సంపాదిస్తున్నారు. ప్రారంభంలో వీరి ఆదాయం నెలకు రూ. 70,000 మాత్రమే. ఈ జంట చేస్తున్న బిజినెస్ చాలామంది పెద్ద పారిశ్రామిక వేత్తలను కూడా ఆకర్శించింది. వీరి కొత్త ఆలోచనకు ముగ్దుడైన రతన్ టాటా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు. దీంతో వారి బిజినెస్ మరింత వేగంగా ముందుకు వెళ్లడం ప్రారంభించింది. గతేడాది వీరి ఆదాయం రూ. 65 కోట్లకు చేరింది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ. 200 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. రెపోస్ ఎనర్జీ ప్రస్తుతం టాటా గ్రూప్‌తో మాత్రమే కాకుండా.. మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ ఎలక్ట్రికల్, లార్సెన్ & టబ్రో, షిండ్లర్, జేడబ్ల్యు మారియట్ హోటల్, ఫీనిక్స్ మాల్, ది వెస్టిన్ హోటల్ వంటి సంస్థలతో కూడా ఒప్పందాలను కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి.. మరింత లాభాలు పొందటానికి సంస్థ సన్నద్ధమవుతోంది. -
మొక్క పైనే పిచికారీ చేసే రోబో!
పంటలపై చీడపీడీలను అదుపు చేయడానికి పొలాల్లో విష రసాయనిక పురుగుమందులను పిచికారీ చేస్తుంటాం. అయితే, డ్రోన్ల ద్వారా చల్లినా, స్ప్రేయర్లతో చల్లినా.. పంట మొక్కలపైనే కాకుండా పొలం అంతటా నేలపైన కూడా పురుగుమందు పడుతూ ఉంటుంది. దీని వల్ల పురుగుమందు వృథా అవ్వటమే కాకుండా, భూసారం కూడా నాశనమవుతుంది. ఈ సమస్యలకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ నైకో రోబోటిక్స్ చక్కటి పరిష్కారం కనుగొంది. మొక్కలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, వాటిపైన మాత్రమే పురుగుమందును పిచికారీ చేసే అధునాతన రోబోను రూపొందించింది. కృత్రిమ మేధతో నడిచే ఈ స్పాట్ స్ప్రేయర్ రోబోలపై ఆ సంస్థ పేటెంట్ కూడా పొందింది. తమిళనాడులో పుట్టిన జైసింహ అమెరికాలో బీటెక్ ఈసీఈ చదివి కువైట్‌లో ఏడేళ్లు పనిచేసి, స్వదేశానికి వచ్చేశారు. పిచికారీ పద్ధతులను ఆధునీకరిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి బెంగళూరు కేంద్రంగా 2015లో నైకో రోబోటిక్స్‌ను నెలకొల్పారు. ఈ రోబో ఎలా పనిచేస్తుందంటే..? ఈ రోబో ప్రత్యేకతలు ఏమిటంటే.. దీనికి 5 మీటర్ల పొడవైన రెక్కలు రెండు వైపులా ఉంటాయి. ఏకకాలంలో పది మీటర్ల వెడల్పున ఇది పిచికారీ చేయగలదు. ఈ రెక్కలకు కృత్రిమ మేధతో కూడిన కళ్లను అమర్చారు. ఈ కళ్లు మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తాయి. మొక్కలు ఉన్న చోట రోబో రెక్కకు ఉన్న నాజిళ్లు తెరచుకొని పురుగుమందును పిచికారీ చేస్తాయి. మొక్క లేకుండా ఖాళీ నేల ఉన్న చోట రోబో రెక్కలకు ఉన్న నాజిళ్లు తెరచుకోవు. కాబట్టి అక్కడ పురుగుమందు పడదు. 60% పురుగుమందు ఆదా ఈ రోబోతో పిచాకారీ చేస్తే.. 60% పురుగుమందు ఆదా కావటంతో పాటు.. భూ/వాయు కాలుష్యం కూడా ఆ మేరకు తగ్గుతుందని సంస్థ చెబుతోంది. గత ఏడాది నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పత్తి, సోయాబీన్స్, మిర్చి వంటి పంట పొలాల్లో పురుగుమందులు చల్లుతున్న ఈ ఏఐ రోబోలు అక్కడి రైతుల మనసులు చూరగొన్నాయని చెబుతున్నారు. ఎకరానికి రూ.350ల చొప్పున అద్దె చెల్లించి రైతులు తమ పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేయించుకుంటున్నారు. అకోలాకు చెందిన పత్తి, సోయా రైతు యోగేశ్ రౌత్ తన 30 ఎకరాల్లో ఈ రోబో ద్వారా పురుగుమందులు పిచికారీ చేయించుకున్నారు. కూలీలతో పిచికారీ చేయిస్తే ఎకరానికి రూ.1200 ఖర్చయ్యేదని, ఈ రోబో ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే 500 మంది రైతులు లక్ష ఎకరాల్లో అద్దె రోబోలు పిచికారీ చేశాయట. పురుగుమందులనే కాదు ద్రవరూప ఎరువులు, సేంద్రియ ద్రావణాల పిచికారీకి కూడా ఈ రోబోలు ఉపయోగకరమే. (చదవండి: జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం) -
ఆ స్టార్టప్ కంపెనీ ఇక కనిపించదు! ఉద్యోగులు ఉంటారో.. ఊడతారో..
తన వ్యాపార నైపుణ్యాలతో అనేక రంగాల్లో అగ్రగామిగా రాణిస్తూ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన ముఖేష్ అంబానీ గురించి అందరికీ తెలిసిందే. రూ.17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా అనేక స్టార్టప్ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. అలా వాటికి యాజమానిగా ఉన్నారు. ఈ సార్టప్ కంపెనీల్లో మిల్క్‌బాస్కెట్ కూడా ఒకటి. ఇది త్వరలో కనుమరుగు కానుంది. మిల్క్‌బాస్కెట్ అనేది 2015లో ప్రారంభించిన ఒక సబ్స్క్రిప్షన్ ఆధారిత గ్రోసరీ డెలివరీ స్టార్టప్. ఈ కంపెనీలో ముఖేష్ అంబానీ 2021లో 96 శాతం వాటాను కొనుగోలు చేశారు. అలా మిల్క్‌బాస్కెట్ యాజమాన్య సంస్థగా మారిన రిలయన్స్ రిటైల్.. ఆ కంపెనీని తనలో కలిపేసుకోనుంది. తద్వారా మిల్క్‌బాస్కెట్ బ్రాండ్ శాశ్వతంగా కనుమరుగు కానుంది. దీన్ని జియో స్మార్ట్ డైలీ పేరుతో పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి ➤ JioBharat phone: సక్సెస్‌ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే.. మిల్క్‌బాస్కెట్ కంపెనీని జియోమార్ట్‌తో కలిపేస్తున్న నేపథ్యంలో అందులో పనిచేస్తున్న సిబ్బంది భవితవ్యం ప్రశ్నాత్నకంగా మారింది. ప్రస్తుతం ఈ సంస్థలో ఆఫ్‌లైన్ మార్కెటింగ్, సేల్స్, హెడ్ ఆఫీస్ టీమ్‌తో సహా దాదాపు 600 మంది ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, గుర్గావ్, నోయిడా, గ్రేటర్ నోయిడా సహా పలు ప్రాంతాల్లో మిల్క్‌బాస్కెట్ బిజినెస్ టు కస్టమర్ (B2C) స్పేస్‌లో సేవలు అందిస్తోంది. దీనికి పోటీగా కంట్రీ డిలైట్, డైలీ నింజా వంటి సంస్థలు ప్రస్తుతం వ్యాపారం నిర్వహిస్తున్నాయి. -
ఆగని ఉద్యోగాల కోత! ఆ సంస్థ నుంచి మళ్ళీ 340 మంది..
కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను భారీగా తొలగించింది. ఆ ప్రభావం ఇప్పటికి కూడా ఉద్యోగులపైన అలాగే ఉందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మరో కంపెనీ తాజాగా సుమారు 30 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. అమెరికాకు చెందిన అటానమస్ డెలివరీ రోబోట్ స్టార్టప్ న్యూరో తన క్యాపిటల్ రన్‌వేను మరింత విస్తరించడానికి 30 శాతం మంది లేదా 340 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. గత వారంలో న్యూరో కో-ఫౌండర్స్ 'డేవ్ ఫెర్గూసన్ అండ్ జియాజున్ ఝూ' మాట్లాడుతూ.. కంపెనీ సిబ్బందిని తగ్గించి వనరులను వాణిజ్య కార్యకలాపాల నుంచి రీసర్చ్ & డెవెలప్మెంట్ వైపు మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది కంపెనీ తమ మూడవ జనరేషన్ డెలివరీ రోబోట్స్ వాణిజ్య కార్యకలాపాలను పెంచడంతో పాటు వాల్యూమ్ ఉత్పత్తిని ఆలస్యం చేయడానికి తమ ప్రణాళికలను ఫాజ్ చేస్తుంది. ఈ మార్పుల వల్ల కంపెనీ మునుపటికంటే రెండు రెట్లు ఎక్కువ పని చేసే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: Apna Founder Success Story: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) గతంలో కూడా కంపెనీ అటానమస్ సిస్టం అభివృద్ధి చేసింది. దీని కోసం కస్టమ్ వెహికల్స్ కూడా రూపొందించింది. అయితే ఈ కొత్త విధానం న్యూరో ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేసే అవకాశం ఉందని బలంగా భావిస్తున్నారు. వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు క్యాపిటల్ రన్‌వేను విస్తరించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఉద్యోగులను తొలగించడం ఇది రెండవ సారి. కంపెనీ గత ఏడాది నవంబర్ నెలలో కూడా సుమారు 20 శాతం లేదా 300 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఇప్పుడు మరో సారి ఉద్యోగాల కోతలు సుమారు 340 మంది ఉద్యోగులపైన ప్రభావం చూపుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
సైన్యానికి దన్నుగా స్వయ
సాక్షి, హైదరాబాద్: రక్షణరంగ అవసరాల కోసం దేశంలోనే తొలిసారిగా నాలుగు కాళ్ల రోబో, సైనికులు ధరించగల ఎక్సోస్కెలిటన్ నమూనాలు సిద్ధమయ్యాయి. డీఆర్డీవో అనుబంధ సంస్థలైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ బయో–ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీల సహాయ సహకారాలతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్వయ రొబోటిక్స్ వీటిని రూపొందించింది. ఈ నమూనాలను రక్షణశాఖ సలహాదారు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి సోమవారం ఆయన పరిశీలించారు. రక్షణ, డీఆర్డీవో వర్గాలతో కలసి రోబో తయారీ అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో రానున్న కాలంలో రోబోలదే కీలకపాత్రని స్పష్టం చేశారు. ప్రతికూల భౌగోళిక పరిస్థితులను అధిగమించి నిఘా పనులు చేసేందుకు, సైనికుల మోతబరువును తగ్గించడంలోనూ రోబోల సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ‘‘అతితక్కువ కాలంలో స్వయ రోబోటిక్స్ వీటిని (రోబో, ఎక్సోస్కెలిటన్లను) రూపొందించడం హర్షణీయం. దేశ రొబోటిక్స్ రంగం పురోగతికి ఇలాంటి భాగస్వామ్యాలు ఎంతో ఉపయోగపడతాయి. క్షేత్ర పరీక్షలు వేగంగా పూర్తి చేసి అటు రక్షణ, ఇటు పరిశ్రమ వర్గాలకు ఉపయోగపడే ఈ రకమైన రోబోలను వేగంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం’’అని సతీశ్‌రెడ్డి చెప్పారు. డీఆర్డీవో ‘మేకిన్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా స్వయ రోబోటిక్స్ వంటి ప్రైవేటు సంస్థలతో రోబోలను తయారు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇలాంటి సైనిక రోబోలను అమెరికా, స్విట్జర్లాండ్ల నుంచి దిగుమతి చేసుకుంటుండగా లేహ్, లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో అవి పనిచేయలేవు. ఎందుకంటే వాటిని నిర్దిష్ట పరిసరాల్లోనే పనిచేసేలా రూపొందించారు. పైగా వాటిల్లో ఫీచర్లు కూడా తక్కువ. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు స్వయ రోబోలు ఉపయోగపడతాయని అంచనా. రెండేళ్లలో మిలటరీకి: విజయ్ శీలం రక్షణ శాఖ అవసరాలకోసం సిద్ధం చేసిన రోబో నమూనా తొలి తరానిదని.. మరిన్ని ఫీచర్లు, సామర్థ్యాలను జోడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయ రోబోటిక్స్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ ఆర్.శీలం తెలిపారు. అమెరికాలో బోస్టన్ డైనమిక్స్‌తో పాటు ఇతర దేశాల్లోని కొన్ని సంస్థలు కూడా ఇలాంటి రోబోలు తయారు చేస్తున్నా... మిలటరీ అవసరాల కోసం తామే తొలిసారి తయారు చేశామని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. సైనికులు వాడే ఆయుధాలు, సమాచార పరికరాలను ఈ రోబో సునాయాసంగా మోసుకెళ్లగలదని, ప్రమాదకర పరిస్థితుల్లోనూ శత్రు స్థావరాలను పరిశీలించి రాగలదని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ సరిహద్దులపై నిఘా ఉంచే రోబోలను ఇతర ప్రాంతాల నుంచి కూడా నియంత్రించొచ్చని వివరించారు. తొలితరం నమూనాలో నడక మాత్రమే సాధ్యమవుతుందని, సమీప భవిష్యత్తులోనే వాటికి చూపును కూడా అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో ఈ రోబో సైన్యానికి సేవలందించే అవకాశం ఉందన్నారు. పాదాల్లో ఏర్పాటు చేసిన సెన్స ర్లు, ఇతర పరికరాల ద్వారా ఈ రోబో నేల, కాంక్రీట్, రాయిల మధ్య తేడాలను గుర్తించి నడకను నియంత్రించుకోగలదని వివరించారు. -
ఇక.. రోబో సేద్యం
దుక్కి నుంచి కలుపుతీత వరకు మొక్కల వరుసల మధ్య రెండడుగుల దూరం ఉండే పంటలకు ఈ రోబో ఉపయోగం. డ్రై ల్యాండ్‌లో సాగయ్యే పత్తి, మిరప, పొగాకు, టమాటా, కూరగాయలు వంటి పంటల సాగులో దుక్కిదున్నటం, భూమి చదునుచేయడం, మొక్కలు నాటడం, విత్తడం, కలుపుతీయడం, ఎరువులు చల్లడం, పురుగుమందు పిచికారీ వంటి పనులన్నీ చేయగలదు. కావల్సిన విత్తనం, ఎరువులు, పురుగుమందులు రోబోకి అమర్చిన బాక్సులో వేసి రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. పొలం మ్యాప్‌తో మొక్కల మధ్య, వరుసల మధ్య ఎంతదూరం ఉండాలో సెట్‌చేస్తే అదే విత్తుతుంది. ఏ పనిచేయాలో సెట్‌చేసి చెబితే చాలు మానవసాయం లేకుండా చేసేస్తుంది. స్ప్రేయింగ్ పనులు మాత్రమే అయితే రోజుకు నాలుగెకరాల్లో, ఇతర పనులైతే రోజుకు రెండెకరాల్లో పూర్తిచేస్తుంది. పైలెట్ ప్రాజెక్టుగా ఈ రోబోను వరంగల్‌తో పాటు గుంటూరు పరిసర ప్రాంతాల్లో వినియోగించారు. పెట్టుబడి ఖర్చులో 30–40 శాతం తగ్గినట్లు గుర్తించారు. సాక్షి, అమరావతి: వ్యవసాయరంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. అధునాతన యంత్ర పరికరాలతోపాటు అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే డ్రోన్ స్ప్రేయర్లు రంగప్రవేశం చేయగా, తాజాగా రోబోలు కూడా సేద్యం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దుక్కుల నుంచి కలుపుతీత వరకు అన్ని పనులు చేసేలా హైదరాబాద్‌కు చెందిన ‘ఎక్స్‌మెషిన్స్’ అనే స్టార్టప్ కంపెనీ వీటిని అభివృద్ధి చేసింది. ఏపీ, తెలంగాణల్లో ఎంపికచేసిన పంటలసాగులో ప్రయోగాత్మక వినియోగంలో ఇవి సక్సెస్ కావడంతో ఖరీఫ్ సీజన్ నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పంట ఏదైనా విత్తు నుంచి కోత వరకు ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు రైతులకు భారంగా మారుతున్నాయి. పెట్టుబడి ఖర్చులో 35–40 శాతం కూలీలకే ఖర్చవుతోంది. పైగా ప్రతి దశలోను కూలీలకొరత రైతులను వేధిస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే ఎన్నో రకాల యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. రోజురోజుకు పెరిగే పెట్రో ఉత్పత్తుల ధరల కారణంగా వీటి నిర్వహణ రైతులకు భారమవుతోంది. ఈ సమస్యలను అధిగమించే లక్ష్యంతో భిన్నంగా ఆలోచించి.. నాలుగేళ్లపాటు పరిశోధించి, పరిశీలించిన ఎక్స్‌మెషిన్స్ సంస్థ ఎక్స్–100 అనే వ్యవసాయ రోబోను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 80 కిలోల బరువున్న రోబో ఈ రోబోను మైక్రో ట్రాక్టర్‌గా సంబోధిస్తున్నారు. దీంట్లో 24 వాట్స్ సామర్థ్యంగల రెండు బ్యాటరీలు, మోటారు, కంప్యూటర్, కెమెరా, సెన్సార్లు ఉన్నాయి. చిన్న రబ్బర్ టైర్లు అమర్చారు. 50 సెంటీమీటర్ల, 40 సెంటీమీటర్ల వెడల్పు, 72 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ రోబో 80 కిలోల బరువుంటుంది. ఇది 5–7 కిలోల విత్తనాలు, 25 లీటర్ల పురుగుమందులు, 25 కిలోల ఎరువులు మోయ గలిగే ఏర్పాట్లు చేశారు. మూడుగంటలు చార్జింగ్ పెడితే ఎనిమిది గంటలు నిర్విరామంగా పనిచేస్తుంది. ఒక బ్యాటరీ డిశ్చార్చ్ అవగానే ఆటోమెటిక్‌గా మరో బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. రిమోట్ కంట్రోల్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా మానవ సహాయం లేకుండా కూడా పనిచేస్తుంది. ఈ రోబో పనితీరును అధ్యయనం చేసిన తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ సాగులో వినియోగానికి ఇబ్బంది లేదని సర్టిఫై చేసింది. 40 శాతం ఆదా అవుతుంది రోబోల రాకతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. అన్ని రకాల పనులకు ఈ చిట్టి రోబోలు అనుకూలంగా ఉన్నాయి. చాలా బాగా పనిచేస్తున్నాయి. కొనుగోలుకు ఆర్డర్ కూడా పెట్టాను. వీటి సహాయంతో వ్యవసాయ పనులు చేస్తే కనీసం 40 శాతం పెట్టుబడి ఖర్చులు ఆదా అవుతాయి. – పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, రైతునేస్తం ఫౌండర్, గుంటూరు ఖరీఫ్ కల్లా అందుబాటులోకి తెస్తాం కూలీల వెతలను తీర్చడంతోపాటు వ్యవసాయ పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా వినీల్‌రెడ్డి, ధర్మతేజాలతో కలిసి ఈ రోబోను అభివృద్ధి చేశాం. నాలుగేళ్లపాటు అన్ని రకాల టెస్ట్‌లు పూర్తిచేసి మార్కెట్లోకి విడుదల చేశాం. దీని ధర రూ.1.75 లక్షలు. అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే ఖరీఫ్ సీజన్‌కల్లా ఏపీలో గుంటూరు, అనంతపురం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల రైతులకు అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – డి.త్రివిక్రమ్, వ్యవసాయ రోబో సృష్టికర్త -
ఫ్రెష్‌టుహోమ్ 104 మిలియన్ డాలర్ల సమీకరణ
న్యూఢిల్లీ: మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించే స్టార్టప్ సంస్థ ఫ్రెష్‌టుహోమ్ తాజాగా రూ. 104 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 861 కోట్లు) సమీకరించింది. అమెజాన్ ఎస్ఎంభవ్ వెంచర్ ఫండ్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన ఈ నిధులను వ్యాపార విస్తరణ కోసం వినియోగించుకోనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో 100 భౌతిక రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించనుంది. 2015లో బెంగళూరు కేంద్రంగా ఫ్రెష్‌టుహోమ్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం దేశీయంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 160 పైగా నగరాల్లోనూ వ్యాపారం నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 250 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించినట్లు సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు షాన్ కడవిల్ తెలిపారు. ప్రస్తుతం 30 రిటైల్ స్టోర్స్ ఉండగా వచ్చే 12 నెలల్లో వీటిని 130కి పెంచుకోనున్నట్లు వివరించారు. అటు సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాల్లోనూ విస్తరించనున్నట్లు తెలిపారు. 2025 ఆఖరు నాటికి ఐపీవోకి (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే యోచనలో ఉన్నట్లు కడవిల్ చెప్పారు. ప్రస్తుతం తమ వార్షికాదాయం దాదాపు రూ. 1,100 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. -
అద్భుతమైన ఏడుగురం కలిశాం: గూగుల్ మాజీ ఉద్యోగి స్టోరీ వైరల్
న్యూఢిల్లీ: ఉద్యోగం పోయిందని విచారిస్తూ కూచుంటే ఫలితం ఉండదు. ముందు కాస్త బాధపడినా త్వరగానే కోలుకొని మళ్లీ కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సిందే. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే. సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ తొలగించిన ఏడుగురు ఉద్యోగులు అదే చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి కొత్త స్టార్టప్ కంపెనీ ఆవిష్కారానికి నాందిపలికారు. ఇంకా పేరు ఖరారు చేయని వారి సంస్థ, ఇతర "స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి , నిధులు పొందేందుకు" సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. లింక్డ్ ఇన్‌లో షేర్ చేసిన వీరి స్టోరీ వైరల్‌గా మారింది. గూగుల్ గత నెలలో సుమారు 12 వేలమందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఖర్చు తగ్గింపు చర్యలో భాగంగా తొలగించినవారిలో గూగుల్ సీనియర్ మేనేజర్ హెన్రీ కిర్క్ కూడా ఒకరు. తన స్నేహితులతో ఇపుడు కొత్త కంపెనీని మొదలు పెడుతున్నామని కిర్క్ తెలిపారు. సహ ఉద్యోగులతో కలిసి న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో డిజైన్ డెవలప్మెంట్ స్టూడియోను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం తన బృందానికి ఆరు వారాల సమయం ఇచ్చినట్లు లింక్డ్ఇన్లో కిర్క్ పేర్కొన్నాడు. ఉద్యోగుల తొలగింపు నోటిఫికేషన్ 60 రోజుల గడువు మార్చిలో ముగిసేలోపు కంపెనీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఇంకా 52 రోజులు మిగిలి ఉన్నాయి. మీ సహాయం కావాలి....కష్టపడితే , ఫలితాలు మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకువెళతాయని ఎపుడూ నమ్ముతా. కానీ ఈ సంఘటన ఆ నమ్మకంపై సందేహాన్ని కలిగించింది. కానీ జీవిత సవాళ్లు అద్వితీయమైన అవకాశాలను అందిస్తాయి.. అందుకే విషాదాన్ని.. గొప్ప అవకాశంగా మల్చుకుంటున్నాం అంటూ కిర్క్ గత వారం లింక్డ్ఇన్ పోస్ట్‌లో చెప్పాడు. తనతో మరో ఆరుగురు గూగుల్ మాజీఉద్యోగులు తన వెంచర్లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషాదాన్ని ఒక అవకాశంగా మార్చుకుని కొత్త డిజైన్ & డెవలప్మెంట్ స్టూడియోను ప్రారంభిస్తున్నాం. స్టార్టప్‌లకు, ఇతర కంపెనీల యాప్‌లు, వెబ్సైట్ల కోసం డిజైన్ పరిశోధన సాధనాలను అందించాలనుకుంటున్నాం. ఉద్వాసనకు గురైన అత్యుత్తమ మాజీ-గూగ్లర్లు ఏడుగురం ప్రతిష్టాత్మక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్‌ల పరిశోధన, రూపకల్పన, అభివృద్ధికి, స్టార్టప్‌లు ఎదిగేలా సాయం చేస్తాం. తమలో ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి భిన్నంగా ఉన్నంది. కొంతమందికి కుటుంబాన్ని చూసుకోవడానికి ఒక కుటుంబం ఉంటుంది, కొంతమందికి లేదు, కొందరు ఆర్థికంగా బలంగా ఉన్నారు, మరికొందరు గత కొన్నేళ్లుగా ఎంతో కొంత పొదుపు చేసుకున్నారు. కొందరికీ అదీ లేదు. ఈ నేపథ్యంలో ముందుగా, కొన్ని ప్రాజెక్ట్‌లను పొందడం తక్షణ కర్తవ్యం. తద్వారా బిల్లులను చెల్లించడం ప్రారంభించవచ్చు. తమకు మద్దతివ్వాలంటూ పోస్ట్ చేశారు. దీంతో పలువురు అభినందనలు తెలిపారు. -
Saurabh Maurya: విజయ సౌరభం
మంచి ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనేది సౌరభ్ మౌర్య కల. అయితే తన దగ్గర అమ్మ పంపించిన అయిదువేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొన్నాడు. స్టార్టప్‌లు స్టార్ట్ చేసి కోటీశ్వరుడిగా ఎదిగి, ఎంతోమందికి రోల్‌మోడల్ కావడానికి అవసరమైన ప్రయాణం ఈ సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ నుంచే మొదలైంది! ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్ అనే చిన్నగ్రామంలో పుట్టి పెరిగాడు సౌరభ్ మౌర్య. పేదరికంలో ఉన్నప్పటికీ తన పిల్లలను అప్పు చేసైనా పెద్ద చదువులు చదివించాలనుకునేవాడు తండ్రి. సౌరభ్ ఇద్దరు అన్నలు చదువులో మందుండేవారు. పై చదువుల కోసం వారిని బెనారస్‌కు పంపాడు తండ్రి. మొదటి ప్రయత్నంలో ఇద్దరు ‘ఐఐటీ–జెఇఇ’లో ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురు పిల్లలు పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలని కలలు కనేవారు తల్లిదండ్రులు. అయితే సౌరభ్ పరిస్థితి వేరు. తనకు పెద్ద ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనేది కల. కంప్యూటర్ స్టోర్ అనేది ఆ కలలలో ఒకటి. మొదటి ప్రయత్నంలో ‘ఐఐటీ– జెఇఇ’లో ఫెయిలయ్యాడు సౌరభ్. ‘నేను ఫెయిలయ్యాను అనే బాధ కంటే తల్లిదండ్రులను బాధ పెట్టాను అనే ఆలోచన నన్ను ఎక్కువగా బాధ పెట్టింది’ అంటున్న సౌరభ్ కష్టపడి చదివి రెండో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఐఐటీ–బెనారస్ కాలేజీలోకి వెళ్లిన తరువాత తనకొక కొత్త ప్రపంచం పరిచయం అయింది. తనలాగే ఆలోచించే ఎంతోమందితో పరిచయం ఏర్పడింది. మరో వైపు ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నాయి. జేబు ఖర్చుల కోసం 6–8 తరగతులకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. జేబుఖర్చుల మాట ఎలా ఉన్నా పోను పోను ‘బోధన’ అనేది తనకొక ప్యాషన్‌గా మారింది. తల్లి పంపించిన అయిదువేలతో సెకండ్‌హ్యాండ్ సెల్‌ఫోన్ కొనడంతో తన కెరీర్ మొదలు పెట్టడానికి మొదటి అడుగు పడింది. కొద్దిరోజులకు యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఐఐటీ–జెఇఇ పరీక్షలో విఫలమైన తాను రెండో ప్రయత్నంలో ఎలా విజయం సాధించింది మొదలు ఐఐటీకి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ యూట్యూబ్ చానల్ ద్వారా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చానల్‌కు మంచి ఆదరణ లభించడంతో సౌరభ్‌లో ఉత్సాహం వెల్లువెత్తింది. నాలుగు సంవత్సరాల అనుభవం తరువాత స్టాక్ మార్కెట్ ట్రేడర్‌గా సక్సెస్ అయ్యాడు. ‘ఐఐటీయన్ ట్రేడర్’ పేరుతో ట్రేడింగ్ స్ట్రాటజీస్, టెక్నికల్ ఎనాలసిస్...మొదలైన ఆన్లైన్ కోర్సులు ప్రారంభించి సక్సెస్ సాధించాడు. చిన్న వ్యాపారమైనా సరే, సొంతంగా మొదలుపెడితే చాలు అనుకున్న సౌరభ్ 11–12 తరగతుల విద్యార్థులు ‘ఐఐటీ–జెఇఇ’ లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన బలమైన పునాదిని ఏర్పాటు చేయడానికి ప్రారంభించిన ‘రైట్–ర్యాంకర్స్’ స్టార్టప్, ఆన్లైన్ స్టాక్‌మార్కెట్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ఐఐటీయన్ ట్రేడర్స్’ సక్సెస్ సాధించి తనను 22 కోట్ల క్లబ్‌లోకి చేర్చాయి. ‘ఏదైనా సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు డబ్బు, వనరుల కొరత ఎప్పుడూ అడ్డంకి కాదు. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి’ అంటున్నాడు 22 సంవత్సరాల సౌరభ్ మౌర్య. -
తొలి సక్సెస్ఫుల్ స్టార్టప్ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర భారతదేశంలో విజయవంతమైన తొలి స్టార్టప్ రాష్ట్రం తెలంగాణ అని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభివర్ణించారు. విధానాల రూపకల్పన మొదలుకొని ఔత్సాహిక ప్రారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా ప్రోత్సా హం అందించే వాతావరణాన్ని కల్పించే వరకూ తెలంగాణ ఒక స్టార్టప్ కంపెనీ మాదిరిగానే ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ ప్రపంచస్థాయి శిఖరాగ్ర సదస్సు (టై గ్లోబల్ సమ్మిట్ –2022) ఏడో సమావేశం ప్రారంభానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి దేశంలోనే అత్యద్భుతమైన నగరంగా హైదరాబాద్ ఎదిగిందన్నారు. టీ–హబ్, వీ–హబ్, టీ–వర్క్స్, రిచ్, టాస్క్, ఇమేజ్, నైకామ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం వంటి సంస్థల ఏర్పాటు ద్వారా ఈ వాతావరణాన్ని కల్పించామని తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణమున్న టీ–హబ్ 2.0ను ప్రారంభించామని గుర్తు చేశారు. ఏడేళ్ల కాలంలో టీ–హబ్ 1,100 మంది ఎంట్రప్రెన్యూర్లకు మద్దతిచ్చిందని, 190 కోట్ల డాలర్ల మేరకు నిధులు సమీకరించేందుకు సాయపడిందని చెప్పారు. ప్రైవేట్ రంగంలో తొలి రాకెట్‌ను తయారు చేసిన స్కైరూట్, మూడు నానో ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన ధ్రువ స్పేస్ టెక్ కంపెనీలు టీ–హబ్‌లోనే పురుడు పోసుకున్నాయని తెలిపారు. హైదరాబాద్‌కు విచ్చేయండి... ప్రపంచంలోని టాప్–20 ఐటీ సంస్థల్లో ఎక్కువ కంపెనీలు హైదరాబాద్‌లో తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయని, 6,500కుపైగా స్టార్టప్‌లకు కేంద్రమూ ఈ నగరమేనని కేటీఆర్ తెలిపారు. అడోబ్ లాంటి సంస్థలు కూడా మరింత విస్తృతస్థాయి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని వేదికపై ఉన్న ఆ సంస్థ సీఈవో, హైదరాబాద్‌లోనే విద్యనభ్యసించిన శంతను నారాయణన్‌ను కోరారు. బెంగళూరు నగరంలో విమానాశ్రయం నుంచి ఐటీ కంపెనీలున్న చోటికి వెళ్లాలంటే ఉండే ట్రాఫిక్ సమస్యలిక్కడ లేవంటూ చమత్కరించారు. మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌కు గ్రాంట్.. దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టై గ్లోబల్ సమ్మిట్ అన్ని ఏర్పాట్లు చేసిందని టై గ్లోబల్ ఉపాధ్యక్షుడు, వోక్సీ టెక్నాలజీస్ సీఈవో మురళి బుక్కç³ట్నం తెలిపారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు లక్షల డాలర్లు గ్రాంట్‌గా అందించేలా పోటీ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పోటీలో సుమారు 40 మంది తమ ఆలోచనలను పెట్టుబడిదారుల ముందు ఉంచారని, వీరిలో ఆరుగురు తుదిదశకు ఎంపిక కాగా.. విజేతగా నిలిచే ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త తమ ఆలోచనతో వ్యాపారం మొదలు పెట్టేందుకు లక్ష డాలర్ల గ్రాంట్ ఇస్తామని వెల్లడించారు. శంతను నారాయణన్‌కు అవార్డు టై గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసిన సీఈఓ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఈ ఏడాది అడోబ్ సంస్థ సీఈవో శంతను నారాయణన్‌కు అందిస్తున్నట్లు మురళి బుక్కపట్నం ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణన్ మాట్లాడుతూ.. స్థానిక విద్యారణ్య పాఠశాలలో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన చదువులు తన పురోగతికి ఎంతగానో తోడ్పడ్డాయని తెలిపారు. దేశంలోని కాలేజీ విద్య.. ఆలోచించడం ఎలాగో నేర్పిస్తుందని అన్నారు. టై గ్లోబల్ అధ్యక్షుడు బిజే అరుణ్ మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో టై గ్లోబల్ ద్వారా ఏకంగా లక్ష కోట్ల డాలర్ల విలువైన సంపద ఒనగూరిందని చెప్పారు. -
యూనికార్న్ హోదాకు సర్విఫై!
ముంబై: వివిధ స్మార్ట్‌ఫోన్ వెండార్ ప్రొడక్టుల(డివైస్‌లు) లైఫ్‌సైకిల్‌ను నిర్వహించే సర్విఫై తాజాగా 6.5 కోట్ల డాలర్లు(రూ. 520 కోట్లు) సమీకరించింది. సింగులారిటీ గ్రోత్ అపార్చునిటీ ఫండ్ అధ్యక్షతన పలు సంస్థలు నిధులు అందించినట్లు సర్విఫై వెల్లడించింది. తాజా పెట్టుబడులతో కంపెనీ విలువ దాదాపు బిలియన్ డాలర్లకు చేరినట్లు సర్విఫై వ్యవస్థాపకుడు శ్రీవాస్తవ ప్రభాకర్ పేర్కొన్నారు. శామ్సంగ్, ఆపిల్ తదితర గ్లోబల్ బ్రాండ్లకు సర్వీసులందించే సంస్థ రానున్న 18-24 నెలల్లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే లక్ష్యంతో ఉన్నట్లు శ్రీవాస్తవ తెలియజేశారు. ఐరన్ పిల్లర్, బీనెక్ట్స్, బ్లూమ్ వెంచర్స్, డీఎంఐ స్పార్కిల్ ఫండ్ తదితరాలు పెట్టుబడులు సమకూర్చినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో మరోసారి 7 కోట్ల డాలర్లవరకూ నిధులను సమీకరించే వీలున్నట్లు తెలియజేశారు. -
కార్యకలాపాల విస్తరణలో ప్రాక్టికల్లీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎడ్టెక్ సంస్థ ప్రాక్టికల్లీ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ముంబై, మొహాలీలో ఇటీవలే కార్యాలయాలు ప్రారంభించింది. ప్రస్తుతం 300 మంది ఉద్యోగులు ఉండగా.. వచ్చే ఏడాది కాలంలో ఈ సంఖ్యను 66 శాతం మేర పెంచుకోనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకురాలు చారు నొహేరియా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో దాదాపు నలభై శాతం వాటా భారత మార్కెట్ నుంచి, మిగతాది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రాగలదని భావిస్తున్నట్లు వివరించారు. ఫెడెనా (స్కూల్ ఈఆర్పీ) కొనుగోలుతో సమగ్రమైన ప్రాక్టికల్లీ స్కూల్ సొల్యూషన్కు స్కూళ్లలో ఆమోదయోగ్యత మరింత పెరిగినట్లు తెలిపారు. -
గంటకు 260 కిలోమీటర్ల వేగం.. ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు
ఎగరాలంటే విమానం ఎక్కాలి. కనీసం హెలికాప్టరైనా ఉండాలి. వీటికి చాలా తతంగం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఫ్లైయింగ్ కార్లు అక్కడక్కడా వస్తున్నాయి. వాటికి ఇంధనం బాగానే ఖర్చవుతుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫ్లైయింగ్ సాసర్ ఉంటే, ఎక్కడికైనా తేలికగా పక్షిలా ఎగిరి వెళ్లవచ్చు. కోరుకున్న చోట హాయిగా వాలిపోవచ్చు. దీనికి ఇంధనం సమస్య ఉండదు. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘జెవా’ ఈ ఫ్లైయింగ్ సాసర్ను రూపొందించింది. ఇందులో ఒక మనిషి మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. ఇందులో బ్యాటరీని పూర్తిగా చార్జి చేస్తే, 80 కిలోమీటర్ల దూరం ఏకధాటిగా ప్రయాణించవచ్చు. దీని గరిష్ఠవేగం గంటకు 260 కిలోమీటర్లు. -
ఉద్యోగులూ.. అరగంట కునుకేయండి..!
బెంగుళూరు: పని చేసే ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట ఓ కునుకు వేసే అవకాశం వస్తే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందమే కదా. ఆ అవకాశం లేక నిద్రమత్తుతో జోగే ఉద్యోగులకు బెంగళూరులోని స్టార్టప్ కంపెనీ ఊరట కల్పించింది. వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ మధ్యాహ్నం 30 నిమిషాలు కునుకు తీయొచ్చునని అధికారికంగా ప్రకటించింది. ఆ కంపెనీ ఉద్యోగులు మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు కునుకు తీసే వెసులుబాటు కల్పించింది. నాసా అధ్యయనం ప్రకారం మధ్యాహ్నం పూట 26 నిముషాలు నిద్రపోతే ఆ ఉద్యోగి పని చేసే సామర్థ్యం 33% పెరుగుతుందని తేల్చింది. గత ఆరేళ్లుగా వేక్‌ఫిట్ పరుపులు, తలగడలు తయారు చేసే వ్యాపారంలో ఉంది. -
‘దిగంతర’ స్పేస్ స్టార్టప్'.. ఇంజనీరింగ్ విద్యార్థుల సక్సెస్ స్టోరీ
వీరు ఆకాశానికి నిచ్చెనలు వేయలేదు గానీ... ఆకాశమంత కల కన్నారు. తమ ప్రతిభతో బంగారంలాంటి అవకాశాలను సృష్టించుకున్నారు. ‘దిగంతర’ స్పేస్ స్టార్టప్‌తో తిరుగులేని విజయం సాధించారు.... చెత్త సమస్య భూలోకంలోనే కాదు అంతరిక్షంలోనూ ఉంది. దాన్ని స్పేస్ జంక్ అని పిలుస్తారు. వేలాది సంఖ్యలో ఉండే ఈ వ్యర్థాలు భూగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటి సంఖ్య పెరిగిపోవడం అనేది ఉపగ్రహాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాటి భద్రతకు ఖర్చులు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యర్థాల తొలగింపుపై ఇస్రో దృష్టిపెట్టింది. మరోవైపు సెల్ఫ్ ఈటింగ్ రాకెట్లు, వానిషింగ్ శాటిలైట్ల రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతరిక్ష చెత్త గురించి సీరియస్‌గా చర్చ మొదలైన పరిస్థితులలో బెంగళూరు కేంద్రంగా మొదలైన ‘దిగంతర’ అనే అంకురసంస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘స్టార్టప్’ స్టార్ట్ చేయడం ఎంత సవాలో, ‘యస్. మేము చేయగలం’ అని ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించడం అంతకంటే పెద్ద సవాలు. అలాంటి సవాలే ఈ ముగ్గురు కుర్రాళ్లకి ఎదురైంది. అనిరుద్ శర్మ, రాహుల్ రావత్, తన్వీర్ అహ్మద్‌లు ‘దిగంతర’ పేరుతో స్పేస్ టెక్ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టినప్పుడు పెద్దగా ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ‘అప్పుడే ఇంజినీరింగ్ పూర్తిచేసుకొని వచ్చిన యువకులు స్పేస్ స్టార్టప్ గురించి చెబితే నమ్మడం కష్టమే. అందుకే ఇన్వెస్టర్ కమ్యూనిటీలో నమ్మకం కలిగించడమే మా తొలి లక్ష్యం అయింది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటాడు అనిరుథ్. ‘దిగంతర’ అనేది అంతరిక్ష వ్యర్థాల సమస్యకు పరిష్కారం కనుక్కునే స్టార్టప్. ‘అంతరిక్షంలో ఉన్న చెత్తతో వ్యాపారమా? ఇది ఎలా సాధ్యం’ అనే ఆశ్చర్యాలు బారులు తీరాయి. ఎందుకంటే ఇలాంటి అంకుర సంస్థ గురించి వినడం వారికి ఇదే మొదటిసారి. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... అనిరుథ్ శర్మ పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ(ఎల్పీయూ)లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్. అయితే ఇతడికి ఏరోస్పేస్, ఏరోనాటిక్స్ అంటే చాలా ఇష్టం. శర్మ మిత్రుడు తన్వీర్ అహ్మద్ బెంగళూరులోని ఆర్వీ కాలేజీలో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. ఇస్రో మార్గదర్శకాలతో తమ కాలేజీలో ‘స్టూడెంట్ శాటిలైట్ టీమ్’ ప్రారంభించాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న శర్మ తమ యూనివర్శిటీలో కూడా అలాంటి టీమ్‌ను ప్రారంభించాడు. ఇస్రో ఆధ్వర్యంలో చండీగఢ్‌లో జరిగిన ఒక సదస్సులో ఈ టీమ్ ఒక పేపర్ సమర్పించి అవార్డ్ సొంతం చేసుకుంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జర్మనీలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన తరువాత ‘స్పేస్ సస్టెయినబిలిటీ’ అనేది ఎంత పెద్ద సవాలో లోతుగా తెలుసుకోగలిగారు. ఒక లాటిన్ అమెరికా స్పేస్ కంపెనీ కోసం శాటిలైట్ విడిభాగాలను తయారుచేసి శబ్భాష్ అనిపించుకున్నారు. అలా ‘దిగంతర’కు అంకురార్పణ జరిగింది. ఈ కంపెనీకి అనిరుథ్ శర్మ సీయివో, తన్వీర్ అహ్మద్ సీటివో(చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), రాహుల్ రావత్ సీవోవో (చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) నుంచి 15 లక్షల గ్రాంట్ పొందడం దిగంతర సాధించిన తొలివిజయం. స్పేస్ క్లైమెట్ అండ్ ఆబ్జెక్ట్ ట్రాకర్ (ఎస్సీవోటి), ఆర్బిటల్ ఇంజన్, స్పేస్–ఎడాప్ట్...అనే మూడు విభాగాల్లో ‘దిగంతర’ పనిచేస్తుంది. హార్డ్‌వేర్,సాఫ్ట్వేర్లతో మిళితమైన ‘ఇన్–ఆర్బిట్ స్పేస్ డెబ్రీస్ మానిటర్’ 1 సెం.మీ నుంచి 20 సెం.మీ పరిమాణంలో ఉన్న అంతరిక్ష వ్యర్థాలను ట్రాక్ చేస్తుంది. ఆ తరువాత విజువలైజేషన్ మోడల్ రూపొందించి కేటలాగ్ తయారుచేస్తారు. ‘మేము ఇచ్చే డాటా ద్వారా కస్టమర్ల మిషన్ ఆపరేషన్ ఖర్చు చాలా తగ్గుతుంది’ అంటుంది దిగంతర. మన ప్రభుత్వం స్పేస్ సెక్టార్లో ప్రైవెట్ కంపెనీలకు పచ్చజెండా ఊపిన తరువాత ‘దిగంతర’లాంటి కంపెనీలకు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. ఇటలీకి చెందిన ప్రసిద్ధ స్పేస్ ఫ్లైట్ సర్వీసెస్ కంపెనీ ‘టెలిస్పాజియో’ కెనడియన్ స్పేస్స్టార్టప్ ‘నార్త్‌స్టార్ ఎర్త్ అండ్ స్పేస్’లో వాటా తీసుకుంది. ఇప్పుడు ఆ కంపెనీ ‘దిగంతర’పై కూడా ఆసక్తి చూపుతుంది. ‘వీరి గురించి గొప్పగా చెప్పుకోవడానికి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి... స్టూడెంట్స్‌గానే ఎన్నో సాధించారు. రెండు... వృత్తినిబద్ధత. టెక్నాలజి విషయాలు మాత్రమే కాకుండా మార్కెట్ సంబంధిత అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంది’ అని ప్రశంసిస్తున్నారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ చైర్మన్(సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్..బెంగళూరు) సీవి మురళీ. భవిష్యత్‌లో ‘దిగంతర’ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. చదవండి: Health Tips: ఎంత సంపాదిస్తే ఏం లాభం? ఆరోగ్యం లేకుంటే.. ఈ చిట్కాలు పాటిస్తే -
పక్షిలా ఎగిరే విమానం!... ఎలాగో తెలుసా!!:
ఫొటోలు చూశారుగా.. ఆకారంతోపాటు ఎగిరే క్రమంలోనూ పక్షిని పోలిన వినూత్నమైన ఎగిరే కారు ఇది. ఆఫ్రికాకు చెందిన ఫ్రాక్టిల్ అనే సంస్థ దీన్ని డిజైన్ చేసింది. నిట్టనిలువుగా పైకి ఎగిరే ఇలాంటి కార్ల కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా అలాంటివి వాస్తవ రూపం దాల్చింది తక్కువే. వీటిని వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) వాహనాలంటారు. (చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!) అయితే వీటీఓఎల్ను ఫ్రాక్టిల్ కాస్త మార్చి నియర్ వీటీఓఎల్గా కొత్త విమానాలకు పేరు పెట్టింది. పక్షి తన కాళ్లతో ఎలా చెట్టుకొమ్మను పట్టుకుంటుందో ఈ విమానమూ నేలపై కొంత ఆధారంతో నిలబడి ఉంటుంది. పక్షి మాదిరిగానే కొమ్మను బలంగా నొక్కుతూ పైకి ఎగురుతుంది. గాల్లో చేరిన తరువాత కాళ్లు లోనికి ముడుచుకుంటాయి. పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఈ వాహనంతో సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రన్‌వే, హెలిపాడ్ వంటివేవీ అవసరం లేకపోగా పైలట్ మోడ్‌తోపాటు రిమోట్ కంట్రోల్ ద్వారానూ దీన్ని నడపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో 150 కిలోల బరువు ఉన్న మందులు, సరుకులను మోసుకెళ్లవచ్చని కంపెనీ తన వెబ్సైట్లో తెలిపింది. (చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
నేను బాగా సంపాదించగలను....నా స్టార్ట్ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్
న్యూఢిల్లీ: కొన్ని సంఘటనలు చూస్తే మనం సినిమాల్లో చూసిన సీన్లు గర్తుకోస్తాయి కదా. అచ్చం అలాంట సంఘటనే ఒకటి ఇక్కడ చోటుచేసుకుంది. పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్శకి ఒక విచిత్రమైన మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ సారాంశం ఏమిటంటే "సార్ నేను నా 18 ఏళ్ల స్కూల్ జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. అరిస్టాటిల్, బుద్ధుడు, వివేకానంద, న్యూటన్ వంటి ఎందరో ప్రముఖుల గురించి తెలుసుకున్నాను. నేను గనుక వ్యాపారం చేస్తే ఒక ట్రిలియన్ డాలర్ల వరకు డబ్బు సంపాదించగలను కానీ నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఇక వ్యాపారం ఎలా మొదలు పెట్టగలను. (చదవండి: పీపీఎఫ్ కిట్లతో డ్యాన్స్) టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ వంటి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనే ఆలోచన ఉంది. మన జీవితంలో కుటుంబం, స్నేహితులు ఎంత ప్రధానమో డబ్బు కూడా అంతే ప్రధానమైనది." అంటూ చెప్పుకొచ్చాడు. ఆఖరికీ ఆ సదరు వ్యక్తి తాను ప్రపంచంలోనే ఒక ప్రముఖ ఆటవస్తువుల కంపెనీ పెట్టాలనుకుంటున్నానని, దాని కోసమై వెంచర్ క్యాపిటలిస్ట్‌లు కూడా సంప్రదించానని కానీ ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పైగా భారత్‌లో అందరి దగ్గర డబ్బు లేదని కానీ అది ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర్నించి అసలు బయటకు రాదంటూ ఆవేదనగా చెప్పుకొస్తూ పేటీఎమ్ సీఈవో శేఖర్‌కి మెయిల్ చేశాడు. దీంతో శేఖర్ దాన్ని స్క్రీన్ షార్ట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఇలాంటా ఆత్మవిశ్వాసం గల అబ్బాయిలను అందరూ ఇష్టపడతారంటూ ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా?) -
బంపరాఫర్.. ఆ కంపెనీలో వారానికి 3 రోజులే పని..!
సాక్షి, హైదరాబాద్: ‘త్రీ డే వీక్’పని విధానం.. వినడానికి కొత్తగా ఉంది కదూ. అదేనండీ.. వారానికి మూడు రోజులు పనిచేస్తే చాలు. అదీ కూడా ఆఫీసుకు వస్తే రావొచ్చు లేదా ఎక్కడి నుంచైనా పనిచేయొచ్చు. వారానికి 20 నుంచి 25 గంటల వర్కింగ్ అవర్స్. ఇది వినడానికే ఎంతో బావుంది కదూ. మనకూ ఇలాంటి జాబ్ దొరికితే చాలు.. ఇంకా ఏమీ అవసరం లేదనే భావన అందరిలో ఏర్పడటం సహజమే. అయితే ఇవన్నీ కూడా వినడానికే కాదు ఆచరణలో అమలు చేస్తోంది బెంగళూరుకు చెందిన ఫైనాన్సియల్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ (ఫిన్ టెక్ కంపెనీ) ‘స్లైస్ ’. ఇండియన్ క్రెడిట్ కార్డ్ ఛాలెంజర్ స్టార్టప్‌గా ‘కోడ్ ఇన్ 3’ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ సంస్థ దీనిని ప్రారంభించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి వారంలో మూడు రోజుల పనికి 80 శాతం జీతం ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. తాము చేపడుతున్న పెద్ద ప్రాజెక్ట్‌ల కోసం ఫుల్‌టైమ్ ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, డిజైనర్లను రిక్రూట్ చేస్తోంది. ‘కొత్తగా ఆలోచించడం, నవీన ఆవిష్కరణలపై జిజ్ఞాస పెంచేం దుకు మా ప్రాజెక్ట్‌లో పనిచేసే టీమ్ సభ్యులకు వారు కోరుకున్న, అనువైన పని విధానాన్ని అమలు చేస్తున్నాం. వారికి ఇష్టమైన ప్రాజెక్ట్‌లపై పనిచేసే అవకాశం కలి్పంచడం, నచి్చనంత సమయం పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయి’అని 28 ఏళ్ల స్లైస్ వ్యవస్థాపకుడు, సీఈవో రాజన్ బజాజ్ చెబుతున్నారు. కొన్ని స్టార్టప్ కంపెనీలు వృత్తినిపుణులు, ఉద్యోగులను కాపాడుకోవడం కోసం, తగిన నైపుణ్యాలున్న వారిని ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లు ఇస్తున్నాయి. సోషల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘మీషో’సంస్థ తమ ఉద్యోగులకు వచ్చే నెల నవంబర్‌లో 10 రోజుల సెలవులు ప్రకటించింది. ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ భారత్‌పే తమ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్‌లు, ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్లు, దుబాయ్‌లో క్రికెట్ హాలిడే వంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది. వృత్తినిపుణులకు పెరిగిన డిమాండ్‌తో... భారత్‌లో సాంకేతిక, వృత్తి నిపుణులకు వివిధ రం గాల్లో బాగా డిమాండ్ ఉంది. అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు అనేక దేశీయ టెక్ స్టార్టప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు వివిధ ప్రాజెక్ట్‌ల కోసం పెద్ద ఎత్తున నియామకాలు చేసుకుంటున్నాయి. దీంతో పాటు ఐటీ ఔట్సోర్సింగ్, సిలికాన్ వ్యాలీ కంపెనీలు, గ్లోబల్ రిటైల్ సంస్థలు, వాల్‌స్ట్రీట్ బ్యాంక్‌ల టెక్నాలజీ సెంటర్లు భారీగా వృత్తినిపుణులను చేర్చుకుంటుండటంతో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నాయి. ఇతర కంపెనీల కంటే ఎక్కువ సెలవులు, ఇళ్లల్లో పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు స్త్రీలతో సమానంగా మగవారికి కూడా ‘పేరెంటల్ లీవ్స్’, వృత్తిçపరంగా మరిన్ని నైపుణ్యాలు పెంచుకునేందుకు.. ఇలా అనేక అవకాశాలు కలి్పస్తున్నాయి. పనివిధానాన్ని మార్చేసిన మహమ్మారి... కోవిడ్ మొదటి, రెండోవేవ్లు ప్రపంచాన్ని కుదిపేసాక కంపెనీలన్నీ కొన్నాళ్లు వర్క్‌ఫ్రంహోం, తర్వాత కొన్నిరోజులు ఆఫీసు, కొన్నిరోజులు ఇంటి నుంచి పనిచేయడం, ఇతర రూపాల్లో ‘హైబ్రిడ్ వర్కింగ్’విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వ, ఐటీ ఉద్యోగులకు 5రోజుల పని విధానం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. విదేశాల్లో కొన్ని సంస్థలు ‘ఫోర్ డే వీక్ వర్క్’విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేశాయి. అయితే, యూకేతో సహా పలు దేశాల్లో ఈ విధానం పెద్దగా విజయవంతం కాలేదు. ఇన్ని రోజులు, ఇన్ని గంటలు పనిచేయాలనడం కంటే.. తమకు సరిపోయే పనిగంటలు, నచి్చన విధానంలో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించొచ్చుననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇకపై హైబ్రిడ్ పద్ధతే... భవిష్యత్‌లో త్రీ డే, ఫోర్ డే వీక్ లేదా ఇళ్లు, ఆఫీసు, మరెక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా పనిచేసే హైబ్రిడ్ పద్ధతికి దాదాపుగా అన్ని కంపెనీలు మారాల్సిందే. ఐటీలో ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూర్, ముంబై వంటి మెట్రో నగరాల్లో దీంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వాహనాల రద్దీతోపాటు కాలుష్యం తగ్గుతుంది. మెంటల్ స్ట్రెస్ తగ్గి జీవనశైలి మెరుగవుతుంది. ఐతే ఫార్మా, ప్రొడక్షన్ ఇతర రంగాల్లో ఇలాంటి విధానాలు సాధ్యం కావు. –డా. బి. అపర్ణరెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు -
మార్కెట్లోకి మరో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలే!
బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ ప్రవైగ్ డైనమిక్స్ గత కొంత కాలంగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేస్తుంది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ ఇప్పటికే చాలా సార్లు రోడ్లపై పరీక్షల సమయంలో కనిపించింది. ప్రవైగ్ డైనమిక్స్ ఎలక్ట్రిక్ కారు, లేటెస్ట్ ఫీచర్స్ తో రానున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ కారుని కంపెనీ పూర్తిగా దేశీయ ఉత్పత్తులతో తయారు చేస్తుంది. ఇది అధునాతన లక్షణాలు కలిగిన స్వదేశీ లగ్జరీ కారు కానుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం తన మొదటి ఎలక్ట్రిక్ కారుని 2022లో విడుదల చేయనుంది. అంతే గాకుండా కంపెనీ 2022లో సుమారు 2,500 కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రణాళికలో భాగంగా 2023 నాటికి ఒక లక్ష కార్లను మరియు 2025 నాటికి 1 మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడానికి సన్నాహాలు చేస్తుంది. దీని ఫీచర్స్ కూడా వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ కారు ప్రధాన ప్రత్యేకత అందరినీ ఆకట్టుకునే డిజైన్.(చదవండి: ఈ-కామర్స్ అమ్మకాలలో కుమ్మేస్తున్న టైర్ 3 నగరాలు) ప్రవైగ్ డైనమిక్స్ ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్ దీని గరిష్ట వేగం 196 కిమీ/గం. ఇది 201.5 బిహెచ్పి పవర్, 2400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ప్రవైగ్ 5.4 సేకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 504 కిలో మీటర్లు దూసుకెళ్తుంది. ఇది 150 KW పవర్ అవుట్ పుట్ గల మోటార్ కలిగి ఉంది. ఫాస్ట్ చార్జర్ దీనిని చార్జ్ చేస్తే 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. ప్రవైగ్ డైనమిక్స్ ఎలక్ట్రిక్ కార్ అధునాతన ఫీచర్స్ గల అటానమస్ టెక్నాలజీ కోసం NVIDIAతో భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది. అంతే కాకుండా ఈసీయు, ఇతర కంట్రోల్ మెటీరియల్స్ అన్నీ కూడా కంపెనీ తయారు చేసుకుంటుంది. ప్రీమియం సౌండ్ సిస్టమ్ డెవియాలెట్ నుంచి తీసుకొనున్నారు. ఈ కారు ప్రీమియంగా ఉండనుంది. -
డిజిటల్ న్యూస్ స్టార్టప్స్ కోసం గూగుల్ ’ల్యాబ్’
న్యూఢిల్లీ: దేశీయంగా స్వతంత్ర స్థానిక న్యూస్ స్టార్టప్‌ల కోసం టెక్ దిగ్గజం జీఎన్ఐ స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా పేరిట యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. దీని కింద ఆర్థికంగా, నిర్వహణపరంగా ఆయా అంకుర సంస్థలు నిలదొక్కుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో నాలుగు నెలల పాటు శిక్షణనిస్తుంది. ఇందుకోసం ఎకోస్, డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్‌తో జట్టు కట్టింది. భారతీయ భాషల్లో ప్రచురిస్తున్న న్యూస్ స్టార్టప్ సంస్థలేవైనా ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేది అక్టోబర్ 18. తొలి బ్యాచ్ కోసం 10 స్వతంత్ర డిజిటల్ న్యూస్ పబ్లిషింగ్ సంస్థలను ఎంపిక చేస్తారు. -
గిగా మెష్‌తో తక్కువ ఖర్చుతో వేగంగా ఇంటర్నెట్
‘బరిలో బడా బడా ఫైటర్లు ఉన్నారు. నీవల్ల ఎక్కడవుతుంది’ అనే మాట విని ‘నిజమే సుమండీ’ అని అమాయకంగా వెనుతిరిగేవాళ్లు ఎప్పుడూ ఫైటర్లు కాలేరు. ‘నేనేమీ చిన్నవాడిని కాదు’ అనే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగే వాళ్లే సత్తా నిరూపించుకునే ఫైటర్లు అవుతారు. స్టార్టప్ కంపెనీలు కూడా అంతే. కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన చిన్నపాటి స్టార్టప్ కంపెనీ ‘ఆస్ట్రోమ్’ గిగా మెష్ అనే ఆవిష్కరణతో అద్భుతాన్ని సాధించింది. యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఇంటింటి అవసరంగా మారింది. ఇ-కామర్స్ పెరిగాక బడా కంపెనీలకు పట్టణాలు, ఒక మాదిరి పట్టణాలతో పాటు పల్లెలు కూడా ఆత్మీయనేస్తాలయ్యాయి. కానీ ఏంలాభం? పట్టణాలతో పోల్చితే మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు ఎంత కష్టమో తెలియందేమీ కాదు. ఫైబర్ భారం లేకుండా, ఖర్చు తక్కువగా మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ను తేవడం ఎలా? సరిగ్గా ఈ ప్రశ్న నుంచి పుట్టుకువచ్చిందే ఆస్ట్రోమ్. ప్రసాద్ హెచ్.ఎల్.భట్‌తో కలిసి 2016లో బెంగళూరులో ఈ స్టార్టప్ మొదలుపెట్టారు నేహా శతక్. మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆలోచన తొలిసారిగా ‘ఆస్ట్రోమ్’కేమీ రాలేదు. అంతకుముందే గూగుల్, ఫేస్బుక్, స్పేస్‌ఎక్స్‌లాంటి దిగ్గజాలతో పాటు వన్‌వెబ్, బోయింగ్లాంటివి ప్రయోగాలు చేస్తున్నాయి. ‘అంత పెద్ద సంస్థల ముందు మనం ఎంత?’ అని ఢీలా పడిపోలేదు నేహా. డ్రోన్స్‌కు మినియేచర్ వెర్షన్ ‘మైక్రోలెవెల్స్–వెహికిల్స్’ రూపకల్పనతో మొదలైన ఆమె ప్రయాణం ‘గిగా మెష్’తో పతాకస్థాయికి చేరింది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడానికి వైర్లెస్ బ్యాక్‌హాల్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువ, డేటా స్పీడ్ పెరగకపోవడంలాంటి పరిమితులు ఉన్నాయి. ‘ఆస్ట్రోమ్’ వారి వైర్లెస్ డివైజ్ ‘గిగా మెష్’తో తక్కువ ఖర్చుతో వేగంగా ఇంటర్నెట్ సేవలు అందించవచ్చు. దీనికి ఇటీవలే మన దేశంతో పాటు అమెరికాలోనూ పేటెంట్ లభించింది. త్వరలో దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘ఆస్ట్రోమ్’ వ్యవస్థాపకురాలు, సీయివో నేహా శతక్ స్వస్థలం రాజస్థాన్‌లోని బ్యావర్. పదవతరగతి పూర్తికాగానే పై చదువుల కోసం జైపూర్‌కు వచ్చారు. తన జీవితంలో ఇదో పెద్ద ముందడుగు అని చమత్కరిస్తారు ఆమె. ‘పదవతరగతి పూర్తయింది కదా...ఆడపిల్లకు ఈమాత్రం చదువు చాలు’ అనుకునే ప్రాంతం అది. అయితే నేహా తల్లిదండ్రులు అలా ఆలోచించలేదు. ఆమెను బాగా ప్రోత్సహించారు. ‘ఒక కుటుంబంలో ఆడపిల్లను పెద్ద చదువులు చదివిస్తే మిగిలిన వాళ్లు స్ఫూర్తి పొంది అదే బాటలో పయనిస్తారు. మా అమ్మాయిని ఇంజనీరింగ్ కాలేజీలో ఎలా చదివించాలి? అని ఒకరోజు అమ్మను అడిగాడు మాకు పాలుపోసే వ్యక్తి’ అంటూ గుర్తు చేసుకుంటారు నేహా నేహాకు సైన్స్–ఫిక్షన్ నవలలు చదవడం, టీవీ సీరియల్స్ చూడడం అంటే ఇష్టం. ఈ ఇష్టమే ఆమెను ఏరోస్పేస్ ఫీల్డ్‌పై ఆసక్తిని పెంచింది. యూఎస్‌లో పీహెచ్‌డి చేసిన నేహా ఏదో ఒక సంస్థలో ఉద్యోగం చేయడం అని కాకుండా తనను తాను నిరూపించుకోవడానికి ఏరోస్పేస్ట్ ఫీల్డ్‌లో కంపెనీ స్థాపించాలనుకున్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత తనకు పాఠాలు చెప్పిన గురువును సలహా అడిగారు. ఆయన నేహాను ఆశీర్వదించి ఇ–కామర్స్ స్టారప్పై పనిచేస్తున్న ప్రసాద్ భట్‌కు పరిచయం చేశారు. అలా ‘ఆస్ట్రోమ్’ ప్రయాణం మొదలైంది. ‘భూమిపై మనం ఎదుర్కునే సమస్యలకు ఆకాశంలో పరిష్కారాలు వెదకాలి’ అనేది నేహా సిద్ధాంతం. అనంతమైన ఆకాశం సృజనాత్మకమైన ఆవిష్కరణలకు గొప్ప అవకాశం అంటారు ఆమె. ఆస్ట్రోమ్ అస్త్రం మారుమూల ప్రాంతాల్లోనే కాదు ఇంట్లో కూడా తరచుగా ఇంటర్నెట్ సమస్యలు ఎదురవుతుంటాయి. ‘గిగా మెష్’తో అలాంటి సమస్య ఉండబోదని హామీ ఇస్తుంది ఆస్ట్రోమ్. ప్లగ్ అండ్ ప్లే వైఫై శాటిలైట్ అయిన ‘గిగా మెష్’ను సులభంగా ఉపయోగించవచ్చు. కట్టింగ్–ఎడ్జ్ మెష్ వైఫై, బీమ్ ఫార్మింగ్ సాంకేతికజ్ఞానంతో అధికవేగంతో ఇది సేవలు అందిస్తుంది. ఆకాశమే గొప్ప అవకాశం! మనం ఒక రంగంలో పనిచేస్తున్నప్పుడు పోలిక తప్పనిసరిగా మొదలవుతుంది. ప్రతికూలంగా తీసుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. పాజిటివ్‌గా తీసుకుంటే ఏదైనా చేయగలం. పోలిక ద్వారా జరిగే విశ్లేషణలో మనకు ఉన్న పరిమితులతోనే గొప్పగా ఎలా ప్రయత్నించవచ్చో ఆలోచించాలి. భూమి మీద మనం ఎదుర్కునే సమస్యలకు ఆకాశంలో పరిష్కారాలు వెదకాలి. – నేహా శతక్,ఆస్ట్రోమ్ సహ వ్యవస్థాపకురాలు, సీయివో -
స్టార్టప్స్‌లో గూగుల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్... భారత్‌కు చెందిన రెండు స్టార్టప్‌లు–గ్లాన్స్ ఇన్మోబి, వర్స్ ఇన్నోవేషన్‌ల్లో పెట్టుబడులు పెట్టింది. తన 1,000 కోట్ల డాలర్ల గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌లో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టినట్లు గూగుల్ పేర్కొంది. అయితే ఈ స్టార్టప్‌ల్లో ఎంత మేరకు ఇన్వెస్ట్ చేసిందీ గూగుల్ వెల్లడించలేదు. అయితే పెట్టుబడులు పొందిన స్టార్టప్‌లు మాత్రం ఆ వివరాలను వెల్లడించాయి. గ్లాన్స్‌లో రూ.1,072 కోట్ల పెట్టుబడులు గూగుల్ సంస్థ తమ కంపెనీలో రూ.1,072 కోట్లు(14.5 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేసిందని గ్లాన్స్ ఇన్మోబి సంస్థ పేర్కొంది. ఇక తమ కంపెనీలో గూగుల్ సంస్థ రూ.739 కోట్లు(10 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేసినట్లు వర్స్ ఇన్నోవేషన్ పేర్కొంది. ఈ సంస్థ డైలీ హంట్, షార్ట్ వీడియో యాప్ జోష్లను నిర్వహిస్తోంది. స్టార్టప్‌లకు గూగుల్ తోడ్పాటు.. భారత్‌లో వినూత్నమైన స్టార్టప్‌లకు తోడ్పాటునందించగలమన్న దానికి తాజా పెట్టుబడులే నిదర్శనమని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్‌గుప్తా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగించే సమ్మిళిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టామని వివరించారు. ఇంటర్నెట్ అనుసంధానత మెరుగుపడటం, చౌక ధరలకే డేటా లభించడం... ఈ రెండు కారణాల వల్ల భారత్‌లో స్టార్టప్‌ల జోరు పెరుగుతోందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో 10 కోట్ల మంది గ్రామీణులు ఇంటర్నెట్ యూజర్లయ్యారని, ఇప్పుడు మొత్తం మొబైల్ డేటా వినియోగంలో గ్రామీణుల వినియోగం 45 శాతంగా ఉందని వివరించారు. 1,000 కోట్ల డాలర్ల గూగుల్ ఫండ్ ఈ ఏడాది జూలైలో 1,000 కోట్ల డాలర్ల గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌ను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. దేశంలో డిజిటల్ టెక్నాలజీల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడానికి ఐదు నుంచి ఐదేళ్లలో స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం కోసం ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అప్పుడు పేర్కొన్నారు. -
గెట్.. సెట్.. స్టార్టప్!
కరోనా వైరస్ ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేయవచ్చు గాక, కానీ స్టార్టప్‌లకు మాత్రం జోష్‌నిచ్చింది. కరోనా కాలంలో చాలా స్టార్టప్‌ల అమ్మకాలు, లాభదాయకత అంచనాలకు మించి పెరిగాయి. దీంతో నిధుల సమీకరణ నిమిత్తం, లేదా మరింత విలువ పెంచుకోవడం కోసం (వేల్యూ అన్‌లాక్) పలు స్టార్టప్‌లు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లకు రానున్నాయి. అసలైతే రెండు, మూడేళ్ల తర్వాత గాని ఐపీఓల గురించి ఆలోచించని స్టార్టప్‌లన్నీ ఇప్పుడు ఐపీఓలపై కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయమై సాక్షి స్పెషల్ స్టోరీ.... కరోనా వైరస్... స్టార్టప్ కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రణాళికలను ముందుకు జరుపుతోంది. డిజిటల్ కామర్స్, పేమెంట్స్ కంపెనీలు ఐపీఓ మార్గంలో నిధులు సమీకరించాలని యోచిస్తున్నాయి. స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఈ ఐపీఓల ద్వారా తమ తమ వాటాలను విక్రయించనున్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫార్మ్ జొమాటొ, ఫ్యాషన్ ఇటెయిలర్ నైకా, లాజిస్టిక్స్, డెలివరీ సంస్థ డెలివరీ, ఇన్సూరెన్స్ డిస్కవరీ ప్లాట్ఫార్మ్ పాలసీ బజార్, కళ్లజోళ్ల రిటైల్ చెయిన్ లెన్స్‌కార్ట్, విద్యాసేవలకు సంబంధించిన ఎడ్యుటెక్, ఆన్లైన్ ట్యూషన్ల సంస్థ బైజుస్.. ఈ సంస్థలన్నీ బాహాటంగానే తమ తమ ఐపీఓ ప్రణాళికలను వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే, ఆన్లైన్ బిల్ చెల్లింపుల సంస్థ మోబిక్విక్లు కూడా ఐపీఓ కోసం కసరత్తు చేస్తున్నాయని సమాచారం. కరోనాతో జోరు.... కరోనా కారణంగా ఈ స్టార్టప్‌ల వ్యాపారం కుదురుకోవడమే కాకుండా జోరుగా పెరిగేలా చేసిందని, అందుకే ఈ స్టార్టప్‌లు తమ ఐపీఓ ప్రణాళికలను ముందుకు జరుపుతున్నాయని నిపుణులంటున్నారు. ఈ కంపెనీల తదుపరి వ్యాపార వ్యూహం ఐపీఓయేనని వారంటున్నారు. సీఈఓగా ప్రమోషన్... ఐపీఓ కోసమే తమ కంపెనీ అమ్మకాలు, లాభదాయకత మరింతగా పెరిగాయని ఫ్యాషన్ ఇటెయిలర్ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ పేర్కొన్నారు. ఫలితంగా ఐపీఓ ప్రణాళికలను ఈ కంపెనీ ముందుకు జరిపే అవకాశాలున్నాయి. ఇక మోబిక్విక్ సంస్థ తన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చందన్ జోషిని సీఈఓగా ప్రమోట్ చేసింది. ఐపీఓ ప్రణాళిక కోసమే ఈ మార్పు జరిగిందని సమాచారం. కాగా ఐపీఓకు వచ్చేది ఖాయమేనని, అయితే ఎప్పుడనేది త్వరలోనే నిర్ణయిస్తామని బైజుస్ సీఈఓ బైజు రవీంద్రన్ ఇటీవలనే తెలిపారు. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ విదేశాల్లో లిస్టయ్యే యోచన చేస్తోందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ కంపెనీ విలువ 5,000 కోట్ల డాలర్లు ఉండొచ్చని అంచనా. వాల్‌మార్ట్ గ్రూప్ కంపెనీల్లో ఒక్క ఫ్లిప్‌కార్ట్‌కే నష్టాలు వస్తున్నాయి. 2019లో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ ప్లేస్, ఈ సంస్థ హోల్‌సేల్ వ్యాపారాలకు కలిపి రూ.5,459 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. మరో ఆన్లైన్ దిగ్గజం అమెజాన్‌తో పోటీపడాలంటే ఐపీఓకు రావడమే ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న ఏకైక మార్గమని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఐపీఓకువస్తే, ఈ స్టార్టప్‌ల విలువలు గతంలో మాదిరిగా భారీగా పెరగకపోవచ్చని విశ్లేషకులంటున్నారు. విదేశాల్లో లిస్టింగ్ ఇక ఫ్లిప్‌కార్ట్ సంస్థ విదేశాల్లో లిస్టయ్యే యోచన చేస్తోంది. ఈ కంపెనీ విలువ 5,000 కోట్ల డాలర్లు ఉండొచ్చని అంచనా. ఇక పాలసీ బజార్ సంస్థ న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో వచ్చే ఏడాది లిస్ట్ కావాలని కసరత్తు చేస్తోంది. 350 కోట్ల డాలర్ల విలువ సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భారత కంపెనీల విదేశీ లిస్టింగ్‌కు సంబంధించి కంపెనీల సవరణ చట్టాన్ని ఇటీవలే లోక్‌సభ ఆమోదించింది. ఈ సవరణ కారణంగా భారత కంపెనీలు విదేశాల నుంచి నిధుల సమీకరణ గతంలో కంటే సులువు కానున్నది. ముందుగానే ఐపీఓకు.... ఎందుకంటే ► కరోనా కట్టడి కోసం కేంద్రం లాక్డౌన్ విధించింది. లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలిస్తూ వచ్చింది. ఈ కాలంలో స్టార్టప్‌ల కార్యకలాపాలు బాగా పుంజుకున్నాయి. అమ్మకాలు, లాభదాయకత పెరగడంతో పలు సంస్థలు నిధుల సమీకరణకు ఐపీఓ బాట పడుతున్నాయి. ► కరోనాకు ముందు పీఈ(ప్రైవేట్ ఈక్విటీ), వీసీ(వెంచర్ క్యాపిటల్) సంస్థల నుంచి జోరుగా పెట్టుబడులు వచ్చాయి,. కరోనా కాలంలో ఈ పెట్టుబడులు ఆగిపోయాయి. దీంతో నిధుల కోసం స్టార్టప్‌లు ఐపీఓ వైపు చూస్తున్నాయి. ► గతంలో ఆలీబాబా, టెన్సెంట్ వంటి చైనా సంస్థల నుంచి స్టార్టప్‌లకు పెట్టుబడుల వరద పారేది. మన దేశంతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడంతో చైనా నుంచి పెట్టుబడుల విషయమై భారత ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. దీంతో చైనా సంస్థల నుంచి నిధులు రావడం లేదు. ఫలితంగా స్టార్టప్‌లు తమ ఐపీఓ ప్రణాళికలను ముందుకు జరపక తప్పడం లేదు. -
ఎలక్ట్రిక్ స్టార్టప్‌లో విజయ్ దేవరకొండ పెట్టుబడులు
ముంబై: హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ బైక్స్ స్టార్టప్ వాట్స్ అండ్ వోల్ట్స్‌లో సినీ హీరో విజయ్ దేవరకొండ పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీ వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది. పెట్టుబడులు ఎంతనేది వెల్లడించలేదు. స్వల్ప ప్రయాణానికి వీలుగా కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ సైకిల్స్, బైక్‌లు, స్కూటర్ల వంటివి తీసుకొస్తామని విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారుడు ప్రయాణించిన దూరానికి మాత్రమే చార్జీలు చెల్లించేలా పే పర్ యూజ్ విధానంలో వీటిని తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే విజయ్ ‘రౌడీ’ బ్రాండ్ పేరిట దుస్తుల విభాగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిరుద్యోగ యువత, రైతులకు తక్కువ ధరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అవసరమైన ఆర్థిక చేయూత, మార్కెటింగ్ సేవలను అందించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ స్టార్టప్ అవర్ ఫుడ్ సిద్ధమైంది. ఈ మేరకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ)తో ఒప్పందం చేసుకుంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అవర్ ఫుడ్ సీఈఓ వీ బాలా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ స్థానిక బ్యాంక్‌లతో ఒప్పందం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
మీ ఇంటికే మెకానిక్
కార్ అయినా బైక్ అయినా నడిచినంత కాలం పర్లేదు. కాని ఆగిందంటే నరకమే అంటారు వాహన చోదకులు. సరైన సర్వీసింగ్ సెంటర్ దొరకక, దొరికిన సర్వీసింగ్‌పై సందేహాలు తీరక... వాహన యజమానులు కష్టాలకూ ఓనర్స్అనిపించుకుంటున్నారు. ఈ పరిస్థితుల నుంచే ఓ యువ టీమ్ సృష్టించింది గో మెకానిక్ స్టార్టప్. సాక్షి, సిటీబ్యూరో: మన దేశంలో కార్లు వినియోగించేవాళ్లు కేవలం అందానికి, సాంకేతిక విశేషాలకు మాత్రమే కాకుండా నాణ్యమైన విక్రయానంతర సేవలకూ అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఆ సేవలు సైతం తమకు వీలైనంత సమీపంలో ఉండాలని కోరుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఆథరైజ్డ్ సేవలకూ, లోకల్ వర్క్‌షాప్స్‌కు మధ్య సర్వీసింగ్ తో పాటు ధరల్లో కూడా చెప్పుకోదగ్గ వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఈ ఖాళీని పూర్తి చేయడానికే టెక్నాలజీని అనుసంధానించిన కార్ సర్వీసెస్ సెంటర్స్ నెట్‌వర్క్‌గా గో మెకానిక్‌ను అందుబాటులోకి తెచ్చామంటున్నారు అమిత్ భాసిన్, రిషబ్ కర్వా, కుశాల్ కర్వా, నితిన్ రానాలు. ఢిల్లీకి చెందిన ఈ యువ బృందం ఇటీవలే నగరానికీ తమ సేవల్ని విస్తరించిన సందర్భంగా పంచుకున్న విశేషాలు.. అనుభవం చూపిన పరిష్కారం.. నేను చెవర్లెట్ తీసుకున్నప్పుడు పలు వర్క్‌షాప్స్‌కి తిరిగి రూ.2వేల నుంచి రూ.20వేల వరకూ సమర్పించుకుంటూ ఉండేవాడినని (భాసిన్). అప్పటికీ తన కార్కు సంబంధించిన అసలు సమస్య ఏమిటనేది తెలీలేదు.. ఇలాంటి సందర్భాల్లో ఆథరైజ్డ్ సెంటర్‌కి వెళ్లి అధిక మొత్తం చెల్లించుకోవడం లేదా లోకల్ వర్క్‌షాప్‌లో మంచి సర్వీసింగ్ దొరకాలని భగవంతుడ్ని ప్రార్థించడం.... వినియోగదారుల ముందు రెండే ఆప్షన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉత్పత్తిదారులాగా నాణ్యమైన సేవలనూ లోకల్ వర్క్‌షాప్ తరహాలో అందుబాటు ధరలనూ మేళవించడమే దీనికి పరిష్కారం అనిపించింది. ఎలా పనిచేస్తుందంటే... ఫ్రాంఛైజీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ (ఎఫ్‌ఓసీఓ)మోడల్లో గో మెకానిక్ పనిచేస్తుంది. కస్టమర్ ఇంటి నుంచే కార్ తీసుకెళ్లి మరమ్మతు పూర్తి చేశాక తిరిగి ఇంటికి భద్రంగా చేరుస్తుంది కార్ని ఇచ్చిన దగ్గర్నుంచి అది తిరిగి వచ్చేవరకూ దానికి సంబంధించిన అప్డేట్స్ ఆటోమేటెడ్ మెసేజెస్ కస్టమర్‌కి వెళ్తుంటాయి. మరమ్మతు ధరల్లో పారదర్శకత...తీసుకురావాలనేదే మా ఆలోచన ఏ స్పేర్ పార్ట్కైనా రీప్లేస్మెంట్ చేసేలా...వేలాదిగా స్పేర్ పార్ట్స్, మా కస్టమర్లు అందరికీ సర్వీస్పార్ట్నర్స్ ద్వారా ప్రీ ఫిక్స్డ్ ప్రైసింగ్ ఉంటుంది. వారంటీ అనంతరం ప్రతి కారుకీ తప్పని ఈ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మార్కెట్ విలువ దాదాపు 8 నుంచి 10 బిలియన్లు ఉంటుందని మా అంచనా.మా స్టార్టప్ ప్రస్తుతం హైదరాబాద్ సహా అరడజను నగరాల్లో సేవలు అందిస్తోంది. -
ఆర్టీసీ ఇక ‘ఛలో’
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలో త్వరలో మొబైల్ టిక్కెటింగ్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫోన్ నుంచే నేరుగా బస్సులోనే టిక్కెట్ కొనుక్కునే సదుపాయాన్ని ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తోంది. ఇందుకు ‘ఛలో’ అనే ప్రజా రవాణా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుని ‘ఛలో’ యాప్, ‘ఛలో’ కార్డులను ప్రవేశపెట్టింది. బుధవారం విజయవాడలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్, ఛలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వినాయక్ ‘ఛలో’ యాప్‌ను ఆవిష్కరించారు. తొలి దశలో మొబైల్ టిక్కెటింగ్, ‘ఛలో’ కార్డులను విజయవాడ సిటీ బస్సుల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో ఆన్లైన్ రిజర్వేషన్, ఈ–వాలెట్, నగదు రహిత లావాదేవీలు, వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమలవుతున్నాయి. వీటితోపాటు మొబైల్ టిక్కెటింగ్‌కు అన్ని సౌకర్యాలున్న ఎలక్ట్రానిక్ టిమ్స్‌లను వినియోగించనున్నారు. వీటి కొనుగోలుకు, డిపోల్లో కంప్యూటర్లు అమర్చడానికి, ఇంటర్నెట్కు ఆర్టీసీ పైసా ఖర్చు చేయడం లేదు. ‘ఛలో’ కంపెనీ తమ సామర్థ్యం నిరూపించుకునేందుకు ఉచితంగా ఈ సేవలను ఆర్టీసీకి అందించనుంది. మూడు నెలలు ఉచితంగా స్మార్ట్ కార్డులు ఛలో ట్రావెల్ ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డును మొదటి మూడు నెలలు ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు కంపెనీ నిర్ణయించింది. ఆ తర్వాత తమ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ చేసుకోవాలి. అన్ని రీఛార్జ్‌లపై 5 శాతం ప్రారంభోత్సవ బోనస్ లభిస్తుంది. ఈ స్మార్ట్ కార్డుతో ఒక రోజు బస్ పాస్‌ను కూడా పొందొచ్చు. ఈ పాస్‌తో విజయవాడ సిటీ బస్సుల్లో అపరిమితంగా పర్యటించేందుకు వీలు కల్పించారు. అంతేకాకుండా ప్రయాణికుడు కండక్టర్‌కు ఈ కార్డును చూపిస్తే.. కార్డును ఎలక్ట్రానిక్ టిమ్‌కు ట్యాప్ చేసి టిక్కెట్ ఇస్తారు. కాగా, ఈ స్మార్ట్ కార్డులను త్వరలో అందుబాటులోకి తెస్తామని ‘ఛలో’ కంపెనీ వెల్లడించింది. యాప్ ప్రారంభిస్తున్న ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్, ఛలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వినాయక్ యాప్‌తో మొబైల్ టిక్కెట్లు కొనుక్కునే సదుపాయం ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఛలో యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా సిటీ బస్సుల్లో ఎక్కడ్నుంచి ఎక్కడకు ప్రయాణించాలో.. నమోదు చేసుకుని డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బస్సును లైవ్ ట్రాక్ చేయొచ్చు. ఈ యాప్‌తో బస్టాప్‌ల చిరునామాలు, అన్ని ప్రయాణ మార్గాల ఛార్జీలను తెలుసుకోవచ్చు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకే ప్రయోగాత్మకంగా విజయవాడలో ఛలో యాప్, కార్డును ప్రవేశపెట్టాం. యాప్.. విజయవాడలో 500 సిటీ బస్సుల్లో 2.5 లక్షల మంది రోజువారీ ప్రయాణికులకు సేవలందించనుంది. ఆర్టీసీ.. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో ముందు ఉంటుంది. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు మొత్తం వెయ్యి బస్సులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించాం. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినందున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి విశాఖకు కనెక్టివిటీ పెంచే విధంగా 22 వోల్వో బస్సులను కొనుగోలు చేస్తున్నాం. వీటికి డాల్ఫిన్ క్రూయిజ్‌లుగా నామకరణం చేస్తాం. – మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ ఎండీ -
వైద్య పరికరాల దిగుమతులకు చెక్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఉపయోగించే వైద్య పరికరాల్లో 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఈ పరిస్థితి మారాలని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వైద్య పరికరాల తయారీకి పెద్దపీట వేయాలని, వైద్య పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తమ ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందడుగు వేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా) సంయుక్తంగా నిర్వహించిన బయో ఆసియా సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య పరికరాల తయారీ కేంద్రంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలకు భూ కేటాయింపు పత్రాలను అందజేశారు. ఐబీఎం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బయో ఆసియా వంటి సదస్సులు ప్రభుత్వాలకు, పరిశ్రమలకు ఎన్నో గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. 17వ బయో ఆసియా సదస్సుకు 35 దేశాల నుంచి 2,000 మంది హాజరయ్యారని, వచ్చే ఏడాది ఈ సదస్సు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు అవార్డులు... బయో ఆసియాలో భాగంగా స్టార్టప్ కంపెనీల పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదు కంపెనీలకు కేటీఆర్ నగదు బహుమతులు అందజేశారు. పోటీ కోసం వందల దరఖాస్తులు రాగా నిశిత పరిశీలన తరువాత 70 కంపెనీలకు బయో ఆసియాలో తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించామని, సీసీఎంబీ, టెక్ మహేంద్ర వంటి సంస్థల నుంచి ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలు 5 కంపెనీల ను విజేతలుగా నిర్ణయించారని ఐఐఐటీ ప్రొఫెసర్ రమేశ్ లోకనాథన్ తెలిపారు. నవజాత శిశువులకు వచ్చే కామెర్ల రోగానికి చికిత్స అందించే పరికరాన్ని అభివృద్ధి చేసిన ‘హీమ్యాక్ హెల్త్ కేర్’, డాక్టర్ల అపాయింట్మెంట్లు మొదలు, వారి లభ్యత, ప్రత్యేకతల గురించి టెలిఫోన్లో వివరించేందుకు వాడే కృత్రిమ మేధ ఆధారిత సేవలను అందిస్తున్న ‘కాల్జీ’, ఆధునిక టెక్నాలజీతో పనిచేసే ఊతపు కర్రలు (క్రచెస్)ను తయారు చేసిన ‘ఫ్లెక్సీ మోటివ్స్’, శరీర అవయవాల త్రీడీ మోడళ్ల ద్వారా గాయాలు, శస్త్రచికిత్సల నుంచి కోలుకునే సమయాన్ని సగానికి తగ్గించే ‘లైకాన్ త్రీడీ’, ఈ–కోలీ బ్యాక్టీరియాలో మార్పుల ద్వారా మందుల తయారీకి అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేయగల ‘ఆంకోసెమిస్’కు ఈ అవార్డులు లభించాయి. -
మార్చి నాటికి టీ హబ్–2!
సాక్షి, సిటీబ్యూరో: స్టార్టప్‌లకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో టీహబ్– 2వ దశ భవనం ఈ ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. దేశంలో అతిపెద్ద స్టార్టప్‌ల ల్యాబ్ (ఇంక్యుబేటర్)ఇదేనని ఐటీశాఖ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 9 అంతస్తులు..3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈభవనం రూపుదిద్దుకుంటోంది. ఏకంగా వెయ్యి స్టార్టప్ కంపెనీలకు ఈ భవనం నిలయం కానుంది. సుమారు నాలుగువేల మంది సాంకేతిక నిపుణులు తమ సృజనకు పదునుపెట్టే వేదికగా ఈ భవనాన్ని రాయదుర్గంలో ఇంచుమించు మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో ఐటీశాఖ నిర్మిస్తోంది. అత్యాధునిక హంగులతో దుబాయ్‌లోని బుర్జ్ దుబాయ్ నిర్మాణ శైలిని పోలిన రీతిలో మరో అధునాతన భవంతి నిర్మాణం జరుగుతోంది. బయటి నుంచి చూసే వారికి ప్రధాన కేంద్రం నుంచి నాలుగు పిల్లర్లు.. వేలాడే రెండు స్టీలు దూలాలతో ఈ భవనం నిర్మించినట్లు..వేలాడే భవంతిలా కనిపించనుంది. సుమారు 9 అంతస్తుల్లో ..60 మీటర్ల ఎత్తు...90 మీటర్ల పొడవున నిర్మిస్తోన్న ఈ భవన నిర్మాణం పనులు వడివడిగా జరుగుతున్నాయి. రెండులక్షల చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం...మరో మూడు లక్షల అడుగులమేర సువిశాలమైన పార్కింగ్ సదుపాయంతో సుమారు రూ.276 కోట్ల అంచనావ్యయంతో ఈ భవన నిర్మాణ పనులను చేపట్టారు. గత ఆరునెలలుగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో అంకురపరిశ్రమలతోపాటు,ఇంక్యుబేషన్ల్యాబ్..ఉపాధికల్పన వంటి అంశాల్లో నాలుగు వేల మంది పనిచేసేందుకు వీలుగా విశాలమైన అంతస్తులను నిర్మించనున్నారు. పిల్లర్లపై వండర్ బిల్డింగ్.. టీహబ్ రెండోదశ భవంతి అత్యాధునిక ఇంజినీరింగ్ డిజైన్లు,సాంకేతికత ఆధారంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ శైలి ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఈ భవన నిర్మాణంలో నాలుగు పిలర్ల ఆధారంగా ఒక పునాది..గ్రౌండ్‌ఫ్లోర్..దానిపై 9 అంతస్తుల మేర స్టీలు భవంతిని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో 9 వేల మెట్రిక్‌టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, మరో 2500 టన్నుల రీఇన్ఫోర్స్ స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో కాంక్రీటు నిర్మాణం 25 వేల క్యూబిక్ మీటర్లు కావడం విశేషం. నిర్మాణం సమయంలో పునాదిని 6500 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటు నిర్మాణాన్ని 26 గంటల సమయంలో పూర్తిచేయడం ఇంజినీరింగ్ రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ నిర్మాణ పనుల్లో 25 మంది నిపుణులైన ఇంజినీర్లు..200 మంది నైపుణ్యంగల కార్మికులు పాల్గొంటున్నారు. ఒక్కో అంతస్తుకు ఓ ప్రత్యేకత... గ్రౌండ్‌ఫ్లోర్: వీక్షకులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంటుంది. చక్కటి ఆహ్లాదకరమైన ఆకుపచ్చని గోడలు, ప్రకృతి రమణీయ హరిత దృశ్యాలు, ప్రవేశ ద్వారం, ఆరుబయట సేదదీరేందుకు విశాలమైన పచ్చికబయలు, తగిన సౌకర్యాల కల్పన ఈ ఫ్లోర్ సొంతం. మొదటి అంతస్తు: విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టే నిర్మాణ శైలి, ఇంక్యుబేషన్ కేంద్రం దీని ప్రత్యేకత. భవనంలో జరిగే మొత్తం రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది. రెండో అంతస్తు: అద్భుతమైన 3డి చిత్రాలతో ఆలోచనలను ఆవిష్కరింపజేసే ప్రయోగస్థలాన్ని తలపిస్తుంది. సమావేశమందిరాలు,చర్చా ప్రాంగణాలు ఇందులో ఉంటాయి. 3,4వ అంతస్తులు: అంకురపరిశ్రమలు, ఐటీ, బీపీఓ, కెపిఓ,సేవారంగానికి చెందిన వివిధ కార్యాలయాల ఏర్పాటు, సమావేశాలు, చర్చల నిర్వహణకు అవసరమైన హంగులుంటాయి. ఆకుపచ్చని మొక్కలు, హరితతోరణంతో ఆరోగ్యకరమైన, వినూత్న ఆలోచనలు..వాటి ఆచరణలో పెట్టేందుకు అనువైన పరిస్థితులుంటాయి. 5వ అంతస్తు: ప్రశాంతతకు చిహ్నంగా నిలిచే అటవీ ప్రాంతాన్ని తలపించేలా ఉంటుంది. చిన్నచిన్న కాలిబాటలు..నీటి సెలయేర్లు..అభిప్రాయాలు, ఆలోచనలు పరస్పరం పంచుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటుచేస్తారు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవనుందీ అంతస్తు. 6,7,8,9వ అంతస్తులు: వివిధ రకాల కార్యాలయాలు,అంకురపరిశ్రమలు ఏర్పాటుచేసుకోవచ్చు. ఉద్యోగులకు ఆనందాన్ని,ఆహ్లాదాన్ని,ఆరోగ్యాన్ని పంచేందుకు అవసరమైన వసతులుంటాయి. ఉద్యోగులకు ఆటవిడుపు.. ఇన్డోర్గేమ్స్, జిమ్‌లు, క్యాంటీన్లు, ఫుడ్ కోర్టులు, కేఫెటేరియాలు ఇందులో ఉంటాయి. 3డి నిర్మాణ శైలి.. ఈ భవన నిర్మాణంలో చేపట్టిన వినూత్న విధానాలు, ఆధునిక ఇంజినీరింగ్ ప్రమాణాలు, ప్రపంచంలోకెల్లా అత్యున్నత మైనవి కావడంతో ఈ భవనాన్ని 3డి నిర్మాణంగా భావిస్తున్నారు. ఈ భవన రూపకల్పన, నిర్మాణ విశ్లేషణను ‘ఈటీఏబీఎస్ వి 15.2.2’ అనే నూతన సాఫ్ట్వేర్ ప్రోగ్రాం ద్వారా రూపొందించారు. నిర్మాణ ప్రమాణాల విషయానికి వస్తే ఐఎస్ 456–2000 ప్రమాణాల ప్రకారం బీమ్‌లు, ఆర్సీసీ గోడలు, స్తంభాలను రూపకల్పన చేశారు. భూకంపాలను తట్టుకునేస్థాయిలో ఐఎస్ 1893–2002 ప్రమాణాల ప్రకారం నిర్మించారు. ఈ స్టీలు భవంతి భూకంపాలు, వరదలకు సైతం చెక్కుచెదరని సాంకేతికతతో నిర్మిస్తున్నారు. గురుత్వాకర్షణ బలాలను సైతం ఈ భవంతి తట్టుకుంటుంది. అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనుండడం విశేషం. -
పోలీస్ హ్యాకథాన్
సాక్షి,సిటీబ్యూరో: సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనేతొలిస్థానంలో ఉన్న హైదరాబాద్ సిటీ పోలీసులు మరో వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భద్రతలో విద్యార్థులు, స్టార్టప్ కంపెనీలకు భాగస్వామ్యం కల్పిస్తూ తొలిసారిగా హ్యాకథాన్తలపెట్టారు. రాష్ట్రంలో ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇదేప్రథమమని పోలీసు అధికారులు చెబుతున్నారు. నగర అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) శిఖా గోయల్ సారథ్యంలో నిర్వహించే హ్యాకథాన్‌కు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (కేవీబీఆర్) స్టేడియంవేదిక కానుంది. ఈ నెల 18 ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం నిర్వరామంగా 36 గంటల పాటు సాగుతుంది. ఇందులో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టార్టప్, విద్యార్థికి రూ.లక్ష ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. చెన్నై, బెంగళూరు పోలీసులు గత ఏడాది నవంబర్‌లో ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. నగర పోలీసు విభాగం ఇప్పటికే పలురకాలైన టెక్నాలజీలను వినియోగిస్తోంది. ప్రజల–పోలీసులకు వారధిగా హాక్–ఐ వంటి యాప్స్ సైతం అందుబాటులోకి తెచ్చింది. అయితే, సమాజంలో నేరాల తీరు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇలా అవసరమైన ప్రతిసారి పోలీసులు కొన్ని సంస్థలను సంప్రదించడమో, తమ వద్ద ఉన్న బృందాల సహకారం తీసుకోవడమో చేస్తుంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చెన్నై, బెంగళూరు పోలీసుల మాదిరిగా హ్యాకథాన్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, స్టార్టప్ సంస్థలకు మాత్రమే.. చెన్నై, బెంగళూరు పోలీసులు ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు, ఐటీ పారిశ్రామిక వేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్‌తో పాటు రక్షణ రంగానికి చెందిన వారికీ అవకాశం కల్పించారు. నగర పోలీసులు మాత్రం స్టార్టప్ ఇండస్ట్రీస్, సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులతో పాటు కార్పొరేట్ ఉద్యోగులను మాత్రమే ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. హ్యాకథాన్‌లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా wehub.telangana.gov.in/hackathon.html వెబ్ పేజీ సైతం అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి ఐఐఐటీ హైదరాబాద్, ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ, వి–హబ్ వంటి సంస్థలు సహకరిస్తున్నాయి. రిజిస్టర్ చేసుకున్న వారంతా హ్యాకథాన్‌కు హాజరై తమ ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త యాప్స్‌ను పోలీసుల ముందు ప్రదర్శిస్తారు. వీటిని పరిశీలించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. వీటిలో తాము గుర్తించిన లోపాలు, అవసరమైన మార్పుచేర్పులను సూచిస్తారు. వీటిని పరిగణలోకి తీసుకుని సదరు విద్యార్థి/స్టార్టప్ సంస్థ ఆయా మార్పులు చేసి తక్షణం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇలా ఎంపికైన వాటిలో మూడింటికి బహుమతులు అందిస్తారు. నగర పోలీసు విభాగంతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లాలు, యూనిట్స్‌కు చెందిన పోలీసులు ఈ హ్యాకథాన్‌ను సందర్శించనున్నారు. ఇందులో సైబర్ నేరాలతో పాటు మహిళలు–చిన్నారులపై జరిగే నేరాలు నిరోధించడం, కేసులను కొలిక్కి తీసుకురావడం, రోడ్డు భద్రత పెంపొందించడం–అవగాహన కల్పించడం, సోషల్ మీడియాపై నిఘా–నకిలీ వార్తల గుర్తింపు అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. స్టూడెంట్‌తో పాటు స్టార్టప్ కేటగిరీల్లో వేర్వేరుగా విజేతలను ఎంపిక చేస్తారు. ఈ విజేతల ఆలోచనలను అమలు చేయడంలో పోలీసు విభాగంతో పాటు ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలు సహకరించనున్నాయి. ప్రధానంగా వీటిపైనే దృష్టి.. సైబర్ క్రైమ్: ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ ఫోరెన్సిక్వెరిఫికేషన్ టూల్స్, నకిలీ టూల్స్, యాప్స్ గుర్తింపు, నకిలీ వెబ్‌సైట్స్, పోర్టల్స్ గుర్తింపు ఉమెన్/చిల్ట్రన్ సేఫ్టీ: ట్రాఫికింగ్ నిరోధం, వేళగాని వేళల్లో సంచరించే మహిళలకు రక్షణ, వర్క్ఫోర్స్హెరాస్మెంట్ నిరోధం, ఈవ్ టీజింగ్ నిరోధం,జీపీఎస్ టెక్నాలజీ వినియోగం, చైల్డ్ పోర్నోగ్రఫీనిరోధం, సోషల్ మీడియా–ఇంటర్నెట్పై నిఘా రోడ్ సేఫ్టీ: ఇంటెలిజెంట్ పార్కింగ్ సిస్టం, ఫుట్పాత్ఆక్రమణల నిరోధం, ఉల్లంఘనల గుర్తింపు సోషల్ మీడియా: నకిలీ వార్తల గుర్తింపు,మూలాలు కనిపెట్టడం -
అకస్మాత్తుగా బైక్ చెడిపోయిందా...
సాక్షి, సిటీబ్యూరో: అకస్మాత్తుగా బైక్ చెడిపోయిందా...చాలా రోజులుగా సర్వీసింగ్‌కు ఇవ్వాలనుకొని ఇవ్వలేకపోతున్నారా..పని ఒత్తిడి కారణంగా తీరిక లేకుండా ఉందా.. మరేం ఫరవాలేదు. ఇప్పుడు మీరు ఎక్కడుంటే అక్కడి నుంచే బైక్ సర్వీసింగ్ సేవలు లభిస్తాయి. మీరు కోరుకున్న సమయంలో వాహనానికి కావలసిన మరమ్మతులు చేసి అందజేస్తారు. సర్వీసింగ్ స్టేషన్లకు పరుగెత్తవలసిన అవసరం లేదు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంటి నుంచి వాహనాన్ని తీసుకెళ్లి సర్వీసింగ్ చేసి ఆ తరువాత తిరిగి ఇంటి దగ్గరే అప్పగిస్తారు. ఇందుకోసం చేయాల్సిందల్లా ఒక్కటే .. గాడీ–360 మొబైల్ అప్లికేషన్లో మీ బైక్ మరమ్మతు అవసరాన్ని నమోదు చేయడం. అంతే. ఆ తరువాత నిశ్చింతగా ఉండొచ్చు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ‘గాడీ –360 ’ స్టార్టప్ సంస్థ ఈ వినూత్నమైన సదుపాయాన్ని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చింది. సేవలు ప్రామాణికం సాధారణంగా చాలామంది వాహనదారులు పని ఒత్తిడి కారణంగా, నిర్లక్ష్యం వల్ల బైక్ సర్వీసింగ్‌ను వాయిదా వేస్తూంటారు. దీంతో బండి బాగా చెడిపోయి, విడిభాగాలు దెబ్బతింటాయి. అప్పుడు మరింత నష్టం వాటిల్లుతుంది. కానీ క్రమం తప్పకుండా వాహనాన్ని సర్వీసింగ్ చేయడం వల్ల ఎక్కువ కాలం వినియోగించుకొనే అవకాశం లభిస్తుంది. మరోవైపు బైక్‌ను సర్వీసింగ్‌కు ఇవ్వాలని భావించినప్పటికీ ప్రామాణికమైన, నమ్మకమైన మెకానిక్‌ను ఎంపిక చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతారు. ఈ పరిస్థితుల్లో అలాంటి ఇబ్బందులేమీ లేకుండా నాణ్యమైన, నమ్మకమైన, ప్రామాణికమైన బైక్ సర్వీసింగ్ సదుపాయం కల్పించనున్నట్లు హామీ ఇస్తోంది గాడీ–360. ప్రస్తుతం మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, తదితర ప్రాంతాల్లో సేవలు కొనసాగుతున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాలకు తమ సర్వీసులను విస్తరిస్తున్నట్లు చెప్పారు సంస్థ సీఈఓ అనిల్. వాహన వినియోగదారులు మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తమ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్, అడ్రస్, తదితర వివరాలను నమోదు చేస్తే చాలు. ప్రతినిధులు నేరుగా వచ్చి బైక్‌ను పరిశీలించి లోపాలను గుర్తిస్తారు. మరమ్మతులకు అంగీకరిస్తే తమతో పాటు తీసుకెళ్తారు. మరమ్మతులు పూర్తయిన తరువాత ఫైనల్ బిల్లు మొబైల్ ఫోన్‌కు అందుతుంది. ఆ తరువాత ప్రతినిధులు తిరిగి వాహనాన్ని అప్పగిస్తారు. ఈ పిక్ అండ్ డ్రాప్ సేవలు పూర్తిగా ఉచితం. సర్వీసింగ్ చార్జీలు మాత్రం రూ.799 చెల్లిస్తే సరిపోతుందని అనిల్ వివరించారు. ఒకవేళ విడిభాగాలు ఏవైనా వినియోగిస్తే వాటికి సంబంధించిన ఇన్వాయిస్ ప్రకారం డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. పని చేసే ఆఫీస్ నుంచి లేదా ఇంటి దగ్గర నుంచి ఈ సర్వీసులను పొందవచ్చు. పారదర్శకమైన సేవలు మా సేవలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. ఎక్కడా ఎలాంటి దాపరికం ఉండదు. బ్రాండెడ్ విడిభాగాలను వినియోగిస్తాం. నాణ్యమైన సేవలను అందజేస్తాం. వాహనదారులు తమ బైక్ మోడల్, బ్రాండ్, రిజిస్ట్రేషన్ నెంబర్, బుకింగ్ డేట్ వంటి వివరాలను యాప్ ద్వారా నమోదు చేసి మాకు చేరవేస్తే చాలు. ఆ తరువాత అన్నీ మేమే చూసుకుంటాం. – అనిల్, సీఈవో -
మీ భూమి చరిత్ర!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాపర్టీ కొనాలన్నా, విక్రయించాలన్నా అంత తేలికేమీ కాదు. సవాలక్ష సందేహాలుంటాయి. మెట్రో నగరాల్లో అయితే మరీ ఎక్కువ!!. ఎంపిక చేసిన ప్రాపర్టీకి ఎలాంటి లీగల్ చిక్కులున్నాయో? వాస్తవానికి ఆయా ప్రాంతంలో ధర ఎంత ఉందో? ఒకవేళ కొన్నాక నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయో రావో..? బ్యాంక్ గృహ రుణం ఎంతవరకు ఇస్తుందో? .. ఇలా ప్రతి దశలోనూ సందేహాలే. వీటన్నింటికీ ముందే... అది కూడా చిటికెలో పరిష్కారం చూపిస్తే? అదే ‘మై ఓఎస్ ప్రాపర్టీ.కామ్’ (మేక్ యువర్ ఓన్ స్పేస్ ప్రాపర్టీ.కామ్) ఘనత. ఈ యాప్‌ను హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ‘ఓల్యూబిల్లీస్ ప్రాపర్టీ’ అభివృద్ధి చేసింది. మైఓఎస్ ప్రాపర్టీ యాప్‌కు మెంటార్‌గా ఉన్న జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్డ్స్ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ డి. విజయ్ కిశోర్ ఈ యాప్ గురించి ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఇప్పటివరకు యాప్ డెవలప్మెంట్ కోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశామని, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్, వెబ్ అప్లికేషన్స్ మూడూ అందుబాటులో ఉన్నాయన్నా రు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... 12 నగరాల్లో జియో ట్యాగ్.. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, కాన్పూర్, చెన్నై, బెంగళూరు, పుణే, ముంబై, అహ్మదాబాద్, సూరత్, జైపూర్ నగరాల్లో సేవలందిస్తున్నాం. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రోపాలిటన్స్, కార్పొరేషన్లు, స్పెషల్ అథారిటీ తాలూకు బిల్డింగ్ రూల్స్, మాస్టర్ప్లాన్స్ను డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్(డీసీఆర్) సాంకేతికతతో డీ–కోడింగ్ చేశాం. ఆయా ప్రాపర్టీలకు జియో ట్యాగింగ్ చేశాం. దీంతో ప్రాపర్టీ రెసిడెన్షియల్ జోన్లో ఉందా? కమర్షియల్ జోన్లో ఉందా? ధర ఎం త? వంటివన్నీ సెలక్ట్ చేయగానే వచ్చేస్తాయి. ఎలా పనిచేస్తుందంటే... స్మార్ట్‌ఫోన్‌లో మైఓఎస్ ప్రాపర్టీ.కామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ లొకేషన్స్‌లో మన ప్రాపర్టీ తాలూకు లొకేషన్, హద్దులను, రోడ్లను మ్యాపింగ్ చేయాలి. అంతే!! క్షణాల్లో ప్రాపర్టీ త్రీడీ రూపంలో ప్రత్యక్షమవుతుంది. అంతేకాదు... ఆయా ప్రాంతంలో ప్రభుత్వం నుంచి ఎన్ని అంతస్తులకు పర్మిషన్ ఉంది? ప్రాపర్టీ విలువ ఎంత? వంటి అన్ని వివరాలు వచ్చేస్తాయి. వీటితో పాటూ ఆర్కిటెక్ట్, ప్లానర్స్, ఇంజనీర్ల వివరాలు, న్యాయపరమైన సలహాల కోసం లీగల్ నిపుణులు, రుణాల కోసం ఆర్ధిక సంస్థలు, బ్యాంక్‌ల వివరాలు, అనుమతులకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు... ఇలా అన్ని వివరాలూ వచ్చేస్తాయి. ప్రవాసుల కోసం ల్యాండ్‌గార్డ్.. ప్రత్యేకంగా ప్రవాసులు(ఎన్నారైల) కోసం ల్యాండ్‌గార్డ్ అనే మరో ఫీచర్‌ను అభివృద్ధి చేశాం. ఇదేంటంటే... ప్రవాసులు మెట్రో నగరాల్లో స్థలాలు, ప్రాపర్టీలను కొంటుంటారు. ఆయా ప్రాపర్టీల్లో ఏం జరుగుతోంది? చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది? ఎవరైనా కబ్జా చేశారా? వంటి రకరకాల టెన్షన్స్ ఉంటాయి. ఇందుకోసం ల్యాండ్‌గార్డ్ ఫీచర్లో ప్రతి నెలా ప్రాపర్టీల ప్రత్యక్ష ఫొటోలు తీసి.. వాటిని జియో ట్యాగింగ్ చేసి సదరు ప్రాపర్టీ యజమానులకు పంపిస్తుంటాం. 1100 మంది ఎన్ఆర్ఐలు ఈ సేవలను వినియోగిస్తున్నారు. 100 కోట్ల వ్యాపారం లక్ష్యం.. మైఓఎస్ ప్రాపర్టీ యాప్ మీద సుమారు 50 మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరికి సుమారు 10 లక్షల డౌన్‌లోడ్స్‌కు చేరుతాం. వచ్చే ఏడాది కాలంలో 100 నగరాలకు, రూ.100 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీతెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ప్రకటనలు చూస్తే పైసలొస్తాయ్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :ప్రకటనలు చూస్తే మనకేం వస్తుంది? కొత్త ఉత్పత్తులు లేక ఆఫర్ల గురించి తెలుస్తుంది. అంతే కదా!!. కానీ, యాడ్ చూస్తే చాలు మన జేబులోకి డబ్బులొస్తే? ఇది అక్షరాలా నిజం. క్విక్యాడ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే ఇది సాధ్యమే. ప్రకటనల రంగంలో సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది హైదరాబాదీ స్టార్టప్ క్విక్యాడ్స్. మరిన్ని వివరాలు సీఈఓ సుమంత్ రాగిరెడ్డి మాటల్లోనే.. ‘‘యూజర్లు తమ ఫోన్లలో క్విక్యాడ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా మంది మా యాప్‌లో అడ్వర్టయిజ్‌మెంట్స్ ప్రసారమవుతాయని అనుకుంటారు. కానీ అది తప్పు యాప్‌లో ఏమీ ఉండదు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న మొబైల్స్‌లో యూజర్లు ఫోన్ మాట్లాడడం పూర్తవగానే యాడ్ వీడియో వస్తుంది అంతే! దీన్ని పూర్తిగా చూస్తే.. యూజర్లకు డిజిటల్ వాలెట్‌లోకి డబ్బులొస్తాయి. నెలకు 200–800 వరకు ఆదాయం వస్తుంది. రూ.6 కోట్ల ఆదాయం.. 193 దేశాల్లో 3 రకాల సాఫ్ట్వేర్ పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ప్రస్తుతానికి ఇండియన్ పేటెంట్, కాపీరైట్స్ హక్కులు వచ్చాయి. ఇప్పటివరకు రూ.52 లక్షల ఆదాయం వచ్చింది. 4 నెలల్లో ఏపీ, మహారాష్ట్ర, అస్సాంలకు విస్తరించనున్నాం. ఆగస్టు నుంచి నైజీరియా, కెన్యా దేశాల్లో సేవలను ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది కాలంలో కార్పొరేట్లో 50, లోకల్లో 5 వేల కంపెనీలకు, 6–7 లక్షల యూజర్లకు చేరుకోవాలని, రూ.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెటట్టుకున్నాం. రూ.1.5 లక్షలకు ఫ్రాంచైజీ.. ప్రస్తుతానికి యూజర్లకు క్విక్ యాడ్ డిజిటల్ వాలెట్లో మనీని జమ చేస్తున్నాం. వీటిని యూజర్ కావాలంటే రీచార్జ్‌లు, మూవీ టికెట్స్ తదితరాలకు వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఈ సొమ్ముతో యూజర్ పేరు మీద బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించాం. యూజర్ బీమా ప్రీమియం ఈ సొమ్ముతో కంపెనీయే చెల్లిస్తుంది. ఇప్పటివరకు రూ.1.2 కోట్ల పెట్టుబడి పెట్టాం. నాలుగున్నర నెలల్లో బ్రేక్ ఈవెన్‌కు వస్తాం. క్విక్యాడ్స్ ఫ్రాంచైజీలు ఇస్తున్నాం. రూ.1.5 లక్షల చార్జీ. ఇప్పటివరకు తెలంగాణలో 25 ఫ్రాంచైజీలు ఇచ్చాం. అడ్వర్టయిజ్మెంట్ మెటీరియల్స్, సాఫ్ట్వేర్, టెక్నికల్ సపోర్ట్ అంతా కంపెనీదే’’ అని సుమంత్ తెలిపారు. 1.6 లక్షల యూజర్లు;74 మంది క్లయింట్లు.. ప్రస్తుతం మాకు 1.6 లక్షల మంది యూజర్లతో పాటు, 74 కంపెనీలు క్లయింట్స్‌గా ఉన్నాయి. గీతమ్, కేఎల్, విజ్ఞాన్ యూనివర్సిటీలు, ప్రైడ్ హోండా, జేఎస్ఆర్ గ్రూప్, శ్రీ తారక జువెల్లర్స్ వంటి కంపెనీలు జాబితాలో ఉన్నాయి. త్వరలోనే కేఎఫ్‌సీ, బీఎస్ఎన్ఎల్, ఎస్బీఐలతో ఒప్పందం చేసుకోనున్నాం. 10, 20, 30 సెకన్ల నిడివి గల యాడ్ వీడియోలుంటాయి. ధరలు రూ.5 వేల నుంచి రూ.12 లక్షల వరకూ ఉంటాయి. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీతెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
అదిగో అద్దె గది
సికింద్రాబాద్ స్టేషన్లో బస్సు దిగిన కావ్య.. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణంతో బాగా అలసిపోయింది. మాదాపూర్‌లో ఇంటర్వ్యూకి ఇంకా మూడు గంటల సమయం ఉంది. కాసేపు ఎక్కడైనా రెస్ట్ తీసుకుని తర్వాత ఇంటర్వ్యూకి వెళితే బాగుంటుందనుకుంది. కానీ ఆమెకునగరంలో తెలిసిన వారెవరూ లేరు. మరెలా? అవినాష్ ఆఫీస్గచ్చిబౌలిలో ఉంది. వర్క్ కూడా అయిపోయింది. కాసేపట్లో తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి జూబ్లీహిల్స్ వెళ్లాలి. డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అవకుండా పార్టీకి వెళితే బాగుండదు. కానీ బోడుప్పల్లో ఉన్నఇంటికి వెళ్లి వస్తే పార్టీ సమయం దాటిపోతోంది ఇప్పుడెలా? సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొనేవే. ఇవే కాదు ఇలాంటి మరెన్నో ఇబ్బందులకు సమాధానం తమ ‘పోబైట్’ యాప్ (www.pobyt.co) చెబుతుందంటున్నారు నిఖిల్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా గుర్రాలకు చెందిన ఆయన అమెరికాలో ఉన్నత చదువు, పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ ‘పోబైట్’ అని వెల్లడించారు. సింగపూర్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన నిఖిల్ సోదరుడు నిహాల్‌రెడ్డి, ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ చేసిన భార్య మేఘన కోలన్ కలిసి యాప్ ద్వారా అచ్చంగా క్యాబ్ బుకింగ్ తరహాలో తక్షణ అవసరాల కోసం హోటల్ రూమ్స్ అందిస్తుండడం విశేషం. అవసరమైన వెంటనే బుక్ చేసుకోగలగడంతో పాటు ఎంతసేపు వినియోగిస్తే అంత సమయానికి మాత్రమే డబ్బులు చెల్లించేందుకు వీలుగా నిఖిల్‌రెడ్డి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. నిఖిల్, నిహాల్ , మేఘన మారుతున్న అవసరాలకుఅనుగుణంగా.. రియల్ ఎస్టేట్ ధరల పుణ్యమాని సిటీలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలామంది సిటీలో ఉద్యోగాలు చేస్తూ శివార్లలో నివాసముంటున్నారు. దీనివల్ల ఇంటి అద్దె భారం తగ్గినా ఆఫీసులకు ఉద్యోగుల రాకపోకల సమయం బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో రిలాక్స్ అవడానికో, రెస్ట్ కోసమో ఇంటికి, ఆఫీసుకి మధ్య కొన్నిసార్లు తాత్కాలిక బస అవసరం అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సమావేశాలతో, ఈవెంట్స్‌తో అలసిపోయాక పార్టీలకో, మరేదైన ముఖ్యమైన మీట్కో వెళ్లాల్సి ఉంటే కాసింత ఫ్రెష్ అవడానికి ఏదైనా రూమ్ దొరికితే బాగుండుననిపిస్తుంది. దగ్గరలో ఉన్న ఏ ఫ్రెండ్‌నో.. బంధువులనో అడగాలంటే సమయానికి వారు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఓ గంట.. రెండు గంటలు రెస్ట్ తీసుకునేందుకు గది దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఏదైనా హోటల్కువెళితే మాత్రం ఫుల్ డే డబ్బులు చెల్లించాల్సిందే. కిలోమీర్కు ఇంత అని క్యాబ్‌కు చెల్లిస్తున్నప్పుడు.. గది అద్దె కూడా అలా చెల్లించే వెసులుబాటు ఉంటే బాగుంటుంది కదా..! ఇలాంటి ఆలోచన నుంచి పుట్టిందే ‘పోబైట్’ యాప్. ‘నిమిషాల్లో క్యాబ్‌ని అందించగలుగుతున్నప్పుడు హోటల్ రూమ్‌ని ఎందుకు అందించలేం? అని ఆలోచించాం. కేవలం రిలాక్స్ అవడానికో, రెస్ట్ తీసుకోవడానికో మాత్రమే కాక ఏకాంతంగా ఉండే ప్రదేశంలో కొన్ని గంటల్లో పర్సనల్ కంప్యూటర్ ద్వారా పనులు చక్కబెట్టుకునేవారికి, దూర ప్రాంతాలకు విమాన ప్రయాణం చేస్తూ మధ్య ఏదైనా సిటీలో బ్రేక్ జర్నీ చేసేవారికి ఉపయోగపడేలా ఏదన్నా చేయాలనుకున్నాం. అదే ఈ యాప్ ద్వారా అందిస్తున్నాం’ అని చెప్పారు నిఖిల్. ఉభయులకుఅనుకూలంగా.. విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన బెడ్, ఎయిర్ కండిషన్, వైఫై సేవలు, ఇంకా కావాలనిపిస్తే డ్రింక్స్, స్నాక్స్.. అన్నీ అందించే తాత్కాలిక బస అంటే హోటల్ రూమ్‌ని మించి ఏముంటుంది? ‘కనీసం 3 స్టార్ హోటల్స్ మా ప్రాధాన్యం’ అంటున్నారు నిఖిల్. ఈ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుంటే ఒక లగ్జరీ బెడ్, బాత్‌టబ్ సహా అన్ని సౌకర్యాలను జేబులో పెట్టుకున్నట్టే అంటున్నారాయన. మరోవైపు చాలా నగరాల్లో హోటల్స్ నిర్వాహకులు కూడా రద్దీ సమయాల్లో తప్ప గదులు ఖాళీగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి తమ యాప్ ద్వారా ఆక్యుపెన్సీ, ఆదాయం రెండూ పెరుగుతాయని అంటోందీ బృందం. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాల్లో పలు హోటల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అధికారికంగా వినియోగదారులకు గైడ్ చేసేలా ఆటోవాలాలకు కూడా ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. -
స్టార్టప్స్‌కు ఊరట..!
న్యూఢిల్లీ: ఏంజెల్ ట్యాక్స్ నోటీసులతో ఆందోళన చెందుతున్న స్టార్టప్ సంస్థలకు ఊరటనిస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది. స్టార్టప్ సంస్థల నిర్వచనాన్ని మార్చడంతో పాటు నిబంధనలను సడలించింది. ఇకపై రూ. 25 కోట్ల దాకా పెట్టుబడులపై పూర్తి స్థాయిలో పన్ను మినహాయింపులు వర్తింపచేసేలా నిర్ణయం తీసుకుంది. ప్రమోటర్లు, కుటుంబ సభ్యులు, మిత్రులు చేసే పెట్టుబడులకు ఈ పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. ‘అర్హత కలిగిన లిస్టెడ్ కంపెనీలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ చేసే పెట్టుబడులు కూడా ఈ పరిమితి పరిధిలోకి రావు. దీంతో పెట్టుబడులు రూ. 25 కోట్లకు మించినప్పటికీ స్టార్టప్ సంస్థలు పన్నుపరమైన ప్రయోజనాలు పొందవచ్చు‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ఇప్పటిదాకా ఏంజెల్ ఇన్వెస్టర్లు సహా ఇతరత్రా సమీకరించిన మొత్తం పెట్టుబడులు రూ. 10 కోట్ల దాకా మాత్రమే ఈ పరిమితి ఉండేది. పన్ను రాయితీల ప్రయోజనాలు కల్పించే క్రమంలో స్టార్టప్ సంస్థ నిర్వచనాన్ని కూడా కేంద్రం మార్చింది. టర్నోవరు పరిమితి రూ. 25 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెంచింది. ఏర్పాటైనప్పట్నుంచీ ఏ ఆర్థిక సంవత్సరంలోనూ టర్నోవరు రూ. 100 కోట్లు దాటని సంస్థను స్టార్టప్‌గా పరిగణిస్తారు. పన్నుపరమైన ప్రయోజనాలు పొందేందుకు ఉద్దేశించిన కాల వ్యవధిని 7 సంవత్సరాల నుంచి పదేళ్లకు పెంచారు. పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలను 2021 మార్చి 31 లోగా సమీక్షించే అవకాశం ఉంది. ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఇప్పటికే జారీ చేసిన ట్యాక్స్ నోటీసులకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులకు సీబీడీటీ సూచించింది. పెద్ద స్టార్టప్స్‌కూ ప్రయోజనం.. తాజాగా సడలించిన నిబంధనలతో పెద్ద స్టార్టప్‌లకు కూడా ప్రయోజనం చేకూరగలదని లక్ష్మీకుమరన్ అండ్ శ్రీధరన్ అటార్నీస్ సంస్థ పార్ట్నర్ ఎస్ వాసుదేవన్ పేర్కొన్నారు. రూ. 100 కోట్ల పైబడి టర్నోవరు ఉండి, షేర్ల కేటాయింపు ద్వారా సమీకరించిన ప్రీమియం పెట్టుబడులపై ట్యాక్స్‌లు కట్టాల్సిన స్టార్టప్‌లకు కూడా ఊరట లభిస్తుందని వివరించారు. ఇప్పటిదాకా రూ. 5 కోట్ల కన్నా తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసే ఏంజెల్ ఇన్వెస్టర్లకూ పన్నుపోటు ఉంటోందని, తాజాగా పెట్టుబడుల పరిమితిని రూ. 25 కోట్లకు పెంచడం ద్వారా ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్స్కి మించి ప్రయోజనం చేకూర్చినట్లవుతుందని డీపీఐఐటీ కార్యదర్శి రమేష్ అభిషేక్ చెప్పారు. ప్రస్తుతం గుర్తింపు పొందిన స్టార్టప్స్ 16,000 పైచిలుకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సవరించిన నిబంధనల ప్రకారం.. రూ. 100 కోట్ల నికర విలువ లేదా టర్నోవరు రూ. 250 కోట్ల పైచిలుకు ఉన్న లిస్టెడ్ కంపెనీలు.. అర్హత కలిగిన స్టార్టప్స్‌లో చేసే పెట్టుబడులపై పన్నుపరమైన మినహాయింపులు పొందవచ్చు. ఇది రూ. 25 కోట్ల పెట్టుబడుల పరిమితికి అదనంగా ఉంటుంది. ఇక, అర్హత కలిగిన స్టార్టప్‌లలో ప్రవాస భారతీయులు, ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్ (కేటగిరి1) మొదలైనవి చేసే ఇన్వెస్ట్మెంట్స్కి కూడా మినహాయింపులు లభిస్తాయి. ఇవి కూడా రూ. 25 కోట్ల పరిమితికి అదనంగా ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న స్టార్టప్ సంస్థ డీపీఐఐటీ గుర్తింపు పొంది ఉండి, నిర్దిష్ట అసెట్స్‌లో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపులు పొందవచ్చు. స్థిరాస్తి, రూ. 10 లక్షలు దాటిన రవాణా వాహనాల కొనుగోలు, వ్యాపార అవసరార్థం తప్పితే ఇతరత్రా సంస్థలకు రుణాలివ్వడం, షేర్ల కొనుగోలు మొదలైన వాటికి ఈ మినహాయింపులు వర్తించవు. అయితే, ఆయా రంగాల్లోనే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు మినహాయింపు ఉంటుంది. స్టార్టప్ సంస్థలు ఈ మినహాయింపులు పొందాలంటే సమీకరించిన నిధుల వినియోగం గురించి డీపీఐఐటీకి సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పిస్తే సరిపోతుంది. దీన్ని ఆ తర్వాత కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కు డిపార్ట్మెంటు పంపుతుంది. ఏంజెల్ పెట్టుబడులకు మార్గం సుగమం.. నిబంధనలను సడలించడంపై పరిశ్రమవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. తాజా పరిణామంతో స్టార్టప్ సంస్థల్లో ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్లు మళ్లీ పుంజుకోగలవని ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ (ఐఏఎన్) సహ వ్యవస్థాపకురాలు పద్మజా రూపారెల్ చెప్పారు. స్టార్టప్‌లకు పెద్ద అడ్డంకి తొలిగిపోయినట్లవుతుందని లోకల్‌సర్కిల్స్ సంస్థ వ్యవస్థాపకుడు సచిన్ తపాడియా చెప్పారు. ‘ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్కు మరింత ఊతమిస్తుంది. స్టార్టప్‌ల సంఖ్యాపరంగా మూడో స్థానంలో ఉన్న భారత్.. త్వరలోనే అగ్రస్థానానికి చేరేందుకు ఇది దోహదపడుతుంది‘ అని టీఐఈ ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంత విభాగ గౌరవ చైర్మన్ సౌరభ్ శ్రీవాస్తవ చెప్పారు. వివాదమిదీ.. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)) నిబంధన స్టార్టప్ సంస్థలకు సమస్యాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. స్టార్టప్ సంస్థ నికర మార్కెట్ విలువకు మించి వచ్చిన పెట్టుబడులను ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించి 30 శాతం పన్ను రేటు వర్తింపచేసేలా ఈ నిబంధన ఉంది. స్టార్టప్‌లలో పెట్టుబడుల నిబంధనలు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో 2012లో ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఇది ఏంజెల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నందున.. దీన్ని ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నిబంధన కింద ఇటీవల నోటీసులు జారీ అవుతుండటంతో పలు స్టార్టప్‌లు ఆందోళన చెందుతున్నాయి. దీన్ని ఎత్తివేయాలంటూ స్టార్టప్ సంస్థలు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా మార్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
డ్రోన్ల శక్తి పెరిగింది....
శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ ఎల్రాయ్.. ఏకంగా 250 కిలోల బరువును మోసుకెళ్లగలిగే డ్రోన్లను సిద్ధం చేసింది. వస్తువుల రవాణాకు ఉపయోగపడే డ్రోన్లు ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ కేవలం పది, ఇరవై కిలోల బరువు మాత్రమే మోసుకెళ్లగలవు. పైగా ఇవి ప్రయాణించే దూరం కూడా చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఎల్రాయ్ 250 కిలోల బరువును మోసుకెళ్లగలిగే డ్రోన్లను సిద్ధం చేయడం.. అది కూడా ఏకంగా 300 మైళ్ల దూరం ప్రయాణించేలా సిద్ధం చేయడం విశేషం. ఆరు రోటర్లతో కూడిన ఈ డ్రోన్లు నిట్టనిలువుగా పైకి ఎగురుతాయి. నేలకు దిగగలవు కూడా. వీటితోపాటు వెనుకభాగంలో ఏర్పాటు చేసిన ఇంకో రోటర్ కారణంగా వేగంగా ముందుకెళ్లగలదని కంపెనీ సీఈవో డేవిడ్ మెరిల్ తెలిపారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ అవసరం కూడా లేకుండా ఇది హైబ్రిడ్ వపర్ ట్రెయిన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. విపత్తుల సందర్భంలో సరుకులు రవాణా చేసేందుకు ఈ డ్రోన్లు బాగా ఉపయోగపడుతాయని.. భవిష్యత్తులో ట్రక్కులకు బదులుగా ఈ డ్రోన్లను వాడాలన్నది తమ లక్ష్యమని మెరిల్ వివరించారు. ఇప్పటికే దాదాపు 70 కోట్ల రూపాయల నిధులు సేకరించిన తాము మరిన్ని నిధుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. -
స్విగ్గీ చేతికి కింట్ ఐవో
న్యూఢిల్లీ: బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ‘కింట్ డాట్ ఐవో’ను స్విగ్గీ సొంతం చేసుకుంది. దీంతో కింట్ ఐవో వ్యవస్థాపకులు పవిత్ర సోలాని జవహర్, జగన్నాథన్ వీరరాఘవన్ స్విగ్గీ బృందంలో చేరతారని కంపెనీ తెలిపింది. తన ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపునకు ఈ కొనుగోలు చేసింది. యూబీఎస్ మార్పులతో యమహా స్కూటర్లు న్యూఢిల్లీ: భారత నూతన ప్రమాణాలకు తగినట్లుగా తమ కంపెనీ స్కూటర్లను ఆధునికరిస్తున్నట్లు యమహా మోటార్ ఇండియా ప్రకటించింది. ఇందులో భాగంగా ఏకీకృత బ్రేకింగ్ వ్యవస్థను (యూబీఎస్) తమ స్కూటర్లలో అమర్చనున్నట్లు తెలియజేసింది. 125 సీసీ పైబడిన ద్విచక్ర వాహనాలకు ఈ వ్యవస్థ తప్పనిసరికావడంతో అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ కంపెనీ చైర్మన్ మెటొఫుమీ షితార వివరించారు. -
స్టార్టప్‌లకు ఉపశమనం!
న్యూఢిల్లీ: పన్నుకు సంబంధించి స్టార్టప్ సంస్థల్లో నెలకొన్న భయాందోళనలు కాస్త ఉపశమించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏంజెల్ ఫండ్స్ వెచ్చించే పెట్టుబడులపై స్టార్టప్స్ పన్ను మినహాయింపులను కోరేందుకు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఏంజెల్ ఫండ్స్ ద్వారా తాము సమీకరించిన నిధులపై పన్నులు చెల్లించాలంటూ ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ నుంచి తమకు నోటీసులందటంపై స్టార్టప్స్ వ్యవస్థాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ 56 (2) కింద స్టార్టప్ సంస్థలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. స్టార్టప్‌కు పన్ను మినహాయింపు నిబంధనల విషయంలో తాజా మార్పుల నోటిఫికేషన్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆమోదం తెలిపినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ‘త్వరలో అమల్లోకి రానున్న కొత్త విధానం ప్రకారం స్టార్టప్స్ గనుక ఏంజెల్ ఫండ్స్‌పై పన్ను మినహాయింపులను కోరాలంటే ముందుగా పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డీఐపీపీ) దరఖాస్తు చేసుకోవాలి. నిర్ధేశిత స్టార్టప్ దరఖాస్తును తగిన ధ్రువపత్రాలతో కలిపి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగానికి (సీబీడీటీ) డీఐపీపీయే పంపుతుంది. దరఖాస్తును అందుకున్న 45 రోజుల్లోగా స్టార్టప్‌లకు పన్ను మినహాయింపునకు ఆమోదం తెలపడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తిరస్కరించడంపై సీబీడీటీ కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో నోటిఫికేషన్... గతంలో స్టార్టప్‌లు సమర్పించే పన్ను మినహాయింపు దరఖాస్తును అంతర్ మంత్రిత్వ శాఖల విభాగం ధ్రువీకరణ కోసం పంపేవారు. దీనివల్ల జాప్యం అయ్యేంది. ఇప్పుడు డీఐపీపీ ద్వారా నేరుగా సీబీడీటీకి పంపేలా ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వం వర్గాలు వివరించాయి. అదేవిధంగా స్టార్టప్‌లు విక్రయించిన షేర్లకు మార్కెట్ విలువ ఎంతనేది నిర్ధారిస్తూ మర్చెంట్ బ్యాంకర్ నుంచి నివేదికను తీసుకొని సమర్పించాలన్న గత నిబంధనను కూడా తాజాగా తొలగించారు. డీఐపీపీ గుర్తింపు ఉన్న స్టార్టప్‌లన్నీ కొన్ని షరతులకు లోబడి ఈ పన్ను మినహాయింపు పొందే వీలుంది. ప్రధానంగా ఖాతాల వివరాలతోపాటు గడిచిన మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాలి. అలాగే ఏంజెల్ ఇన్వెస్టర్లు కూడా తమ నెట్‌వర్త్, పెట్టుబడిపై ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. కాగా, ఏంజెల్ ఫండ్స్ ఇతరత్రా ఇన్వెస్టర్ల నుంచి రూ.10 కోట్లకు మించి జరిపిన నిధుల సమీకరణపై పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుందని 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఐటీ చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం స్టార్టప్స్ తమకున్న మార్కెట్ విలువకు మించి జరిపే నిధుల సమీకరణపై 30 శాతం పన్ను విధించేందుకు వీలుంది. దీని ఆధారంగానే ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. కాగా, పన్ను మినహాయింపు నిబంధనల్లో తాజా మార్పులన్నీ నోటిఫికేషన్ జారీ అయినతర్వాత అమల్లోకి వస్తాయని.. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి కొత్త నిబంధనలు వర్తించవని ఆయా వర్గాలు తెలిపాయి. ఏటా 300– 400 స్టార్టప్‌లకు ఏంజెల్ ఫండ్స్ నుంచి నిధులు అందుతుండగా... 2018 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ కేవలం రెండు స్టార్టప్స్‌కు మాత్రమే పన్ను మినహాయింపు లభించడం గమనార్హం. ఈ అంశాన్ని కూడా మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేయండి ప్రధానిని కోరిన ఐస్పిర్ట్ న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు శాపంగా మారిన ఏంజెల్ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని స్టార్టప్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐస్పిర్ట్... ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు ఈ సంస్థ ఒక లేఖ రాసింది. స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్ అని పేర్కొంది. ఏంజెల్ ఇన్వెస్టర్లు ఎంతో రిస్క్ తీసుకొని ఈ పెట్టుబడుల పెడతారని, విదేశాల్లో ఇలాంటి పెట్టుబడులకు నజరానాలిస్తుండగా, ఇక్కడ మాత్రం పన్నులు వేసి పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు వస్తుండటంతో పలు స్టార్టప్‌లు బెంబేలెత్తుతున్నాయని, కొన్ని మూతపడుతున్నాయని పేర్కొంది. ఈ ఏంజెల్ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని, అలా కుదరని పక్షంలో కనీసం నిబంధనలను సరళీకరించాలని కోరింది. స్టార్టప్‌లలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల వరకు ఇన్నోవాక్సర్లో తొలి పెట్టుబడి బెంగళూరు: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్ స్టార్టప్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన కార్పొరేట్ వెంచర్ ఫండ్, ఎమ్12 (గతంలో మైక్రోసాఫ్ట్ వెంచర్స్ ఫండ్‌గా వ్యవహరించేవారు) భారత స్టార్టప్‌లలో ఒక్కో కంపెనీలో 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల రేంజ్లో పెట్టుబడులు పెట్టబోతోంది. దీన్లో భాగంగా తొలి పెట్టుబడి పెట్టడానికి హెల్త్ టెక్ స్టార్టప్, ఇన్నోవాక్సర్‌ను ఎంచుకున్నామని ఎమ్12 పార్ట్నర్ రష్మి గోపీనాధ్ చెప్పారు. బీ2బీ స్టార్టప్‌లలో ఏ నుంచి సి రౌండ్ సిరీస్‌లలో నిధులు సమకూరుస్తామని పేర్కొన్నారు. బిగ్ డేటా, అనలిటిక్స్, బిజినెస్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు నిధులందిస్తామని ఆమె పేర్కొన్నారు. -
నీరు + అల్యూమినియం= 1,000 కి.మీ ప్రయాణం
కాసిన్ని నీళ్లు.. ఇంకొంత అల్యూమినియం!.. ఓ కారు రయ్యి రయ్యిమని దూసుకెళ్లేందుకు..ఇవి మాత్రమే చాలని ఎవరైనా చెబితే?.. ఫక్కున నవ్వేస్తాం..అంత సీన్ లేదులే అని కొట్టిపారేస్తాం! కానీ... చెప్పేవాడు అక్షయ్ సింఘల్ అయితే? ఎవరీయన.. ఏమా కథా కమామిషు???? బెంగళూరులోని బోలెడన్ని స్టార్టప్ కంపెనీల్లో ‘లాగ్9 మెటీరియల్స్’కూడా ఒకటి. ఈ కంపెనీ సీఈవోనే అక్షయ్ సింఘల్. పట్టుమని పాతికేళ్లు కూడా నిండలేదుగానీ..ఈ రూర్కేలా ఐఐటీ విద్యార్థి బుర్రలో పుట్టిన ఐడియా మాత్రం సూపర్! కేవలం నీళ్లు, అల్యూమినియంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ఓ సరికొత్త ఫ్యూయల్సెల్ బ్యాటరీని తయారు చేశాడు. ఎక్కడో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నిల్వ చేసుకోవడం కాకుండా ఈ కొత్త రకం బ్యాటరీలు అక్కడికక్కడే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అల్యూమినియం లాంటి అనేక లోహాలతో ఇలాంటి మెటల్ ఎయిర్ బ్యాటరీలను తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వీటి ఖరీదెక్కువ. ఉత్పత్తి అయ్యే విద్యుత్ కూడా తక్కువగానే ఉండటంతో ఇప్పటివరకూ అవి విజయవంతం కాలేదు. అక్షయ్ సింఘల్ కంపెనీ మాత్రం ఈ సమస్యను గ్రాఫీన్‌తో అధిగమించింది. లీటర్ నీటికి 300 కి.మీ.. విద్యుత్‌తో నడిచే కార్లు మనకు కొత్త కాకపోవచ్చుగానీ.. వాటితో సమస్యలూ ఎక్కువే. బ్యాటరీ చార్జ్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టడం, ఒకసారి చార్జ్ చేసుకుంటే ప్రయాణించగలిగే దూరం పరిమితంగా ఉండటంతో చాలామంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. గ్రాఫీన్, మెటల్ ఎయిర్ బ్యాటరీల వాడకం ద్వారా తాము ఈ సమస్యలను అధిగమించగలిగామని అక్షయ్ సింఘల్ ‘సాక్షి’కి తెలిపారు. బ్యాటరీలో వాడే అల్యూమినియం రేకులను వెయ్యి కిలోమీటర్లకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుందని, ఒక్క లీటర్ నీరు పోసుకుంటే కనీసం 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునని వివరించారు. ఈ బ్యాటరీలో ఉండే గ్రాఫీన్ కడ్డీ అల్యూమినియం, నీళ్ల మధ్య జరిగే రసాయన చర్య.. విద్యుత్ ఉత్పత్తికి సాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త రకం బ్యాటరీని కేవలం విద్యుత్ వాహనాలకు మాత్రమే గాక.. ఇళ్లు, వాణిజ్య సంస్థల్లోనూ జనరేటర్ల మాదిరిగా వాడుకునే అవకాశం ఉందన్నారు. తాము ఇప్పటికే ఈ బ్యాటరీతో నమూనా కారు ఒకదాన్ని సిద్ధం చేసి పరీక్షిస్తున్నామని అక్షయ్ వివరించారు. ఖర్చు మాటేమిటి? నీళ్లతో పనిచేసే కారు అనగానే ఖర్చు చాలా తక్కువని అందరూ అనుకుంటారు. అయితే ప్రస్తుతానికి ఈ కారుతో ప్రయాణం ఖర్చు సాధారణ పెట్రోలు, డీజిల్ కార్లతో సమానంగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో వాడే అల్యూమినియం కారును ప్రతి వెయ్యి కిలోమీటర్లకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది,. ప్రస్తుతానికి ఒక్కో అల్యూమినియం ప్లేటు ఖరీదు రూ.5,000 వరకూ ఉంది. అయితే ఈ కార్ల వాడకం పెరిగినా కొద్దీ దీని ఖరీదు గణనీయంగా తగ్గుతుందని అక్షయ్ అంటున్నారు. కేవలం 15 నిమిషాల్లోనే అల్యూమినియం ప్లేట్‌ను మార్చుకుని మళ్లీ ప్రయాణించ గలగడం ఈ కారుకు ఉన్న మరో విశేషం. అంటే చార్జింగ్ కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదన్నమాట. లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఈ మెటల్ ఎయిర్ బ్యాటరీల ధర సగం మాత్రమే ఉంటుందని.. ఫలితంగా ఈ కొత్త బ్యాటరీలతో నడిచే కారు ధర తక్కువగానే ఉంటుందని అక్షయ్ పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సేంద్రియ ఇంటిపంటల ద్వారా సామాజిక మార్పు!
సేంద్రియ ఇంటిపంటల సాగు గౌరవప్రదమైన ఉపాధి పొందడమే కాకుండా.. సమాజంలో సానుకూల మార్పునకు దోహదపడవచ్చని నిరూపిస్తున్నారు ఉన్నత విద్యావంతులైన అనురాగ్, జయతి దంపతులు... వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన పంజాబ్‌లో యువత మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కుకుపోయి ఉండటం బహిరంగ రహస్యమే. ఈ ట్రెండ్‌కు ఫుల్ స్టాప్ పెట్టడానికి తన వంతుగా ఏదైనా నిర్మాణాత్మకంగా చేయాలనుకున్నాడు 28 ఏళ్ల అనురాగ్ అరోరా. జలంధర్ నగరంలో పుట్టిపెరిగిన అనురాగ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకొని ఒక ప్రైవేటు కంపెనీలో హ్యూమన్ రిసోర్సెస్ విభాగాధిపతిగా పనిచేస్తూ.. ఉద్యోగానికి స్వస్తి చెప్పి సామాజిక మార్పు కోసం తపించే వ్యాపారవేత్తగా మారారు. గత ఏడాది తన భార్య జయతి అరోరాతో కలసి ‘మింక్ ఇండియా’ పేరుతో స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో రెండు విభాగాలున్నాయి. రసాయనిక అవశేషాల్లేని అధిక పోషక విలువలున్న ఆహారాన్ని మేడలపైన ఎవరికి వారు పండించుకొని తినేలా ప్రోత్సహించడానికి మింక్ ఆర్గానిక్స్ విభాగం పనిచేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి మంచి ఉపాధి మార్గాలను అందిపుచ్చుకునే శిక్షణ ఇవ్వడానికి మింక్ ఎడ్యుకేషన్ విభాగం పనిచేస్తోంది. ఈ రెండు మార్గాల ద్వారా పక్కదారి పడుతున్న పంజాబ్ యువతకు సన్మార్గం చూపాలన్నది అనురాగ్ లక్ష్యం. సేంద్రియ వ్యవసాయంలో ఆధునిక పోకడలపై పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అనురాగ్ శిక్షణ పొందటం ద్వారా పని ప్రారంభించారు. ‘‘రసాయనాల్లేకుండా, వర్మీకంపోస్టు ద్వారా, మట్టి లేకుండా కొబ్బరి పొట్టుకు సహజ ద్రవ పోషకాలు జోడించడం ద్వారా టెర్రస్ పైన షేడ్ నెట్‌హౌస్‌లో సాగు చేస్తున్నాం. మైక్రోగ్రీన్స్, టమాటాలు, వంకాయలు, క్యాబేజి, కాలీఫ్లవర్, ఆనప, సొరకాయలు, ముల్లంగి, ఉల్లిపాయలు, పాక్చాయ్, బ్రకోలి వంటి ఆకుకూరలు, చెర్రీ టమాటాలు, సేంద్రియ మొలకలు, సేంద్రియ కూరగాయలు, ముత్యపుచిప్ప పుట్టగొడుగులు మింక్ ఆర్గానిక్స్ సాగు చేస్తున్నాం. ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తున్నాం.. తమ మేడపై కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి సేవలందిస్తున్నాం..’’ అని అనురాగ్ తెలిపారు. వీటితోపాటు సేంద్రియ గోధుమ నారుతో పొడి, ఎండబెట్టిన పుట్టగొడుగులను కూడా జలంధర్ నగరంలో 25 దుకాణాల్లో వీరి ఉత్పత్తులు అమ్మటంతోపాటు అమెజాన్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు.మైక్రోగ్రీన్స్, పుట్టగొడుగులకు మంచి ఆదరణ లభిస్తోంది. వివిధ రకాల ఆకుకూరలు,నూనెగింజల విత్తనాలను విత్తుకున్న 6–8 రోజుల్లో 2 అంగుళాలు పెరుగుతాయి. మైక్రోగ్రీన్స్‌ను కత్తిరించి సలాడ్లు, పిజ్జాలు, శాండ్విచ్లు, సూపులలో వాడుకోవచ్చు. నెల రోజులు పెరిగిన ఆకుకూరల కన్నా ఈ మైక్రోగ్రీన్స్ ద్వారా 40 రెట్లు ఎక్కువగా పోషకాలు పొందవచ్చని అనురాగ్ తెలిపారు. మైక్రోగ్రీన్స్ చిన్న బాక్సుల్లో, లోతు తక్కువ టబ్లలోనూ విత్తుకోవచ్చు. రోజుకు రెండు సార్లు నీరు చిలకరిస్తే చాలు. కత్తిరించిన మైక్రోగ్రీన్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకొని 5–8 రోజుల వరకు వాడుకోవచ్చు. అనురాగ్ స్టార్టప్ ఏడాదిలో మంచి ప్రగతి సాధించింది. 50 కిలోలతో ప్రారంభమైన పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు 4000 కిలోలకు పెరిగింది. మింక్ బృందం ఇద్దరి నుంచి ఏడాదిలో ఎనిమిదికి పెరిగింది. ఈ ఉత్సాహంతో పంజాబ్‌లోని అన్ని నగరాలకూ తమ కార్యకలాపాలను విస్తరింపజేయాలని అనురాగ్ భావిస్తున్నారు. ముందుచూపుతో అడుగేస్తే సేంద్రియ ఇంటిపంటల సర్వీస్ ప్రొవైడర్ వృత్తి ద్వారా కూడా గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తున్న అనురాగ్, జయతిలకు జేజేలు! పుట్టగొడుగులు, చెర్రీ టమాటాలు మేడపై షేడ్‌నెట్ హౌస్‌లో అనురాగ్ అనురాగ్, జయతిలతో సిబ్బంది -
జూన్‌కల్లా ‘టీ–వర్క్స్’ తొలి దశ
సాక్షి, హైదరాబాద్: హార్డ్‌వేర్ స్టార్టప్ కంపెనీల కోసం ఉద్దేశించిన టీ–వర్క్స్ ఇంక్యుబేటర్ డిజైన్లకు తుది ఆమోదం లభించిందని, ఈ డిజైన్ల ప్రకారం టీ–వర్క్స్ తొలిదశ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పరిశ్రమలు, ఐటీ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్‌లోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. టీ–వర్క్స్ పనులను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. టీ–క్లౌడ్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఇలాంటి ప్రాజెక్టులు అమలు చేసిన రాష్ట్రాలు లేదా దేశాల అనుభవాలను అధ్యయ నం చేయాలని సూచించారు. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు పనులను వేగంగా పూర్తి చేయాలని, ఇప్పటికే పార్కులో పెట్టుబడులకు అంగీకరించిన కంపెనీల కార్యకలాపాలు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డి సహకారం తీసుకోవాలని కేటీఆర్ టీఎస్ఐఐసీ అధికారులకు సూచించారు. ఇంటింటికీ ఇంటర్నెట్ కోసం ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ (టీ–ఫైబర్) ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాలను రానున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్వర్క్ (టీడీఎన్) ద్వారా ప్రదర్శించాలన్నారు. వేగంగా పనులు... టీ–ఫైబర్, టీ–వర్క్స్, టీ–క్లౌడ్ ప్రాజెక్టుల పురోగతిపై కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. టీ–ఫైబర్ ఆధ్వర్యంలో చేపడుతున్న టీడీఎన్ మరో 2 వారాల్లో పూర్తవుతుందని అధికారులు వివరించారు. మహేశ్వరం మండలంలోని 4గ్రామాల్లో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, ఇవి పూర్తయితే ఈ–హెల్త్, ఈ–ఎడ్యుకేషన్, ఈ–గవర్నెన్స్ రంగాల్లో రానున్న మార్పులను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే వారంలో ఈ నెట్‌వర్క్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌ను ఆదేశించారు. వరంగల్ మెగాటెక్స్‌టైల్ పార్కులో అవసరమైన ప్రభు త్వ కార్యాలయాల ఏర్పాటుకు రెవెన్యూశాఖ 20 ఎకరాల స్థలాన్ని కోరినట్లు అధికారులు తెలిపారు. పార్కుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇప్పటికే వచ్చాయని, లే అవుట్ పూర్తయిందని, రోడ్లు, నీటి సౌకర్యాల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రికి వివరించారు. నీటి సౌకర్యం కోసం ఇప్పటికే రూ. 50 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయని, టెక్స్టైల్ పార్కు పనులు సకాలంలో పూర్తి చేస్తామని మంత్రికి అధికారులు వివరించారు. డ్రై పోర్టులపై.... రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రై పోర్టుల గురించి కూడా కేటీఆర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. డ్రై పోర్టుల కోసం గతంలో గుర్తించిన భువనగిరి, జహీరా బాద్, జడ్చర్లతోపాటు రాష్ట్రానికి నలువైపులా ఉన్న మరిన్ని ప్రాంతాలనూ పరిశీలించాలన్నా రు. టీఎస్ఐఐసీ చేపట్టిన మెడికల్ డివైసెస్ పార్కు పురోగతి, దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ పార్కు, జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్), మెగా ఫుడ్ పార్కు, సీడ్ పార్కు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, టీ–ఫైబర్ ఎండీ సుజయ్ కారంపూరిలతోపాటు పరిశ్రమలు, ఐటీశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రజనీ ‘బాబా ముద్ర’.. మా లోగో ఒక్కటే
న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘బాబా ముద్ర’ ఓ స్టార్టప్ కంపెనీకి లోగోగా ఉండటం ఆ కంపెనీకి సమస్యగా మారింది. కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని రజనీకాంత్ ఇటీవల ప్రకటించడం, పార్టీ చిహ్నంగా బాబా ముద్ర ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుండటం తెలిసిందే. సోషల్ మీడియా యాప్ అయిన వోక్స్‌వెబ్ అనే స్టార్టప్ కంపెనీకి కూడా దాదాపుగా ఇలాంటి లోగోనే ఉంది. దీంతో వోక్స్‌వెబ్ రజనీకాంత్ పార్టీకి అనుకూలంగా ఉంటుందా అని కొందరు తమను అడుగుతున్నారనీ, రజనీతోగానీ ఆయన స్థాపించే పార్టీతోగానీ తమకు ఏ సంబంధం లేదని వోక్స్‌వెబ్ వ్యవస్థాపకుడు యశ్ మిశ్రా చెప్పారు. రజనీ వర్గంలోని సంబంధిత వర్గాలకు తాము ఓ లేఖ కూడా రాసినప్పటికీ ఇంకా తమకు వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని మిశ్రా వెల్లడించారు. బాబా ముద్రను పార్టీ చిహ్నంగా వాడకుండా ఉండేలా, లేదా కొన్ని మార్పులు చేసుకుని వాడేలా రజనీని కోరతామని ఆయన చెప్పారు. -
మూతబడిన మరో స్టార్టప్
కార్యకలాపాలు నిలిపేసిన టాస్క్‌బాబ్ న్యూఢిల్లీ: గృహావసరాల సంబంధ సేవలు అందించే ముంబైకి చెందిన స్టార్టప్ సంస్థ టాస్క్‌బాబ్ మూతబడింది. నిర్దిష్ట కారణాలు వెల్లడించనప్పటికీ.. అనూహ్య పరిస్థితుల వల్ల జనవరి 19 నుంచి కార్యకలాపాలు నిలిపివేసినట్లు సంస్థ ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో టాస్క్‌బాబ్ సహ వ్యవస్థాపకుడు అసీమ్ ఖరే వెల్లడించారు. ఇప్పటికే వచ్చిన ఆర్డర్లను మాత్రం ప్రాసెస్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఊహించినంత స్థాయిలో లాభదాయకత, కార్యకలాపాల విస్తరణను సాధించడం సాధ్యం కాకపోవడం వల్లే సంస్థను మూసివేయాల్సి వచ్చినట్లు ఖరే సూచనప్రాయంగా పేర్కొన్నారు. టాస్క్‌బాబ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నప్పటికీ.. తమ యాప్ లో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్స్ మొదలైన వారి జాబితా అందుబాటులోనే ఉంటుందని, కస్టమర్లు నేరుగా వారికి ఫోన్ చేసి సర్వీసులు పొందవచ్చని ఖరే తెలిపారు. త్వరలోనే మరింత మెరుగ్గా, పటిష్టంగా కార్యకలాపాలు మళ్లీ ప్రారంభించగలమని పేర్కొన్నారు. టాస్క్బాబ్ను 2014లో ఖరే, అభిరూప్ మేధేకర్, అజయ్ భట్, అమిత్ చహాలియా ప్రారంభించారు. ఆ తర్వాత ఐవీక్యాప్ వెంచర్స్, ఓరియోస్ వెంచర్ పార్ట్నర్స్ నుంచి 5 మిలియన్ డాలర్లు సమీకరించారు. గతేడాది మూతబడిన స్టార్టప్ఆస్క్మి, స్నాప్‌డీల్ తోడ్పాటున్న పెప్పర్‌ట్యాప్ వంటి స్టార్టప్‌లు ఉన్నాయి. -
భారత్‌లో సాఫ్ట్బ్యాంకుకు రూ.3,750 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్... భారత్‌లోని స్టార్టప్ కంపెనీల్లో వెచ్చించిన పెట్టుబడులపై 58.14 బిలియన్ యెన్ల(56 కోట్ల డాలర్లు-దాదాపు రూ.3,750 కోట్లు)ను నష్టపోరుుంది. ప్రధానంగా ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్, ట్యాక్సీ ఆగ్రిగేటర్ ఓలాల్లో చేసిన పెట్టుబడులు కూడా ఇందులో ఉన్నారుు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ప్రకటించిన ఆర్థిక ఫలితాల నివేదికలో ఈ మేరకు పెట్టుబడులను రైట్ డౌన్ చేసినట్లు సాఫ్ట్‌బ్యాంక్ ప్రకటించింది. పెట్టుబడి నష్టాలను చవిచూసిన ఇతర భారతీయ కంపెనీల్లో ఏఎన్ఐ టెక్నాలజీస్, జాస్పెర్ ఇన్ఫోటెక్ వంటివి ఉన్నారుు. కాగా, రైట్ డౌన్ చేసిన మొత్తంలో 29.62 బిలియన్ యెన్లను కరెన్సీ ఇంపెరుుర్మెంట్(కరెన్సీ విలువపరంగా కంపెనీ మొత్తం ఆస్తుల విలువలో తగ్గింపు) కారణంగా నష్టపోరుునట్లు వెల్లడించింది. 2014 అక్టోబర్‌లో సాఫ్ట్‌బ్యాంక్... ఓలాలో 21 కోట్ల డాలర్లు, స్నాప్‌డీల్‌లో 62.7 కోట్ల డాలర్లను పెట్టుబడిగా వెచ్చించింది. ఆతర్వాత కూడా ఈ రెండు స్టార్టప్‌లలో మరిన్ని పెట్టుబడులను కుమ్మరించింది. ఓలా ఇప్పటివరకూ సాఫ్ట్‌బ్యాంక్ సహా టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ తదితన ఇన్వెస్టర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్లను సమీకరించింది. ఇక గతేడాది స్నాప్డీల్చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌తో పాటు సాఫ్ట్‌బ్యాంక్ నుంచి 50 కోట్ల డాలర్ల నిధులను దక్కించుకుంది. దీనిప్రకారం అప్పట్లో స్నాప్‌డీల్ కంపెనీ విలువ 4.8 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. భారీ పెట్టుబడి ప్రణాళికలు...: ఇప్పటివరకూ భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ 2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. వచ్చే 5-10 ఏళ్లలో ఈ మొత్తాన్ని 10 బిలియన్ డాలర్లకు డాలర్లకు చేర్చాలని భావిస్తున్నట్లు కూడా వెల్లడించింది. -
స్టార్టప్‌లతో సంప్రదాయ వ్యాపారాలకు దెబ్బ!
ఏంజెల్ ఇన్వెస్టర్ల అభిప్రాయం కోల్‌కతా: దేశంలో శరవేగంగా వేళ్లూనుకుంటున్న స్టార్టప్ సంస్థలతో సంప్రదాయ వ్యాపార విధానాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇన్వెస్టర్లు స్టార్టప్‌లకు నిధులను సమకూర్చుతున్నవారే కావడం గమనార్హం. ‘సంప్రదాయ వ్యాపారులు తమ సొంత శైలిలో వెళ్తారు. కస్టమర్లకు నేరుగా అవసరమైనమేరకు డిస్కౌంట్లను ఇస్తారు. అయితే, స్టార్టప్‌లతో ముందుకొస్తున్న టెక్నాలజీ నిపుణులకు గతంతోపనిలేదు. భవిష్యత్తుపైనే దృష్టిపెడతారు’ అని ఆన్లైన్ సరుకుల విక్రయ సంస్థ గ్రోఫర్స్ ఫైనాన్స్ హెడ్ అష్నీర్ గ్రోవర్ పేర్కొన్నారు. ఈ విధమైన వ్యవహారశైలి సంప్రదాయ వ్యాపార విధానాన్ని దెబ్బతీస్తూనే ఉంటుందన్నారు. ఐడీజీ వెంచర్స్ ఎండీ టీసీఎం సుందరం కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్యాబ్ అగ్రిగేటర్లు, ఈ-కామర్స్ సంస్థలే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, 90 శాతం స్టార్టప్‌లు ఎందుకూపనికిరావని, ఉద్యోగాల కల్పనలో వాటివల్ల పెద్దగా ఒరిగిందేమీలేదంటూ ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియానీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ... ఒకవిధంగా ఆయన చెప్పింది నిజమేనని ఇండియా ఇంటర్నెట్ ఫండ్‌కు చెందిన అనిరుధ్ సూరి పేర్కొన్నారు. ‘90 శాతం స్టార్టప్‌లు జాబ్స్‌ను సృష్టించలేవన్నది వాస్తవం. అయితే, విజయవంతమైన ఒకట్రెండు స్టార్టప్‌లు ప్రస్తుత వ్యాపార విధానాలను అతలాకుతలం చేయగలవు’ అని ఆయన చెప్పారు. కలకత్తా ఏంజెల్ నెట్వర్క్(సీఏఎన్) నేతృత్వంలో నిర్వహించిన ఒక చర్చాకార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇన్వెస్టర్లు ఈ అభిప్రాయాలను వెల్లడంచారు. స్టార్టప్‌ల ఆవిర్భావంలో బెంగళూరు. ఢిల్లీ, పుణే, హైదరాబాద్, చెన్నైలతో పోలిస్తే.. తూర్పు భారతావని వెనుకబడటానికి.. ఇక్కడ నిపుణుల కొరతతోపాటు ఇందుకు సరైన పరిస్థితులు లేకపోవడమే కారణమని వారు పేర్కొన్నారు. -
వేలిముద్రలతో బిల్లు చెల్లింపులు!
లండన్: మనకు షాపింగ్ కేంద్రాల్లో డెబిట్/క్రెడిట్ కార్డులు, ముఖకవళికలు, సెల్ఫీలతో చేసే చెల్లింపులు తెలుసు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త సాంకేతికతతో వేళ్లలోని సిరలు(గుండెకు చెడురక్తాన్ని తీసుకెళ్లేనాళాలు) సాయంతో బిల్లులు చెల్లించొచ్చు. ‘ఫింగోపే’గా సాంకేతికతను యూకేలోని ఒక స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. వేలిసిరల నిర్మాణాన్ని బట్టి వినియోగదారుడికి ప్రత్యేక గుర్తింపును ఇది కేటాయిస్తుంది. దీన్ని బ్యాంకు ఖాతాతో అనుసంధానిస్తుంది. బిల్లు చెల్లింపు సమయంలో అతను తన వేలిని స్కానర్‌పై ఉంచితే చాలు. డబ్బు బదిలీ అయిపోతుంది. కార్డులు/నగదు మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 340 కోట్ల మందిలో ఒకరి సిరలు మాత్రమే మరోవ్యక్తి సిరలను పోలి ఉంటాయట. -
రాష్ర్టమే ఓ స్టార్టప్ కంపెనీ :సీఎం చంద్రబాబు
♦ రాష్ర్టంలో మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయి ♦ జాబ్స్‌డైలాగ్ ఉద్యోగరథం ప్రారంభం విజయవాడ (గుణదల): ఆంధ్రప్రదేశే ఓ స్టార్టప్ కంపెనీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రానున్న రోజుల్లో దేశంలోనే ఉపాధి అవకాశాల కల్పనలో రాష్ర్టం ముందువరుసలో ఉంటుందన్నారు. గురువారం విజయవాడలోని సిద్ధార్థ కళాపీఠంలో టీఎంఐ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్స్‌డైలాగ్ ఉద్యోగరథాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఎంస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్) రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. దేశంలోనే తొలిసారిగా చౌకగా ఇంటర్నెట్ అందిస్తున్న రాష్ర్టం ఏపీ అని, దీనిపై పేటెంట్ రైట్స్‌కి దరఖాస్తు చేశామని తెలిపారు. టీఎంఐ గ్రూప్స్ సంస్థ చైర్మన్ టి.మురళీధరన్ ఉద్యోగరథం గురించి వివరించారు. క్యాండిడేట్ మేనేజ్మెంట్ టీం, క్లైంట్ మేనేజ్మెంట్ టీం ఉంటాయని, అభ్యర్థి ఇంటి ముంగిటకు వెళ్లి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి సరిపోయే ఉద్యోగాల వివరాలను, కావాల్సిన నైపుణ్యాలను అందింస్తుందన్నారు. క్లైంట్ మేనేజ్మెంట్ టీం ద్వారా వివిధ సంస్థల్లో ఉన్న ఉపాధి అవకాశాలు, వారికి ఎలాంటి నైపుణ్యం కలిగిన అభ్యర్థులు కావాలో వంటి వివరాలను సేకరిస్తుందని చెప్పారు. కాగా మరో రెండు నిమిషాల్లో సీఎం వస్తారనగా వేదిక వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. పోలీస్ సిబ్బంది వైర్లు తప్పించబోతుండగా స్వల్పంగా మంటలంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇవ్వలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి విజయవాడలోను, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోను గురువారం టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. కాగా కిడారి చేరికను వ్యతిరేకిస్తూ అరకులో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. రిటైర్డ్ టీచర్లకు ఇళ్లు : పదవీ విరమణ చేసిన ప్రభుత్వ టీచర్లకు వారు కోరుకున్నచోట సొంతిళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.దీనిపై పథకాన్ని రూపొందిస్తామన్నారు. విజయవాడలో గురువారం జరిగిన పీఆర్టీయూ రాష్ట్ర ద్వితీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. -
రూ.5.5 కోట్ల నిధులను సమీకరించిన హెల్త్ఎనేబ్లర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ హెల్త్ఎనేబ్లర్... రూ.5.5 కోట్ల మేర నిధులను సమీకరించింది. సీడ్ రౌండ్ విభాగంలో సిలిక్యాన్ వ్యాలీ, హాంగ్‌కాంగ్‌కు చెందిన పలు బృందాలు ఈ పెట్టుబడులను పెట్టినట్లు సంస్థ కో- ఫౌండర్, సీటీఓ అవిషేక్ ముఖర్జీ చెప్పారు. ఈ నిధులను పేటెంటెడ్ ఈఎంఆర్ టెక్నాలజీ అభివృద్ధి కోసం వినియోగిస్తామన్నారు. ‘‘ప్రస్తుతం ముంబై, కోల్కత్తా నగరాల్లో సేవలందిస్తున్నాం. ఈ ఏడాది చివరికల్లా రెండో రౌండ్ నిధుల సమీకరణపై దృష్టిపెడతాం. వీటి సాయంతో దేశంలోని మరో 8 నగరాలకు విస్తరిస్తాం’’ అని ముఖర్జీ ఒక ప్రకటనలో తెలియజేశారు. మొబైల్ వేదికగా టెలీ హెల్త్ కేర్ సేవలందిస్తున్న హెల్త్ఎనేబ్లర్... గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. -
బయో స్టార్టప్ లకు ఈక్విటీ నిధులు
♦ బయో ఏషియా సదస్సులో ♦ బైరాక్ ఎండీ రేణు స్వరూప్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయో టెక్నాలజీలో స్టార్టప్ కంపెనీలను ఈక్విటీ నిధులను సమకూర్చనున్నట్లు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్ (బైరాక్) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనే కనీసం రూ.200 కోట్లతో కార్పస్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు బైరాక్ మేనేజింగ్ డెరైక్టర్ రేణు స్వరూప్ తెలిపారు. మంగళవారం బయో ఏషియా సీఈవో కాన్క్లేవ్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ రంగంలో స్టార్టప్‌లకు గ్రాంట్ల కింద గత ఐదేళ్లలో రూ. 600 కోట్ల వరకు నిధులను సమకూర్చామని, రెండో దశలో ఇక నుంచి ఈక్విటీ నిధులను సమకూర్చనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు బయోటెక్నాలజీలో 150 కంపెనీల స్టార్టప్‌లకు ఆర్థిక సహాయాన్ని అందించామని వీటి నుంచి 25 కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చినట్లు స్వరూప్ తెలిపారు. ఆర్థిక సహాయం అందుకున్న కంపెనీల్లో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల కంపెనీలే కావడం గమనార్హం. ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ బయోటెక్నాలజీ రంగం ప్రభుత్వం సహకారం అందిస్తే 2025 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకునే సామర్థ్యం ఉందన్నారు. అనుమతులు త్వరితగతిన లభించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తే ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం బయోటెక్నాలజీ పరిశ్రమ నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని, దీనిని భర్తీ చేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీలో ఐఎస్బీ తరహాలో 100 ఎకరాల్లో ఫార్మా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. ఇందుకు ఫార్మా కంపెనీల సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. -
ఫిబ్రవరి 13న ఐటీ, స్టార్టప్ పాలసీ!
హైదరాబాద్‌లో నాస్కామ్ 10 కే వేర్‌హౌజ్: కేటీఆర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :దేశంలో ఎప్పుడూ లేని విధంగా స్టార్టప్ కంపెనీల గురించి మాట్లాడుకోవటం చూస్తున్నామని, అది కూడా దేశ ప్రధాని నుంచే మొదలుకావటం శుభపరిణామమని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీ రామారావు చెప్పారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఎలాగైతే స్టార్టప్ పాలసీని ప్రకటించిందో... దానికి ఏమాత్రం తీసిపోని విధంగా తెలంగాణలోనూ ఐటీ, స్టార్టప్ పాలసీని తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పాలసీ ఆవిష్కరణను వాయిదా వేశామని, ఎన్నికల అనంతరం ఫిబ్రవరి 13న పాలసీని విడుదల చేస్తామని వెల్లడించారు. సోమవారమిక్కడ టీ-హబ్‌లో ‘నాస్కాం 10కే వేర్‌హౌజ్’ను ప్రారంభించిన సందర్భంగా నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్, చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అకాడమీ స్థాయి నుంచే యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి. అందుకే త్వరలోనే కోర్స్ క్రెడిట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పాఠశాల, కళాశాల స్థాయిలోనే పారిశ్రామిక ఆలోచనలను వెలికితీసి సరైన మార్గదర్శనం చేయడానికిది ఉపకరిస్తుంది. టీ- హబ్‌లో మరిన్ని వేర్‌హౌజ్‌ల ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం’’ అన్నారాయన. సోషల్ రిలేషన్స్‌లోనే అవకాశాలు: చంద్రశేఖర్ దేశంలో యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంప్రదాయ వ్యాపార పద్ధతుల నుంచి టెక్నాలజీ బిజినెస్‌ల వైపు అడుగులేస్తున్నారని నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ చెప్పారు. ‘‘గతంలో ఈ-కామర్స్, లాజిస్టిక్ రంగంలో ఎక్కువగా స్టార్టప్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు సామాజిక సంబంధమైన (సోషల్ రిలేషన్స్) రంగంలో అవకాశాలు ఎక్కువ’’ అన్నారాయన. సోషల్ రిలేషన్స్ అంటే ఎక్కువ మందికి అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలన్నారు. త్వరలో విశాఖలోనూ నాస్కామ్ వేర్‌హౌజ్‌ను ఆరంభిస్తామన్నారు. దీన్లో స్టార్టప్ కంపెనీలకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలుంటాయి. పారిశ్రామికవేత్తలు, నిపుణుల సల హాలు, సూచనలు, శిక్షణ శిబిరాలు, సదస్సులు, మెంటారింగ్‌లు ఉంటాయి. ఆచరణతోనే విజయం: మోహన్‌రెడ్డి చక్కని ఆలోచనతో స్టార్టప్‌ను తెచ్చినా, దాన్ని ప్రణాళికాబద్ధంగా ఆచరణయోగ్యం చేస్తేనే విజయం దక్కుతుందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడమంటే మౌలిక సదుపాయాలు సమకూర్చడం కాదని, వాటికి అవసరమైన దిశానిర్దేశం, మెంటారింగ్, ఫండింగ్ సమకూర్చాల్సి ఉంటుందని చెప్పారు. టీ-హబ్ అలాగే మొదలైందన్నారు. ‘‘నేటి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అదృష్టవంతులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ స్టార్టప్‌లను బాగా ప్రోత్సహిస్తున్నాయి. మౌలిక సదుపాయాలే కాదు గ్రాంట్లు, రాయితీలూ అందిస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, తయారీ.. ఇలా అన్ని రంగాల్లోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని టెక్నాలజీ ద్వారా నివృత్తి చేసి అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అన్నారాయన. -
ఎర్రబస్సు... ఎయిర్‌బస్సు కూడా!
సెప్టెంబర్ నుంచి యాత్రాజీనీ విమాన టికెట్లు * నెల రోజుల్లో హోటల్ గదుల బుకింగ్ సేవలు కూడా * ఆ తర్వాత లాజిస్టిక్స్ విభాగంలోకి.. * 150 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెరికా సంస్థ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ఎర్రబస్సు నుంచి ఎయిర్‌బస్ వరకూ..’ ఇదేదో ప్రాస కోసం వాడింది కాదు. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ అక్షరాలా దీన్ని నిజం చేస్తోంది. 2013 నవంబర్‌లో బస్సు టికెట్ల బుకింగ్ సేవలను ప్రారంభించిన యాత్రాజీనీ డాట్‌కామ్... ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విమాన టికెట్ల విక్రయం కూడా ప్రారంభిస్తోంది. ‘‘ఇప్పటికే ఎయిర్కోస్టా, ఎయిర్ ఇండియా, జెట్ విమాన సంస్థలతో సంప్రతింపులు జరిపాం. మిగతా అన్ని సంస్థలతో చర్చలు జరిపి... అన్ని విమానయాన టికెట్లను యాత్రాజినీలో బుక్ చేసుకునేలా టెక్నాలజీని రూపొందిస్తున్నాం’’ అని యాత్రాజీనీ సీఈఓ రెనిల్ కోమిట్ల చెప్పారు. ‘సాక్షి స్టార్టప్’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలివీ... బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన పాక్స్టెర్రా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్... ఈ-కామర్స్ సంస్థలకు సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసి ఇచ్చేది. ట్రావెల్స్ రంగంలో ఉన్న డిమాండ్‌ను గుర్తించిన ఆ సంస్థ చైర్మన్, సీఈఓ రెనిల్ కోమిట్ల.. యాత్రాజీనీ.కామ్(డ్చ్టట్చజ్ఛజ్ఛీ) పేరుతో బస్ టికెట్, క్యాబ్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ‘‘టికెట్లను విక్రయించడం ఒక్కటే మా పనికాదు. కస్టమర్ ఇంట్లోంచి బయటికి కాలు పెట్టింది మొదలు తిరిగి ఇంట్లోకి వెళ్లే వరకు అవసరమయ్యే అన్ని సేవలూ అందించడమే లక్ష్యంగా సంస్థను ప్రారంభించాం. అంటే కస్టమర్ ప్రయాణం చేసేందుకు అవసరమైన బస్సు టికెట్టు, బస చేసేందుకు బడ్జెట్ హోటల్, చేరుకున్న నగరంలో తిరిగేందుకు క్యాబ్.. ఇలా అన్ని రకాల సేవల్నీ అందించటమే యాత్రాజీనీ నినాదం’’ అంటారు రెనిల్. నెల రోజుల్లో హోటల్స్ బుకింగ్స్.. నెల రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకరాష్ట్రాల్లో హోటల్ గదుల బుకింగ్ సేవల్ని యాత్రాజీనీ ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు 2,000 హోటళ్లు రిజిస్టరు కాగా... దీన్లో తెలుగు రాష్ట్రాల వాటా 10 నుంచి 12 శాతం. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి 20 హోటల్స్ వరకూ ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు నాటికి లాజిస్టిక్ విభాగంలోకి కూడా కంపెనీ అడుగిడబోతోంది. విజయవాడ, విశాఖపట్నం ప్రధాన కేంద్రాలుగా సేవలందించడానికి పెద్ద మొత్తంలో ట్రక్కుల్ని కొనుగోలు చేస్తోంది సంస్థ. యాత్రాజీనీకి చెందిన క్యాబ్ డ్రైవరే లాజిస్టిక్ కేంద్రాల్లోని ఉత్పత్తులను ట్రక్కుల్లో లోడ్ చేసుకొని.. చెప్పిన చిరునామాలో అన్లోడ్ చేస్తాడు. తెలంగాణలో క్యాబ్స్ సేవలు.. ‘‘ఇటీవలే ఏపీలోని 13 జిల్లాల్లో క్యాబ్స్ సేవలు ప్రారంభించాం. నెల రోజుల్లో తెలంగాణలోని పది జిల్లాల్లో కూడా క్యాబ్స్ ప్రారంభిస్తాం. దశలవారీగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తాం. ఈ ఏడాది ముగింపు నాటికి అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సెప్టెంబర్ నుంచి కర్ణాటకలో 30 జిల్లాల్లో సేవలు ఆరంభిస్తాం. తర్వాత తమిళనాడు, కేరళ మార్కెట్లలోకి వెళతాం. 2016-17 ముగింపు నాటికి ముంబై, ఢిల్లీ నగరాలకూ.. మొత్తం మీద మూడేళ్లలో దేశంలోని వంద నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నా అత్యధిక మార్కెట్ వాటా ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచే. బెంగళూరు నుంచి ఏపీకి క్యాబ్స్, బస్ టికెట్ల బుకింగ్ డిమాండ్ బాగా ఉంది. అందుకే ఏపీలో క్యాబ్స్ సర్వీసులను ప్రారంభించిన మూడు నెలల్లో 30,000 బుకింగ్స్ జరిగాయి. ప్రస్తుతం యాత్రాజినీలో లక్ష నుంచి లక్షాపాతిక వేల మంది కస్టమర్లున్నారు. రోజుకు 3,000-3,500 బస్ టికెట్లు, 1,000-1,500 వరకు క్యాబ్స్ బుక్ అవుతున్నాయి. ఇందులో 90 శాతం బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతున్నవే. మిగతావి కర్ణాటక నుంచి. యాత్రాజినీకి క్యాబ్‌లు అద్దెకివ్వాలనుకుంటే.. 15:85 ఓనర్ మేనేజ్మెంట్ రూపంలో తీసుకుంటున్నాం’’ అని రెనిల్ వివరించారు. రూ.150 కోట్ల పెట్టుబడులు.. యాత్రాజీనీపై రెండేళ్లలో రూ.30 కోట్ల పెట్టుబడులు పెట్టగా గతేడాది రూ.60 కోట్ల టర్నోవర్ నమోదయింది. ఈ ఏడాది రూ.150 కోట్ల టర్నోవర్‌ను సంస్థ ఆశిస్తోంది. అమెరికాకు చెందిన ఓ వెంచర్ కేపిటలిస్ట్ రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సంప్రతింపులు జరుపుతున్నట్లు రెనిల్ వెల్లడించారు. ఈ డీల్‌కు సంబంధించి పూర్తి వివరాలను నెల రోజుల్లో వెల్లడిస్తామన్నారు. యాత్రాజీనీ క్యాబ్స్ జీపీఎస్ టెక్నాలజీతో పనిచేస్తాయని, కస్టమర్లు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే నొక్కటానికి ప్యానిక్ బటన్ ఉంటుందని ఆయన తెలియజేశారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
స్టార్టప్ కంపెనీల్లో కొలువుల జాతర
2020 నాటికి 3 లక్షల ఉద్యోగాలు న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో స్టార్టప్ కంపెనీలు దాదాపు 3 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. దాదాపు 80 శాతం మంది ఉద్యోగం కోరుకునే వారు స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగం చేయటానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. గతేడాది స్టార్టప్ కంపెనీలు దాదాపు 50 వేల నుంచి 60 వేల మందికి ఉపాధిని కల్పించాయని, వచ్చే ఏడాది కూడా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశ ఉందని మానవ వనరుల నిపుణులు అభిప్రాయపడ్డారు. 2020 సంవత్సరానికల్లా స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగ కల్పన 2.5 నుంచి 3 లక్షలుగా ఉంటుందని మెరిట్‌ట్రాక్ సంస్థ పేర్కొంది. భారత స్టార్టప్ కంపెనీలలో ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని, దీనికి తామే సాక్ష్యమని మెరిట్‌ట్రాక్ ఇన్నోవేషన్స్ అండ్ న్యూ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్ రాజీవ్ మీనన్ అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగ నియామక పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పారు. నేర్చుకోవటానికి, స్థిరపడటానికి, వేగంగా ఎదగటానికి కావాల్సిన అపార అవకాశాల కోసం పలువురు స్టార్టప్ కంపెనీల వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. గత రెండేళ్ల నుంచి స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగం కోరుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని హెచ్ఆర్ సర్వీస్ సంస్థ రాండ్ట్సాండ్ ఇండియా సీఈఓ మూర్తి కె ఉప్పలూరి అన్నారు. -
మీ ‘కేర్’ మీ చేతుల్లోనే...
అద్భుతాలు చేయడానికి బడా బడా కంపెనీలే అక్కర్లేదు. మల్టీ మిలియన్ డాలర్ల పెట్టుబడీ అవసరం లేదు. ఓ మంచి ఐడియా... దాన్ని నెరవేర్చుకోవాలన్న సంకల్పం... నెరవేర్చుకునే నైపుణ్యం... ఈ మూడూ ఉంటే చాలు. నిజమే! ఈ మూడు లక్షణాలతో మొదలైన స్టార్టప్‌లు అద్భుతాలు చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని సేవల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. అలాంటి స్టార్టప్ కంపెనీలను వెదికి... వాటి వివరాలను పాఠకులకు అందించటాకే ‘సాక్షి’ ఈ ‘స్టార్టప్ డైరీ’ని ఆరంభిస్తోంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నుంచి నివేదికలన్నీ ఆన్లైన్లోనే ⇒ అదికూడా... అర్థమయ్యే భాషలో సరళీకరణ ⇒ హైదరాబాదీ స్టార్టప్ ‘ఈ కిన్‌కేర్’ ఉచిత సేవలు ⇒ రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టిన విదేశీ సంస్థలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హలో... అమ్మా ఒంట్లో ఎలా ఉంది? టైంకి మందులేసుకుంటున్నారా? మళ్లీ చెకప్‌కు డాక్టర్ ఎప్పుడు రమ్మన్నాడు? ఎవరైనా ఎన్నారై తన ఇంటికి ఫోన్ చేస్తే చాలు... ఈ మాటలు ఉండాల్సిందే. తరవాత తల్లిదండ్రులు చెప్పిన వివరాలు విని ఆదుర్దా పడటం... వీలైతే తనకు తెలిసిన ఓ డాక్టర్నో, ఆసుపత్రినో సూచించటం. ఇప్పటిదాకా అంతే!! అయితే ఇలాంటి చెకప్‌లకు చెక్ పెడుతోంది ekincare.com.ఫోన్లో మాట్లాడటంతోనే వదిలిపెట్టకుండా ఆ ఫోన్లోనే మనవాళ్ల ఆరోగ్య వివరాలూ తెలుసుకునేందుకు వీలుగా ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు హైదరాబాద్‌కు చెందిన కిరణ్ కే. కలకుంట్ల. కంపెనీకి సంబంధించి ‘సాక్షి’తో ఆయన ఏం చెప్పారంటే... అమెరికా ఉద్యోగం వదిలిపెట్టి... హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 2004లో ఎంఎస్ చదవటానికి అమెరికా వెళ్లా. నాకైతే చిన్నప్పటి నుంచీ సొంత కంపెనీ పెట్టాలని ఉండేది. యూఎస్‌లో టెలికం సేవల కంపెనీ ఐటీఅండ్టీలో నార్త్ అమెరికా మేనేజర్‌గా పనిచేశా. 2013లో ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చా. జనానికి, సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఓ కొత్త కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నా. మొదట్లో ఎవరూ నా నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. బంగారంలాంటి ఉద్యోగం వదిలేసి ఎదుకొచ్చావన్నారు. అయినా బాధపడలేదు. నాకైతే నమ్మకం ఉంది. సొంత కంపెనీ పెట్టి ఎదుగుతానని. ఆ పేరెందుకంటే... e ఎలక్ట్రానిక్స్... kin కుటుంబీకులు/బంధువులు/శ్రేయోభిలాషులు... care శ్రద్ధ అని అర్థం. అంటే మొత్తంగా చూస్తే.. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ద్వారా మన వాళ్ల ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ వహించడమన్నమాట. మా సేవలు కావాలంటే... ekincare సేవలు వినియోగించుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ekincare యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్లో భద్రపరచాలనుకుంటున్న మెడికల్ రికార్డులను, రిపోర్టులను, ప్రిస్కిప్షన్స్‌ను, డాక్టర్ సమ్మరీలను మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా ఫొటో తీసి యాప్‌లోకి అప్లోడ్ చేయాలి. సులువుగా అర్థమయ్యేలా... డాక్టర్ ప్రిస్క్రిప్షన్గానీ, ల్యాబ్ రిపోర్టులు గానీ ఇవేవీ మనకు సులువుగా అర్థమయ్యేవి కావు. డాక్టర్ చెప్పింది నమ్మడం తప్ప మనం చేసేదేమీ ఉండదు. కానీ, ekincareలో మాత్రం వచ్చిన వ్యాధేంటి? అది ఏ స్థాయిలో ఉంది? వంటి విభిన్న కోణాల్లో విశ్లేషిస్తూ.. క్లయింట్లకు అర్థమయ్యే భాషలో వాటిని సరళంగా చెబుతాం. వాటి వివరాలను గ్రాఫులు, రంగుల రూపంలో తెలియజేస్తాం. (ఎరుపు రంగుంటే ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు.. పసుపు రంగుంటే జాగ్రత్తలు తీసుకుంటే మేలని గుర్తుగా..) సంబంధిత వ్యాధి తాలూకు చరిత్ర, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తాం. తలనొప్పి నుంచి మొదలుపెడితే గుండె పోటు వరకు సుమారు 150కి పైగా వ్యాధులకు సంబంధించిన రికార్డులను ఆన్లైన్లో భద్రపరచుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 1,500కి పైగా ఆసుపత్రుల్లో... దేశవ్యాప్తంగా 1,500కు పైగా ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు మా సంస్థతో అనుసంధానమై ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో డాక్టర్ అపాయింట్మెంట్లను కూడా మా యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారి రిపోర్ట్లు పరీక్షల తరవాత నేరుగా మేమే తీసుకుంటాం. వాటిని సరళీకరించి యాప్‌లో అప్లోడ్ చేస్తాం. క్లయింట్ నేరుగా తన మొబైల్లోనే వీటిని చూసుకోవచ్చు. తర్వాతి చెకప్ మళ్లీ ఎప్పుడుం టుందో ముందుగానే చెబుతాం కూడా. ప్రస్తుతం అపోలో డెంటల్, మాక్సి విజ న్, పార్థ డెంటల్, వాసన్ ఐ కేర్, విజయ డయాగ్నస్టిక్స్, తపాడియా, థైరో కేర్, డాక్టర్ లాల్ ఆసుపత్రులతో కంపెనీ అనుసంధానమై ఉంది. త్వరలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ఆసుపత్రుల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. త్వరలో హోమ్ హెల్త్కేర్లోకి... ఇప్పటివరకు క్లయింట్స్ నివేదికలను ఆన్లైన్లో భద్రపరచడమే చేస్తున్నాం. ఈ నెలాఖరుకల్లా డయాబెటిస్, అధిక రక్తపోటు, కార్డియో వాస్క్యులర్ (గుండె- రక్తనాళాలకు సంబంధించి) వ్యాధులకు చికిత్సలు కూడా చేస్తాం. అది కూడా నేరుగా ఇంటికి వెళ్లి. దీనికోసం ప్రత్యేక మెడికల్ ఆఫీసర్లను నియమించాం. ఆ రోగుల నివేదికలను కూడా ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తాం. రూ.2 వేలకు కుటుంబంలోని ఇద్దరికి మొత్తం బాడీ చెకప్ చేస్తాం. ఇందులో సుమారుగా 70 రకాల చెకప్లుంటాయి. రూ.2 కోట్ల పెట్టుబడులు..: అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చాక దాదాపు ఆరు నెలల పాటు శ్రమించి కంపెనీని ప్రారంభించా. గతేడాది నవంబర్‌లో మార్కెట్లోకి వచ్చాం. ప్రస్తుతానికి కంపెనీలో 1,000 మంది క్లయింట్లు రిజిస్టరై ఉన్నారు. ఇటీ వలే బిట్చెమీ వెంచర్ క్యాపిటల్, యూఎస్ కంపెనీ అయిన అడ్రాయిటెంట్ కంపెనీలు రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిని పూర్తిగా కంపెనీ విస్తరణ, మార్కెటింగ్ కోసం వినియోగిస్తున్నాం. అద్భుతమైన స్టార్టప్ ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే bussiness@sakshi.com కు మెయిల్ చేయండి.... -
సార్టప్‌లలోకి నిధులు పెరగాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నైపుణ్యం, విద్య, పరిశోధన సంస్థలు, ఆలోచనలకు మార్గదర్శనం చేసే మెంటార్లు, స్టార్టప్ కంపెనీలకు భాగ్యనగరం చిరునామాగా మారిందని ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు సఫిర్ ఆదేని అన్నారు. టై ఆధ్వర్యంలో శనివారమిక్కడ ‘స్మాషప్-స్టార్ట్ప్ హీరోస్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌డీఐ, పీఈ వంటి నిధులనూ స్టార్టప్ కంపెనీలకు మళ్లించాలని అప్పుడే ఆయా సంస్థలు మరింతగా వృద్ధి చెందుతాయన్నారు. స్టార్టప్ కంపెనీలతో దేశం లో నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు జీడీపీ వృద్ధి రేటు కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులను ప్రోత్సహించి కొత్త కంపెనీలను ప్రారంభించడమే టై ప్రధాన ఉద్దేశమన్నారు. కేవలం కంపెనీలను, టై సభ్యులను పెంచడమే కాదు కొత్త ప్రాంతాల్లో విభాగాలను ప్రారంభించడంలోనూ టై ముందుంటుందన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా టై చాప్టర్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.