IT ministry
-
డీఫ్ ఫేక్‌పై పోరు.. నేడు, రేపు కీలక సమావేశం
సాక్షి, ఢిల్లీ: ఇంటర్నెట్లో డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తి ఈమధ్య ఆందోళన కలిగిస్తోంది. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు, ఆకతాయిలు అశ్లీల, నకిలీ.. విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారు. సాధికారత, వృద్ధి, సృజనాత్మకతకు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్ బలమైన సాధనమే అయినప్పటికీ.. కొంతమంది దాన్ని దుర్వినియోగం చేయడం గమనార్హం. ఈ తరుణంలో డీప్‌ఫేక్ తరహా వ్యవహారాల కట్టడికి కేంద్రం రంగంలోకి దిగింది. నేడు,రేపు(నవంబర్ 23,24వ తేదీల్లో) సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులతో కేంద్ర ఐటీ శాఖ సమావేశం కానుంది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం.. గురువారం జరిగే సమావేశంలో మార్ఫింగ్ కంటెంట్(ఫొటోలు, వీడియోలు) అంశాల కట్టడిపై, శుక్రవారం జరిగే భేటీలో ఐటీ నిబంధనలపై చర్చించనున్నారు. డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తి కట్టడికి అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. ఈ తరుణంలో.. చట్టం రూపకల్పన, ఇతరత్రా అంశాలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ప్రతినిధులతో కేంద్రం సమాలోచనలు జరిపే అవకాశాలూ కనిపిస్తున్నాయి. వాస్తవానికి డీఫ్ ఫేక్ కంటెంట్ వ్యవహారం ఇంటర్నెట్లో చాలాకాలంగా కొనసాగుతున్నప్పటికీ.. నటి రష్మిక మందన్న వీడియో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వెంటనే పలువురు ప్రముఖుల విషయంలోనూ ఇలాంటి వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డీప్ ఫేక్ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. తాజాగా.. బుధవారం జరిగిన జీ20 వర్చువల్ సమ్మిట్ ముగింపు ప్రసంగంలోనూ ప్రధాని మోదీ డీప్‌ఫేక్ సమస్యను ప్రస్తావించడం గమనార్హం. ‘‘ఏఐ ప్రతికూల ప్రభావాల గురించి ప్రపంచం ఆందోళన చెందుతోంది. సమాజానికి డీప్‌ఫేక్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడంతో పాటు డీప్‌ఫేక్‌ల నుంచి సమాజాన్ని కాపాడేందుకు కృషి చేయాలి’’ అని ప్రధాని మోదీ జీ20 సభ్య దేశాలకు పిలుపు కూడా ఇచ్చారు. -
బెట్టింగ్ గేమ్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ రంగ నియంత్రణకు సంబంధించి కేంద్రం గురువారం నిబంధనలను ప్రకటించింది. సిసలైన డబ్బులు పెట్టి ఆడేవి, బెట్టింగ్ చేసే గేమ్‌లను నిషేధించింది. అలాగే, ఆన్లైన్ గేమింగ్ రంగం స్వీయ నియంత్రణ విధానాన్ని పాటించాలని సూచించింది. ఈ దిశగా దేశీయంగా ఉపయోగించే గేమ్‌లను ఆమోదించేందుకు తొలుత మూడు స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్ఆర్వో) నోటిఫై చేయనుంది. 2021 ఐటీ చట్టాలకు సవరణగా ఈ నిబంధనలను చేర్చారు. సిసలైన డబ్బుతో పందేలు కాయనివి, వినియోగదారులకు హాని కలిగించే కంటెంట్ ఏదీ ఉండనివి, పిల్లలకు వ్యసనంగా మారని గేమ్స్‌కు అనుమతి ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ‘ఆన్లైన్ గేమింగ్ వృద్ధికి భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయి. అది గణనీయంగా విస్తరించేందుకు ఈ నిబంధనలు తోడ్పడగలవు‘ అని మంత్రి చెప్పారు. కొత్త నిబంధనలు నవకల్పనలకు ఊతమివ్వగలవని, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించగలదని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫాంలను ఏరివేసి, అంతర్జాతీయంగా పరిశ్రమ పోటీపడేలా ప్రోత్సహించగలవని అభిప్రాయపడ్డాయి. నిబంధనల్లో మరిన్ని ముఖ్య అంశాలు.. ► ఆన్లైన్ గేమ్స్‌ను నియంత్రించే ఎస్ఆర్వోల్లో పరిశ్రమ ప్రతినిధులు, గేమర్లు, ఇతరత్రా సంబంధిత వర్గాలు ఉంటాయి. నిబంధనల ప్రకారం ఎస్ఆర్వోల్లో ఒక విద్యావేత్త, సైకాలజీ నిపుణులు, బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న వ్యక్తి లేదా అధికారి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఎస్ఆర్వోలను డీనోటిఫై చేస్తారు. ► గేమింగ్ వ్యసనంగా మారకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, మోసాల బారిన పడకుండా యూజర్లను కాపాడేందుకు తగు వ్యవస్థను ఎస్ఆర్వోలు రూపొందించాలి. ఒక గేమింగ్ సెషన్లో సముచిత సమయం దాటితే పదే పదే హెచ్చరిక మెసేజీలు కూడా పంపించే విధంగా అది ఉండాలి. -
ఐటీ పరిధిలో ఆట
ఆన్లైన్ గేమింగ్‌లో అతి పెద్ద మార్కెట్ అయిన మనం ఎట్టకేలకు కళ్ళు తెరిచి, కష్టనష్టాలను నియంత్రించే పనిలో పడ్డాం. ఆన్లైన్ గేమింగ్‌ను ఐటీ నిబంధనల కిందకు తెస్తూ, కొన్ని ముసాయిదా సవరణలను కేంద్ర ఐటీ శాఖ సోమవారం విడుదల చేసింది. ఆన్లైన్ గేమ్స్ అన్నీ భారత చట్టాలకు అనుగుణంగా ఉండేలా, వాడకందార్లకు హాని కలగకుండా కాపాడేందుకే ఈ చర్యలని సర్కారు మాట. ముసాయిదాలో స్వీయ నియంత్రణ వ్యవస్థను ప్రతిపాదించిన మంత్రి, భవిష్యత్తులో గేమింగ్ కంటెంట్‌ను సైతం నియంత్రించే అవకాశం ఉందని చెప్పడం గమనార్హం. సాధారణంగా ఆన్లైన్ గేమింగ్ 3 రకాలు. ఒకటి – 1990లలో వీడియో పార్లర్లలోని ఆటల్లాగా ఇప్పుడు ఆన్లైన్లో వ్యవస్థీకృతంగా ఆడే ‘ఇ–స్పోర్ట్స్’. రెండోది – వేర్వేరు జట్లలోని నిజజీవిత ఆట గాళ్ళను ఒక జట్టుగా ఎంచుకొని, పాయింట్ల కోసం ఆన్లైన్లో ఆడే ‘ఫ్యాంటసీ గేమ్స్’. మూడోది – మానసిక, శారీరక నైపుణ్యంపై, లేదంటే పాచికలాట లాంటి సంభావ్యతపై ఆధారపడ్డ ఆన్లైన్ సరదా ఆటలు. సంభావ్యతపై ఆధారపడ్డ ఆటల్ని డబ్బులకు ఆడితే జూదం. ఇదీ స్థూలమైన లెక్క. తాజా ప్రతిపాదనల్లో ‘ఆన్లైన్ ఆట’ను నిర్వచించడమే కాక, ఆపరేటర్లు నియమ నిబంధనలన్నీ వాడకందారుకు ముందే చెప్పాలంటూ పారదర్శకతకు ప్రయత్నించడం బాగుంది. అలాగే çసమయం దాటి ఆడుతుంటే, అది ఓ వ్యసనంగా మారకుండా హెచ్చరిక సందేశాలు పంపాలనడమూ భేష్. కేంద్ర చట్టం పరిధిలోకి ఆన్లైన్ ఆటల్ని తీసుకొస్తున్న పాలకుల చొరవను స్వాగతిస్తూనే, లోపా లనూ నిపుణులు వేలెత్తి చూపుతున్నారు. గతంలో ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ ‘ఐటీ చట్టం–2000’ పరిధిలోది కాదు. తాజాగా ఐటీ శాఖను ఆన్లైన్ గేమింగ్ చూసే కేంద్ర మంత్రిత్వ శాఖగా నియమిం చారు. అది జరిగిన వారానికే ఈ కొత్త ముసాయిదా సవరణలు తెచ్చారు. నిజానికి, ఆన్లైన్ గేమింగ్ ఏ శాఖ కిందకు వస్తుందనే పాలనాపరమైన స్పష్టత ఇవ్వడం వరకు ఓకే కానీ, ఆ అధికారాన్ని సదరు శాఖ వినియోగించాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఆ పని చేయకుండానే ఐటీ చట్టం నియంత్రణ పరిధిలోకే ఆన్లైన్ గేమింగ్‌ను తెస్తూ, ఐటీ నిబంధనలు చెయ్యడం విడ్డూరం. అలాగే, ఈ సరికొత్త ముసాయిదా సవరణలపై ఈ నెల 17 లోగా ప్రజలు సలహాలు, సూచనలి వ్వాలని కోరారు. కానీ, ఈ సంప్రతింపుల ప్రక్రియలో వచ్చిన అభిప్రాయాలను ప్రజా క్షేత్రంలో ఉంచట్లేదు. ఇటీవల ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ –2022’లోనూ ఐటీ శాఖ ఇదే పని చేసింది. దీనివల్ల ఈ విధాన నిర్ణయంలో ప్రభుత్వ చర్యల పట్ల ప్రజల్లో ఏ మేరకు నమ్మకం ఉంటుం దంటే సందేహమే. ముందుగా ఎలాంటి చర్చ, శ్వేతపత్రం లేకుండానే, కనీసం ప్రభుత్వ ఆలోచన ఏమిటో చెప్పకుండానే కొత్త ముసాయిదా సవరణల్ని కేంద్రం తేవడం కొంత వివాదాస్పదమైంది. భౌతికంగా అన్ని రకాల జూదం, పందాలపై దేశంలో గోవా, సిక్కిమ్, కేంద్రపాలిత డామన్ మినహా మిగతా రాష్ట్రాల్లో నిషేధం ఉంది. బ్రిటీష్ కాలపు బహిరంగ జూద చట్టం 1867 సహా, వివిధ రాష్ట్రాల చట్టాలున్నాయి. కొన్నిచోట్ల నైపుణ్య ఆధారిత ఆటలకూ షరతులున్నాయి. పాపులర్ ఆన్లైన్ ఆట లూడోలోనూ జూదం సాగుతోందని వివాదమైంది. ఇప్పుడు ఆన్లైన్ ఆటల్ని సైతం ఒక కేంద్ర చట్టం కిందకు తేవడంతో విదేశాల నుంచి నడిచే చట్టవిరుద్ధ, దేశవిద్రోహ జూద వేదికల ముప్పును అరికట్టవచ్చు. అయితే, పరిమాణం, రిస్క్‌తో సంబంధం లేకుండా ఆన్లైన్ ఆటల్ని అందించే సైట్లు, మొబైల్ యాప్‌లు (ఇంటర్మీడియరీలు) అన్నిటినీ ఒకే గాట కట్టడంపై పునరాలోచించాలి. అంతర్జాతీయ సంస్థలు తమ సేవల్ని భారత్‌లో ఆరంభించడానికి ఇక్కడ ఆఫీసర్లను పెట్టుకోవడం ఎంత ఆచరణాత్మకమో చెప్పలేం. డబ్బుతో జూదంపై మరింత కఠిన నిబంధనలుండాలని తమిళనాడు కోరుతోంది. మరి రాష్ట్రాలు అదనపు షరతులు పెట్టవచ్చేమో స్పష్టత లేదు. నిజానికి, కరోనాలో మనం వినోదాన్ని ఆస్వాదించే విధానం మారిపోయింది. ఓటీటీ ఛానల్స్ విస్తరణతో పాటు ఆన్లైన్ గేమింగ్ బాగా పెరిగింది. ఆన్లైన్ ఆటలపై వెచ్చించే సగటు సమయం కోవిడ్ ముందుతో పోలిస్తే, 65 శాతం హెచ్చింది. ఏకంగా 43 కోట్ల మందికి పైగా ఈ వర్చ్యువల్ గేమింగ్‌పై సమయం వెచ్చిస్తున్నారని లెక్క. కరోనాతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టెక్నాలజీని వాడి, డిజిటల్ తెరను వీక్షించే వ్యవధి పెరగడం తిప్పలు తెచ్చింది. యువతరానికి ఆన్లైన్ ఆట ఓ వ్యసనమై, రోజూ 6 నుంచి 8 గంటలు వెచ్చిస్తున్నారు. చదువు, మానవ సంబంధాలు, చివరకు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. గతంలో పబ్జీ, బ్లూ వేల్ ఛాలెంజ్ లాంటి ఆన్లైన్ గేమ్స్ హింస, ఆత్మహత్యలను ప్రేరేపించేసరికి, వాటిని నిషేధించాల్సి వచ్చిన సంగతి మరిచిపోలేం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గేమింగ్ వ్యసనాన్ని ఆరోగ్య సమస్యగా గుర్తించడం గమనార్హం. చైనా ఇప్పటికే ఈ ఆటల్ని ‘మెదడుకు మత్తుమందు’ అంటూ, 18 ఏళ్ళ లోపు పిల్లలు వారానికి 3 గంటలు మించి ఆడే వీల్లేకుండా చేసింది. భారత్‌లోనూ క్యాసినో లాగే ఆన్లైన్ ఆటల్లోనూ పిల్లలకు కనీస వయఃపరిమితి విధించవచ్చు. ముఖ్యంగా వీటి దుష్ఫలితాలపై తల్లితండ్రులు, అధ్యాపకులు పిల్లల్లో చైతన్యం తేవాలి. వచ్చే 2025 కల్లా 65.7 కోట్ల యూజర్లతో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ రూ. 29 వేల కోట్లకు పైగా ఆదాయం తెస్తుంది. 15 వేల ఉద్యోగాలొస్తాయట. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దే క్రమంలో ఆర్థిక అవకాశాలెన్ని ఉన్నా, ఈ ఆటలపై అదుపు లేకుంటే సామాజిక నష్టమూ ఎక్కువే. కాబట్టి పట్టువిడుపులతో పాలకుల నియంత్రణ చర్యలే శరణ్యం. -
సేవల అంతరాయం: ప్రభుత్వానికి వాట్సాప్ వివరణ, గోప్యంగా వివరాలు!
దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో వాట్సాప్ ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించింది. నివేదికలో ఏముంది! భారత్ సహా పలు దేశాల్లో అక్టోబర్ 25న వాట్సాప్ సేవలు దాదాపు 2 గంటల పాటు నిలిచిపాయాయి. అయితే కొంత సమయం తర్వాత ఆ సమస్య పరిష్కారమైంది. వాట్సాప్ సేవలు అంతరాయం లాంటి ఘటనలు ఇది వరకే పలుమార్లు చోటుచేసుకున్నప్పటికీ, ఈ స్థాయిలో సమస్య తలెత్తడం ఇదే తొలిసారి. దీంతో భారత ప్రభుత్వం దీనిపై నజర్ అయ్యింది. భారత్‌కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (Cert-in)తో సమన్వయం చేసుకుంటూ అంతరాయానికి గల కారణాలను అన్వేషించాలని సూచించింది. సాంకేతిక సమస్య కారణమా లేక సైబర్ అటాక్ జరిగిందా అనేది చెప్పాలని కోరింది. కాగా వాట్సాప్‌కు భారత్‌లో 50 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. నివేదికల ప్రకారం.. వాట్సాప్ అంతరాయానికి సంబంధించిన రిపోర్ట్‌ను మెటా ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది. అందులో ఈ అంతరాయం గురించి సవివరమైన నివేదిక ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వాట్సాప్ సమర్పించిన వివరణాత్మక నివేదికలోని వివరాలు ఇంకా బయటకు విడుదల కాలేదు. దీంతో వాట్సాప్ నివేదికపై స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: బంగారమా? ఇల్లా? పెట్టుబడికి ఏది బెటర్? ఈ విషయాలు తెలుసుకోండి! -
ఆ యూట్యూబ్ ఛానెళ్లు బ్యాన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేక్ న్యూస్, విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు పోస్ట్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఐటీ చట్టం 2021 నిబంధనల ప్రకారం.. 10 యూట్యూబ్ ఛానెల్స్‌కు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ఛానెళ్లు మార్పింగ్ వీడియోలు, ఫోటోలను ఉపయోగించి భారత జాతీయ భద్రతకు, విదేశీ సంబంధాలు దెబ్బతినేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్నిపథ్, ఆర్మీ, కశ్మీర్ అంశాలపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ‘తప్పు వార్తల ద్వారా భారత్‌కు ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీసేలా వీడియోలు చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను ప్రసార, సమాచార శాఖ బ్యాన్ చేసింది. దేశ భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటాం. భారత సార్వభౌమత్వం, సమగ్రతను, జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, ప్రజా సంబంధాలను దెబ్బతీసేందుకు చేసే కుట్రను అణచివేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది.’ అని తెలిపారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్. ఇదీ చదవండి: రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాలంటూ ఫిర్యాదు -
అశ్లీల, మార్ఫింగ్ వీడియోల కథ కంచికి!
ఇంటర్నెట్లో సైట్లను బ్లాక్ చేసినా మన దేశంలో అశ్లీల కంటెంట్ వీక్షణకు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటున్నాయి. ఆఖరికి సోషల్ మీడియా అకౌంట్లలోనూ వీటి హవా నడుస్తోంది. అయితే ఇకపై ఇలాంటి ఆటలు సాగవు!. అశ్లీల కంటెంట్‌తో పాటు మార్ఫింగ్ వీడియోల తొలగింపు కోసం స్వయంగా రంగంలోకి దిగింది కేంద్రం. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అశ్లీల, మార్ఫింగ్ వీడియోల పని పట్టేలో కేంద్ర ప్రభుత్వం తలమునకలైంది. వివిధ ప్లాట్‌ఫామ్‌లలోని అకౌంట్లపై వేట(టు) మొదలైంది. ఈ మేరకు కేంద్ర సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ.. ట్విటర్, ఫేస్బుక్, టెలిగ్రాం అకౌంట్లలో సర్క్యులేట్ అవుతున్న మార్ఫింగ్, అశ్లీల వీడియోల అంశాన్ని ఆయా ప్లాట్‌ఫామ్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయా అకౌంట్లను తాత్కాలికంగా లేదంటే పూర్తిగా నిషేధించడమో చేయాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడుతున్నాయి కూడా. ఆ క్లిప్‌తో గుర్రు! గతంలో పోర్న్ సైట్ల బహిరంగ వీక్షణపై కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు టెలికామ్ ఆపరేటర్ల సహకారంతో ఈ చర్యకు ఉపక్రమించింది. అయినప్పటికీ ఇతర మార్గాల ద్వారా అశ్లీల కంటెంట్ వైరల్ అవుతూ వస్తుండగా.. ఎప్పటికప్పుడు చర్యల ద్వారా కట్టడి చేస్తూ వస్తోంది కేంద్రం. ఇదిలా ఉంటే ట్విటర్లాంటి సామాజిక మాధ్యమాల్లో సైతం అసభ్య, అశ్లీల, మార్ఫింగ్, ఫేక్ వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ విషయంలో పలు ఫిర్యాదులు అందడంతో సీరియస్ అయిన కేంద్రం.. ఐటీ రూల్స్ 2021 ద్వారా కట్టడికి ప్రయత్నిస్తూ వస్తోంది. అయినా కూడా కంటెంట్ వ్యాప్తి ఆగడం లేదు. కేవలం ఏజ్ లిమిట్ పర్మిషన్తో యూజర్లను ఆయా ప్లాట్‌ఫామ్స్ అనుమతిస్తుండగా.. కేంద్రం మాత్రం ఇది కుదరని కరాకండిగా చెప్తోంది. ఇంతలో క్యాబినేట్ భేటీ సంబంధిత క్లిప్ మార్ఫింగ్ అయ్యి మరి సర్క్యులేట్ అవుతుండడంపై కేంద్రం గరం అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఫటాఫట్ చర్యలు ప్రత్యేకించి కొన్ని అకౌంట్లు, పేజీలు, ఛానెల్స్ నుంచే అశ్లీల కంటెంట్, వర్గాల మధ్య చిచ్చు పెట్టే తరహా కంటెంట్ వ్యాప్తి చెందుతోంది. ఈ మేరకు ఆయా ప్లాట్‌ఫామ్స్ నుంచి సరైన స్పందన లేకపోతుండడంతో స్వయంగా సమాచార మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. త్వరగతిన రంగంలోకి దిగిన కేంద్రం.. 73 ట్విటర్ అకౌంట్లను సస్పెండ్ చేసింది. నాలుగు యూట్యూబ్ ఛానెళ్లను తొలగించింది. ఇన్స్టాగ్రామ్ గేమ్‌ను తొలగించిందని తెలుస్తోంది. కేవలం తొలగించడమే కాదు.. ఇలాంటి చేష్టలకు పాల్పడే బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని చెబుతోంది కేంద్రం. ఆడవాళ్ల కోసం.. మరోవైపు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ఇతరత్ర కంటెంట్‌ను వ్యాప్తిచెందిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ మేరకు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ మేనేజ్మెంట్లకు అలాంటి అకౌంట్ల విషయంలో జాప్యం చేయకుండా(విచారణ, దర్యాప్తు పేరుతో కాలయాపన చేయకుండా) త్వరగతిన యాక్షన్ తీసుకోవాలని సూచించింది. ప్రత్యేకించి ప్రముఖుల మార్ఫింగ్, అభ్యంతరకర, నకిలీ కంటెంట్ విషయంలో త్వరగతిన స్పందించాలని కోరింది. ఫిర్యాదులు అందినా.. అందకపోయినా నిరంతర పర్యవేక్షణ ద్వారా చర్యలకు ఉపక్రమించాలని తెలిపింది. టెక్నాలజీ(ఫేక్, మార్ఫింగ్) కట్టడికి టెక్నాలజీనే విరుగుడుగా ఉపయోగించాలని సూచిస్తోంది. వీపీఎన్ల నిషేధం! ట్విటర్, టెలిగ్రామ్ లాంటి అకౌంట్లతో పాటు వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్)లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఇంటర్నెట్లో విచ్చలవిడిగా అశ్లీల, అభ్యంతరకర, నిషేధిత కంటెంట్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీపీఎన్ అకౌంట్ల నిషేధంపై కేంద్రం నజర్ పెట్టింది. ప్రత్యేక టూల్స్ ద్వారా అకౌంట్లపై నిఘా కొనసాగించాలంటూ ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఒత్తిడి తెస్తోంది. దేశంలో వీపీఎన్ సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్, నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. ఇది వరకే హోం మంత్రిత్వ శాఖను కోరిన విషయం తెలిసిందే. మరోవైపు అశ్లీల సైట్ల డొమైన్ల(ఎప్పటికప్పుడు మారుస్తూ ఇంటర్నెట్లో దర్శనమివ్వడం!) విషయంలోనూ కఠిన నియంత్రణ ద్వారా కట్టడి చేయాలని అనుకుంటోంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ వేసవి లోపే అశ్లీల, మార్ఫింగ్ వీడియోల కట్టడిపై కేంద్రం పట్టు సాధించే అవకాశం ఉంది. చదవండి: 20 ఏళ్లుగా పరారీలో డాన్.. ఎలా దొరికాడో తెలిస్తే సంబరపడతారు -
‘ఎన్ఎస్ఓ గ్రూప్‌పై నిషేధం’ ప్రతిపాదన లేదు
న్యూఢిల్లీ: ‘ఎన్ఎస్ఓ గ్రూప్’ అని పేరున్న సంస్థలపై నిషేధం విధించాలన్న ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. పెగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు అందించినందుకు గాను ఎన్ఎస్ఓ గ్రూప్‌ను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో చేర్చినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈ గ్రూప్‌ను భారత్‌లో నిషేధిస్తారా? అని రాజ్యసభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అలాంటి ప్రతిపాదన లేదన్నారు. దేశంలో సోషల్ మీడియా దుర్వినియోగం అవుతున్న సంగతి నిజమేనని అంగీకరించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసి, విక్రయించిన పెగాసస్ స్పైవేర్‌తో భారత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై, జర్నలిస్టులపై, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, అలాంటిదేమీ లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుతోంది. పెగాసస్ స్పైవేర్ వాడకంపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ముగ్గురు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. -
స్టార్టప్‌లకు శుభవార్త ? రంగంలోకి గూగుల్!
న్యూఢిల్లీ: ద్వితీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాల్లో స్టార్టప్‌లపై పని చేస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శుభవార్త. అంకుర పరిశ్రమగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న వారికి సాయం చేసేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన మైటీ స్టార్టప్ హబ్‌తో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. యాప్‌స్కేల్ కేంద్రానికి చెందిన మైటీ, గూగుల్‌కు కలిసి యాప్‌స్కేల్ అకాడమీని ప్రారంభించనున్నాయి. ఈ అకాడమీ ద్వారా అత్యంత నాణ్యమైన యాప్స్‌ను భారతీయ స్టార్టప్స్ అభివృద్ధి చేసేందుకు సాయం చేస్తుంది. గేమింగ్, హెల్త్‌కేర్, ఫిన్‌టెక్, ఎడ్‌టెక్‌తోపాటు సామాజికంగా ప్రభావం చూపే యాప్స్ అభివృద్ధిపై అకాడమీ దృష్టిసారిస్తుంది. డిసెంబరు 15 వరకు యాప్‌స్కేల్ అకాడమీ సాయం పొందేందుకు స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 15 వరకు అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న స్టార్టప్‌లు మైటీ వెబ్పోర్టల్కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉత్తమంగా ఉన్న వంద స్టార్టప్‌లను దేశవ్యాప్తంగా ఎంపిక చేస్తారు. వీటికి యాప్‌స్కేల్ అకాడమీ ద్వారా అవసరమైన మద్దతు అందిస్తారు. ఆరు నెలల పాటు ఎంపిక చేసిన స్టార్టప్‌లు నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. రెగ్యులర్‌గా వెబినార్లు నిర్వహిస్తూ నిధుల సమీకరణ, సెక్యూరిటీ విధానాలు, యూఎక్స్ డిజైన్స్ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం జిల్లా కేంద్రాలు, టైర్ టూ సిటీల్లో ఉన్న స్టార్టప్‌లకు మేలు చేస్తుందని కేంద్రం చెబుతోంది. చదవండి: 'గ్రీన్ పవర్ 'పేరుతో ఓలా, మహేంద్ర కంపెనీల్లో మొత్తం మహిళా బృందాలే -
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: పబ్జీకి చెందిన త్వరలో లాంచ్ కానున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ యాప్ నిషేధం విషయంలో కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాను భారత్ లో విడుదల కాకముందే తాము నిషేదించలేమని జెఎన్‌యులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ గౌరవ్ త్యాగి అనే విమర్శకుడు ఇటీవల దాఖలు చేసిన ఆర్టీఐకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ నిబంధనల ప్రకారం విడుదల తర్వాత మాత్రమే ఈ ఆటను నిషేదించే అవకాశం ఉంటుంది అని చెప్పింది. డాక్టర్ గౌరవ్ త్యాగి దాఖలు చేసిన ఆర్టీఐపై స్పందిస్తూ ఐటి మంత్రిత్వ శాఖ.. "భారతదేశంలో పబ్జీ లేదా ఏదైనా కంపెనీ/మొబైల్ యాప్ ప్రవేశానికి అనుమతి ఇవ్వడంలో ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఎటువంటి అధికారులు లేవు" అని పేర్కొంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. "హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ యాప్ విడుదలకు అనుమతి ఇవ్వదు. భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, రక్షణ విషయంలో నిబందనలు పాటించకపోతే మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ, ఐటీ నిబంధనల ప్రకారం ఏదైనా మొబైల్ యాప్ ను నిషేదించే అవకాశం ఉంటుంది" అని తెలిపింది. ఈ గేమ్ ను భారతదేశంలోకి క్రాఫ్టన్ తీసుకొస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మే 18 నుంచి ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ నెల 18న గేమ్ విడుదల అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే, విడుదల విషయంలో అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెల్లడించలేదు. As part of my research on predatory practise of Chinese companies in India and it's impact on National Security, had filed an RTI about the relaunch of PUBG Mobile in India by Krafton (in which the Chinese behemoth has the second largest stake). pic.twitter.com/WL5rkThdOb — Dr Gaurav Tyagi (@drtyagigaurav) June 13, 2021 చదవండి: గుడ్ న్యూస్: టీవీఎస్ అపాచీ బైక్ పై భారీ ఆఫర్ -
ట్విటర్‌పై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌పై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్నట్విటర్ వ్యాఖ్యలను ఖండించింది. ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు చేసిందని ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్విటర్ పాఠాలు నేర్పుతోందని కేంద్రం మండిపడింది. ట్విటర్ ఉద్దేశ్యపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఐటీశాఖ ఆరోపించింది. నిబంధనల గురించి పాఠాలు నేర్పేందుకు ట్విటర్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత న్యాయ వ్యవస్థను దెబ్బతీయాలని ట్విటర్ చూస్తోందని కేంద్రం వ్యాఖ్యానించింది. కాగా, ‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు మే 24న సాయంత్రం వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ వివాదం చిలికి చిలికి పెను తుఫానులా మారింది. మరోవైపు ‘కాంగ్రెస్ టూల్ కిట్’ వ్యవహారంలో ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని, పోలీసుల చేత బెదిరించే ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆరోపించింది. భావ ప్రకటనా స్వేఛ్చకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టం పప్రకారం తాము నడుచుకుంటామని అంటూనే తీవ్ర పదజాలంతో ప్రభుత్వంపై విరుచుకుపడింది. చదవండి: కొత్త డిజిటల్ నిబంధనలపై స్పందించిన సుందర్ పిచాయ్ -
భారత్ లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్?
మన దేశంలో సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అవుతాయా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఫేస్బుక్, ట్విట్టర్‌పై నిబంధనల పేరిట కత్తి వేలాడుతోంది. సోషల్ మీడియా కట్టడికి ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 25న ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త నియమావళి బుధవారం మే 26 నుంచి అమల్లోకిరానుంది. కొత్త నిబంధనలను పాటించటానికి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఆ మార్గదర్శకాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలకు, ఓటీటీలకు మే 25 దాకా కేంద్రం సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే ఈ గడువు ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది. ఒకవేళ ఈ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు కొత్త నియమనిబంధనల్ని అంగీకరించకపోతే నిషేధం తప్పేలా లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబందనలలో అనేక అంశాలున్నాయి. ప్రతి సోషల్ మీడియా కంపెనీలకు ఇండియాలో సంబంధిత అధికారులు ఉండాలి. వారి పేర్లు, ఇండియాలో వారి అడ్రస్, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకరమైన కంటెంట్ తొలగించడం వంటివి ఈ నియమాలలో ఉన్నాయి. ఏ సంస్థ కూడా ఇప్పటివరికి ఆ నిబందనలు అంగీకరించ లేదు. అందుకే ఇండియాలో ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం తప్పేలా లేదన్న చర్చ జరుగుతోంది. మే 26 నుంచి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఈ కంపెనీలు ఆరు నెలల సమయం కావాలని కోరాయి. దీనికి కేంద్రం ససేమిరా అంటోంది. దీంతో ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సోషల్ మీడియాల సర్వీసులు నిలిపివేయడమో లేదా తాత్కాలికంగా ఆగిపోవడమో జరిగే అవకాశం ఉంది. చదవండి: ప్రపంచానికి కొత్త కుబేరుడు.. రెండో స్థానంలో జెఫ్ బిజోస్ -
18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్ సంబంధిత తప్పుడు సమాచారాన్ని, అలాగే తమ నిబందనలు ఉల్లంఘించిన ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్ల కంటెంట్/పోస్టులను తొలగించినట్లు సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లు తన కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ తాజా ఎడిషన్‌లో తెలిపింది. విద్వేషపూరిత ప్రసంగం, బెదిరింపు, వేధింపులు, నగ్నత్వం, లైంగిక వంటి కార్యకలాపాలతో సహా ఇతర 12 ఫేస్బుక్ విధానాలను, 10 ఇన్స్టాగ్రామ్ విధానాలను ఉల్లంఘిస్తే సీఎస్‌ఇఆర్ చర్యలు తీసుకుటుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి నుంచి మార్చి మధ్య 9.8 మిలియన్ ద్వేషపూరిత కంటెంట్లను ఫేస్బుక్ తొలగించింది. అంతకుముందు త్రైమాసికంలో ఈ సంఖ్య 6.4 మిలియన్లు. ఇక ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 3,24,500 కంటెంట్ పై చర్య తీసుకున్నారు. అదనంగా, ఫేస్బుక్ తన ప్రధాన సైట్లో బెదిరింపు, వేధింపులకు సంబందించిన 8.8 మిలియన్ కంటెంట్, ఇన్‌స్టాగ్రామ్‌లో 5.5 మిలియన్ల పోస్ట్‌లపై చర్యలు తీసుకుంది. ఫేస్బుక్ ఈ నివేదికను వివరిస్తూ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో నిబందనలకు విరుద్దమైన సమాచారాన్ని తొలగించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏ విధంగా సహాయపడిందని పేర్కొంది. ఇక మన దేశ విషయానికి వస్తే 2020 జూలై నుంచి డిసెంబర్ మధ్య కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఫేస్బుక్ భారతదేశంలో 878 విభాగాలకు సంబందించిన కంటెంట్‌ను యాక్సెస్ చేయడాన్ని పరిమితం చేసినట్లు సోషల్ మీడియా దిగ్గజం తాజా రిపోర్ట్ లో వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సెక్షన్ 69ఎను ఉల్లంఘించినందుకు ఆంక్షలు విధించినట్లు ఫేస్బుక్ పేర్కొంది. ప్రభుత్వం 2020 మొదటి ఆరు నెలల కాలంలో 681 అభ్యర్థనలతో పోలిస్తే చివరి ఆరు నెలల కాలంలో అభ్యర్థనల రేటు 28.9 శాతం పెరగింది అని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా, వినియోగదారుల డేటా కోసం ప్రభుత్వ అభ్యర్థనలు 2020 ద్వితీయార్ధంలో 1,73,592 నుండి 1,91,013కు అంటే 10 శాతం పెరిగాయి. జూలై - డిసెంబర్ మధ్య కాలంలో భారతదేశం వినియోగదారు డేటా కోసం 40,300 అభ్యర్ధనలను చేసింది. యునైటెడ్ స్టేట్స్ (61,262) తర్వాత భారత్ ఎక్కువ అభ్యర్థనలు చేసింది. 2020 మొదటి అర్ధభాగంలో భారత్ 35,560 అభ్యర్థనలు చేసింది. సోషల్ మీడియా సంస్థ 52 శాతం భారత అభ్యర్థనలను పరిష్కరించింది. చదవండి: డ్రైవర్ అవసరం లేని డైమ్లర్స్ భారీ ట్రక్ -
Whatsapp: వాట్సాప్‌పై కేంద్రం గరం గరం
న్యూఢిల్లీ: వాట్సాప్ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం గరం గరం అయ్యింది. నూతన ప్రైవసీ పాలసీలో చేపట్టిన మార్పులు భారతీయ పౌరుల గోప్యత, డేటా భద్రత, హక్కులు, ప్రయోజనాలకు హాని కలిగించేలా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. వాట్సాప్ వెంటనే వివాదాస్పద కొత్త గోప్యతా విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసింది. అభ్యంతరాలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ లోపు సంతృప్తికరమైన స్పందన రాకపోతే చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ డేటా ప్రకారం భారతదేశంలో 53 కోట్ల మంది వినియోగదారులను వాట్సాప్ కలిగి ఉంది. ఐరోపాలోని వినియోగదారులతో పోలిస్తే భారతీయ వినియోగదారుల పట్ల వాట్సాప్ అనుసరిస్తున్న వివక్ష ధోరణిని కేంద్రం ఖండిచింది. వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీకి సంబందించిన మే15ను గడువును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అమలును వాయిదా వేసినంత మాత్రన ప్రజల ప్రయోజనాలను గుర్తించినట్లు కాదని ఐటీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. నూతన ప్రైవసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులో కూడా మంత్రిత్వ శాఖ ఇదే వైఖరిని అవలభించింది. చదవండి: తరిగిపోతున్న ఎలాన్ మస్క్ సంపద -
దేశంలోనే బెస్ట్ మంత్రిగా కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్’గా, తెలంగాణ రాష్ట్రం ‘ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. 2003 నుంచి కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలు మెరుగైన పాలన కోసం అనుసరిస్తున్న విధానాలపై చేసిన అధ్యయనం తర్వాత తెలంగాణను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ వెల్లడించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్.. కొచ్చర్ తరఫున ఈ నెల 23న కేటీఆర్‌కు ఈ అవార్డును అంద జేశారు. ‘ఐటీ సాంకేతికత వినియోగం ద్వారా పౌర సేవలను మెరుగు పరచడంలో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. ముఖ్యంగా కోవిడ్–19 సమయంలో పౌర సేవలను అందించడంలో ఆధునిక టెక్నాలజీ జీవన రేఖగా నిలిచింది. ఈ విషయంలో అత్యంత శ్రద్ధ చూపిన కేటీఆర్‌కు 2020లో అవార్డు దక్కింది. 2016లోనూ కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు. రెండుసార్లు స్కోచ్ అవార్డును అందుకున్న ఏకైక మంత్రి కేటీఆర్’ అని కొచ్చర్ వ్యాఖ్యానించారు. తనకు అవార్డు లభించడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ టాప్.. ఈ గవర్నెన్స్‌లో 2019 స్కోచ్ ర్యాంకింగ్‌లో పదో స్థానంలో నిలిచిన తెలంగాణ, 2020 సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచింది. 2019లో ఎనిమిదో స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రస్తుత ర్యాంకింగ్‌లో మహారాష్ట్రతో కలిసి రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2021 ర్యాంకింగ్‌కు సంబంధించి మదింపు ప్రక్రియ ప్రారంభమైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పనితీరును కూడా మదింపు చేస్తామని స్కోచ్ అవార్డు కమిటీ పేర్కొంది. Delighted to share that Telangana IT Minister @KTRTRS has been awarded the SKOCH “Best Performing IT Minister” Award for the year 2020. Also, Telangana state has been awarded “e-Governance State of the Year” award by @skochgroup. pic.twitter.com/orV0dWO1AW — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 25, 2021 -
దిగొచ్చిన ట్విటర్? ఆ ఖాతాలు బ్లాక్ ?
-
దిగొచ్చిన ట్విటర్? ఆ ఖాతాలు బ్లాక్ ?
సాక్షి,న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ నోటీసులను, ఆదేశాలను పట్టించుకోని ట్విటర్ క్రమంగా దిగివస్తోందా? తన నోటీసులను పాటించక పోవడంతో సీరియస్ పరిణామాలుంటాయన్న ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ట్విటర్ ఖాతాల బ్యాన్‌కు ఉపక్రమించిందన్న అంచనాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆంక్షలు విధించాలని ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పిన ట్విటర్ ఖాతాల్లో 97 శాతం అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీ, ట్విటర్ ప్రతినిధుల సమావేశం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా. మొత్తం 1,435 వాటిలో 1,398 ఖాతాలను నిషేధించినట్టు సమాచారం. అయితే ఈ అంచనాలపై ట్విటర్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. (ట్విటర్, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు) కాగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం, రిపబ్లిక్ డే హింస ఘటనల నేపథ్యంలో కేంద్రం ట్విటర్‌పై ఫైర్ అయింది. పాకిస్తాన్, ఖలిస్తాన్ అనుకూల ట్విటర్ ఖాతాలను, అలాగే "రైతుల మారణహోమం" లాంటి హ్యాష్‌ట్యాగ్‌లను వ్యాప్తి చేస్తున్న 1435 యూజర్ల ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ట్విటర్‌కు నోటిసులిచ్చింది. అయితే భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించ లేమంటూ కొన్ని ఖాతాలను బ్యాన్‌కు నిరాకరించింది. అయితే విద్వేషాన్ని రగిలించే "హానికరమైన కంటెంట్‌ను" ను నిరోధిస్తున్నామని, నిబంధనలను ఉల్లంఘించిన 500 ఖాతాలను శాశ్వతంగా నిలిపివేసిందని పేర్కొంది. దీనిపై ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గురువారం రాజ్యసభలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, వాట్సాప్‌సహా ఏ సోషల్ మీడియా సంస్థ అయినా భారత రాజ్యాంగం, చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను అగౌరవ పరచడం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఫేక్‌న్యూస్ నిరోధించేందుకు ఒక విధానాన్నిరూపొందించాలంటూ సుప్రీంకోర్టు ట్విటర్, కేంద్రానికి నోటిసులిచ్చిన సంగతి తెలిసిందే. (‘కూ’ యాప్ సురక్షితమేనా? సంచలన విషయాలు) -
ఐటీ శాఖ వ్యాఖ్యలు : ముదురుతున్న ట్విటర్ వివాదం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం, మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. కొన్ని ట్విటర్ ఖాతాలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ట్విటర్ వివరణపై ఐటీ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖలిస్తాన్, పాకిస్తాన్ లింకులున్న మొత్తం 1,178 ఖాతాలను బ్యాన్ చేయాలన్న హెచ్చరికల నేపథ్యంలో పలు ఖాతాలను ఇప్పటికే తొలగించిన ట్విట్టర్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలు చట్ట విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమంటూ ఒక బ్లాగ్ పోస్ట్ లో వివరణ ఇచ్చింది. అయితే దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆ గ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంతో చర్చలకు ముందే ఈ విధంగా వ్యవహరించడం సరికాదని, ఇది చాలా వింతగానూ అసాధారణంగానూ ఉందని తెలిపింది. దీనిపై మరింత వివరంగా త్వరలోనే స్పందించనున్నట్లు పేర్కొంది. అలాగే దేశీయ యాప్ 'కూ' వేదికపై మంత్రిత్వ శాఖ తనకమెంట్‌ను పోస్ట్ చేయడం విశేషం. (ట్విటర్‌కు షాక్: దేశీ ట్విటర్ ‘కూ’ జోరు) 'కూ' వేదిక కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సందేశంలో, ప్రభుత్వంతో సమావేశమయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ట్విటర్ కోరిందని, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ట్విటర్ సీనియర్ మేనేజ్మెంట్తో మాట్లాడవలసి ఉందని తెలిపింది. ఈ సమావేశం ముందే బ్లాగ్ పోస్ట్‌ను పోస్ట్ చేయడం అసాధారణ విషయమని, ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించింది. (రైతు ఉద్యమం : ఆ ఖాతాలకు షాక్) కాగా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు ఆందోళనలో భాగంగా గణతంత్ర దినోత్సవంరోజు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ట్విటర్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మొదలైంది. 250 ట్విటర్ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది. దీనిపై స్పందించిన ట్విటర్ తమ సిబ్బంది భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకున్న చర్యలను, తీసుకోలేకపోయిన చర్యలను ఈ పోస్ట్‌లో వివరించింది. మీడియా సంస్థలు, పాత్రికేయులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకుల ఖాతాలపై చర్యలు తీసుకోలేదని తెలిపింది. వీటిపై చర్యలు తీసుకుంటే, భారతీయ చట్టాల ప్రకారం వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లవుతుందని పేర్కొంది. ప్రభుత్వంతో సమావేశమయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరింది. కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖకు బుధవారం ఈ సమాచారాన్ని తెలియజేశామని, చర్చలను కొనసాగిస్తామని ట్విటర్ తెలిపింది. -
రుణాల యాప్‌లపై గూగుల్ సంచలన నిర్ణయం
హైదరాబాద్: లాక్డౌన్ ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక కష్టాల సమయంలో రుణాలు ఇస్తామంటూ వెంటపడి ఇచ్చిన రుణ యాప్‌లు అనంతరం ఆ రుణాలు చెల్లించాలని తీవ్ర వేధింపులకు గురి చేసి పదుల సంఖ్యలో ప్రజలు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విధంగా రుణాలు ఇచ్చే యాప్‌లు ప్రజలను వేధిస్తున్నాయని పోలీసులతో పాటు ప్రజలు ఫిర్యాదులు చేయడంతో ఎట్టకేలకు గూగుల్ సంస్థ స్పందించింది. అలాంటి లోన్ యాప్స్‌ను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దాదాపు 100 యాప్‌లపై నిషేధం విధించింది. డాటాను దుర్వినియోగం చేయడమే కాకుండా ఎక్కువ మొత్తం వడ్డీలు వసూలు చేస్తున్నారనే విషయాన్ని గూగుల్ గుర్తించి ఈ చర్యలు తీసుకుంది. ఆ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. వెంటనే రుణాలు ఇస్తామని ప్రజల వెంటపడి తర్వాత అధిక వడ్డీ పేరుతో వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. రుణాలు చెల్లించినా కూడా వడ్డీ పేరిట అధిక వసూళ్లకు పాల్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ల మోసాలపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఈ యాప్‌ల ద్వారా రుణాలపై అధిక వడ్డీకి సంబంధించిన ఫిర్యాదులు చాలా వచ్చాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి సంజయ్ ధోత్రే లిఖితపూర్వక సమాధానంలో బుధవారం పార్లమెంటుకు తెలిపారు. వ్యక్తిగత డాటా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులను కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందని మంత్రి చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని రుణాలకు సంబంధించిన యాప్‌లను తొలగించినట్లు గూగుల్ తెలిపింది. తొలగించిన యాప్‌లు తమ నిబంధనలను పాటించడం లేదని, భద్రతా విధానాలను ఉల్లంఘించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్ వివరించింది. అయితే ఎన్ని యాప్స్.. వేటిని నిషేధించిందనే విషయం మాత్రం గూగుల్ బహిర్గతపర్చలేదు. మొత్తానికి కొన్ని రుణాల యాప్స్‌లను తొలగించడంతో కొంత ఊరట కలిగించే అంశమైనప్పటికీ ఇలాంటి రుణాలకు సంబంధించిన యాప్స్ ప్లే స్టేర్ వేలకొద్దీ ఉన్నాయని.. వాటిని కూడా నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు గూగుల్‌కు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయితే యాప్‌లను నిషేధించడం.. ప్లే స్టోర్ నుంచి తొలగించడం కొత్త కాదు. గతంలో చైనాకు సంబంధించిన యాప్‌లు భారతదేశంలో నిషేధించారు. ప్రాణాంతకంగా మారడంతో పబ్జీ గేమ్‌ను కూడా నిషేధించిన విషయం తెలిసిందే. -
వాట్సాప్‌కు కేంద్రం గట్టి హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రైవసీ పాలసీలో మార్పులను ప్రతిపాదించిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీరుపై కేంద్రం ఘాటుగా స్పందించింది. డేటా గోప్యత విధానంలో ఏకపక్షంగా మార్పులు చేయడం ఎంత మాత్రం సముచితం, ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రతిపాదిత మార్పులను ఉపసంహరించుకోవాలని సూచించింది. వాట్సా ప్ సీఈవో విల్ క్యాథ్‌కార్ట్‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ మేరకు ఘాటుగా లేఖ పంపింది. ఏకంగా 40 కోట్లు పైగా యూజర్లున్న భారత మార్కెట్ వాట్సాప్‌నకు కీలకంగా ఉంటోందన్న సంగతి ఇందులో గుర్తు చేసింది. డేటా పంచుకునే విషయంలో యూజర్ల అభిమతంతో పని లేకుండా ఏకపక్షంగా ప్రైవసీ పాలసీని మార్చేయడమన్నది. భారతీయ పౌరుల స్వయంప్రతిపత్తిపై పడే పరిణామాలపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోందని కేంద్రం వ్యాఖ్యానించింది. భారత యూజర్లను గౌరవించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. సమాచార గోప్యత, ఐచ్ఛికాలు ఎంచుకునే స్వేచ్ఛ, డేటా భద్రత తదితర అంశాల్లో వాట్సాప్ తన ధోరణిని పునఃసమీక్షించుకోవాలని, ప్రతిపాదిత మార్పులను తక్షణం వెనక్కి తీసుకోవాలని సూచించింది. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర గ్రూప్ సంస్థలతో కూడా యూజర్ల డేటాను పంచుకునే విధంగా ప్రైవసీ పాలసీని మారుస్తున్నామని, దీనికి అంగీకరించే యూజర్లు మాత్రమే తమ సర్వీసులు పొందగలరని వాట్సాప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై దుమారం రేగడం, యూజర్లు ప్రత్యామ్నాయ మెసేజింగ్ యాప్స్‌వైపు మళ్లుతుండటంతో వాట్సాప్ కాస్త వెనక్కి తగ్గి.. మార్పుల ను కొంత కాలం పాటు వాయిదా వేసింది. మీ వివరాలు కూడా ఇవ్వండి .. అసలు భారత్‌లో ఏయే సర్వీసులు అందిస్తున్నారు, ఏయే డేటా సేకరిస్తున్నారు, వేటి గురించి అంగీకారం, అనుమతులు తీసుకుంటున్నారు వంటి వివరాలన్నీ ఇవ్వాలంటూ వాట్సాప్‌నకు కేంద్రం సూచించింది. అలాగే భారత్‌లో అమలు చేస్తున్న ప్రైవసీ పాలసీ, మిగతా దేశాల్లో పాటిస్తున్న పాలసీకి మధ్య తేడాలేమైనా ఉన్నాయా అన్నది తెలియజేయాలని పేర్కొంది. యూజర్ల వివరాలను భద్రంగా ఉంచేందుకు చట్టపరంగా నిర్దేశించిన జాగ్రత్తలన్నీ వాట్సాప్ పాటించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపింది. -
ఫేస్బుక్, ట్విటర్‌కు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధానంగా ఉన్న ఫేస్బుక్, ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దుర్వినియోగంపై సమన్లు జారీ చేసి ఈనెల 21వ తేదీన తమ ముందుకు హాజరుకావాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు పంపించింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు అందించిన ఆధారాలతో పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులు ఆ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన అంశంపై మాట్లాడనున్నారు. డిజిటల్ రంగంలో పౌరుల హక్కుల రక్షణ, సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ప్రధానంగా మహిళల భద్రత విషయమై ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల సోషల్ మీడియా సంస్థలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఒక పార్టీకి.. కొందరు నాయకులకు మద్దతుగా సోషల్ మీడియా వ్యవహరిస్తోందని గుర్తించారు.దీనిపై కొన్ని నెలల కిందట పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే. రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. మొత్తంగా సోషల్ మీడియా దుర్వినియోగంపై నియంత్రణ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫేస్బుక్, ట్విటర్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సంస్థల ప్రతినిధులతో 21వ తేదీన సమావేశమై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. లేదా కొత్తగా నిబంధనలు విధించి వీటిని తప్పనిసరిగా అమలయ్యేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వాట్సాప్ వ్యక్తిగత వివరాల అప్డేట్పై రేగిన వివాదం నేపథ్యంలో ఈ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి: నిన్న ట్రంప్.. నేడు గ్రేసీ) -
ఆరోగ్య సేతులో మరో కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా సోకకుండా జాగ్రత్త పడేందుకు సాయం చేసే కోవిడ్ ట్రేసింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో వ్యాపార సంస్థల కార్యకలాపాలు సులభతరం చేసేలా ‘‘ఓపెన్ ఏపీఐ సర్వీస్’’ను తీసుకువచ్చింది. దీని ద్వారా వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు, ఈ యాప్‌ను ఉపయోగించే ఇతర యూజర్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వీలు కల్పించింది. అయితే ఇందుకు సదరు యూజర్ల అంగీకారం తప్పనిసరి అని, దీని ద్వారా ఆరోగ్య సేతు యాప్ యూజర్ల డేటా, గోప్యతకు ఎలాంటి భంగం కలగబోదని స్పష్టం చేసింది. (ఆరోగ్య సేతు: మీ అకౌంట్ డిలీట్ చేయాలా..) అదే విధంగా ఇందులో కేవలం ఆరోగ్య సేతు స్టేటస్, యూజర్ పేరు తప్ప మరే ఇతర వివరాలు ఉండవని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రాణాంతక కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 30 వేల పాజిటివ్ కేసులను ట్రేస్ చేసినట్లు సమాచారం. దీంతో కరోనా బాధితులను గుర్తించడంతో పాటు వారిని అప్రమత్తం చేసి తగిన చికిత్స అందించడం ఆరోగ్య కార్యకర్తలకు తేలికైంది. ఇక ఆరోగ్య సేతు యాప్‌నకు సుమారు 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.(ఆరోగ్య సేతు: ప్రపంచంలోనే అధిక డౌన్లోడ్లు) అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు వద్దు: కేంద్రం -
సమాచార సృష్టికర్తలు తెలిసిపోతారు!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా, ఇతర ఆన్లైన్ వేదికల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం సమాచార, సాంకేతికత నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది. ప్రభుత్వ సంస్థలు కోరినప్పుడల్లా పలానా సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు సహకరించాలని పేర్కొంది. ఈ మేరకు ఐటీ నిబంధనల్లో మార్పులు చేస్తూ సోమవారం ముసాయిదా సవరణలను ప్రకటించింది. ఈ చర్య వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ, పౌరుల జీవితాల్లోకి ప్రభుత్వం చొరబడేందుకు కారణమవుతుందని విపక్షాలు ఆరోపించాయి. ఈ సవరణలు అమల్లోకి వస్తే ప్రజలపై ప్రభుత్వం చలాయిస్తున్న పెద్దన్న అధికారాలు మరింత విస్తృతమవుతాయని, ఈ పరిస్థితి నియంత పాలనకు సమానమవుతుందని కాంగ్రెస్ పేర్కొంది. తాజా నిబంధనలు వ్యక్తిగత గోప్యత, భావ స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు జనవరి 15 వరకు గడువిచ్చారు. వ్యక్తిగత గోప్యతను కారణంగా చూపుతూ ప్రస్తుతం సోషల్ మీడియా సంస్థలు సమాచార వనరుల్ని వెల్లడించేందుకు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి సమాచారంతో జాగ్రత్త.. ‘చట్టబద్ధ అధికారం కలిగి ఉన్న సంస్థలు కోరితే సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై ఉన్న సమాచార సృష్టికర్తలు ఎవరో తెలుసుకునేందుకు సహకరించాలి. అక్రమ, విద్వేషపూరిత సమాచారాన్ని గుర్తించి తొలగించేందుకు లేదా ప్రజలకు కనిపించకుండా చేసేందుకు ఆయా సంస్థలు టెక్నాలజీ ఆధారిత వ్యవస్థల్ని ఏర్పాటుచేసుకోవాలి’ అని ముసాయిదా సవరణల్లో పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశా>లు..అమర్యాద, దైవదూషణ కలిగించే, అభ్యంతరకర సమాచారాన్ని అప్లోడ్, హోస్టింగ్, షేరింగ్ చేయొద్దని సోషల్ మీడియా సంస్థలు వినియోగదారులకు సూచించాల్సి ఉంటుంది. చట్ట వ్యతిరేక, స్వీకర్తలను తప్పుదోవ పట్టించే, జాతి భద్రతకు ముప్పుగా మారే ఎలాంటి సమాచారాన్నైనా హోస్టింగ్, షేరింగ్ చేయొద్దని అప్రమత్తం చేయాలి. కోర్టు ఆదేశించిన 24 గంటల్లోపు సాధ్యమైనంత త్వరగా అలాంటి సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలు తొలగించాలి. సైబర్ భద్రత, దేశ భద్రత రీత్యా దర్యాప్తు సంస్థలు కోరితే అలాంటి సమాచారాన్ని 72 గంటల్లోగా అందించాలి. ఈ కేసుల దర్యాప్తులో ప్రభుత్వ సంస్థలకు సహకరించేందుకు అవసరమైతే ఇంటర్నెట్ కంపెనీలు సంబంధిత రికార్డుల్ని 180 రోజులు లేదా అంత కన్నా ఎక్కువ కాలం భద్రపరచాలి. నియంత్రణ మా ఉద్దేశం కాదు.. సామాజిక మాధ్యమాల సమాచారాన్ని నియంత్రించే ఉద్దేశం తమకు లేదని, కానీ ఈ సంస్థలు తమ ప్లాట్‌ఫాంలు ఉగ్రవాదం, హింస, నేరానికి దోహదపడకుండా ఉండాలని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల సంఘ విద్రోహ శక్తులు సోషల్ మీడియాను వినియోగించుకుని కొత్త సవాళ్లు విసిరిన సంగతిని ప్రస్తావించింది. టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లతో ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు గత వారం సమావేశమై ప్రతిపాదిత సవరణలపై చర్చలు జరిపారు. సామాజిక మాధ్యమాలు వేదికగా బూటకపు వార్తలు విస్తరించడం ఇటీవల పెద్ద సమస్యగా మారడం తెల్సిందే. వాట్సప్‌లో వ్యాపించిన పుకార్ల వల్ల దేశవ్యాప్తంగా మూకహింస చెలరేగింది. దీంతో సోషల్ మీడియా సంస్థల్ని చట్ట పరిధిలో జవాబుదారీని చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిషేధించినా నెట్టింట..
సాక్షి, హైదరాబాద్: ‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు’అన్నారు పెద్దలు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అశ్లీల(పోర్న్), సినిమా పైరసీ సైట్ల నిర్వాహకులు ప్రస్తుతం ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో జరుగుతున్న పలు అత్యాచారాలకు కారణంగా నిలుస్తోన్న ఈ వెబ్సైట్లను నిషేధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (డీవోటీ)కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయినా తిమ్మిని బమ్మి చేసే ఆయా సైట్ల నిర్వాహకులు సైట్ల పేరులోని స్పెల్లింగ్‌లో కొద్దిపాటి మార్పు చేసి వీటిని చలామణిలోకి తీసుకొచ్చారు. తిరిగి ఎప్పట్లాగే ఇవి అందరికీ అందుబాటులోకి రావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎందుకు నిషేధించారు.. ఉత్తరాఖండ్ హైకోర్టులో ఇటీవల ఓ రేప్ కేసు విచారణకు వచ్చింది. స్కూలు విద్యార్థినిపై తోటి బాలుడు అత్యాచారానికి పాల్పడిన కేసు అది. తాను ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు పోర్న్ సైట్లు చూశానని ఆ బాలుడు కోర్టుకు చెప్పాడు. దీనిపై స్పందించిన కోర్టు అత్యాచారాలకు కారణమవుతోన్న ఇలాంటి అశ్లీల వెబ్సైట్లను వెంటనే నిషేధించాలని సెప్టెంబర్ 27న కేంద్రానికి ఆదేశాలిచ్చింది. నవంబర్ 15లోగా ఈ పనిని పూర్తి చేయాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు మంత్రిత్వ శాఖకు అక్టోబర్ 8న అందాయి. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (డీవోటీ)కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా దేశంలో 827 పోర్న్ వెబ్సైట్లను గుర్తించి బ్లాక్ చేశారు. అంతేకాకుండా ఈ జాబితాలోని సైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రన్ చేయవద్దని ఇంటర్నెట్ సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది. వీటితోపాటు టెలికామ్ సంస్థలు కూడా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. నియంత్రణ కష్టమే.. ‘మాకు ఆదేశాలు వచ్చిన వెంటనే మేం నిషేధాన్ని అమల్లో పెట్టాం. జాబితాలోని 827 అశ్లీల సైట్లను నిషేధించాం. కానీ, వారు తెలివైనవారు. ప్రపంచంలో ఏదో మూల నుంచి ఆపరేట్ చేస్తారు. తమ వెబ్‌సైట్‌కు వీక్షకులు తగ్గిన విషయం వీరికి తెలిసిన వెంటనే, ఐపీ అడ్రస్, వెబ్సైట్ చిరునామాలో స్వల్ప మార్పులు చేసి నెట్లో సులువుగా దొరికేలా చేస్తారు’అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ప్రైవేటు టెలికామ్ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. మనమే ఎందుకు లక్ష్యం..! భారత్‌లో జనాభా అధికం. ప్రపంచంలో రెండో స్థానం. జనాభాలో యువత దాదాపు 40 శాతం పైమాటే. దీనికితోడు భారత్‌లో పెరిగిపోతున్న ఇంటర్నెట్ యూజర్లు, మొబైల్ వినియోగదారులను ఈ వెబ్సైట్లు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఏడాది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (డీవోటీ) ఇచ్చిన నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రస్తుతం 46.36 కోట్లకుపైగా బ్రాడ్‌బాండ్ వినియోగదారులు ఉన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే.. 0.74 శాతం అధికం. ఇక జూన్ 2018 నాటికి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 50 కోట్ల మంది వరకు ఉన్నారు. ఓ సంస్థ అందించిన రిపోర్టు ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పోర్న్ వీడియోలు చూసే దేశంలో 2015లో ఇండియా 4వ స్థానంలో ఉండగా, 2016లో 3వ స్థానానికి ఎగబాకింది. తొలి రెండు స్థానాల్లో బ్రెజిల్, ఫిలిప్పీన్స్ ఉన్నాయి. పేరు మార్చి మళ్లీ ప్రత్యక్షం.. పోర్న్ వెబ్సైట్లపై నిషేధం విధిస్తారని ఆయా వెబ్సైట్ల నిర్వాహకులకు ముందే తెలుసు. అలాగే 2 వారాలుగా ఆన్లైన్లో వీటిని శోధించినా ఎవరికీ దొరకలేదు. దీంతో వీక్షకులు తగ్గిపోయిన విషయాన్ని ఆయా సైట్ నిర్వాహకులు గుర్తించారు. అందుకే వాటి ఐపీ అడ్రెస్లు, యూఆర్ఎల్ లింకులు, వెబ్సైట్ చిరునామా( డొమైన్ నేమ్) స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులు చేసి తిరిగి రన్ చేస్తున్నారు. ఆ పాత సైట్లన్నీ స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులతో తిరిగి నెట్లో హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో అయితే దాదాపు 1,350 పోర్న్‌తోపాటు పైరసీ సినిమా వెబ్సైట్లను పోలీసులు గుర్తించి వాటిని నిషేధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వారు పేర్లు మార్చుకుని తిరిగి వస్తుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. -
‘ఫేక్’ల మూలం కనుక్కోవాల్సిందేనంటున్న కేంద్రం...!
నకిలీ వార్తలు, వదంతులు అరికట్టేందుకు తీసుకునే చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం, వాట్సాప్‌ల మధ్య వేడి మరింత పెరుగుతోంది.ఫేక్‌న్యూస్‌లు, వీడియోలు, మెసేజ్‌లకు మూలం ఎక్కడో, వాటిని ఎవరు పంపిస్తున్నారో ట్రాక్ చేసే విధానాన్ని రూపొందించాలంటూ ఆ సంస్థపై కేంద్రం ఒత్తిడిని పెంచుతోంది. ఇప్పటికే ఆ సంస్థకు రెండు నోటీసులు పంపాక కూడా స్పష్టమైన హామీ రాకపోవడంతో త్వరలోనే మూడో నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వాట్సాప్ మాధ్యమం ద్వారా వదంతులు, నకిలీ వార్తల ప్రచారం పెరిగిపోయి . చిన్న పిల్లలను ఎత్తుకెళుతున్నారని, ఇతర ’ఫేక్‌వార్తలు’ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మూకదాడులకు దారితీశాయి. ఏడాది కాలంలోనే 30 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మెసేజ్‌ల ఎక్కడి నుంచి వస్తున్నాయో మూలం కనిపెట్టే విధానాన్ని అమల్లోకి తేవాలంటూ ఈ సంస్థకు ఇటీవల కేంద్ర ఐటీశాఖ హెచ్చరికలు కూడా చేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విషయంలో రాజీపడకుండానే ఈ సమస్యకు సాంకేతికపరమైన పరిష్కారాన్ని కనుక్కోవచ్చునని ఈ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వాట్సాప్ మాత్రం ఇవి యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగమని వాదిస్తోంది. ఒకేసారి లెక్కకు మించి ఫార్వర్డ్ చేసే మెసేజ్‌లకు సంబంధించి అది ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాక్ చేయవచ్చునంటున్నారు. ఏదైనా అంశంపై ప్రజలను రెచ్చగొట్టేవిధంగా లేదా చర్చనీయాంశమై వైరల్‌గా మారిన మెసేజ్ ఒరిజనల్‌గా ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించడం ద్వారా దీని మూలాన్ని కనుక్కోవచ్చునని అంటున్నారు. ఏదైనా ఓ మెసేజ్ వందసార్లకు పైగా ఫార్వర్డ్ అయ్యి, శాంతి,భద్రతల సమస్య తలెత్తేందుకు కారణమైందో అలాంటిది ఒరిజనల్‌గా ఎక్కడి నుంచి వచ్చిందో వాట్సాప్ బాధ్యులు కనిపెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు మనదేశంలో వాట్సాప్‌ను అత్యధికసంఖ్యలో ఉపయోగిస్తుండడంతో ఈ మాధ్యమం ద్వారా నకిలీ వార్తలు, వదంతులను అరికట్టడం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలీసు వ్యవస్థలకు సవాల్‌గా మారింది. ఈ విషయంలో జవాబుదారీతనం పెరగాలని, నకిలీవార్తల ప్రచారం ద్వారా జరిగే అరాచకాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలంటూ వాట్సాప్ సంస్ధను దారికి తెచ్చేందుకు కేంద్రం వివిధ పద్ధతులను అవలంబిస్తోంది. అయితే ప్రభుత్వ వత్తిళ్ల నేపథ్యంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో మెసేజ్‌లు, ఇమేజీలు, వీడియోలు షేర్ చేయకుండా ఐదుగురికి మాత్రమే వాటిని పంపేలా ’వాట్సాప్’ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్‌గా కొనసాగుతున్న వాట్సాప్ ద్వారా యూజర్ల భద్రతా, గోప్యతను కాపాడేందుకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. ఒరిజనల్ మెసేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ట్రాక్ చేసే పద్ధతులు కనుక్కోవాలనే భారత ప్రభుత్వ డిమాండ్‌కు మాత్రం ఆ సంస్థ తలొగ్గడం లేదు. ఇది ఎండ్ లు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌పై ప్రభావం చూపడంతో పాటు వినియోగదార్ల గోప్యతను దెబ్బతీసినట్టు అవుతుందని గట్టిగా వాదిస్తోంది. అయితే ఇతర డిమాండ్లకు తలొగ్గి తనవైపు నుంచి చర్యలు చేపట్టింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తున్నది భారత వాట్సాప్ యూజర్లే కావడంతో ఒకేసారి ఐదుగురికే వీటిని ఫార్వర్డ్ చేసేలా నియంత్రణ చర్యలు చేపట్టింది. దీంతో పాటు తమ యాప్‌లో మీడియా మెసేజ్స్కు పక్కనే ఉన్న క్విక్ ఫార్వర్డ్ బటన్ తొలగించినట్టు తెలిపింది.. వాట్సాప్ యూజర్లు సొంతంగా పంపించే (ఒరిజనల్) మెసేజ్ ఏదో, ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఏదో గుర్తించే ఫార్వర్డ్ లేబుల్‌ను కూడా ఈ సంస్థ ఇప్పటికే మొదలుపెట్టింది. -
కేంబ్రిడ్జ్ అనలిటికాకు ప్రభుత్వం నోటీసులు
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన కేంబ్రిడ్జ్ అనలిటికాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఫేస్బుక్ డేటాబేస్‌ను కొల్లగొట్టి ఏఏ సంస్థలు భారతీయుల డేటాను వాడుకున్నాయో తెలుపాలంటూ ఆదేశించింది. మొత్తం ఆరు ప్రశ్నలను సంధిస్తూ.. మార్చి 31 వరకు వీటిపై స్పందించాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఈ నోటీసులు జారీచేసింది. ఒకవేళ వీటిపై స్పందించపోతే, కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పైన పేర్కొన్న దొంగతనానికి పాల్పడి భారతీయుల డేటాను ఏమైనా అసైన్‌మెంట్‌కు వాడారా? పైన పేర్కొన్న దానిలో ఎవరెవరున్నారు? అసలు డేటాను వారు ఎలా పొందారు? వ్యక్తుల అనుమతి తీసుకున్నారా? అలా సేకరించిన డేటాను ఎలా వాడారు? అటువంటి డేటా ఆధారంగా ఏదైనా ప్రొఫైలింగ్ చేయబడిందా? వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్బుక్లో పోస్టు చేయొద్దని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అతేకాక మీ లొకేషన్‌ను కూడా వెల్లడించవద్దని సీఈఆర్టీ అడ్వయిజరీ జారీచేసింది. ఈ సూచనలు...ఫేస్బుక్ అనేది పబ్లిక్ నెట్‌వర్క్‌లో భాగం. తేలికగా ఈ సమాచారాన్ని యాక్సస్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, అన్ని సోషల్ మీడియా యూజర్లు తమ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఈ సైట్లలో లేదా యాప్స్‌లో షేర్ చేసుకోకూడదు. అధికారిక డేటాను లేదా వ్యక్తిగత సీక్రెట్లను పంచుకోకూడదు. ఓటు ప్రిఫరెన్స్‌లను, పిన్, పాస్‌వర్డ్‌లను, క్రెడిట్ కార్డు వివరాలను, బ్యాంకింగ్ వివరాలను, పాస్‌పోర్టు వివరాలను, ఆధార్ కార్డు వివరాలను ఈ సైట్లలో పొందపరచుకూడదు. అనధికారిక వర్గాల నుంచి వచ్చిన మెసేజ్‌లను, ఇమేజ్‌లను ఓపెన్ చేయకూడదు. థర్డ్ పార్టీ యాప్స్‌కు సమాచారం ఇచ్చే ముందుకు జాగ్రత్త వహించాలి. ఎంతో పకడ్భందీతో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దానిలో సింబల్స్, క్యాపిటల్ లెటర్లు, లోయర్-కేసు లెటర్లు ఉండాలి.