బైక్ ర్యాలీలో స్టార్ హీరోయిన్.. అదే కారణమా? | Tamil Movie Weapon Team Bike Rally In Chennai To Create Awareness On Wear Helmet - Sakshi
Sakshi News home page

Tanya Hope: హీరోతో కలిసి బైక్ ర్యాలీలో ఆ బ్యూటీ

Published Mon, Aug 28 2023 3:17 PM | Last Updated on Mon, Aug 28 2023 3:42 PM

Tamil Movie Weapon Team Bike Rally Chennai - Sakshi

మిలియన్‌ స్టూడియో పతాకంపై ఎంఎస్‌ మన్సూర్‌ నిర్మించిన చిత్రం 'వెపన్‌'. సత్యరాజ్‌, వసంత రవి, తాన్య హోప్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గుహన్‌ చెన్నియప్పన్‌ దర్శకత్వం వహించారు. యాక్షన్‌ కిల్లర్‌ నేపథ్యంలో కొత్త టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?)

కాగా చిత్ర నిర్మాత ఆదివారం ఉదయం ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులకు అవగాహన కలిగించే విధంగా వేర్‌ హెల్మెట్‌ పేరుతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసంత రవి, తాన్య హోప్‌ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత మన్సూర్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 

టూ వీలర్స్ హెల్మెట్లు ధరించాల్సిన ఆవశ్యకత, సురక్షితంగా వాహనాలను నడపడం గురించి అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు స్థానిక ఓఎంఆర్‌ రోడ్‌‌లో ప్రారంభమై తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాంతం వరకు సాగింది.

(ఇదీ చదవండి: కేఏ పాల్‌ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement