ఆయుధాలతో దేశం సంపన్నంగా ఉండాలి
ఆయుధాలతో దేశం సంపన్నంగా ఉండాలి
Published Sun, Oct 9 2016 7:40 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
మిర్యాలగూడ టౌన్ : ఆయుధాలతో దేశం సంపన్నంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ నల్లగొండ విభాగ్ ప్రచారక్ శివకుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ముత్తిరెడ్డికుంట, వినోభానగర్, అశోక్‌నగర్, రెడ్డికాలనీ, డాక్టర్స్ కాలనీ, ఆర్టీసీ బస్టాండ్, రైతు బజారు తదితర ప్రాంతాల్లో సంచరిన్ అనంతరం దసరా, దుర్గా పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో పధా సంచారిన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభించిన విజయదశిమి రోజున అమ్మవారు శక్తిశాలిని, ఆయుధాలను ధరించి రాక్షస సంహారం చేస్తుందన్నారు. అర్జునుడు శమీ వృక్షం నుంచి ఆయుధాలను తీసి విజయం పొందుతాడని అన్నారు. ఆయుధాలతో ఇతరులపై దాడులను చేయకుండా స్వయం రక్షణ కోసం వాటిని ఉపయోగించాలన్నారు. 1998లో అణుపరీక్షలను నిర్వహించిందన్నారు. దానిలో అణుశక్తి కలిగిన 6వ దేశంగా గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు గౌరు ప్రవీణ్, తల్లం వెంకన్న, తిప్పన వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ అద్దంకి శ్రీనివాస్‌రావు, బంటు ముత్తయ్య, చిత్తలూరి శ్రీనివాస్, వినోదచంద్రన్, తలకోల శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.
Advertisement
Advertisement