కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ | Sathyaraj Weapon Movie Telugu Version Released In OTT, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Weapon Movie OTT Release: ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Sun, Aug 4 2024 7:20 AM | Last Updated on Sun, Aug 4 2024 12:31 PM

Sathyaraj Weapon Movie Telugu Version OTT Details

'బాహుబలి' కట్టప్పగా మనందరికీ సుపరిచితమైన సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వెపన్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి థియేటర్లలో రిలీజ్ అనుకున్నారు. ఎందుకో వెనక్కి తగ్గారు. తాజాగా తమిళ వెర్షన్‌ని ఆహా ఓటీటీలోకి తీసుకురాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ని మరో ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)

సత్యరాజ్, ఆనంద్ రవి లీడ్ రోల్స్ చేసిన 'వెపన్' చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. అయితే థియేటర్లలో స్కిప్ చేసిన తెలుగు వెర్షన్‌ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. యాక్షన్ మూవీ లవర్స్ దీన్ని ట్రై చేయొచ్చు.

'వెపన్' విషయానికొస్తే.. అగ్ని (వసంత్ రవి) ఓ యూట్యూబర్. ప్రకృతి రక్షించేందుకు పాటుపడుతుంటాడు. తేని జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓ సంస్థ దగ్గర బాంబు పేలుడు జరుగుతుంది. ఈ ప్రాంతంలో అగ్నిని పోలీసులు పట్టుకుంటారు. టెర్రిరిస్ట్ అనుమానంతో అరెస్ట్ చేస్తారు. అయితే తాను ప్రపంచానికి తెలియని సూపర్ హీరో మిత్రన్ (సత్యరాజ్) గురించి వెతుకుతున్నానని, ఈ బ్లాస్టులతో సంబంధం లేదని అంటారు. ఇంతకీ మిత్రన్ ఎవరు? అతడికి అగ్నికి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement