Tanya Hope
-
బైక్ ర్యాలీలో స్టార్ హీరోయిన్.. అదే కారణమా?
మిలియన్ స్టూడియో పతాకంపై ఎంఎస్ మన్సూర్ నిర్మించిన చిత్రం 'వెపన్'. సత్యరాజ్, వసంత రవి, తాన్య హోప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గుహన్ చెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. యాక్షన్ కిల్లర్ నేపథ్యంలో కొత్త టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) కాగా చిత్ర నిర్మాత ఆదివారం ఉదయం ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులకు అవగాహన కలిగించే విధంగా వేర్ హెల్మెట్ పేరుతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసంత రవి, తాన్య హోప్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత మన్సూర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. టూ వీలర్స్ హెల్మెట్లు ధరించాల్సిన ఆవశ్యకత, సురక్షితంగా వాహనాలను నడపడం గురించి అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు స్థానిక ఓఎంఆర్ రోడ్లో ప్రారంభమై తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతం వరకు సాగింది. (ఇదీ చదవండి: కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?) -
చెన్నై నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వచ్చేవాణ్ణి
‘జీవితం అంటే ఏంటి? మన లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతలా కష్టపడాలి? అనేది ‘ఇదే మా కథ’ చిత్రంలోని సందేశం’’ అని శ్రీకాంత్ అన్నారు. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జి. మహేష్ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా కలిసే నలుగురు బైక్ రైడర్స్ వారి కష్టాలను ఎలా పంచుకున్నారు? ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది ‘ఇదే మా కథ’లో ఆసక్తిగా ఉంటుంది. ఇందులో మహేంద్ర పాత్ర చేశాను. 24 ఏళ్ల క్రితం మిస్ అయిన అమ్మాయిని కలుసుకునేందుకు లడఖ్‌కి వెళ్లే పాత్ర నాది. బైక్‌లోనే ఎందుకు వెళ్తాడు? అనేదానికి కూడా ఓ కథ ఉంటుంది. కులుమనాలి నుంచి లడఖ్ వరకు బైక్ మీద షూటింగ్ చేశాం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్ మీదే తిరిగేవాణ్ణి. చెన్నై నుంచి హైదరాబాద్‌కు కూడా బైక్ మీదే వచ్చేవాణ్ణి. మామూలుగా బైకర్స్ అంతా ఢిల్లీలో కలుస్తుంటారు. ఈ గ్రూపుల్లో కలిసినవాళ్లు జీవితాంతం ఫ్రెండ్స్‌గా ఉంటుంటారు. వారి జీవిత కష్టాలను కూడా ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘సాయితేజ్ క్షేమంగా ఉన్నారు. ఈ రోజు (గురువారం) కూడా తనతో మాట్లాడాను. తను నటించిన ‘రిపబ్లిక్’ పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు శ్రీకాంత్. -
నిర్మాతల కష్టం బాగా తెలిసింది
‘‘యాక్టర్‌గా నా జర్నీ పట్ల సంతృప్తిగానే ఉన్నాను. ప్రతి సినిమా ఓ కొత్త అనుభూతే. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాను. ప్రొడ్యూసర్ అంటే అంతా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. నిర్మాతల కష్టం ఏంటో ఇప్పుడు నాకు ఇంకా బాగా తెలుస్తోంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. గురు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. మనోరమ సమర్పణలో మహేశ్ గొల్లా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో సుమంత్ అశ్విన్ చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ ఉంటుంది. శ్రీకాంత్‌గారికి లడక్‌లో ఓ స్టోరీ ఉంటుంది. పాత్ర ప్రకారం ఆయన కోరుకుంటే ప్రైవేట్ జెట్ ఫ్లయిట్లో వెళ్లొచ్చు. కానీ బైక్ రైడ్ అంటే ఇష్టంతో బైక్‌లో స్టార్ట్ అవుతారు. తండ్రి ఆశయాన్ని పూర్తి చేయడం కోసం భూమికగారు, మా గోల్స్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం నేను, తాన్య రోడ్ జర్నీని బైక్‌పై మొదలుపెడతాం. మేమంతా ఎక్కడ కలుసుకున్నాం? మా జర్నీ ఏమైంది? గోల్స్ రీచ్ అయ్యామా లేదా? అనేది కథ. ► తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ. క్లైమాక్స్‌లో మంచుపై రైడ్ సీన్స్ ఉంటాయి. రోడ్డుపై అంటే ఓకే.. కానీ మంచుపై కష్టం. అందుకే బాగా ప్రాక్టీస్ చేశాం. భూమికగారు ధైర్యవంతురాలు. డూప్స్‌ను పెట్టుకునే వీలు ఉన్నప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ► తాన్యాతో నా లవ్‌ట్రాక్ న్యాచురల్‌గా ఉంటుంది. డైరెక్టర్ గురు ఈ సినిమా కోసం బైక్స్‌పై చాలా పరిశోధన చేశారు. ఏ బైక్‌కు ఎంత సీసీ ఉంటుంది? బైక్ గేర్లు ఇలాంటివాటిపై ఆయనకు అవగాహన ఉంది. ► ఒకే రకమైన సినిమాలు తీయడం నాన్నగారి (నిర్మాత, దర్శకుడు ఎమ్ఎస్ రాజు)కి నచ్చదు. సినిమాకు చెందిన అన్ని కోణాలను టచ్ చేయాలనుకుంటారు. ఆయన డైరెక్షన్లో నేను హీరోగా నటించిన ‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ పూర్తయింది. -
అందరి కథ
రోడ్డు ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇదే మా కథ’. (రైడర్స్ స్టోరి అనేది ఉపశీర్షిక). సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గురుపవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్. సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో మనోరమ గురప్ప సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ఇదే మా కథ’ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. గురుపవన్ మాట్లాడుతూ– ‘‘నేను రైడర్ని. అందుకే ఆ నేపథ్యంలో కథ రాశా. డిసెంబర్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఇది మనందరి కథ. చాలా ఎమోషన్స్‌తో ట్రావెల్ అయ్యే స్క్రిప్ట్’’ అన్నారు జి.మహేష్. శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు చాలాసార్లు రైడింగ్‌కి వెళ్లాను. ఒకసారి హైదరాబాద్ నుండి లడక్‌కి కారులో వెళ్లాను. ఇప్పుడు ఈ టీమ్‌తో లడక్ వెళ్లడం ఒక మంచి అనుభూతి’’ అన్నారు. ‘‘బైక్ రైడింగ్ అంటే ఇష్టం కానీ నేను ప్రొఫెషనల్ రైడర్ని కాదు. గురుపవన్ నాకు శిక్షణ ఇచ్చారు’’ అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిరంజీవి ఎల్. -
రోడ్డు ప్రయాణం
‘‘చాలా రోజుల తర్వాత సినిమా సెట్స్‌పైకి వచ్చాను. త్వరలో మీ అందర్నీ తెరపై కలుసుకుంటాం’’ అని భూమిక అన్నారు. సుమంత్ అశ్వి¯Œ , శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. గురుపవన్ దర్శకత్వంలో జి. మహేష్ నిర్మిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత గురువారం పునఃప్రారంభమైన షూటింగ్లో భూమిక జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నాలుగు పాత్రల చుట్టూ నడిచే రోడ్ జర్నీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లాక్‌డౌన్‌కు ముందుగానే లడఖ్ షెడ్యూల్‌తో సహా 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘భూమిక, శ్రీకాంత్ లాంటి సీనియర్ యాక్టర్లతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘ఏడు నెలల తర్వాత మళ్లీ షూటింగ్‌కు రావడం హ్యాపీ’’ అన్నారు శ్రీకాంత్. ఈ చిత్రానికి కెమెరా: సి. రామ్‌ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిరంజీవి ఎల్, సంగీతం: సునీల్ కశ్యప్. -
అమ్మ సలహాలు తీసుకున్నా
‘‘పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం వస్తే వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. సీనియర్ హీరోలతోనే చేస్తే యంగ్ హీరోలతో అవకాశాలు తగ్గుతాయేమో? లాంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోను. వచ్చిన పాత్రకు నటిగా పూర్తి న్యాయం చేయాలనుకుంటాను’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్, తాన్యా హోప్ హీరోయిన్లు. గత శుక్రవారం ఈ సినిమా విడుదలైన సందర్భంగా పాయల్ చెప్పిన విశేషాలు. ► 2020 చాలా అద్భుతంగా ప్రారంభమైంది. మా ‘డిస్కోరాజా’కు మంచి స్పందన లభిస్తోంది. నా పాత్ర బావుందని, పాత్ర నిడివి పెద్దది కాకపోయినా దాని ప్రభావం బావుందని అభినందిస్తున్నారు. దర్శకుడు వీఐ ఆనంద్‌గారు కథ చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అందుకే కథ విన్న వెంటనే సినిమా చేయాలనుకున్నా. నా పాత్ర నిడివి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ► సినిమాలో మూగ చెవిటి అమ్మాయిగా నటించాను. ఏదైనా విషయాన్ని మాటల్లో అర్థం అయ్యేలా చెప్పేయొచ్చు. కానీ నా పాత్ర ఏదైనా కళ్లతోనే చెప్పాలి. మాట్లాడకుండా భావాన్ని వ్యక్తపరచడం చాలా కష్టం. ఈ పాత్ర చేయడం నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ► కథానుసారం నా పాత్ర రెట్రో లుక్‌లో ఉంటుంది. ఆ పాత్రకు తయారవడం కోసం మా అమ్మ దగ్గర చాలా సలహాలు తీసుకున్నాను. అప్పట్లో డ్రెస్సింగ్ స్టయిల్ ఎలా ఉండేది? ఎలాంటి బట్టలు వేసుకునేవారని అడిగి తెలుసుకున్నా. నా పాత్రను బాలీవుడ్ హీరోయిన్లు హెలెన్, హేమ మాలినీ, టబు, జీనత్ పాత్రల ఆధారంగా డిజైన్ చేశారు. ► గత ఏడాదిగా షూటింగ్స్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాను. ఈ ఇండస్ట్రీ నాకు పేరు, డబ్బు, అభిమానం ఇచ్చింది. అందుకే ఇండస్ట్రీ అంటే చాలా గౌరవం. ఈ మధ్యే తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా పూర్తి చేశాను. అందులో ఐపీఎస్ అధికారిగా నటించా. తమిళంలో ‘ఏంజెల్’ అనే సినిమా చేశా. వరుసగా మంచి సినిమాల్లో భాగమవుతూ వస్తున్నా. అదే కొనసాగించాలనుకుంటున్నాను. అందుకే కథల ఎంపికలో ఇంకా జాగ్రత్తగా ఉంటాను. ► లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో బాధ్యత అంతా హీరోయిన్ల మీదే ఉంటుంది. అది కొంచెం ఒత్తిడిగా అనిపిస్తుంటుంది. కెరీర్ తొలి రోజుల్లేనే ఇలాంటి సినిమాలు చేయడం సంతోషంగా ఉంది. ► ‘ఆర్ఎక్స్ 100’ నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమా. ఆ సినిమాయే నాకు ఓ గుర్తింపు తెచ్చింది. నాకో ఇమేజ్ తీసుకొచ్చింది. తీరిక లేకుండా పని చేసేలా చేసింది. ఆ సినిమా ద్వారా నాకు మాస్ ఫాలోయింగ్ వచ్చింది. ‘ఆర్డీఎక్స్’తో కొంచెం బ్రేక్ చేశాను. ‘వెంకీ మామ’తో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యాను. ఇలా ప్రతి సినిమాకు ఆడియన్స్‌ను పెంచుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను. -
మా కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కోరాజా’. కథానాయికలు నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం (ఈ నెల 24) విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం వెల్లడించింది. కేక్ కట్ చేసి ఆ ఆనందాన్ని చిత్రబృందంతో పంచుకున్నారు రవితేజ. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ – ‘‘రెండేళ్లు ‘డిస్కోరాజా’ చిత్రానికి మేం పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రేక్షకులు నుంచి లభిస్తోన్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. ఓపెనింగ్స్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘యూఎస్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ మొదలైంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి మౌత్ టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్‌లో వచ్చే ట్విస్ట్‌లను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. రవితేజగారు – పాయల్ రాజ్‌పుత్‌ల లవ్ ట్రాక్, రవితేజగారు – ‘వెన్నెల’ కిశోర్ కాంబినేషన్ కామెడీ సీన్స్ .. ఇలా సినిమాలోని మరికొన్ని హైలైట్స్ బాగున్నాయని ప్రేక్షకులు మెచ్చుకుంటు న్నారు. మేం చేసిన కొత్త ప్రయత్నాన్ని అభినందించి, మంచి ఫలితం ఇచ్చారు’’ అన్నారు దర్శకుడు వీఐ ఆనంద్. ‘‘కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా మరింత బాగా నచ్చుతుంది. కొత్త ప్రయత్నాలుగా తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వెంటనే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటే సినిమా హిట్ నుంచి సూపర్ హిట్‌కు వెళుతుంది. ఈ సినిమా బుకింగ్స్ బాగున్నాయి. బీ, సీ సెంటర్స్ దగ్గర కొంచెం డ్రాప్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. రేటింగ్స్ అవి నాకు తెలియదు కానీ... మనకు ప్రేక్షకులు ఇంపార్టెంట్. ప్రేక్షకులు మాకు ఇచ్చిన రేటింగ్ 5కి 4.5 ఉంది’’ అన్నారు డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ ఆడెపు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర కూడా పాల్గొన్నారు. -
డిస్కోరాజా కోసం వేచి చూస్తున్నా
‘‘నేను చూస్తూ పెరిగిన పాత్రలను ‘డిస్కోరాజా’ చిత్రంలో చేశాను.. అందరికీ నచ్చుతాయి. తమన్ మంచి పాటలిచ్చాడు. నిర్మాత రామ్ తాళ్లూరితో నేను చేసిన ఈ రెండో సినిమా నిరుత్సాహపరచదు. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా కోసం మీలాగే (ప్రేక్షకులు) నేనూ వేచి చూస్తున్నాను’’ అని రవితేజ అన్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా, నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘డిస్కోరాజా’. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా ‘డిస్కోరాజా’. ఈ చిత్రం చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేశాను. వీఐ ఆనంద్ బాగా తీశాడు. తమన్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘బిగ్ స్టార్‌తో నేను చేసిన సినిమా ఇది. ప్రతి డైరెక్టర్ రవితేజగారితో ఓ సినిమా చెయ్యాలి.. ఆయన్నుంచి చాలా నేర్చుకోవచ్చు.. నేను నేర్చుకున్నాను. ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘మా బావ రవితేజ ఎనర్జీతో ఎవ్వరూ మ్యాచ్ కాలేరు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ వీవీ వినాయక్. ‘‘రవితేజగారితో ‘రాజా ది గ్రేట్’ సినిమా తీశాను.. ఆయనతో మళ్లీ ఎప్పుడెప్పుడు పని చేయాలా? అని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘‘ఈ సినిమాకు ‘డిస్కోరాజా’ అనే టైటిల్‌ని పెట్టినప్పుడే సక్సెస్ అయ్యారు’’ అన్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ‘‘చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమాలో నటించాను. ఈ సినిమా కొత్తగా, గొప్పగా ఉంటుంది’’ అన్నారు నటుడు సునీల్. ‘‘రవితేజగారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో నటించడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు నభా నటేష్. -
ఆ కిక్‌ని రిపీట్ చేయాలనుకుంటున్నాను
‘‘ఒక నటిగా విభిన్న పాత్రలు చేయాలని ఎవరికైనా ఉంటుంది. అయితే అనుకున్నంత మాత్రాన రావు. నాకు మాత్రం కెరీర్ మొదట్లోనే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సినిమా అభిమానిని. కాబట్టి ఏ జానర్ సినిమా అయినా నాకు ఇష్టమే’’ అన్నారు నభా నటేష్. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. ఇందులో కథానాయికలు నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేష్ చెప్పిన విశేషాలు. ► ‘డిస్కో రాజా’ చిత్రంలో నేను నభ అనే బ్యాంకు ఉద్యోగిని పాత్రలో నటించాను. ఇంతకుముందు నేను కథానాయికగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’లోని మేఘన, ‘ఇస్మార్ట్ శంకర్’లోని చాందిని పాత్రలతో పోల్చి చూసినప్పుడు నభ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అనుబంధాలు, ఆప్యాయతలు, విలువలకు ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి నభ. నా నిజ జీతానికి కాస్త దగ్గరగా ఉంటుందని చెప్పగలను. ► రవితేజగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన నటించిన ‘విక్రమార్కుడు’, ‘కిక్’ సినిమాలు నాకు ఎంతో ఇష్టం. ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజన్స్ చాలా బాగుంటాయి. షూటింగ్ షాట్ గ్యాప్‌లో సినిమాల గురించే కాకుండా ఆయన చాలా విషయాలు మాట్లాడతారు. ఫుడ్, లైఫ్ స్టైల్.. ఇలా సందర్భాన్ని బట్టి మా టాపిక్ ఉంటుంది. రవితేజగారితో వర్క్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశాను. ► వీఐ ఆనంద్‌గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. కథ నాకు బాగా నచ్చింది. ఇది మాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అనొచ్చు. కానీ రవితేజగారి పాత్ర గురించి ప్రస్తుతం నేను చెప్పలేను. రేపు థియేటర్స్‌లో ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారని మాత్రం చెప్పగలను. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లతో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. మేజర్‌గా నా సీన్స్ అన్నీ రవితేజగారు, ‘సత్యం’ రాజేష్, నరేష్గారితోనే ఉన్నాయి. ► యాక్టర్స్ అందరూ పెద్ద నిర్మాణ సంస్థల్లో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటారు. అవకాశాలే కాదు.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కూడా వస్తున్నాయి. అందుకు నా దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాను. ► గత ఏడాది కెరీర్ పరంగా నాకు బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ కిక్ నుంచి ప్రేక్షకులు నన్ను ఇంకా బయటకు రానివ్వడం లేదు. ఎక్కడికి వెళ్లినా ‘ఇస్మార్ట్ శంకర్’ పాటలు, డైలాగ్స్ వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు ఆదరణతో ఈ ఏడాది కూడా అలాంటి కిక్‌నే రిపీట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ► యువ కథానాయికల మధ్య పోటీ ఉండొచ్చు. అందరూ బాగా చేస్తున్నారు. వారితో పాటు నేనూ ఇంకా కష్టపడాలనుకుంటున్నాను. ► ప్రస్తుతం సాయి తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్నాను. అలానే తమిళ, కన్నడ చిత్రాలు చేయడానికి కథలు వింటున్నాను. -
క్లాస్ రాజా
రవితేజ మాస్‌రాజా. వీఐ ఆనంద్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సినిమా కోసం ‘డిస్కో రాజా’గా మారారు. తాజాగా ‘డిస్కో రాజా’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్లో చాలా క్లాస్‌గా కనిపిస్తూ క్లాస్ రాజాలా ఉన్నారు రవితేజ. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. 1980–2019 ఇలా రెండు టైమ్‌లైన్స్‌లో కథ నడుస్తుందని సమాచారం. టీజర్‌ని చూస్తే రవితేజ మీద ఏదో ప్రయోగం జరిగినట్టు అర్థం అవుతోంది. మరి ఆ ప్రయోగం వల్ల రవితేజకు ఏం జరిగింది? దాని వల్ల విలన్స్‌కి ఏం జరిగిందో తెలియాలి. ‘‘రవితేజ ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఆయన రెట్రో గెటప్ ఉంటుంది. అందరికీ నచ్చే విధంగా సినిమాను సిద్ధం చేస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. 2020 జనవరి 24న ‘డిస్కో రాజా’ విడుదల కానుంది. -
రాజీపడని రాజా
ప్రేక్షకుల మందుకు సరికొత్తగా వచ్చేందుకు కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకున్నారు ‘డిస్కో రాజా’. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఇందులో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలోని బుర్మ సేతు అనే పాత్రలో నటిస్తున్నారు తమిళ నటుడు బాబీ సింహా. సాయి రిషిక సమర్పణలో రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ‘డిస్కో రాజా’ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయనున్నట్లు గురువారం నిర్మాత రామ్ తాళ్లూరి వెల్లడించారు. ఈ నెల 18తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రం టీజర్‌ను డిసెంబరు మొదటి వారంలో విడుదల చేస్తారు. ‘‘ఈ సినిమాలో గ్రాఫిక్స్ కీలకమైనవి. మేం రాజీపడాలనుకోవడం లేదు. అందుకే సినిమా విడుదలను వాయిదా వేయక తప్పలేదు’’ అన్నారు రామ్ తాళ్లూరి. ఇంతకుముందు ఈ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆ సిన్మా పూర్తికాలేదు.. ఎలా విడుదల చేస్తారు: రానా
దీపావళికి ముందు రోజు ఆ తర్వాత కొత్త లుక్స్ విడుదల సందడి సాగింది. కొత్తగా వచ్చిన ఆ స్టార్స్ చిత్రాల విశేషాల్లోకి వస్తే... ఇప్పటివరకు ఒంటరిగానే దర్శనం ఇచ్చిన రాజా ఈ దీపావళి పండగకి జంటగా కనిపించి ప్రేమ గొడుగు కింద కాస్తంత చోటు దక్కించుకున్నాడు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.‘‘ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ పాట పాడారు. ఈ పాట పూర్తిగా రెట్రో ఫీల్‌ని కలిగిస్తుంది. విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. డిసెంబరు 20న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. భారతీయ సైనికుడి పాత్రలో రానా నటిస్తున్న చిత్రం ‘1945’. శివకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాజరాజన్ నిర్మాత. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, సినిమాను జనవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘సినిమాను పూర్తి చేయడంలో నిర్మాత సఫలం కాలేదు. ఏడాదిగా వారిని నేను కలవలేదు. ఇదొక అసంపూర్ణమైన సినిమా. ఇప్పుడు పోస్టర్‌ను విడుదల చేశారు. మోసం చేసి సంపాదించాలనుకోవడమే వారి ఆలోచన అనుకుంటా’’ అని ఈ చిత్రం గురించి సోషల్ మీడిమాలో రానా పేర్కొన్నారు. ‘‘షూటింగ్ కోసం చాలా ఖర్చు చేశాను. పూర్తి కాని సినిమాను ఎవరూ విడుదల చేయరు. సినిమా పూర్తయిందా? లేదా? అనే విషయాన్ని ఆడియన్స్ నిర్ణయిస్తారు’’ అని నిర్మాత పేర్కొన్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న రామ్ మరో మాస్ ఫిల్మ్ చేయడానికి రెడీ అయ్యారు. రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రెడ్’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సినిమాను నిర్మిస్తారు. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తారు. వెండితెర భీష్మగా కనిపించనున్నారు నితిన్. ఆయన హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలో రష్మిక మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘భీష్మ’లో రష్మిక, నితిన్ -
మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో...
‘డిస్కోరాజా’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టే సమయం దగ్గరపడింది. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ఐస్‌ల్యాండ్‌లో జరిగింది. భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. అక్కడ మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో కూడా షూటింగ్ చేశారు టీమ్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. వారం రోజులు షూటింగ్ జరిగితే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూరై్తపోతుందట. రజిని తాళ్లూరి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
రాజా లుక్ అదుర్స్
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో రవితేజ లుక్ అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు. అదేవిధంగా ఈ నెల 19న ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. ‘వెన్నెల’ కిషోర్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాని డిసెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఐస్ ల్యాండ్‌లో..
ఇటీవలే గోవా షెడ్యూల్ ముగించుకొని వచ్చిన ‘డిస్కో రాజా’ టీమ్ ప్రస్తుతం ఫారిన్ Ðð ళ్లారు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి సమర్పణలో రజినీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. రామ్ తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘రవితేజ కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. గోవాలో 15 రోజులపాటు షూటింగ్ చేసి వచ్చాం. యూరప్‌లోని ఐస్‌ల్యాండ్‌లో ప్రారంభించిన షెడ్యూల్‌కి దాదాపు 4–5 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుంది. అంత ఖర్చుతో చిత్రీకరిస్తున్న ఈ కీలక సన్నివేశం సినిమాలో కేవలం నాలుగు నిముషాలు మాత్రమే ఉంటుంది. ఐస్ ల్యాండ్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ చిత్రం యాక్షన్ స్టంట్ మాస్టర్స్, పలు ఇంటర్నేషనల్ సినిమాలకు పని చేసిన ఊలి టీమ్ చేస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కి పెద్దపీట వేస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ప్రీ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. టైటిల్‌కు తగ్గట్టుగా ‘డిస్కో రాజా’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. బాబీ సింహా, ‘వెన్నెల’ కిశోర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: సాయి రిషిక, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: తమన్. -
రాజా వచ్చేది అప్పుడే!
రాజా రెడీ అయ్యాడు. క్రిస్మస్ పండక్కి ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. సాయి రిషిక సమర్పణలో రామ్ తాళ్లూరి, రజిని తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రంలోని రవితేజ ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘ఆల్రెడీ విడుదల చేసిన ప్రీ–లుక్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ లొకేషన్స్‌లో చిత్రీకరణ పూర్తి చేశాం. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెల 2న గోవాలో మొదలు కానుంది. టైటిల్‌కు తగ్గట్లుగానే ‘డిస్కోరాజా’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు డైలాగ్స్: అబ్బూరి రవి, సంగీతం: తమన్. -
యాక్షన్ రాజా
ఓ రాజకీయ నాయకుడితో గొడవ పడ్డారంట రవితేజ. దీంతో వారిద్దరి మధ్య వైరం మొదలైంది. ఆ నెక్ట్స్ ఆ రాజకీయ నాయకుడు వేసిన స్కెచ్‌కి దీటుగా ఓ యాక్షన్ రిప్లై ఇచ్చారట రవితేజ. రాజకీయ నాయకుడితో రవితేజ గొడవ ‘డిస్కోరాజా’ సినిమా కోసమే. ఆ గొడవకి కారణం ఏంటి? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం కొంత సమయం వేచి ఉండక తప్పదు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
‘విక్కీ డోనర్’ రీమేక్‌లో తాన్యా!
నటుడు హరీష్ కల్యాణ్‌తో నటి తాన్యా హోప్ జత కట్టనుంది. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న తరువాత నటుడు హరీష్ కల్యాణ్ సినిమాల్లో హీరోగా బిజీ అయిపోయారు. ఈయన నటించిన ప్యార్ ప్రేమ కాదల్, ఇస్పేట్ రాజావుమ్ ఇదయ రాణీయుం వంటి చిత్రాలు మంచి ప్రజాదరణను అందుకున్నాయి. ప్రస్తుతం ధనుష్ రాశీ నేయర్గళే చిత్రంలో నటిస్తున్నాడు. సంజయ్ భారతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. తాజాగా హరీష్ కల్యాణ్ మరో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన హీరోగా నటించనున్న ఈ చిత్రానికి దారాళ్ ప్రభు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది హిందీలో మంచి హిట్ అయిన విక్కీ డోనర్ చిత్రానికి రీమేక్. కాగా ఇందులో అతనికి జంటగా తాన్యాహోప్ హీరోయిన్గా ఎంపికైందన్నది తాజా సమాచారం. ఈ కన్నడ బ్యూటీ గతంలో అరుణ్‌విజయ్‌కు జంటగా తడం చిత్రంలో నటించింది. తొలి చిత్రంతోనే కోలీవుడ్‌లో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి ఇది రెండో అవకాశం. కాగా మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తాన్యా చెబుతోంది. ఇకపోతే హిందీలో నటుడు అనుకపూర్ పోషించిన ప్రధాన పాత్రను తమిళంలో వివేక్ నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణ మారిముత్తు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని స్క్రీన్ సీన్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రం తరువాత నటుడు హరీష్‌కల్యాణ్ దర్శకుడు శశి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిస్తోంది. -
ఢిల్లీ టు స్విట్జర్లాండ్
రాజా ప్రయాణ ప్రణాళిక సిద్ధమైంది. ఇక ఫ్లైట్ ఎక్కడమే ఆలస్యం. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిసింది. రవితేజ, పాయల్ రాజ్‌పుత్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఆగస్టు 4న ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ‘డిస్కో రాజా’ టీమ్ స్విట్జర్లాండ్ వెళ్లనుంది. అక్కడ పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ అనే సినిమాలో రవితేజ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. -
ఇట్స్ ఫైటింగ్ టైమ్
విలన్స్‌పై వీరవిహారం చేస్తున్నారు రాజా. తప్పు చేసిన వారి తుక్కు రేగ్గొడుతున్నారు. మరి.. రాజాకు కోపం వచ్చేలా విలన్స్ ఏం చేశారు? ఆ ఫైట్ విజువల్‌గా ఆడియన్స్‌కు ఎంత కిక్ ఇవ్వనుంది? అనే అంశాలను వెండితెరపై చూడాలి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ వంటి విభన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కోరాజా’. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దిలీప్ సుబ్రరాయన్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నలభై శాతం పూర్తయిందని తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
మూడో రాణి దొరికారు
డిస్కో రాజా ముగ్గురు హీరోయిన్లతో జోడీ కట్టనున్నారు. ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు మూడో రాణి కూడా తోడయ్యారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ కథానాయికలు. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ సినిమాలో మూడో హీరోయిన్గా తాన్యా హోప్ ఎంపికయ్యారు. ఇది వరకు ‘నేను శైలజా, అప్పట్లో ఒకడుండేవాడు, పటేల్ సార్’ వంటి సినిమాల్లో నటించారామె. త్వరలోనే షూటింగ్లో జాయిన్ కానున్నారు తాన్య. -
ఉద్ఘర్ష మంచి అనుభూతిని కలిగిస్తుంది
కన్నడ పరిశ్రమలో వినూత్న సినిమాలతో పేరు పొందారు దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘ఉద్ఘర్ష’. అనూప్ సింగ్ ఠాకూర్, తాన్యా హోప్, ధన్సిక, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. దేవరాజ్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మర్డర్ మిస్టరీ ట్రైలర్ లాంచ్ బెంగళూర్‌లో జరిగింది. ‘కిచ్చ’ సుదీప్ వాయిస్ ఓవర్ అందించిన ఈ ట్రైలర్‌ను కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్, నటి ప్రేమ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనూప్ సింగ్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో మోస్ట్ చాలెంజింగ్ పాత్ర ఇది. సినిమా చేయడంలో కొంచెం ఆలస్యం అయింది. అయినా ఎక్కడా నా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా చూసుకున్నారు దర్శకుడు దేశాయ్. ఆయన సినిమాలో పని చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. గొప్ప థ్రిల్లర్‌ను చూశారన్న అనుభూతిని పొందుతారు’’ అన్నారు. ‘‘సునీల్‌గారి సినిమా అనగానే ఓకే అన్నాను. సునీల్కుమార్గారితో ఆల్రెడీ ‘రే’ అనే సినిమా చేశాను. ఇందులో నా క్యారెక్టర్ ఏంటో చెప్పకూడదు. సస్పెన్స్. కానీ కచ్చితంగా షాక్ అవుతారు’’ అన్నారు హర్షిక పొన్నాడ ‘‘కన్నడ నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పాడు ఠాకూర్. తనని అభినందించి తీరాలి’’ అన్నారు దర్శన్. ‘‘వాయిస్ ఓవర్ అందించిన సుదీప్‌కు థ్యాంక్స్. టీమ్ అందరూ కష్టపడ్డాం. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సునీల్‌కుమార్ దేశాయ్. -
నో డూప్
గాల్లో తేలియాడుతున్నారు హీరోయిన్ సాయిధన్సిక. ఊహల్లో కాదండీ బాబు! నిజంగానే. అయ్యో... ఆమెకు ఎందుకంత కష్టం. అంటారా? కష్టం కాదు ఇష్టం. కన్నడ చిత్రం ‘ఉద్ఘర్ష’ కోసం ఆమె డూప్ లేకుండా రియల్‌గా స్టంట్స్ చేస్తున్నారు. సునైల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో అనూప్‌సింగ్ థాకూర్, సాయి ధన్సిక, తాన్యా హోప్, కబీర్ దుహాన్ సింగ్, కిశోర్, హర్షికా పోనాచా ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని డబ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రం కోసమే రియల్‌గా స్టంట్స్ చేస్తున్నారు ధన్సిక. ‘‘కొన్నిసార్లు జీవితంలో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు ధన్సిక. రజనీకాంత్ ‘కబాలి’ సినిమాలో యోగి పాత్రలో ఆమె చేసిన యాక్షన్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. మరి.. ఈ ‘ఉద్ఘర్ష’ లో «ధన్సిక చేసిన యాక్షన్ ఆడియన్స్‌కి ఏ మాత్రం నచ్చుతుందో చూడాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. -
ట్రైలర్, సినిమా చూసి బాగుందన్నా
‘‘బన్ని ఓ సారి ‘పేపర్ బాయ్’ ట్రైలర్ పంపి చూడమన్నాడు. చూసి చాలా బాగుందన్నా. తర్వాత మెహర్ రమేశ్ వచ్చి ఈ సినిమా చూడమంటే చూసి, చాలా బాగుంది అన్నాను. మీరు ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? అన్నాడు మెహర్ రమేశ్. ఇండస్ట్రీనే నమ్ముకున్న సంపత్‌నందిలాంటి వ్యక్తి ఓ కథ రాసుకుని మరో డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చి, మంచి సినిమా చేసినప్పుడు మా సంస్థ ద్వారా విడుదలైతే ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందనే విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సంతోష్ శోభన్, రియా సుమన్, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్లో డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘పేపర్ బాయ్’ హక్కులను అల్లు అరవింద్‌గారు తీసుకున్నారని చెప్పగానే సినిమా చాలా పెద్ద హిట్ అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అరవింద్‌గారి జడ్జ్‌మెంట్‌పై నాకు అపారమైన నమ్మకం ఉంది. ఇప్పుడు ఇది పెద్ద సినిమా’’ అన్నారు. ‘‘చిన్న సినిమా నిర్మాతలకు ఉండే కష్టాలేంటో నాకు తెలుసు.‘ పేపర్ బాయ్’ లాంటి చిన్న సినిమాకు గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ప్లాట్‌ఫామ్ దొరికింది. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘అరవింద్‌గారు రిలీజ్ చేస్తున్నారనగానే ఇదొక మంచి సినిమా అనే గుర్తింపు వచ్చింది. ఆయనకు మా సినిమా గురించి చెప్పిన మెహర్ రమేశ్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు సంపత్ నంది. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిగా కష్టపడుతున్నాం. గీతా ఆర్ట్స్‌వారు మా సినిమాను తీసుకోవడం వల్ల ఈ కష్టం మరచిపోయాం’’ అన్నారు జయశంకర్. దర్శకులు మెహర్ రమేశ్, కల్యాణ్ కృష్ణ, సంతోష్ శోభన్ తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజులు ముందుగానే వస్తున్నాం
సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పేపర్ బాయ్’. తాన్యా హోప్ కీలక పాత్ర చేశారు. దర్శకుడు సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహులు నిర్మించారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘ఓయ్ ఓయ్...పేపర్ బాయ్’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. భీమ్స్ స్వరకర్త. ప్రముఖ సంగీత దర్శకుడు చంద్రబోస్ ఈ పాటను పాడటం విశేషం. ఈ సినిమాను ముందు అనుకున్నట్లుగా సెప్టెంబర్ 7న కాకుండా ఈ నెల 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపారు. సంపత్ నంది మాట్లాడుతూ – ‘‘టీజర్, ట్రైలర్లతో పాటు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు రోడ్ ట్రిప్ ప్లాన్ చేశాం. పేపర్ బాయ్స్ ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది. పాట పాడిన చంద్రబోస్‌గారికి, టీమ్ అందరి తరఫున థ్యాంక్స్’’ అన్నారు. ‘‘టెన్షన్ పడేంత టైమ్ కూడా లేదు. వారం రోజులు ముందే వస్తున్నాం. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు సంతోష్ శోభన్. చంద్రబోస్‌గారిని అనుసరిస్తున్న శిష్యుల్లో నేను, కాసర్ల శ్యామ్ కూడా ఉన్నాం. ఈ సినిమా టైటిల్ సాంగ్ పాడినందుకు చంద్రబోస్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు భీమ్స్. ‘‘నేను లిరిక్స్ అందించిన పాటకు చంద్రబోస్‌గారు గాత్రం అందించడం నా వరం. నా అదృష్టంగా భావిస్తున్నా. సంపత్ నంది మంచి డైలాగ్స్ రాశారు’’ అన్నారు కాసర్ల శ్యామ్. ఈ కార్యక్రమంలో నిర్మాత నరసింహులు, డైరెక్టర్ జయశంకర్, కెమెరామెన్ సౌందర రాజన్ తదితరులు పాల్గొన్నారు.