
న్యూఢిల్లీ: ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. ప్రతిచర్య తీవ్రంగానే ఉంటుంది. మనిషికే కాదు.. మనిషి తెచ్చిన సాంకేతికతకూ అందుకు మినహాయింపు లేకుండా పోయింది. తాజాగా.. ఇలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బోట్ గ్రోక్(Grok) వ్యవహారం ఇప్పుడు ఇలాగే మారింది. ఎక్స్ నుంచి సోషల్ మీడియాలో అటు ఇటు తిగిరి.. చివరకు ప్రభుత్వం దృష్టికి చేరింది.
అన్‌ఫిల్టర్ భాష.. సెన్సార్‌లేని పదజాలంతో గ్రోక్ యూజర్లకు సమాచారం అందిస్తుండడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో స్క్రూటినీ(పరిశీలన)కి దిగింది. రెచ్చగొట్టే తరహా సమాచారాన్ని గ్రోక్ యూజర్లకు ఎందుకు అందిస్తోందంటూ ఎక్స్‌ను తాజాగా కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆరా తీసింది. మరీ ముఖ్యంగా హిందీ భాషను అలా దుర్వినియోగపర్చడంపై ఆరా తీసింది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమ వివరణకు కొంత సమయం ఇవ్వాలని అవతలి నుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. ఆ వివరణ ఆధారంగా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించి సరిపెట్టడమా? లేదంటే చర్యలు తీసుకోవడమా? ఉంటుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇలాన్ మస్క్(Elon Musk)కు చెందిన ఏఐ స్టార్టప్ ఎక్స్‌ఏఐ గ్రోక్ చాట్‌బాట్ సేవల్ని అందిస్తోంది. అయితే భారతీయ కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ యాసలో సమాధానాలు ఇస్తోంది. అలాగే కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. చాట్‌జీపీటీ సహా చాలావరకు ఏఐ చాట్‌బాట్‌లు వివాదాస్పద అంశాల జోలికి పోవడం లేదు. అలాగే.. భాష విషయంలోనూ సెన్సార్డ్‌గా ఉంటున్నాయి. కానీ, గ్రోక్ అందుకు విరుద్ధంగా ఉండడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది.
Grok 3 Voice Mode, following repeated, interrupting requests to yell louder, lets out an inhuman 30-second scream, insults me, and hangs up pic.twitter.com/5GtdDtpKce
— Riley Goodside (@goodside) February 24, 2025
ఏఐ రీసెర్చర్ రిలే గూడ్‌సైడ్(Riley Goodside)కు గ్రోక్‌తో ఎదురైన చేదు అనుభవం ఆ మధ్య వైరల్ అయ్యింది. పదే పదే ఆయన గ్రోక్‌ను వాయిస్ మోడ్‌లో ప్రశ్నలతో విసిగించారు. దీంతో అది ఓపిక నశించి.. మనిషి తరహాలోనే అరుస్తూ ఆయన్ని బూతులు తిట్టి.. ఆ సంభాషణను అక్కడితోనే ముగించింది.

Comments
Please login to add a commentAdd a comment