weapon
-
మాటే మహాత్మ్యం
మాటకున్న మహత్తు ఇంతా అంతా కాదు. బయటి నుంచి తెచ్చుకోవాల్సిన పని లేని ఆయుధం. ప్రతి మనిషికి సహజంగా ఇవ్వబడినది. ఎవరికి వారికి తగిన రీతిలో ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వబడింది. మనిషి తనంత తానుగా చేయ వలసినది దానిని పదును పెట్టి, పాడవకుండా, తుప్పు పట్టకుండా చూసుకోవటం. దానికి ముందుగా అందరూ అప్రయత్నంగా చేసేది పెద్దలని చూసి అనుకరించటం. తరువాత శిక్షణ తీసుకోవటం. ఈ శిక్షణ పాఠశాలలలో కాని, విడిగా శిక్షణాతరగతులలో కాని జరుగుతుంది. ఇతర జీవులకి వేటికి లేని ప్రత్యేకత మానవుడికి మాత్రమే ఇవ్వ బడింది. అదే మనస్సు. దాని లక్షణం ఆలోచించటం. ఆపై తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవటం. దానికి సాధనం భాష. మానవులకి మాత్రమే ఇవ్వ బడిన భాష అనే విలువైన సాధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా! అపార్థాలు కలగకుండా, అనర్థాలు వాటిల్లకుండా, సమర్థవంతంగా తన భావనలని వ్యక్తం చేయటానికి, దానికి సాధనమైన మాటని జాగ్రత్తగా ఉపయోగించాలి. మాటతో మనుషులు, కుటుంబాలు, సంస్థలు, దేశాలు కలుస్తాయి, విడిపోతాయి కూడా. మాట ప్రాణం పోస్తుంది, మాట ప్రాణం తీస్తుంది. వీటి అన్నిటికీ చరిత్రలో ఉదాహరణలు కోకొల్లలు. రామకథలో ప్రతి మలుపుకి ఒక మాట కారణమయింది. స్వతంత్ర భారత దేశం ముక్కలు కావటానికి ఒక మాట కారణం అంటారు ఆనాటి రాజనీతివేత్తలు. కుటుంబ కలహాలకి చెప్పుడు మాటలే కారణం అని విన్నవాళ్ళకి కూడా తెలుసు. కాని, ఆ క్షణాన ఆ మాటలు ఇంపుగా అనిపిస్తాయి. దీనినే కైటభుడుగా పురాణాలు సంకేతించి చెప్పాయి. వినగా వినగా నిజమే నేమో అనిపిస్తుంది, క్రమంగా నిజమే అనిపిస్తుంది. చిన్నప్పుడు విన్న బ్రాహ్మణుడు – నల్లమేకకథ గుర్తు ఉంది కదా! (ప్రస్తుతం మన ప్రచార, ప్రసార సాధనాలు ఈ సిద్ధాంతాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి.) ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఒక కుక్కని చంపాలి అంటే ముందు అది పిచ్చిది అని ప్రచారం చేయాలి అని. మాటకి ఉన్న శక్తి అర్థమయింది కదా! ఉచ్చారణ, వ్యాకరణం, వాక్యనిర్మాణం, కాకువు, ముఖకవళికలు, ముఖ్యంగా కళ్ళు, కనుబొమల కదలికలు, శరీర భంగిమ, కాళ్ళు చేతుల కదలికలు మొదలైనవి అన్నీ మాటలతో పాటు భావ ప్రకటనకి సహకరిస్తాయి. ఉచ్చారణ స్పష్టంగా లేక పోతే ‘కళ్ళు’ తెరవటం ‘కల్లు’ తెరవటం అవుతుంది. ‘శకలం’ (ముక్క) ‘సకలం’ (సమస్తం) అవుతుంది. ‘శంకరుడు’కాస్తా ‘సంకరుడు’ అయిపోతాడు. తేడా తెలుస్తోంది కదా! వ్యాకరణం తెలియక ఎంతో సదుద్దేశంతో ‘‘సుపుత్రాప్రాప్తిరస్తు’’ అని దీవిస్తూ ఉంటారు. అంటే సుపుత్ర అప్రాప్తి అవుతుంది. ‘‘సుపుత్ర ప్రాప్తిరస్తు’’ అనాలి. అందరికీ వాక్సిద్ది లేకపోవటం అదృష్టం.జాగ్రత్తగా ఉచ్ఛరించిన మాటలకి సరైన కంఠస్వరం తోడు ఉంటే వినాలని అనిపిస్తుంది. చెవితో వింటే కదా! ఆచరించాలని అనిపించేది. ఎన్నో సందర్భాలలో ఆర్థికంగా గాని, శారీరికంగా గాని సహాయం చేయలేక పోయినా మాటసహాయం చేసి సమస్యలని పరిష్కరించటం చూస్తాం. ఇంత శక్తిమంతమైన ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరికి వారు ఉద్ధరించ బడుతూ పదిమందికి సహాయం చేయవచ్చు. శక్తిమంతమైన మాటని చక్కగా ఉపయోగించుకోటానికి కొన్ని లక్షణాలని పెంపొందించుకోవాలి. అవి – సత్యం, హితం, మితం, ప్రియం, స్మితం, మధురం, ప్రథమం. ఏ ఒక్క లక్షణం ఉన్నా గొప్పే. అన్నీ ఉండటం సామాన్య మానవుల విషయంలో చాలా కష్టం. హితమైనది ప్రియంగా ఉండదు. సత్యం మధురంగా ఉండక పోవచ్చు. నిజం నిష్ఠురంగా ఉంటుంది కదా! ‘‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్య మప్రియం, ప్రియం చ నానృతంబ్రూయాత్, ఏష ధర్మ స్సనాతనః’’. ఈ ఆరు లక్షణాలతో ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి అంటే సహజ స్వభావానికి మెఱుగు పెట్టే శిక్షణ అవసరం. – డా.ఎన్.అనంతలక్ష్మి -
చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే..
బీజింగ్: చైనా.. గత కొన్నేళ్లుగా అధునాతన టెక్నాలజీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించింది. తాజాగా డెత్ స్టార్ ఆఫ్ ది స్టార్ వార్స్ సినిమా స్ఫూర్తితో తాము అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని రూపొందించామని చైనా శాస్త్రవేత్తలు బాంబులాంటి వార్తను ప్రపంచంముందు ఉంచారు. చైనా దీనికి ‘బీమ్ వెపన్’ అనే పేరు పెట్టింది. స్టార్ వార్స్ సినిమా చూడని వారికి ‘బీమ్ వెపన్’ ఎటువంటిదో అర్థం కాదు. అందుకే ఆ వివరాలు మీకోసం..స్టార్ వార్స్ చిత్రంలో ఎనిమిది వేర్వేరు లేజర్ కిరణాల కలయికతో ఒక తీవ్రమైన కాంతిపుంజం ఏర్పడుతుంది. ఈ కాంతిపుంజాన్ని శత్రువుపై దాడి చేసేందుకు వినియోగిస్తారు. ఈ అత్యంత శక్తివంతమైన కాంతిపుంజం ఒక గ్రహాన్నే నాశనం చేయగలదు. ఇదొక లేజర్ వెపన్. సరిగ్గా ఇలాంటి పవర్ఫుల్ ఆయుధాన్నే చైనా తయారుచేసింది.బీమ్ వెపన్ అనేది లేజర్‌తో కూడిన అధునాతన సాంకేతిక ఆయుధం. ఇది విడుదల చేసే శక్తివంతమైన కాంతి పుంజం లక్ష్యాన్ని అత్యంత వేగంగా ధ్వంసం చేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ వ్యవస్థలను క్షణాల్లో నిర్వీర్యం చేస్తుంది. బీమ్ వెపన్ రూపకల్పన సులభమేమీ కాదు. లేజర్ కిరణాలను నియంత్రిస్తూ, వాటిని శత్రువు వైపు ఎక్కుపెట్టడం అంత తేలికైన ప్రక్రియ కాదని శాస్త్రవేత్తలు తెలిపారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం మైక్రోవేవ్ బీమ్ ఆయుధాన్ని వినియోగంచేందుకు ఏడు వాహనాలు అవసరమవుతాయి. బీమ్ ఆయుధం భారీ పరిమాణంలో ఉంటూ, అధిక స్థలాన్ని ఆక్రమించినప్పటికీ లక్ష్యాన్ని ఛేదించడంలో అత్యున్నత సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఇప్పటివరకూ ఈ స్థాయిలో లక్ష్యాన్ని ఛేదించగల ఆయుధం అందుబాటులో లేదని చైనా మోడరన్ నావిగేషన్ జర్నల్ పేర్కొంది. బీమ్ వెపన్ అధిక ఖచ్చితత్వాన్ని సాధించేందుకు, దానికి మైక్రోవేవ్ ట్రాన్స్‌మిటింగ్ వాహనాలను కనెక్ట్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్‌ను ఉపయోగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.బీమ్ తరహా ఆయుధాల అభివృద్ధిలో అనేక సాంకేతిక, ఆచరణాత్మక సవాళ్లు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే అధిక శక్తి వనరులు అవసరమన్నారు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ చైనా ఈ తరహా ఆయుధాల తయారీలో పురోగతి సాధిస్తోంది. భవిష్యత్తులో బీమ్ ఆయుధాలను విస్తృతంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ యుద్ధాల సమయంలో ఈ తరహా సాంకేతికత కీలకంగా మారనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది? -
Russia-Ukraine war: నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్
తమ భూభాగాన్ని దురాక్రమించిన రష్యా సైన్యంతో నెలల తరబడి అలుపెరగక పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాల చేతికి కొత్త అస్త్రమొచ్చింది. రష్యా స్థావరాలపై భారీ స్థాయిలో మంటలు చిమ్ముతూ, పొగ వెదజల్లే కొత్త తరహా డ్రోన్‌ను ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి దింపింది. అటవీప్రాంతాల్లో నక్కిన రష్యా సైనికులు, వారి యుద్ధట్యాంకులపైకి బుల్లి డ్రోన్లు ఏకధాటిగా నిప్పులు వెదజల్లుతున్న వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ ‘ఎక్స్’లో విడుదలచేయడంతో ఈ డ్రోన్ల సంగతి అందరికీ తెల్సింది. రణరీతులను మార్చేస్తున్న అధునాతన డ్రాగన్ డ్రోన్ గురించి అంతటా చర్చమొదలైంది. ఏమిటీ డ్రాగన్ డ్రోన్? చైనాలో జానపథ గాథల్లో డ్రాగన్ పేరు ప్రఖ్యాతిగాంచింది. నిప్పులు కక్కుతూ ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రాగన్ గురించి అందరికీ తెలుసు. అచ్చం అలాగే నిప్పులను వెదజల్లుతూ ఆకాశంలో దూసుపోతుంది కాబట్టే ఈ డ్రోన్‌కు డ్రాగన్ అని పేరు పెట్టారు. సంప్రదాయక డ్రోన్లకు భిన్నంగా పనిచేస్తున్న ఈ డ్రోన్లతో రష్యా బలగాలకు నష్టం పెద్దగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి? థర్మైట్ ఈ డ్రోన్‌లో ఉన్న ఏకైక ఆయుధం. అత్యధికంగా మండే స్వభావమున్న ఖనిజాన్ని, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్ పొడి, ఇంకొంచెం ఇనుప రజను మిశ్రమాన్ని మందుగుండుగా వాడతారు. అయితే మిగతా డ్రోన్లలాగా ఇది పేలే బాంబును లక్ష్యంగాపైకి జాడవిడచదు. తనలోని మిశ్రమాన్ని మండించి తద్వారా విడుదలయ్యే మంటను కొంచెం కొంచెంగా అలా దారి పొడవునా వెదజల్లుకుంటూ పోతుంది. ఊపిరి ఆడకుండా దట్టమైన పొగను సైతం వెదజల్లుతుంది. ద్రవరూపంలోకి వారిన ఖనిజం మండుతూ ఏకంగా 4,000 డిగ్రీ ఫారన్‌హీట్ వేడిని పుట్టిస్తుంది. ఇంతటి వేడి శత్రు స్థావరాలను కాల్చేస్తుంది. ఈ ద్రవఖనిజం మీద పడితే మిలటరీ గ్రేడ్ ఆయుధాలు ఏవైనా కరిగిపోతాయి. సముద్రతీర ప్రాంతాల్లో నీటి అడుగున నక్కిన శత్రువుల ఆయుధాలను ఇది కాల్చేస్తుంది. ఎందుకంటే ఇది నీటిలో కూడా మండగలదు. ఇది మీద పడితే సైనికుల శరీరం, ఎముకలు కాలిపోతాయి. మరణం దాదాపు తథ్యం. ఒకవేళ తృటిలో తప్పించుకున్నా మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు థర్మైట్ ఆయుధంతోపాటు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపైకి దూసుకెళ్లడం ఈ డ్రాగన్ డ్రోన్ ప్రత్యేకత. సంప్రదాయక రక్షణ ఉత్పత్తులతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైందని బ్రిటన్‌లోని యుద్ధవ్యతిరేక దౌత్య సంస్థ ‘యాక్షన్ ఆన్ ఆర్మ్డ్ వయలెన్స్’ పేర్కొంది. దాడి చేయడంతో పాటు నిఘా పనులూ ఇవి ఒకే సమయంలో పూర్తిచేయగలవు. ఎందుకంటే వీటికి స్పష్టమైన కెమెరాలను బిగించారు. యుద్ధట్యాంక్, సైనికుడు, మరేదైనా స్థావరం.. ఇలా శత్రువుకు సంబంధించిన దేనిపై దాడి చేస్తుందో కెమెరాలో ఉక్రెయిన్ బలగాలు స్పష్టంగా చూడొచ్చు.అంకుర సంస్థ చేతిలో.. ఈ డ్రాగన్ డ్రోన్‌ను ఉక్రెయిన్‌లోని స్టార్టప్ సంస్థ ‘స్టీల్ హార్నెట్స్’ తయారుచేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ తయారుచేసిన శక్తివంతమైన థరై్మట్ సాయంతో 4 మిల్లీమీటర్ల మందమైన లోహ ఉపరితలానికి సైతం కేవలం 10 సెకన్లలో రంధ్రం పడుతుందని తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఉక్రెయిన్‌కు అన్ని రకాల ఆయుధాలు అందిస్తూ అమెరికా ఆదుకుంటోంది. అమెరికా తన అమ్ములపొదిలోని థర్మైట్ గ్రనేడ్లను ఉక్రెయిన్‌కు ఇస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అమెరికా ఇస్తేగనక రష్యా సైతం ఇలాంటి ఆయుధాలనే ప్రయోగించడం ఖాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్
'బాహుబలి' కట్టప్పగా మనందరికీ సుపరిచితమైన సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వెపన్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి థియేటర్లలో రిలీజ్ అనుకున్నారు. ఎందుకో వెనక్కి తగ్గారు. తాజాగా తమిళ వెర్షన్‌ని ఆహా ఓటీటీలోకి తీసుకురాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ని మరో ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)సత్యరాజ్, ఆనంద్ రవి లీడ్ రోల్స్ చేసిన 'వెపన్' చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. అయితే థియేటర్లలో స్కిప్ చేసిన తెలుగు వెర్షన్‌ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. యాక్షన్ మూవీ లవర్స్ దీన్ని ట్రై చేయొచ్చు.'వెపన్' విషయానికొస్తే.. అగ్ని (వసంత్ రవి) ఓ యూట్యూబర్. ప్రకృతి రక్షించేందుకు పాటుపడుతుంటాడు. తేని జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓ సంస్థ దగ్గర బాంబు పేలుడు జరుగుతుంది. ఈ ప్రాంతంలో అగ్నిని పోలీసులు పట్టుకుంటారు. టెర్రిరిస్ట్ అనుమానంతో అరెస్ట్ చేస్తారు. అయితే తాను ప్రపంచానికి తెలియని సూపర్ హీరో మిత్రన్ (సత్యరాజ్) గురించి వెతుకుతున్నానని, ఈ బ్లాస్టులతో సంబంధం లేదని అంటారు. ఇంతకీ మిత్రన్ ఎవరు? అతడికి అగ్నికి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్) -
ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అరుణాచల్ ప్రదేశ్: విజయదశమి పర్వదినం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చానని, అప్పుడు జవానులతో కలిసి విజయదశమి జరుపుకోవాలని అనుకున్నానని, దేశ భద్రతకు బాధ్యత వహిస్తున్న సైనికులను చూసి గర్వపడుతున్నానని అన్నారు. తవాంగ్ చేరుకునే మందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్‌పూర్ సందర్శించారు. అక్కడి నాలుగు కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్‌సైనికులతో సంభాషించారు. ఇక్కడ అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేయడాన్ని రాజ్‌నాథ్ ప్రశంసించారు. వివిధ రాష్ట్రాలు, మతాలు, నేపథ్యాల నుండి వచ్చిన సైనికులు ఒకే బ్యారక్స్, యూనిట్లలో కలిసి పని చేయడం భారత సైన్యానికున్న ఐక్యతను తెలియజేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి? विजयादशमी के पावन अवसर पर तवाँग में ‘शस्त्र पूजा’। https://t.co/JIYcBbd1no — Rajnath Singh (@rajnathsingh) October 24, 2023 -
భారత్‌కు శివాజీ ఆయుధం
ముంబై–లండన్: ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని లండన్ మ్యూజియంలో ఉన్న ఆయన ఆయుధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకురానుంది. 17వ శతాబ్దంలో శివాజీ వాడిన పులిగోళ్లు ఆకారంలో ఉండే ఆయుధాన్ని వెనక్కి తీసుకురావడానికి లండన్‌లోని విక్టోరియా అల్బర్ట్ మ్యూజియం, మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఇనుముతో తయారు చేసిన అత్యంత పదునైన వాఘ్ నఖ్ (పులి గోళ్లు) ఆయుధాన్ని శివాజీ ఎక్కువగా వాడేవారు. ఆ ఆయుధాన్ని చేత్తో పట్టుకొని మహారాజా శివాజీ కదనరంగంలో స్వైరవిహారం చేస్తూ ఉంటే శత్రువులు గడగ డలాడిపోయేవారు. బీజాపూర్ సేనా నాయ కుడు అఫ్జల్ ఖాన్‌ను శివాజీ ఈ పులిగోళ్ల ఆయుధంతో చంపాడని చరిత్ర చెబుతోంది. తెల్లదొరల పాలనా కాలంలో 1818లో ఈస్ట్ ఇండియాకు చెందిన అధికారి జేమ్స్ గ్రాండ్ డఫ్ పులి గోళ్ల ఆయుధాల సెట్‌ను విక్టోరియా అల్బర్ట్ మ్యూజియానికి ఇచ్చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత శివాజీ వాడిన ఆయుధం మన దేశానికి రానుంది. ఛత్రపతి శివాజీ పట్టాభి షిక్తుడై అక్టోబర్ 3నాటికి 350 ఏళ్లు పూర్తి కానున్నాయి. అదే రోజు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు. -
పుతిన్‌తో త్వరలో కిమ్ జోంగ్ ఉన్ భేటీ!
సియోల్: ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధినేత పుతిన్‌తో సమావేశం కాబోతున్నారా? ఇందుకోసం త్వరలోనే రష్యాకు బయలుదేరి వెళ్తారా? నిజమేనని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమెరికాకు బద్ధ వ్యతిరేకి అయిన కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలి కాలంలో పుతిన్‌కు స్నేహ హస్తం అందిస్తున్నారు. ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని రష్యా నిర్ణయించినట్లు సమాచారం. పుతిన్, కిమ్ సమావేశంలో ఇదే అంశంపై చర్చించే అవకాశం ఉంది. రష్యాకు అందించే సహాయానికి బదులుగా ఆహారం, అత్యాధునిక ఆయుధ టెక్నాలజీని తమకు అందజేయాలని పుతిన్ నుంచి కిమ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు చివరిసారిగా 2019 ఏప్రిల్‌లో కలుసుకున్నారు. -
బైక్ ర్యాలీలో స్టార్ హీరోయిన్.. అదే కారణమా?
మిలియన్ స్టూడియో పతాకంపై ఎంఎస్ మన్సూర్ నిర్మించిన చిత్రం 'వెపన్'. సత్యరాజ్, వసంత రవి, తాన్య హోప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గుహన్ చెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. యాక్షన్ కిల్లర్ నేపథ్యంలో కొత్త టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) కాగా చిత్ర నిర్మాత ఆదివారం ఉదయం ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులకు అవగాహన కలిగించే విధంగా వేర్ హెల్మెట్ పేరుతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసంత రవి, తాన్య హోప్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత మన్సూర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. టూ వీలర్స్ హెల్మెట్లు ధరించాల్సిన ఆవశ్యకత, సురక్షితంగా వాహనాలను నడపడం గురించి అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు స్థానిక ఓఎంఆర్ రోడ్లో ప్రారంభమై తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతం వరకు సాగింది. (ఇదీ చదవండి: కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?) -
ఆయుధాల మరమ్మతుల్లో జాగ్రత్తలు పాటించాలి
వెంగళరావునగర్: ఆయుధాలు మరమ్మతులకు వచ్చిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ తెలియజేశారు. యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో బుధవారం ఆర్మరర్ బేసిక్ కోర్స్ రెండో బ్యాచ్ ప్రారంభ కార్యక్రమ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన అంజనీకుమార్ ఆర్మరల్ బేసిక్ కోర్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుధాల మరమ్మతులులో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అప్పుడే ఎలాంటి కొత్త సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు. అనంతరం ఆయన బేస్ రిఫైర్ వర్క్‌షాపును సందర్శించారు. ఇందులో భాగంగా ఆయుధాలు ఎలా మరమ్మతులు చేసే విధానం, ఎటువంటి సమస్యలు వస్తాయని అంటో ఆర్మరర్స్ను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ ఎం.ఎస్.సిద్ధిఖీ, ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, వర్క్‌షాప్ ఇన్చార్జి పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
'కరోనా వైరస్ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు..
చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని అమెరికా నిఘా సంస్థలు తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వుహాన్ ల్యాబ్ పరిశోధకుడిగా పనిచేసిన చావో షాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను చైనానే ఉద్దేశపూర్వకంగా తయారు చేసిందని చెప్పారు. బయోవెపన్‌గా ఉపయోగించుకోవాలని చైనా కరోనాను సృష్టించిందని అన్నారు. మనుషులతో సహా అన్ని జీవులకు వ్యాప్తి చెందగల కరోనా రకాలను గుర్తించే బాధ్యతను తమ పరిశోధక బృంధానికే అప్పగించినట్లు చెప్పారు. మానవ హక్కుల కార్యకర్త జెన్నీఫర్ జంగ్‌తో జరిగిన ఇంటర్వూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. ప్రభావవంతమైన కరోనా రకాలను గుర్తించాలని చావో షాన్‌తో సహా తమ సహచర పరిశోధకులకు బాధ్యతను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో నంజిన్ నగరంలో చావో షాన్‌కు స్వయంగా నాలుగు రకాల కరోనాలను పరిశోధనల నిమిత్తం ఇచ్చారని చెప్పారు. అందులో ఓ రకం అత్యంత వ్యాప్తి చెందగల శక్తి ఉన్నది గుర్తించినట్లు వెల్లడించారు. చావో కరోనా వైరస్‌ను ఓ బయోవెపన్‌గా వ్యాఖ్యానించారు. 2019 నుంచి తమ సహచర పరిశోధకులు కనిపించకుండా పోయారని చెప్పారు. పరిశోధనల కోసం మరికొందర్ని అతర దేశాలకు పంపించినట్లు పేర్కొన్నారు. అయితే.. వైరస్ వ్యాప్తి చేయడానికే తమ సహచరులను ఇతర దేశాలకు పంపించినట్లు చావో అనుమానించారు. ఇదీ చదవండి: ‘వుహాన్ ల్యాబ్’ నివేదికలో అదిరిపోయే ట్విస్ట్ -
షాకింగ్ ఘటన: కొండచిలువనే ఆయుధంగా..వ్యక్తిపై దాడి
కొందరూ తమ పెంపుడు జంతువులను, పక్షులను ప్రేమగా చూసుకుంటున్నట్లు కలరింగ్ ఇస్తారు. నిజానికి కొందరూ వారికేదో సరదా హాబీలా పెంచుతారు. తమకు ఇబ్బంది లేదా కష్టం అనుకుంటే వాటి ప్రాణాలు తీసేందుకు లేదా వాటిని ప్రమాదంలో పడేయడం వంటివి చేస్తారు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి ఓ పెంపుడు కొండచిలువ పట్ల అలానే వ్యవహరించాడు. ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కెనడాలోని టొరంటోలో ఓ వ్యక్తి తన పెంపుడు కొండచిలువను ఆయుధంగా ఉపయోగించుకుని దాడికి దిగుతాడు. పాపం ఆ వ్యక్తిని నడి రోడ్డుపై ఆ పెంపుడు పాముని తాడు మాదిరిగా చేసుకుని ఇష్టారీతిలో కొడుతుంటాడు. అవతల వ్యక్తి తనను తాను రక్షించుకునేందుకు యత్నించినా కూడా వదలకుండా అలా దాడి చేస్తూనే ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసు వాహానం అటుగా రావడంతో వెంటనే సదరు వ్యక్తిని ఆపి అదుపులోకి తీసుకున్నారు. ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని టోరంటో నివాసి 45 ఏళ్ల లారేనియో అవిలాగా గుర్తించి అరెస్టు చేయడమే గాక ఒక ప్రాణిని ఇబ్బందులకు గురి చేసినందుకు పలు కేసులు నమోదు చేసి కోర్టులో హాజర్చారు కూడా. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Dude uses his pet snake as a weapon during street fight in Toronto 😳 pic.twitter.com/T2lLKaLe4E — Crazy Clips (@crazyclipsonly) May 13, 2023 (చదవండి: పదేళ్లు జైల్లో పెట్టేలా కుట్ర! అయినా తగ్గేదేలే! నాచివరి..!: ఇమ్రాన్ ఖాన్) -
'మిత్రకాల్'పై పోరాటం.. సత్యమే నా ఆయుధం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను పోరాటం చేస్తున్నానని, సత్యమే తన ఆయుధమని పదునైన వ్యాఖ్యలు చేశారు. 'నేను మిత్రకాలంపై పోరాటం చేస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సత్యమే నా ఆయుధం. అదే నాకు అండ..' అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. ये ‘मित्रकाल’ के विरुद्ध, लोकतंत्र को बचाने की लड़ाई है। इस संघर्ष में, सत्य मेरा अस्त्र है, और सत्य ही मेरा आसरा! pic.twitter.com/SYxC8yfc1M — Rahul Gandhi (@RahulGandhi) April 3, 2023 హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం స్నేహితుడు అదానీ కోసమే మోదీ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శల జోరు పెంచిన విషయం తెలిసిందే. అందుకే మోదీ పాలనను మిత్రులకు లాభం చేకూర్చే మిత్రకాల్‌గా ఆయన అభివర్ణిస్తున్నారు. కాగా.. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో మార్చి 23న రాహుల్‌ను సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు. తీర్పుపై స్టే విధించాలని, శిక్ష రద్దు చేయాలని కోరారు. అయితే న్యాయస్థానం మాత్రం రాహుల్‌కు ఈ కేసులో ఏప్రిల్ 13 వరకు బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై స్టే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి విచారణను వాయిదా వేసింది. చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
తాను సైతం అంటూ... ఆయుధం చేత బట్టిన ఉక్రెయిన్ మహిళా ఎంపీ!
Holding Kalashnikov: ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు, మహిళా ఎంపీ కిరా రుడిక్ తాను సైతం యుద్ధం చేస్తానంటూ ఆయుధం చేతబట్టారు. ఈ మేరకు ఆమె చాలామందిలాగే తాను కూడా రష్యా దాడిని ఎదుర్కొని తన దేశాన్ని, ప్రజలను రక్షించడానికి కలాష్నికోవ్ అనే ఆయుధాన్ని తీసుకున్నానని అన్నారు. అంతేకాదు ఈ ఆయుధాన్ని ఉపయోగించడం నేర్చుకోవడమే కాక ధరించేందుకు సిద్ధమవుతున్నానని చెప్పారు. మహిళలు పురుషులు అనే భేధం లేకుండా ఈ నేలని రక్షించుకుంటారని అన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తాను చాలా కోపంగా ఉన్నానని చెప్పారు. అయినా పుతిన్ ఉక్రెయిన్ ఉనికి హక్కును ఎలా తిరస్కరిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదనగా పేర్కొన్నారు. తనని తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని అయినప్పటికీ తాను రాజధాని కైవ్‌లోనే ఉంటూ తన కుటుంబాన్ని తన దేశాన్ని రక్షించుకుంటానని చెబుతున్నారు. ఉక్రెయిన్ స్వతంత్ర దేశం అని తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ధీమాగా చెప్పారు. తన తోటి శాసనసభ్యులతో సహా అనేక మంది ఉక్రేనియన్ మహిళలు రష్యా దళాలతో పోరాడేందుకు ఆయుధాలు తీసుకున్నారని ఉక్రెయిన్ ఎంపీ చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఊహకు కూడా అందని విధంగా తాము ప్రతిఘటిస్తాం అన్నారు. ఉక్రెయిన్ రాజధాని కాదు కదా మా గడ్డ మీద ప్రతి అంగుళాన్ని వారికి దక్కనివ్వకుండా మా దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌లోని ప్రతి స్త్రీ, పురుషుడు సిద్ధంగా ఉన్నారన్నారు. "మేము ఈ యుద్ధం ప్రారంభించలేదు, మేము మా దేశంలో మా జీవితాలను శాంతియుతంగా జీవిస్తున్నాము, మన దైనందిన జీవితాన్ని అగాధంలో పడేసేలా శత్రువు మా దేశంలోకి చొరబడి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ కూర్చొం. దేశాన్ని రక్షించే క్రమంలో ఆయుధాలు ధరించాల్సిన అవసరం లేని నాలాంటి వ్యక్తులు సైతం నిలబడి పోరాడతారు. పుతిన్ తమ బలగాలను వెనక్కి రప్పిస్తాడని ఆశిస్తున్న" అని ఉక్రెయిన్ ఎంపీ రుడిక్ అన్నారు. (చదవండి: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు! మా దేశాన్ని రక్షించుకుంటాం) -
పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం ఉందా? తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. గతంలో అతను లైసెన్స్ తీసుకున్న ఆయుధానికి, బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో అతని బ్యాగేజ్ నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్‌కు పొంతన లేకపోవడంతో ఈ అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లోనే ఆయుధం సరెండర్... పరిటాల సిద్ధార్థ్ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం అనంతపురం కలెక్టర్ నుంచి ఆయుధ లైసెన్స్ తీసుకొని .32 క్యాలిబర్ పిస్టల్ కొన్నారు. దాని కాలపరిమితి 2019తో ముగియడం, అదే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఎన్నికలకు ముందే తన ఆయుధాన్ని రామగిరి పోలీసుస్టేషన్లో డిపాజిట్ చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున ఆయన బ్యాగేజ్లో లభించినవి 5.56 క్యాలిబర్ తూటాలు. ఇవి కేవలం సాయుధ బలగాలు మాత్రమే వాడే ఇన్సాస్ రైఫిల్స్‌కు సంబంధించినవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ వద్ద 5.56 క్యాలిబర్‌కు చెందిన అక్రమ ఆయుధం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో శంషాబాద్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరి స్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా నిషేధిత తుపాకీ తూటాలు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు నిందితులను విడిచిపెట్టరు. అయితే సిద్ధార్థ్‌ను మాత్రం వివరణ కోరుతూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేసి వదిలేయడం గమనార్హం. ఆ కానిస్టేబుల్‌తో లింకులు ఉన్నాయా..? సిద్ధార్థ్ వద్ద లభించిన తూటాకు, ఈ ఏడాది ఏప్రిల్‌లో అస్సాంలోని బాగ్డోగ్రా విమానా శ్రయంలో ఓ ఐటీబీపీ కానిస్టేబుల్ వద్ద లభిం చిన తూటాలకు లింకులున్నాయా? అనే అను మానాలు కలుగుతున్నాయి. అస్సాంలో పని చేసే అనంతపురం జిల్లా ములకనూరుకు చెందిన ఓ ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు కానిస్టేబుల్ ఏప్రిల్ 17న బెంగళూరు వెళ్లేందుకు బాగ్డోగ్రా విమానాశ్రయానికి రాగా ఆయన బ్యాగేజ్లో 5.56 క్యాలిబర్‌కు చెందిన 100 పేల్చని తూటాలు లభ్యమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఐటీబీపీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికితోడు ఆ కానిస్టేబుల్‌కు పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!
తిరువొత్తియూర్(తమిళనాడు): దిండిగల్ జిల్లా పలని షణ్ముఖ నదీతీరంలో సుమారు 7 వేల సంవత్సరాల క్రితం నాటి రాతి ఆయుధాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. పురాతత్వ పరిశోధన బృందం జరిపిన తవ్వకాల్లో ఆ ఆయుధం పగిలిన స్థితిలో లభ్యమైంది. పురాతత్వ శాస్త్రవేత్త నారాయణ మూర్తి మాట్లాడుతూ మానవ చరిత్రను పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, ఆధునిక రాతి యుగం, లోహ యుగంగా విభజించారన్నారు. ప్రస్తుతం లభించిన రాతి ఆయుధం.. కొత్త రాతి యుగానికి చెందినదని, ఈ కాలంలోనే తమిళుల మొదటి సంఘాకారం ప్రారంభమైందన్నారు. కొత్త రాతి యుగం ఆయుధాలను మానవులు జంతువులను వేటాడేందుకు ఉపయోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం లభించిన ఈ రాతి ఆయుధం కొన, వెనుక భాగం పూర్తిగా పగిలి ఉన్నట్లు తెలిపారు. దీనిపై ప్రాచీన తమిళ లిపి చెక్కి ఉందని, పైభాగంలో 8 అక్షరాలు కింది భాగంలో 5 అక్షరాలు ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై తెన్నాన్ అని రాసి ఉండడం వల్ల ఈ ఆయుధం తెన్నాడన్కు సంబంధించి అయి ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. తమిళ లిపి ప్రాచీతమైందని చెప్పేందుకు ఈ రాతి ఆయుధం ముఖ్య సాక్ష్యంగా ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: శశికళ రాజకీయ ప్రవేశంపై నిరసన గళాలు) -
వాషింగ్టన్లో సాయుధుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లలో భాగంగా రాజధాని వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద వెస్లీ అలెన్ బీలెర్ (31) అనే వ్యక్తి శుక్రవారం ఆయుధంతో తిరుగుతూ పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడి కారులో నుంచి లైసెన్స్ లేని 9ఎంఎం హ్యాండ్‌గన్, 500 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెస్లీని అదుపులోకి తీసుకొని విచారించారు. ఉగ్రవాదులతో అతడికి ఎలాంటి సంబంధాలు లేవని, తెలియకుండా ఆ ప్రాంతంలోకి వచ్చాడని నిర్ధారణ కావడంతో శనివారం విడిచిపెట్టారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడన్న ఆరోపణతో కేసు నమోదు చేశారు. భద్రతా సిబ్బందికి ఉచితంగా పిజ్జాలు జో బైడెన్ యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తారు. కొద్దిరోజుల క్రితం ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. అప్పటినుంచి ఇక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది నిర్విరామంగా పహారా కాస్తున్నారు. వారి శ్రమను చూసి చలించిపోయిన ‘వి ద పిజ్జా’ అనే రెస్టారెంట్ ఉచితంగా పిజ్జాలు అందజేస్తూ అందరి మన్ననలు చూరగొంటోంది. సెక్యూరిటీ సిబ్బందికి భోజనం అందించడానికి రెస్టారెంట్ యాజమాన్యం ప్రజల నుంచి విరాళాలు స్వీకరిస్తోంది. వి ద పిజ్జా ఔదార్యం చూసిన మరికొన్ని రెస్టారెంట్లు కూడా ఉచితంగా భోజనం అందించడానికి ముందుకొచ్చాయి. హ్యాండ్‌గన్, 500 రౌండ్ల తూటాల స్వాధీనం -
ఆ ముగ్గురు నుంచి నాకు భద్రత కల్పించాలి
ఎర్రగుంట్ల : టీడీపీ నేతలైన మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల నుంచి తనకు ప్రమాదం లేకుండా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అని వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి అన్నారు. తన వద్ద ఉన్న అనుమతిగల షార్టు గన్(ఆయుధం) గురువారం ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటరమణకు సరెండర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రధాన పార్టీ అయిన వైఎస్సార్ సీపీ అభ్యర్థినని , తనకు పోటీగా ఉన్న ప్రత్యర్థులు మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఫ్యాక్షనిస్టులు, హత్యలు కుట్రలు, కుతంత్రాలు చేసే వారని అందుకే తనకు భద్రత కల్పించాలని కోరారు. ప్రస్తుతం రాత్రి సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు గ్రామాలకు ప్రచారానికి వెళుతుంటానని, తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. తనకు రాజకీయంగా ప్రమాదం ఉందనే పోలీసులు తనకు షార్టు గన్ ఇచ్చారని, నేడు పోలీసులు అడిగిన మేరకు షార్టు గన్ను అప్పగించినట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు ఎలాంటి వ్యక్తిగత భద్రత లేదన్నారు. తనకు భద్రత కల్పించాలని ఇది వరకే జమ్మలమడుగు డీఎస్పీకి విన్నవించానని, జిల్లా ఎస్పీ ని కూడా కలిసి విన్నవిస్తానన్నారు. -
గ్యాంగ్ వార్
‘మంగళ’, ‘క్రిమినల్స్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న మరో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వెపన్’. అవినాష్, ప్రదీప్ రావత్, రాజారాయ్, రాజు, మధుబాబు ప్రధాన పాత్రల్లో ఆర్.ఎస్.సురేష్ దర్శకత్వంలో శర్మ చుక్కా నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ మార్చి 20న మొదలవుతుంది. శర్మ చుక్కా మాట్లాడుతూ– ‘‘రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. టైటిల్‌కి పూర్తి జస్టిఫికేషన్ ఇచ్చే కథాంశంతో మా సినిమా ఉంటుంది. మా బ్యానర్లో వచ్చిన ‘మంగళ, క్రిమినల్స్’ చిత్రాల కంటే ‘వెపన్’ మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సబ్బారపు ప్రకాష్. -
నాలెడ్జ్ మన ఆయుధం
-
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు
–జాతీయ ఓటర్ల దినోత్సవంలో జిల్లా జడ్జి అనుపమా చక్రవర్తి – కలెక్టరేట్ నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండు వరకు భారీ ర్యాలీ – అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు –ఓటర్ల జాబితా సవరణలో బాగ పనిచేసిన వారికి ప్రశంసాపత్రాల పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): మంచి పాలకులను ఎన్నుకునేందుకు, ప్రజాస్వామా్యన్ని పరిరక్షించేందుకు ఓటే ఆయుధమని జిల్లా జడి్జ అనుపమా చక్రవర్తి అన్నారు. ఓటరుగా నమోదయిన ప్రతి ఒక్కరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండులో 7వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ కలెక్టరేట్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పచ్చ జెండా ఊపీ ర్యాలీ ప్రారంభించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ... 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోద కావాలని సూచించారు. దేశ దిశ, దశను మార్చే శక్తి యువతకు ందని అన్నారు. సమర్థనాయకత్వం దేశానికి రావాలంటే ఓటుహక్కు వినియోగించుకోవాలని చెపా్పరు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన వారు సార్వభౌములు వంటి వారన్నారు. ఎవరైనా అర్హులుంటే ఓటరుగా నమోదుకు నిరంతరం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నరసింహులు మాట్లాడుతూ... యువతీ యువకుల్లో చాలా మంది ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అసక్తి చూపడం లేదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఓటు వేసే ముందు ఆలోచించి మంచివారికి వేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ... దేశాన్ని అసాంఘిక శక్తుల నుంచి కాపాడే శక్తి ఓటుకు ఉందని దీనిని స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకుంటామని అందరితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞచేయించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. చాంద్‌బాష ప్రదర్శించిన ఇంద్రజాలం, వివిధ నృత్య ప్రదర్శనలు అందరిని మంత్రముగ్దులు చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అన్ని బృందాలకు జిల్లా కలెక్టర్ రూ.10వేల ప్రకారం నగదు బహుమతి ప్రకటించారు. ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకుని ఓటర్ల జాబితా సవరణలో భాగ పనిచేసి అర్హులయిన వారందరిని ఓటర్లుగా నమోదు చేసేందుకు కృషి చేసిన వారికి, సీనియర్ ఓటర్లను కలెక్టర్, రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, జిల్లా ఎస్పీ ప్రశాంసా పత్రాలతో సత్కరించారు. 18ఏళ్లు నిండిన వెంటనే ఓటర్లుగా నమోదైన యువకులకు ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జిల్లా పరిషత్ సీఈఓ ఈశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, మెప్మా పీడీ రామాంజనేయులు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఈఓ రవీంద్రనాథరెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి, ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి, కర్నూలు, కల్లూరు తహసీల్దార్లు రమేష్‌బాబు, నరేంద్రనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెత్తని ‘కత్తి’.. గెలిపించే శక్తి
జాతిహితం మన మెత్తని బలం, పాకిస్తానీలు మన సినిమాలను మన క్రీడాకారులను అభిమానించ డానికే పరిమితమైనది కాదు. మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలు నెలకొనడంలో సొంత ప్రయోజనాలు ఇమిడి ఉన్న పాక్ నటీనటులు అంతకంటే కాదు. వాటికంటే పెద్దది భారత ఉదారవాద, ప్రజాస్వామ్య వ్యవస్థలది, సంస్థలది. ఒక దేశం మరో దేశంలోకి చొరబాటు దార్లను, ఉగ్రవాదులను పంపి హింసాకాండను సృష్టించడం ద్వారానే ప్రభావితం చేయలేదు. ఉత్తమ ఉదాహరణగా నిలవడం ద్వారా కూడా ఆ పని చేయగలుగుతుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి చరిత్రాత్మకమైన లాహోర్ బస్సు యాత్రకు బయ లుదేరిన 1999 ఫిబ్రవరి 22న ప్రధాని కార్యాలయం జుట్టుపీక్కోవాల్సి వచ్చింది. ఆ అర్ధరాత్రి వేళ దేవానంద్‌ను తీసుకు రావడం ఎలా? దేవానంద్ అంటే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పిచ్చి అభిమానం. ఆ విషయం నాటి మన ప్రధాని అటల్జీకి అప్పుడే గుర్తుకొచ్చింది. మరో దేవానంద్ అభిమాన్ని ఎలాగోలా ఆయన వద్దకు వెళ్లి వాజ్‌పేయితో బస్సు యాత్రకు అందుకోగలుగుతారా? అని అడిగారు. ఆయన ఆనందంగా వచ్చేశారు. ఆ పర్యటనలో దేవానంద్ రాక ప్రధాన ఆకర్షణ అయింది. ఆ సినీ మాంత్రికుడు అక్కడ బాల్ డాన్స్ చేశారు, రాజకీయవేత్తలను, ప్రముఖులను, మొత్తంగా పాకిస్తాన్ మీడియాను ఉల్లాసపరుస్తూ గడిపారు. వ్యూహాత్మకంగా అంత ముఖ్యమైన పర్యటనను ఆయనేమీ ఆషామాషీగా చూడలేదు. దేవానంద్‌ను తీసుకెళ్లడం ద్వారా ఆయన అప్పుడు భారత్‌కు ఉన్న మెత్తని బలాన్ని (సాఫ్ట్ పవర్) ఉపయోగించారంతే. పాక్‌పై సాంస్కృతిక, క్రీడాపరమైన, విద్యాపరమైన మొత్తం బహిష్కర ణను విధించాలంటూ సాగుతున్న నేటి ప్రచారాన్ని చూస్తుంటే నాకు... మెత్తని బలం అంటే ఏమిటో ఇంకా అర్థంకాని లేదా గుర్తించని రోజులనాటి ఆ విషయం గుర్తుకొస్తోంది. గౌతం గంభీర్, సౌరవ్ గంగూలీ వంటి గొప్ప క్రికెట్ క్రీడాకారులు సైతం కార్యక్రమంలో చేరారు. మెత్తని బలాన్ని ప్రయోగించా ల్సినది మెత్తని వారి మీదనే అంటున్నారు. పాక్ సమస్య పరిష్కారానికి కుసుమ కోమలమైన సుతి మెత్తని వైఖరి పనికిరాదంటున్నారు. కాబట్టి పాక్‌తో అన్ని సంబంధాలూ తెంచేసుకుని, దాన్ని ప్రపంచంలో అంటరాని రాజ్యంగా నిలపాలి. భారత్ సాగిస్తున్న ఉగ్రవాద (పాకిస్తానీ) వ్యతిరేక పోరా టంలో మిగతా ప్రపంచమంతా చేరేలా ఒప్పించి అప్పుడు చూడమంటు న్నారు. గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి ముందు తరువాత సంభవిం చిన కొన్ని తాజా పరిణామాలు ఈ వైఖరికున్న పరిమితులను నొక్కి చెబుతు న్నాయి. 2014 మేలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశం ప్రపంచ శక్తిగా అవిర్భవించిందని మన టీవీ స్టూడియో యుద్ధ యోధులు, ‘‘యుద్ధ వాద’’ విశ్రాంత సైనిక, గూఢచార అధికారులు, దౌత్యవేత్తలు విశ్వసిస్తు న్నారు. వాస్తవంలో మనం అందుకు బహు దూరంలో ఉన్నాం. మెత్తని బలం అంటే ఏమిటి? మెత్తని బలం అనే సిద్ధాంతానికి మద్దతుదార్లు, వ్యతిరేకులు కూడా ఉన్నారు. జూనియర్ బుష్ మొదటి దఫా అమెరికా అధ్యక్షునిగా ఉండగా రక్షణ మంత్రిగా ఉన్న డొనాల్డ్ రమ్స్ఫీల్డ్ను, మొత్తని బలాన్నిమీరు విశ్వసిస్తారా? అని అడిగితే ‘‘అదేమిటి?’’ అని అమాయకంగా అతి సుప్రసిద్ధ సమాధా నాన్ని చెప్పారు. గట్టి, సైనిక బలం, బల ప్రయోగాలను కోరే వారిలో ఆయన అగ్రగణ్యులు. ప్రపంచాన్ని, అమెరికా ప్రయోజనాలను, భావి తరాల ప్రయో జనాలను ఆయన ఎలా చింద ర వందర చేసి వెళ్లారో కూడా మనకు తెలుసు. రోగిని నిలువుగా కోసేసి వ్రణాన్ని తొలగించకుండానే లేదా తిరిగి కుట్లయినా వేయకుండానే అపరేషన్ బల్లపై (ఇరాక్, అఫ్గానిస్తాన్) అలాగే వదిలేసి పోయారు. 1990లలో, ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో ‘మెత్త్తని బలం’ అనే భావనను హార్వర్డ్ ప్రొఫెసర్ జోసెఫ్ న్యే జూనియర్ మొదట నిర్వ చించారు. 2006లో రాసిన ఓ వ్యాసంలో ఆయన... బుష్ రెండవ దఫా అధ్యక్షునిగా ఉండగా కండోలిజా రైస్ వద్ద మెత్తని బలం గురించి పాఠాలు నేర్చుకున్నారని, మెత్తని బలాన్ని, బహిరంగ దౌత్యాన్ని మరింత ఎక్కువగా ప్రయోగించారని రాశారు. ఇప్పుడు స్టూడి యోలో, పార్టీలు చేసుకునే బృందాల్లో, ఎయిర్ పోర్ట్‌లో, పార్లమెంటులో, ఎక్కడైనాగానీ మెత్తని బలం అనే మాట వింటేనే విరగబడి నవ్వుతారు. ప్రత్యే కించి న్యే అన్నట్టు మెత్తని బలం అనే ఆయన సిద్ధాంతాన్ని ‘‘అతిగా సాగదీశారు, మెలికలు తిప్పారు, కొన్ని సందర్భాల్లో గుర్తుపట్ట లేనంతగా చేసేశారు.’’ మెదళ్లను మెలి తిప్పడం మెరుగు న్యే ఇలా వివరించారు... మెత్తని బలం అని పిలుస్తున్న కారణంగానే అది మెత్తనిది అయిపోదు. అలాగే అది తప్పనిసరిగా మరింత మాన వత్వంతో కూడినది అని కూడా కాదు, అది కేవలం ‘‘విలువలను ప్రబోధించేది కాదు.’’ మీ గట్టి బలాన్ని ప్రయోగిస్తారా? లేక మెత్తని బలాన్ని ప్రయోగిస్తారా? అనేది పరిస్థితిని బట్టి ఉంటుంది. ఒక జనరల్ ఎడారి యుద్ధంలో గెలవడానికైతే పెద్ద ట్యాంకుల బలగాన్ని ప్రయోగిస్తాడు. వియత్నాం అడవుల్లో అయితే అందుకు ఇతర పద్ధతులు అవసరం అవుతాయి. దీన్ని మరింతగా వివరిస్తూ అయన.. మీరు తుపాకీ చూపి అవతలి వాడి డబ్బును దోచుకోవచ్చు లేదా త్వరగా ధన వంతులు కావచ్చని మోసగించి కాజేయొచ్చు లేదా ఆధ్యాత్మిక యాత్రలో తనతో చేరమంటూ అతన్ని ఒప్పించి ఆస్తినంతా మీ పేరిట రాయించేసు కోవచ్చు. మొదటివి రెండూ గట్టి బలానికి ఉదాహరణలు కాగా, మూడోది మెత్తని బలానికి ఉదాహరణ. ‘‘కానీ ఫలితం మాత్రం దొంగతనమే.. చేతులు మెలి తిప్పడం కంటే మెదళ్లను మెలి తిప్పడం మెరుగు.’’ ప్రపంచ శక్తిగా భారత ప్రయోజనాలకు లేదా మరింత కచ్చితంగా చెప్పాలంటే, భారత్-పాక్ సంబంధాలకు ఈ తర్కాన్ని విస్తరింపజేయడం ఎలా? మెత్తని బలం అంటే ఆహారం, సంస్కృతి, సాహిత్యం, క్రీడలేనా? అలా అయితే కోకా కోలా, మెక్ డొనాల్డ్స్, మైఖేల్ జాక్సన్, మడోనాలు సోవియట్ కూటమిని ఇంకా చాలా ముందుగానే జయించేసి ఉండేవారు. లేకపోతే చైనావారు వారి ఆహారం ద్వారా మన మెదళ్లను, హృదయాలను కూడా శాసించేవారు. లేదా దేశీ వెజిటబుల్ ప్రైడ్ రైస్‌ను నాశనం చేసేలా, అది మాదంటే మాదని మనతో యుద్ధానికి దిగేవారు. మెత్తని బలం అంటే జాతీయ విలువలు, విధానాలు ప్రజాస్వామ్యం, రాజకీయాల నాణ్యత, సంస్థల దృఢత్వాలకు సంబంధించినది కూడా. మెత్తని బలం, కేవలం పాకిస్తానీలు టీవీ చానళ్లలో మన సినిమాలను చూడటానికి, మన క్రీడా హీరోలను ఆరాధించడానికి లేదా మన జనరంజక గేయాలను ఆలపించడానికి మాత్రమే పరిమితం కాదు. అది మరింత ఎక్కువ సుప్రసిద్ధ్దులైన పాకిస్తానీలు, క్రీడాకారులు మాత్రమే కారు. ప్రత్యేకించి మన దేశంలో జీవనాధారాన్ని సంపాదించుకుంటూ, మెరుగైన ద్వైపాక్షిక సంబం ధాలు నెలకొనడంలో సొంత ప్రయోజనాలు ఇమిడి ఉన్న నటీనటులు అంత కంటే కాదు. ఇవన్నీ లెక్కలోకి వచ్చేవే, కానీ వాటికంటే మరింత పెద్దదైన భారత ప్రభావం నైతికంగా మరింత ఆకర్షణీయమైనది. మెరుగైన ప్రజా స్వామ్యం, మరింత ఉదారవాద సమాజం, మైనారిటీలతో వ్యవహరించే తీరు, ఎక్కువ వాక్ స్వాతంత్య్రం, సున్నితమైన, ప్రశ్నించే మీడియా, కోర్టులు, పర్యావరణ చట్టాలువంటివన్నీ కలిసి ఆకర్షణీయమైన ఆ బ్రాండ్ ప్రభావా నికి మూల సారంగా ఉంటాయి. దాన్ని మీరు మెత్తని బలం అనొచ్చు లేదా గట్టి బలం అనొచ్చు లేదా నిర్వచించలేనిది అనొచ్చు. గట్టిగా పనిచేసే మెత్తని బలం ఒక దేశం మరో దేశంలోకి చొరబాటుదార్లను, విద్రోహులను, ఉగ్రవాదు లను పంపి హింసాకాండను సృష్టించడం ద్వారానే దాన్ని ప్రభావితం చేయ లేదు. తానే ఉత్తమ ఉదాహరణగా నిలవడం ద్వారా కూడా ఆ పని చేయ గలుగు తుంది. మరింత ఉదారవాద, ప్రజాస్వామిక శక్తులు నియంతృత్వంతో పోటీ పడేటప్పుడు అది ఎప్పుడూ అద్భుతంగా పనిచేసింది. 25 ఏళ్ల క్రితం ‘సెమి నార్’ పత్రికలో నేను ‘‘పాకిస్తాన్: ఎ హ్యాక్స్ ఎజెండా’’ అనే వ్యాసం రాశాను. పాశ్చాత్య కూటమి, ప్రత్యేకించి అమెరికా తన ప్రజాస్వామిక, ఉదారవాద, సాంస్కృతిక ప్రభావాలతో (మెత్తని బలం అనే పద ప్రయోగం అప్పటికి వాడుకలో లేదు) ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియట్ కూటమిని ఓడించ గలిగిందో అందులో వివరించాను. భారత్ దాన్ని క్షుణ్ణంగా అధ్య యనం చేసి, దాన్ని తన పాక్ విధానంలో అల్లాలి. రిపోర్టర్‌గా నేను పాక్‌లో చాలా సార్లు పర్యటించా. భారత సంస్థల ప్రభావం అక్కడి విధాన నిర్ణేతలపై ఎంత బలంగా ఉందో చూసి నివ్వెరపోయాను. ప్రభావశీలురైన అక్కడి వ్యక్తులు నన్ను పంపమని కోరిన వాటిలో నాటికి పాక్ పంజాబ్ ఆర్థిక మంత్రి, తర్వాత విదేశాంగ మంత్రియైన షా మెహమూద్ ఖురేషీ కోరిన కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిటీ నివేదిక ఉంది. అలాగే నవాజ్ (మొదటి పదవీ కాలంలో) కరాచీలో స్వతంత్రంగా పనిచేయడానికి అధికారాలను కోరు తున్న సెన్యానికి నియమ నిబంధనలను రూపొందించడానికి మన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కోరారు. నేడు మనకు పదవీ విరమణ వరకు కొనసాగిన 29 మంది ఆర్మీ చీఫ్‌లు ఉండగా, పాక్‌కు 15 మంది మాత్రమే ఉన్నారు. ఇది కూడా సానుకూల ప్రభావమే అవుతుంది. దాన్ని మెత్తని బలం అంటారా లేదా గట్టి బలం అంటారా మీ ఇష్టం. సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, క్రీడలు తదితరాలన్నీ జాతీయ ప్రయోజనాల రీత్యా బలాన్ని హెచ్చించే గుణకాలు కాగలుగుతాయి. నాలుగు దశాబ్దాల పాటూ రాజ్ కపూర్ మొత్తం కమ్యూనిస్టు దేశాలన్నిటిపైనా సానుకూల ప్రభావం నెరపలేదా? అది కేవలం సోవియట్ యూనియన్‌కే పరిమితం కాలేదు. తియనాన్మెన్ స్క్వేర్ నరమేధం జరిగిన 1989 వేసవిలో చైనా రాజధాని బీజింగ్‌లో సైతం ప్రభావాన్ని చూపింది. ఆ ఘటనపై మా కథనాన్ని మొత్తాన్ని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక హోటల్ ఉద్యోగులు (అధి కారిక అనుమతి లేకుండా) ఫ్యాక్స్ చేసి పంపారు. ప్రతిగా ఫ్యాక్స్ పంపు తున్నంత సేపూ మేం ఆపకుండా ‘ఆవారా హూ’ పాటను పాడుతుండాలని మాత్రమే కోరారు. అమెరికన్లు హాలీవుడ్‌నే కాదు, డిస్నీ ల్యాండ్ సందర్శనను కూడా అంతర్జాతీయ సందర్శకుల కార్యక్రమంలో భాగంగా చేర్చారు. మరింత పెద్ద సంప్రదాయక, అణు ఆయుధాగారాన్ని పెంపొందింపజేసు కుంటున్నా వారు... సోవియట్ల పట్ల మరింతగా తెరలు దించుకుని, మొండి తనంతో ఉండలేదు. పారదర్శకంగా ఉండటం అనేది దాపరికం లేని సమా జాల ఆయుధాగారాల్లో గొప్ప శక్తివంతమైన అస్త్రం అవుతుంది. శేఖర్ గుప్తా twitter@shekargupta -
విద్యా హక్కుకు ఆర్టీఐ అస్త్రం
విశ్లేషణ అందరికీ విద్య ప్రాథమిక హక్కుతో సమానమని అటు రాజ్యాంగం, ఇటు సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందరు పిల్లలను బడికి పంపడం సర్కారు వారికి ఏ మాత్రం ఇష్టం లేదు. చదువులేకుంటే సమాజం సాగదు. విద్యలేక వికాసం లేదు. విద్య ఇప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. కొందరికే అరుునా, కొంత వరకే అరుునా ఆరేళ్ల వయసు వచ్చిన ప్రతి బాలుడూ, బాలిక బడిలో చేర్చే ఏర్పాటు, ఆ తరువాత 14 ఏళ్లు వచ్చే వరకు చదివించే బాధ్యత ప్రభుత్వానిదే. ఇది ఉచిత నిర్బంధ విద్య. పిల్లలు కాదనడానికి వీల్లేదు తల్లిదండ్రులు బడికి పంపకుండా పిల్లలను ఆపడానికి వీల్లేదు. రాజ్యాంగం వచ్చిన పదేళ్లలోగా పిల్లలందరికీ చదువు అందే ఏర్పాటు చేయాలని ఆదేశిక సూత్రం నిర్దేశిం చింది. కాని కేంద్రంలో రాష్ట్రాలలో ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా ప్రభువులు ఆ విషయం పూర్తిగా మరిచి పోయారు. కొత్త తరానికి తీరని అన్యాయం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలితరం విద్యార్థినీ విద్యార్థులను చదివించే పవిత్ర బాధ్యతను స్వాతం త్య్రం కోసం పోరాడి సాధించి అధికారంలోకి వచ్చిన నేతలే వదిలేయడం చరిత్ర మరవని విషాదం. మొదటి తరాన్నే కాదు, తర్వాత ఆరు తరాలను ప్రజా ప్రభువులు వదిలేసారు. బ్రిటిష్‌వారు చెప్పింది గుమాస్తాలను తయారు చేసే చదువు అని విమర్శించిన జాతీయోద్యమ నాయ కులు కనీసం గుమాస్తా చదువులు కూడా అందరికీ అందించలేకపోవడం ఘోరవైఫల్యం. ఆ అపజయం క్రీనీడలనుంచి మన విద్యారంగం ఇంకా విముక్తం కాలేదు. రాజ్యంగంలో ఆదేశిక సూత్రం రూపంలో ఉన్నా, అందరికీ విద్య అనేది ప్రాథమిక హక్కుతో సమానమని సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వాలు పట్టిం చుకోలేదు. ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులోకి తేవాలని ఉద్యమాలు నడపవలసి వచ్చింది. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడం రాజకీయ పార్టీ లకు ఇష్టం లేదు. అందరు పిల్లలను బడికి పంపడం సర్కారు వారికి అంతకన్నా ఇష్టం లేదు. ఇవీ తొలినాటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల తీరు. వేలకోట్ల రూపాయలు ఉన్నత విద్యమీద ఖర్చుచేస్తూ ప్రాథమిక విద్యను గాలికి వదిలేశారు. సర్కారీ బడులు పెంచలేదు. ఉపా ధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ఉండవలసినంత లేదు. సర్కారీ బడిలో మరుగుదొడ్లు ఉన్నాయో లేదో చూసు కునే వారు లేరు. ఆ కారణంగా ఆడపిల్లలు బడికి రాలేక పోవడం, ఆడవారిలో విద్యావంతుల సంఖ్య బాగా పడిపోవడం మన ప్రభువులు సాధించిన గొప్ప విజ యాలు. కుటుంబాలను చదివించగలిగే మహిళలకు చదువు చెప్పలేకపోరుున పథకాలు ఎవరికోసం? అనేకానేక పోరాటాల ఫలితంగా పరిమిత రూపంలో విద్యాహక్కును రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారు. ఒక చట్టం ద్వారా చదువులు నేర్పే విధానం ప్రకటిస్తామన్నారు. కాని ఆ శాసనం తేవడానికి మరి కొన్నేళ్లు కాలయాపన చేశారు. చివరకు 2009లో చట్టం రావడం, మరి కొన్నాళ్లకు దాన్ని అమలు చేయడం సాధ్యమరుుంది. చదువు చెప్పే బాధ్యతలను తనమీద మోపుకున్న ప్రభుత్వం ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వ హించకపోతే అడగవలసిన బాధ్యత పౌర సమా జానిది. పిల్లలున్న సమీప ప్రాంతంలో బడులు నెల కొల్పకపోతే ఎందుకని నిలదీయాలి. ఆ బడిలో పంతుళ్లు లేకపోతే, ఎప్పుడు నియమిస్తున్నారని అడ గాలి. పిల్లలను హింసించడం నేరం కాబట్టి దానికి పాల్పడిన వారిమీద ఏ చర్యలు తీసుకున్నారని అడ గాలి, మళ్లీ ఆ నేరం జరగకుండా ఏంచేశారని అడగాలి. బడుల కోసం ఎన్ని నిధులు ఇవ్వాలి? ఎంత ఇచ్చారు? ఎంత ఖర్చు చేశారు? ఆ ఖర్చుల వివరాలేమిటి అని పౌర సమాజం ప్రశ్నించాలి. చర్యలు తీసుకునే దాకా వెంటబడాలి. లేకపోతే మరికొన్ని తరాలు చదువులేని తరాలుగానే గడిచిపోతారుు. ప్రభుత్వ బాధ్యతల నిర్వహణ సమాచారం తెలు సుకోవడానికి విద్యా హక్కు చట్టంలో కూడా నియ మాలున్నారుు. కాని ఆ బాధ్యతలు నెరవేర్చని ప్రభు త్వాలను, ప్రాథమిక విద్యా శాఖలను అడగడానికి ఫ్రజలు తమ చైతన్యాన్ని ఉపయోగించాలి. ఆ చైత న్యానికి కొత్త పరికరం ఒకటి తోడరుుంది. అదే సమా చార హక్కు. 2009 నాటి చట్టం ఇచ్చిన చదువు హక్కును పదును పెట్టడానికి 2005లో వచ్చిన సమా చార హక్కు కొత్త అవకాశాలను కల్పించింది. ఏ కార ణంగానైనా ప్రభుత్వం పాఠశాలలు పెట్టలేని పక్షంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రరుువేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను వెనుకబడిన వర్గాల వారికి కేటారుుంచాలని విద్యా హక్కు చట్టంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ 25 శాతం సీట్ల భర్తీ, ప్రవేశాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనే కార్యక్రమాన్ని ప్రతి ప్రరుువేటు పాఠశాల స్పష్టంగా అందరికీ తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 25 శాతం పిల్లలకు చదువు చెప్పడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నది. కనుక ప్రరుు వేటు పాఠశాలే అరుునా, మిగతా విషయాల్లో ఆర్టీఐ చట్టం పరిధిలోకి పూర్తిగా రాకపోరుునా, ఈ 25 శాతం ప్రవేశాల విషయంలో వారు ప్రభుత్వానికి, ప్రజలకు సమాచారం చెప్పవలసిందే. కనుక విద్యాశాఖ ప్రతి ప్రరుువేటు పాఠశాలలో ఏటేటా జరిగే ప్రవేశాలను పూర్తి వివరాలతో సహా ప్రజల ముందుకు ఉంచడానికి ఏర్పాటు చేయవలసిందే. లేకపోతే అది సమాచార హక్కు చట్టం ఉల్లంఘన అవుతుంది. మాడభూషి శ్రీధర్ (కేంద్ర సమాచార కమిషనర్) ఈమెయిల్: professorsridhar@gmail.com -
ఆయుధాలతో దేశం సంపన్నంగా ఉండాలి
మిర్యాలగూడ టౌన్ : ఆయుధాలతో దేశం సంపన్నంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ నల్లగొండ విభాగ్ ప్రచారక్ శివకుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ముత్తిరెడ్డికుంట, వినోభానగర్, అశోక్‌నగర్, రెడ్డికాలనీ, డాక్టర్స్ కాలనీ, ఆర్టీసీ బస్టాండ్, రైతు బజారు తదితర ప్రాంతాల్లో సంచరిన్ అనంతరం దసరా, దుర్గా పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పధా సంచారిన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన విజయదశిమి రోజున అమ్మవారు శక్తిశాలిని, ఆయుధాలను ధరించి రాక్షస సంహారం చేస్తుందన్నారు. అర్జునుడు శమీ వృక్షం నుంచి ఆయుధాలను తీసి విజయం పొందుతాడని అన్నారు. ఆయుధాలతో ఇతరులపై దాడులను చేయకుండా స్వయం రక్షణ కోసం వాటిని ఉపయోగించాలన్నారు. 1998లో అణుపరీక్షలను నిర్వహించిందన్నారు. దానిలో అణుశక్తి కలిగిన 6వ దేశంగా గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు గౌరు ప్రవీణ్, తల్లం వెంకన్న, తిప్పన వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ అద్దంకి శ్రీనివాస్‌రావు, బంటు ముత్తయ్య, చిత్తలూరి శ్రీనివాస్, వినోదచంద్రన్, తలకోల శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. -
కష్టాలే విజయానికి ఆయుధాలు
– ప్రణాళికతో చదివితే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సులువే – జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కష్టాలనే విజయానికి ఆయుధాలుగా మలుచుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని జిల్లా ఎస్పీ ఆర్కే రవికష్ణ యువతకు పిలుపునిచ్చారు. కష్టాలు వచ్చినప్పుడు వాటినే తలుచుకొని కృంగిపోకుండా ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు. సానుకూల దృక్పథంతో తాను సాధించగలననే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విజయం వైపు పరుగులు తీయాలని సూచించారు. ఆదివారం బీఏఎస్ కల్యాణ మండపంలో అమరావతి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలోని నిరుద్యోగులకు ఉచితంగా గ్రూపు పరీక్షలు, పోలీసు ఉద్యోగాల కోసం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ...ప్రణాళికతో చదివితో పోటీ పరీక్షలలో విజయం సాధించడం సులువని పేర్కొన్నారు. తాను పాఠశాల, కళాశాల, డిగ్రీ స్థాయిల్లో అనేక కష్టాలను ఎదుర్కొని చదువుకున్నానని, తండ్రి ఆశయం కోసం సివిల్స్ పరీక్షను రాసి విజయం సాధించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల కోర్కెలను తీర్చేందుకు కష్టపడి చదవాలని సూచించారు. అంతకముందు హైదరాబాద్ నుంచి వచ్చిన నరసింహులు జిగ్రాఫీపై, అల్డాడి అంజయ్య ఎకానమీ, శివరాజ్ పాలిటిక్స్, పూవ్వాడి రమణ్ హిస్టరీ, భిక్షఫతి కరెంట్ ఆఫైర్స్ సబ్జెక్టులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కాగా, కర్నూలు విద్యార్థులు పోటీ పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళ్లి ఇబ్బందులు పడకుండా అక్కడి ఫ్యాకల్టీతోనే కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు డైరక్టర్లు జే.శ్రీరామ్, యాదయ్య పేర్కొన్నారు. -
బాలీవుడ్ సంగీతంతో ఐఎస్‌పై యుద్ధం
ట్రిపోలి:ఎవరైనా శత్రువును మట్టి కరిపించి విజయం సాధిస్తే ఆనందోత్సవాలతో నృత్యం చేస్తారు. సంగీత హోరులో ఊగిపోతారు. తన్మయంలో తేలిపోతారు. శత్రువును ఓడించేందుకే సంగీతాన్ని ఆయుధంగా చేసుకోవడాన్ని మాత్రం ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకు చూడలేదు. అంతర్యుద్ధంతో రగిలిపోతున్న లిబియాలో ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను తుదముట్టించేందుకు బ్రిటిష్ సైనికులు సంగీతాన్ని, అందులోనూ బాలివుడ్ సంగీతాన్ని ఆయుధంగా చేసుకొని సరికొత్త పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఐఎస్ఐఎస్ టైస్టులు బాలివుడ్ సంగీతాన్ని ఇస్లాం మతానికి వ్యతిరేకమని భావిస్తారు. దాన్ని వినడాన్ని దైవ దూషణ కింద పరిగణిస్తారు. ఈ విషయం తెలిసిన పాకిస్తాన్లో పుట్టి బ్రిటన్ సైన్యంలో ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తున్న ఓ అధికారి వారిపై మానసిక యుద్ధానికి వ్యూహ రచన చేశారు. దాని ప్రకారం లిబియా ప్రభుత్వానికి అండగా పోరాటం జరుపుతున్న రెండు బ్రిటన్ దళాలు ఐఎస్ఐఎస్పై ఈ మానసిక యుద్ధాన్ని ప్రారంభించాయి. బాలివుడ్ సంగీతాన్ని టెర్రరిస్టులు భరించలేరని, ఆ సంగీతానికి దూరంగా పారిపోతారని లేదా చిర్రెత్తినట్లు ప్రవర్తిస్తారని ఆ దళాలు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాయి. ఇప్పటికే కోస్తా తీరంలోని బెన్ జావెద్, నొఫీలియా పట్టణాలను టెర్రరిస్టులు నుంచి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ సంకీర్ణ దళాలు మొహమ్మద్ గడాఫీ జన్మస్థలమైన సిర్తే నగరంవైపు రెండు భారీ మైకుల్లో బాలివుడ్ సంగీతపు హోరును వినిపించుకుంటూ దూసుకెళుతున్నాయి. వాటి బాణీలకు అనుగుణంగా సైనికులు నృత్యం చూస్తూ ఉత్సాహంగా ముందుకు వెళుతున్నారు. ఈ ప్రయోగం ఏదో బాగుందనుకున్న అమెరికా జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ దళం కూడా బాలీవుడ్ సంగీతాన్ని ఆయుధంగా వాడుతోంది. సోషల్ మీడియా విప్లవం కారణంగా లిబియాలో మొహమ్మద్ గడాఫీ ప్రభుత్వం కూలిపోవడం, ఆ స్థానంలో ఐక్య సంఘటనా ప్రభుత్వం ఏర్పడడం తదితర పరిణామాలు తెలిసినవే. ప్రభుత్వ శక్తుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ఆ నాటి నుంచి లిబియాలో అంతర్యుద్ధం చెలరేగుతోంది. ఈ పరిస్థితులను ఆసరా చేసుకొని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు లిబియాను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది.