భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం | India Uses Laser Weapons To Shoot Down Aircraft & Missiles | Sakshi
Sakshi News home page

భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం

Published Sun, Apr 13 2025 7:44 PM | Last Updated on Mon, Apr 14 2025 2:49 PM

India Uses Laser Weapons To Shoot Down Aircraft & Missiles
  • అధునాతన టెక్నాలజీలో భారత్ మరో ముందడుగు
  • అత్యంత ప్రమాదకరమైన ఆయుధం తయారీ
  • 30 కిలోవాట్ల సామర్థ్యం కల్గిన లేజర్ బీమ్ రూపకల్పన
  • ఎయిర్ క్రాఫ్ట్స్, మిస్సెల్స్ ను క్షణాల్లో ఛేదించే సామర్థ్యం
  • యూఎస్, రష్యా, చైనాల సరసన భారత్‌

న్యూఢిల్లీ: భారత్ అమ్ములపొదిలో హై పవర్ లేజర్ ఆయుధం వచ్చి చేరింది. అధునాతన అధిక శక్తి కల్గిన 30 కిలోవాట్ల లేజర్ బీమ్ ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది.  ఫలితంగా లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్( (DEW) సిస్టమ్ ద్వారా అధునాతన పవర్‌ ఫుల్‌ వెపన్‌ ను తయారు చేసిన దేశాల జాబితాలో భారత్‌ చేరిపోయింది. ఇప్పటివరకూ ముందు వరుసలో అమెరికా, రష్యా, చైనాలు ఉండగా, ఇప్పుడు వాటి సరసన భారత్‌  చేరింది.

ఆదివారం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (NOAR)లో ఈ విజయవంతమైన ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో ఫిక్స్ డ్ వింగ్ డ్రోన్ లు, స్వార్మ్ డ్రోన్ లపై  అధునాతన లేజర్ బీమ్‌ను ప్రయోగించారు. 

ఇది భారత్‌ సాధించిన మరో విజయం
దీన్ని సక్సెస్‌ ఫుల్‌ గా లేజర్‌ బీమ్‌ కూల్చివేయడంతో డీఆర్‌డీవో సంబరాలు చేసుకుంది.  టెక్నాలజీలో ఇది భారత్‌ సాధించిన మరో విజయంగా పేర్కొంది. భారత్ ట్రయల్ రన్ నిర్వహించిన ఈ లేజర్ బీమ్ కు ఎయిర్ క్రాఫ్ట్ లను, మిస్సెల్స్ ను క్షణాల్లో కూల్చివేసి సామర్థ్యం ఉంది. డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ ఆధ్వర్యంలోని ఈ ప్రయోగం చేపట్టారు.  ఇది విజయవంతమైన తర్వాత టీమ్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. 

దీనిలో భాగంగా ఆయన జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఇది గగనతలం రక్షణ దళాన్ని మరింత పటిష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయం కావడంతో అధునాతన టెక్నాలజీ కల్గిన అరుదైన దేశాల జాబితాలో చేరినట్లు ఆయన వెల్లడించారు.   ఇటీవల చైనా కూడా ఇదే తరహా టెక్నాలజీతో  ఓ పవర్ ఫుల్ బీమ్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే.

మనముందు ఇంకా చాలా లక్ష్యాలే ఉన్నాయి..
కామత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ శక్తి సామర్థ్యాలను కల్గి ఉండగా, ఇప్పుడు మనం కూడా వాటి సరసన చేరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ కూడా ఇదే తరహా టెక్నాలజీతో వెపన్స్ తయారు చేసే పనిలో ఉందన్నారు.

మనం ఇంకా చాలా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. వాటిని సాధించే పనిలోనే ఉన్నాం. హై ఎనర్జీ సిస్టమ్ తో  అత్యధిక పవర్ కల్గిన మైక్రోవేవ్స్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నటిక్  ఆయుధాలను తయారు చేయడానికి సమాయత్తమైనట్లు ఆయన వెల్లడించారు. మనకున్న  పలు రకాలైన సాంకేతిక విజ్ఞానంతో స్టార్ వార్స్ శక్తిసామర్థ్యాలను కల్గిన ఆయుధాలను తీసుకురావచ్చన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా స్టార్ వార్స్ సామర్థ్యం కల్గిన వెపనే అంటూ ఆయన పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement