ఏఐకి చెప్తే.. వెబ్‌సైట్ రెడీ!
ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
‘డెవిన్’ను రూపొందించిన కాగ్నిషన్ కంపెనీ
కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్‌లకు చిన్న సూచన చేస్తే.. మనకు కావాల్సినట్టుగా ఫొటోలను తయారు చేసి పెడుతున్నాయి.. కావాల్సినట్టుగా వీడియోలనూ రూపొందిస్తున్నాయి.. అడిగిన డేటాను నెట్‌లో సెర్చ్ చేసిపెడుతున్నాయి.. అనుమానాలు ఉంటే తీరుస్తున్నాయి.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడే ఏకంగా వెబ్‌సైట్లను, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసిపెట్టగల ‘ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్’ వచ్చేసింది.
‘డెవిన్’ పేరుతో..
టెక్నాలజీ ప్రపంచంలో ఇటీవల వచ్చిన చాట్ జీపీటీ ఏఐ ప్రోగ్రామ్ ఎంతో కలకలం రేపింది. అది విద్యార్థులకు కావాల్సిన ఆర్టికల్స్ రాసిపెట్టడం నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అవసరమైన కోడ్‌లనూ సిద్ధం చేసి ఇవ్వడం సంచలనం సృష్టించింది. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన కాగ్నిషన్ అనే స్టార్టప్ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్’ను సృష్టించింది. దానికి ‘డెవిన్’’అని పేరు పెట్టింది.
వెబ్‌సైట్లను, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసి ఇవ్వగలదని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల ఇంటర్వ్యూలను, వివిధ బెంచ్‌మార్క్ టెస్టులను ఇది విజయవంతంగా పాస్ అయిందని తెలిపింది. ఇలాంటి పూర్తిస్థాయి ఏఐ ప్రోగ్రామ్ ప్రపంచంలోనే ఇదే మొదటిది కావడం గమనార్హం.
కోడ్ నుంచి డిప్లాయ్ దాకా..
సాధారణంగా ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్, వెబ్‌సైట్‌ను రూపొందించడంలో చాలా ప్రక్రియలు ఉంటాయి. కోడ్ రాయడం దగ్గరి నుంచి టెస్టింగ్, డీబగ్గింగ్ చేయడం, చివరికి దాన్ని డిప్లాయ్ చేయడం దాకా ఎన్నో క్లిష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న చాట్ జీపీటీ వంటి ఏఐ ప్రోగ్రామ్‌లు.. కొంతవరకు సాఫ్ట్‌వేర్ కోడ్‌లను రాసిపెట్టగలుగుతున్నాయి కూడా.
అయితే తాము అభివృద్ధి చేసిన ‘డెవిన్’.. సాఫ్ట్‌వేర్ కోడ్ రాయడంతోపాటు.. టెస్టింగ్, డీబగ్గింగ్, డిప్లాయ్ కూడా చేయగలదని ‘కాగ్నిషన్’ కంపెనీ ప్రకటించింది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేయగల స్థాయిలో పూర్తిస్థాయిలో పనిచేసే వెబ్‌సైట్‌ను రెడీ చేసి పెడుతుందని వివరించింది. అది కూడా జస్ట్ ఒక చిన్న కమాండ్ ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోగలదని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment