‘‘యాక్టర్‌గా నా జర్నీ పట్ల సంతృప్తిగానే ఉన్నాను. ప్రతి సినిమా ఓ కొత్త అనుభూతే. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాను. ప్రొడ్యూసర్ అంటే అంతా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. నిర్మాతల కష్టం ఏంటో ఇప్పుడు నాకు ఇంకా బాగా తెలుస్తోంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. గురు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. మనోరమ సమర్పణలో మహేశ్ గొల్లా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో సుమంత్ అశ్విన్ చెప్పిన విశేషాలు.
► ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ ఉంటుంది. శ్రీకాంత్‌గారికి లడక్‌లో ఓ స్టోరీ ఉంటుంది. పాత్ర ప్రకారం ఆయన కోరుకుంటే ప్రైవేట్ జెట్ ఫ్లయిట్‌లో వెళ్లొచ్చు. కానీ బైక్ రైడ్ అంటే ఇష్టంతో బైక్‌లో స్టార్ట్ అవుతారు. తండ్రి ఆశయాన్ని పూర్తి చేయడం కోసం భూమికగారు, మా గోల్స్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం నేను, తాన్య రోడ్ జర్నీని బైక్‌పై మొదలుపెడతాం. మేమంతా ఎక్కడ కలుసుకున్నాం? మా జర్నీ ఏమైంది? గోల్స్ రీచ్ అయ్యామా లేదా? అనేది కథ.
► తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ. క్లైమాక్స్‌లో మంచుపై రైడ్ సీన్స్ ఉంటాయి. రోడ్డుపై అంటే ఓకే.. కానీ మంచుపై కష్టం. అందుకే బాగా ప్రాక్టీస్ చేశాం. భూమికగారు ధైర్యవంతురాలు. డూప్స్‌ను పెట్టుకునే వీలు ఉన్నప్పటికీ ఆమె ఒప్పుకోలేదు.
► తాన్యాతో నా లవ్‌ట్రాక్ న్యాచురల్‌గా ఉంటుంది. డైరెక్టర్ గురు ఈ సినిమా కోసం బైక్స్‌పై చాలా పరిశోధన చేశారు. ఏ బైక్‌కు ఎంత సీసీ ఉంటుంది? బైక్ గేర్లు ఇలాంటివాటిపై ఆయనకు అవగాహన ఉంది.
► ఒకే రకమైన సినిమాలు తీయడం నాన్నగారి (నిర్మాత, దర్శకుడు ఎమ్‌ఎస్ రాజు)కి నచ్చదు. సినిమాకు చెందిన అన్ని కోణాలను టచ్ చేయాలనుకుంటారు. ఆయన డైరెక్షన్‌లో నేను హీరోగా నటించిన ‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment