డెవిన్‌కు పోటీగా భారత్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. ఎవరీ దేవిక? | Indian AI Engineer Devika Emerges To Challenge Devin Check The Details | Sakshi
Sakshi News home page

డెవిన్‌కు పోటీగా భారత్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. ఎవరీ దేవిక?

Published Tue, Apr 2 2024 10:29 AM | Last Updated on Tue, Apr 2 2024 12:52 PM

Indian AI Engineer Devika Emerges To Challenge Devin Check The Details - Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన కాగ్నిషన్‌ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌’ను సృష్టించి.. దానికి ‘డెవిన్‌’ అని పేరు పెట్టింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. దీనికి పోటీగా భారత్‌లో 'దేవిక' వచ్చేసింది. ఇంతకీ దేవిక ఎవరు? ఇది ఎలాంటి పనులు చేయగలదు.. అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

భారతదేశానికి చెందిన ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, లిమినల్ అండ్ స్టిటైన్.ఏఐ 'ముఫీద్ వీహెచ్' డెవిన్‌కు ప్రత్యర్థిగా దేవికను రూపొందించారు. దేవిక, డెవిన్‌ మాదిరిగానే.. మనిషి ఇచ్చే సూచనలను అర్థం చేసుకోవడానికి కావలసిన మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి వాటిని పొందుతుంది. తద్వారా సూచనలను తీసుకుని, వాటిని కార్యాచరణలో పెడుతుంది.

దేవిక అనేది కూడా ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఇది మనం ఇచ్చే సూచనల మేరకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సొంతంగా కోడ్ రాస్తుంది. ఇది అమెరికా రూపొందించిన డెవిన్‌కు ఏ మాత్రం తీసిపోకుండా.. గట్టి ప్రత్యర్థిగా నిలుస్తుంది. 

ఏఐ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టి.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగంలో కొత్త శకానికి నాంది పలకడమే ఉద్దేశ్యంగా ఈ ఏఐ దేవికను రూపొందించారు. అయితే ఇది టెక్ జాబ్ మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి వేచి చూడాలి. అయితే ఖచ్చితంగా కోడింగ్ భవిష్యత్తు గణనీయమైన పరివర్తన చెందుతుందని మాత్రం చెప్పవచ్చు.

ప్రాజెక్ట్ దేవికకు సంబంధించి టెస్టర్లు, కంట్రిబ్యూటర్ల నుంచి ఆహ్వానం వచ్చినట్లు ముఫీద్ వీహెచ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా పేర్కొన్నారు. ముఫీద్ దేవిక ఫీచర్స్ వివరించారు. మరిన్నిటెస్టులు నిర్వహించిన తర్వాత, బగ్ పరిష్కారాలు పూర్తయిన తరువాత అధికారికంగా ప్రారంభమవుతుందని డెవలపర్ పేర్కొన్నారు.

ఏఐ దేవిక ఫీచర్స్ 

  • ఒక ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి.. వినియోగదారు ప్రశ్నను అర్థం చేసుకోవడానికి, బ్రౌజ్ చేయడానికి, పరిశోధన చేయడానికి, కోడ్, డాక్యుమెంట్ వంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఫీడ్‌బ్యాక్ లూప్‌లో ఒకదానితో ఒకటి పరస్పర చర్య చేయగల 12 ఏజెంట్ మోడల్‌లు ఉన్నాయి.
  • ఒల్లామా ద్వారా క్లాడ్ 3, GPT-4, GPT-3.5, లోకల్ LLMలకు మద్దతు ఇస్తుంది.
  • దేవికా తను వ్రాసిన కోడ్‌ని రన్ చేయగలదు, వినియోగదారు ప్రమేయం లేకుండా ఏదైనా లోపాలను ఎదుర్కొంటే కోడ్‌ను స్వయంగా సరిదిద్దుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement