'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా? | Prabhas Kalki 2898 OTT Release Date Latest | Sakshi
Sakshi News home page

Kalki OTT: ఓటీటీలోకి 'కల్కి'.. సరిగ్గా ఆ రోజే స్ట్రీమింగ్!

Jul 31 2024 7:26 AM | Updated on Jul 31 2024 8:57 AM

Prabhas Kalki 2898 OTT Release Date Latest

డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' వచ్చి నెల దాటిపోయింది. ఒకటి రెండు చోట్ల తప్పితే థియేటర్ రన్ దాదాపుగా చివరకొచ్చేసింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. తాజాగా స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఎప్పుడు వచ్చే అవకాశముందంటే?

(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా)

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన మూవీ 'కల్కి'. పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఊహించని విధంగా హిట్ టాక్ తెచ్చుకుని ప్రస్తుతం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే పలు రికార్డులు కూడా సాధించింది. అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూడో సినిమాగా నిలిచింది.

ఇకపోతే ఓటీటీలో 'కల్కి' తెలుగు హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ముందే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 8 వారాల గడువు అనుకున్నారు. ఇప్పుడు దానికి కట్టుబడి ఆగస్టు 23న ఓటీటీలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఒకవేళ లేదంటే అద్భుతమైన వీకెండ్ అయిన ఆగస్టు 15నే ఓటీటీలోకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement