Sumanth Ashwin
-
‘7 డేస్ 6 నైట్స్’ వసూళ్లు పెరుగుతున్నా చిన్న వెలితి: ఎంఎస్ రాజు
‘‘మా ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాని ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూశాను.. వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. చాలా సంతోషంగా అనిపించింది’’ అని డైరెక్టర్ ఎంఎస్ రాజు అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలయింది. (చదవండి: అప్పుడు నాకు ఆ సెన్స్, జ్ఞానం లేదు: నాగబాబు) ఈ చిత్రం సక్సెస్ మీట్లో చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘శంకరాభరణం’ నుంచి ఇప్పటివరకు క్లాసిక్ సినిమాల వసూళ్లు మౌత్ టాక్ వల్ల పెరిగాయి. మా సినిమాకి కూడా మౌత్ టాక్‌తో ప్రతి షోకి అన్ని చోట్ల వసూళ్లు పెరుగుతుండటం హ్యాపీ. అయితే, ఒక చిన్న వెలితి. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందనేది చాలా మంది ఉద్దేశం. ఇప్పుడు దాసరి నారాయణరావుగారిలా, కె.బాలచందర్గారిలా చిన్న సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే?, ఈ రోజు ‘హ్యాపీ డేస్’ లాంటి సినిమాలు వస్తే? పరిస్థితి ఏంటి? అని ఆలోచించాల్సిన పరిస్థితి. చిన్న సినిమాలకు, నాలుగు కోట్ల బడ్జెట్ లోపు చిత్రాలకు టికెట్ రేట్లు తగ్గించాలి. రూ.200 టికెట్ పెట్టి చిన్న సినిమాలను ఎవరు చూస్తారు?. ప్రభుత్వాలతో చర్చించి ధర తగ్గించేలా నిర్ణయం తీసుకోవాలి’’ అన్నారు. -
చిన్న సినిమాలకు ఇదే సరైన సమయం
‘‘7 డేస్ 6 నైట్స్’ డీసెంట్ ఫిల్మ్.. యువతరంతో పాటు ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. మార్చి తర్వాత ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు విడుదలై, మంచి హిట్టయ్యాయి. చిన్న సినిమాలు రావడానికి సరైన సమయం ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత ఎంఎస్ రాజు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలనుకుంటున్నాం. మా చిత్రాన్ని యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాలని తక్కువ టికెట్ రేట్స్ పెడుతున్నాం. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి సుమంత్, అమ్మాయి రిషితా దేవికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు రిషితా దేవి. ‘‘7 డేస్ 6 నైట్స్’ నాకు ఒక మాస్టర్ పీస్‌లా అనిపిస్తోంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. నిర్మాత రజనీకాంత్ .ఎస్, కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
దేవుడు వరమిస్తే.. మళ్లీ ఎంఎస్ రాజు గారి అబ్బాయిగానే పుడతా: సుమంత్ అశ్విన్
మా నాన్న(నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు) ఎలాంటి ఫాదర్ అని ఎప్పుడు ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే అది ఇచ్చారు. ఆయనే ఫర్ఫెక్ట్ ఫాదర్. మరో జన్మంటూ ఉంటే.. దేవుడు వచ్చి ఏం కావాలని అడిగితే.. మళ్లీ ఎంఎస్ రాజు దంపతులు కడుపునే పుట్టాలని కోరుకుంటా’అని యంగ్ హీరో సుమంత్ అశ్విన్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా ఎంఎస్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘7 డేస్ 6నైట్స్’.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. జూన్ 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నా కెరీర్లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి. అయితే, ఈ జర్నీ చాలా అందంగా ఉంది. నా తొలి మూవీ'తూనీగ తూనీగ’విడుదలైన 10 ఏళ్లు కావోస్తుంది. ఈ పదేళ్ల కూడా చాలా స్పీడ్‌గా వెళ్లింది. ►'తూనీగ తూనీగ' కోసం మూడు నాలుగు సినిమాలకు పెట్టినంత ఎఫర్ట్ పెట్టాం. ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. కొన్ని సినిమాలు పేపర్ మీద బావుంటాయి. ఎక్కడో చిన్న తప్పు వల్ల అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే, మనం చేసే హార్డ్ వర్క్ విషయంలో ఎటువంటి లోపం ఉండకూడదు. ►ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే..'7 డేస్ 6 నైట్స్’లో డిఫరెంట్ రోల్ చేశా.రియాలిటీకి దగ్గరగా ఉన్న పాత్ర అది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల కావచ్చు, మరొకటి కావచ్చు... ప్రేక్షకులు వరల్డ్ సినిమా చూశారు. అప్డేట్ అయ్యారు. వేరే లెవెల్లో ఉన్నారు. వాళ్ళకు రీచ్ అవ్వాలంటే మనం కూడా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ చేయాలి. టైమ్ పట్టినా కొత్త రోల్స్ చేయాలనుకుంటున్నాను. ►ఈ సినిమాలో నేను ఒక నార్మల్ యంగ్‌స్టర్ పాత్ర చేశాను. అతను ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకుంటాడు. జీవితంలో తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎక్కువ స్మోక్ చేస్తాడు. వెయిట్ చేస్తాడు. తన మీద కేర్ తీసుకోడు. అటువంటి మనిషి ఎలా ఉంటాడో... నా లుక్ కూడా అలాగే ఉంటుంది. ►ఇందులో రోహన్‌ది ఇంపార్టెంట్ రోల్. అతడిని నాన్నే సెలెక్ట్ చేశారు. ముందు ఎస్టాబ్లిష్ హీరోని తీసుకుంటే బావుంటుందని అనుకున్నా. సినిమా చూశాక పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. మెహర్ ఎంత బాగా చేసిందంటే... ఆమెను 'సతి' సినిమాలో కూడా తీసుకున్నాం. ►నాన్న(ఎంఎస్ రాజు) ఇప్పుడు ఫుల్ ఫైర్‌లో ఉన్నాడు. ఎంఎస్ రాజు 2.0 అనుకోవచ్చు. 'డర్టీ హరి'తో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. నాన్నతో సన్నిహితంగా ఉంటాను కాబట్టి ఆయనేంటో నాకు తెలుసు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తర్వాత మధ్యలో ఎక్కడో 'ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి. సేఫ్ గేమ్... ఫ్యామిలీలు, టార్గెట్ ఆడియన్స్' అంటూ చేసిన సినిమాలు కథల పరంగా కొంత డిజప్పాయింట్ చేసి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి... నాన్నగారు కంప్లీట్ అప్ గ్రేడ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. '7 డేస్ 6 నైట్స్'లో ఎంఎస్ రాజు మార్క్ ఉంటుంది. అదే సమయంలో 20 ఏళ్ళ దర్శకుడు తీసినట్టు ఉంటుంది. ► చిన్నప్పుడు, బాగా వెయిట్ ఉండేవాడిని. అప్పుడు వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు గారిని చూస్తే ఫిట్‌గా, హ్యాండ్సమ్గా ఉండేవారు. మంచి డ్రస్సులు వేసుకునేవారు. నేను వెయిట్ వల్ల అటువంటి డ్రస్సులు వేసుకోలేకపోయేవాడిని. డ్యాన్సులు చేసేవారు. షూటింగ్స్ చేసేటప్పుడు వాళ్ళను చూసి... నేను అలా చేయలేనని అనుకున్నా. అప్పుడు సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ కావాలనుకున్నా. 'వర్షం' సమయంలో నిక్సన్ మాస్టర్ పరిచయం అయ్యారు. ఆయన దగ్గర ఏరోబిక్, డ్యాన్సులో కొన్ని క్లాసులు తీసుకున్నా. అప్పుడు వెయిట్ తగ్గా. మా సినిమాల్లో హీరో హీరోయిన్ల ఫోటోషూట్స్ టైమ్‌లో వెళితే... నా ఫోటోలు కొన్ని తీశారు. అవి త్రివిక్రమ్ గారు, ప్రభుదేవా గారు చూసి 'చాలా బావున్నాడు. బాడీ బిల్డ్ చేస్తే మంచి హీరో అవుతాడు' అని చెప్పారు. నా మనసులో అది ఉండిపోయింది. దాంతో ముంబై వెళ్లి యాక్టింగ్ కోర్స్ చేశా. హీరో కావాలనుకున్నా. ► నాకు బోల్డ్ అనే పదం నచ్చదు. యువత అడల్ట్ కంటెంట్ కోసం థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు. ఎవరూ రారు కూడా! ఇంటర్నెట్లో బోలెడు కంటెంట్ ఉంది. కథ ఉంటేనే ఎవరైనా థియేటర్లకు వస్తారు.'7 డేస్ 6 నైట్స్' ఫ్యామిలీతో చూసే మూవీ ► 'డర్టీ హరి'తో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి. దాని తర్వాత ఏ సినిమా చేయాలని నాన్న ఆలోచిస్తున్నారు. ఆయన దగ్గర ఆరేడు కథలు ఉన్నాయి. అందులో ఇది చేద్దామని అనుకున్నప్పుడు... నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇండస్ట్రీలో చాలా మంది దర్శక, నిర్మాతలు నాన్నగారిని హానీ అని పిలుస్తారు. 'డర్టీ హరి' తర్వాత నాన్నగారు వైల్డ్ గా అనిపించారు. అందుకని 'వైల్డ్ హనీ ప్రొడక్షన్స్' అని పేరు పెట్టా. -
ఇందులో నాది బోల్డ్ రోల్ కాదు: హీరోయిన్
‘‘7 డేస్ 6 నైట్స్’ ఒక ఫన్ ఫిల్మ్. టీనేజ్, యంగ్‌స్టర్ వైబ్స్ ఉన్న కథ. ఎంఎస్ రాజుగారి సినిమాలు చూశాను. ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యాను. కథ కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను’’ అని హీరోయిన్ మెహర్ చాహల్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్ చాహల్ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహర్ చాహల్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నేను అస్సాంలో పుట్టాను. మా నాన్నగారు టీ ప్లాంటేషన్స్‌లో పని చేయడం వల్ల దేశంలో చాలా ప్రాంతాలు తిరిగాను. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు ప్రస్తుతం నా తల్లిదండ్రులతో కలిసి కోల్‌కతాలో ఉంటున్నాను. అయితే సినిమాల కోసం ముంబైలో ఉన్నాను. ముంబైలో నన్ను చూసిన ఎంఎస్ రాజుగారు మా మేనేజర్‌తో మాట్లాడారు. హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చాను.. సెలెక్ట్ చేశారు. ‘7 డేస్ 6 నైట్స్’లో నా పాత్ర పేరు రతికా. సుమంత్ అశ్విన్‌కి జోడీగా కనిపిస్తాను. ఇందులో నాది బోల్డ్ రోల్ కాదు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్. హిందీలో ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌లో జోక్స్ ఎలా ఉంటాయో ఇందులోనూ అలా ఉంటాయి.. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఫుల్‌గా నవ్వుకోవచ్చు. యూత్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు. -
మంగళం పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది: రోహన్
‘‘7 డేస్ 6 నైట్స్’లో నా పాత్ర పేరు మంగళం. తర్వాత ఏమవుతుందో అని ఆలోచించకుండా జీవితంలో అనుకున్నది చేస్తాడు. స్నేహితుడు ఆనంద్ (సుమంత్ అశ్విన్)తో కలిసి మంగళం బ్యాచిలర్ ట్రిప్‌కి గోవా వెళతాడు. ఆ ట్రిప్‌లో ఏం జరిగింది? అనేది ‘7 డేస్ 6 నైట్స్’ కథ’’ అని రోహన్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్ చాహల్ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజవుతోంది. (చదవండి: వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!) ఈ సందర్భంగా రోహన్ మాట్లాడుతూ– ‘‘నా షో రీల్ చూసిన సునీల్‌గారు ఎంఎస్ రాజుగారికి చూపించారట. రెండు ఆడిషన్స్ తర్వాత నన్ను ఫైనలైజ్ చేశారు రాజుగారు. తొలి సినిమాకే కామెడీ చేయడం కష్టం అనుకున్నాను. అయితే ఎంఎస్ రాజుగారు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో చేశాను. మంగళం పాత్ర తెలంగాణ యాసలో మాట్లాడాలి.. అందుకోసం ఈ మధ్య వచ్చిన తెలంగాణ యాస చిత్రాలు చూశాను. నా నిజజీవితానికి ఆపోజిట్‌గా ఉండే మంగళం పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. హీరోగానే చేయాలనుకోవడం లేదు.. కథలో ఇంపార్టెన్స్ ఉంటే ముఖ్య పాత్రలు కూడా చేస్తాను’’ అన్నారు. -
7 డేస్ 6 నైట్స్ ట్రైలర్ వచ్చేసింది..
‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, క్రితిక శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ చిత్రనిర్మాణంలో భాగస్వాములైన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ–‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. సుమంత్ అశ్విన్ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించాడు. మెహర్ చాహల్, రోహన్, క్రితికా శెట్టి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు’’ అన్నారు. ‘‘ఆద్యంతం నవ్వించే, కవ్వించే సన్నివేశాలతో అందరికీ నచ్చే యూత్ సినిమా ఇది. హైదరాబాద్, బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలో చిత్రీకరించాం’’ అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, కో ప్రొడ్యూసర్స్: జె.శ్రీనివాసరాజు, మంతెన రాము. చదవండి: నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదు.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు -
భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు
MS Raju Says Bhumika Serious On Fighter In Okkadu Shooting: ఒక్కడు, వర్షం, నువ్ వస్తానంటే నేనొద్దంటాన వంటి తదితర బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన 2008లో వచ్చిన 'వాన' సినిమాతో డైరెక్టర్‌గా మారారు. తర్వాత తూనిగ తూనిగ (2012), డర్టీ హరీ (2020) చిత్రాలతో దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన చిత్రం '7 డేస్ 6 నైట్స్'. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎంఎస్ రాజు, ఆయన తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఒక టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన భూమిక గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో ఫైటర్‌పై భూమిక సీరియస్ అయిందన్న విషయం గురించి హోస్ట్ అడిగాడు. అందుకు సమాధానంగా 'నేను, మహేశ్ బాబు, భూమిక పక్కపక్కన కూర్చున్నాం. ఒక్కసారిగా భూమిక పైకి లేచింది. ఏం తిట్టిందో తెలియదు. ఇంగ్లీషులో ఏదో తిట్టింది. అదేదో భయంకరంగా ఉంది.' అని ఎంఎస్ రాజు తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్ -
నవ్వించే.. కవ్వించేలా ‘7 డేస్ 6 నైట్స్’
‘డర్టీ హరి’ చిత్రం తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, క్రితికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘ఆకట్టుకునే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్‌తో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’అన్నారు. ‘‘అందరికీ నచ్చే యూత్‌ఫుల్ సినిమా ఇది’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సహ నిర్మాతల్లో ఒకరైన జె. శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో–డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము. -
కొత్త సినిమా ప్రకటించిన ఎమ్ఎస్ రాజు, ఫస్ట్‌లుక్ రిలీజ్
‘డర్టీ హరి’ తర్వాత ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించిన ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మంగళవారం (మే 10)న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఎమ్ఎస్ రాజు దర్శకత్వంలో రానున్న ‘సతి’ ఫస్ట్ లుక్ రిలీజైంది. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేశ్ కీలక పాత్రలో నటించనున్నాడు. రఘురామ్, టి. సారంగ సురేష్‌కుమార్, డా. రవి దాట్ల, సుమంత్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘కొత్త దంపతుల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథ ఇది. ఉద్వేగభరిత సన్నివేశాలతో రూపొందిస్తున్న ‘సతి’ నా కెరీర్లో గర్వించదగ్గ చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు ఎమ్ఎస్ రాజు. ఈ సినిమాకు సహనిర్మాత: జె.వాస రాజు. Presenting you the First Look of our next #Sathi 💥 A @SumanthArtPro proud presentation 😇 Produced By @WildHoneyPro & @RamantraCreate @MSumanthAshwin #MeherChahal @DrRaviPRaju @EditorJunaid @PulagamOfficial pic.twitter.com/zQJMQz8HWO — MS Raju (@MSRajuOfficial) May 10, 2022 -
7 డేస్ 6 నైట్స్.. ఇది హారర్ మూవీ కాదు
‘డర్టీ హరి’ చిత్రం తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్–మెహర్ చాహల్, రోహన్–క్రితికా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ఒక రోడ్ ట్రిప్‌కు వెళ్లిన ఇద్దరు యువకుల కథే ‘7 డేస్ 6 నైట్స్’. టైటిల్ చూసి హారర్ చిత్రం అనుకోవద్దు.. ఇదొక కూల్ ఎంటర్టైనర్. నాన్నగారు (ఎంఎస్ రాజు) అందంగా చిత్రీకరించారు’’ అన్నారు. ‘‘రాజుగారి నుంచి వచ్చే మరో క్లాసిక్ చిత్రమిది’’ అన్నారు చిత్ర సహనిర్మాత జె. శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, సహనిర్మాత: మంతెన రాము. -
ఆ ప్రశంసలతో మా కష్టాన్ని మర్చిపోయాం
‘‘చాలా రోజుల తర్వాత మంచి విజయం దక్కింది. సినిమా చూసినవారు బాగుందని అభినందిస్తున్నారు. దర్శకుడు గురు బాగా తీశారు’’ అన్నారు శ్రీకాంత్. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రధారులుగా జి. మహేష్ నిర్మాణంలో గురు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇదే మా కథ’. ఈ నెల 2న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాం. ప్రేక్షకుల ప్రశంసలు మా కష్టాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి’’ అన్నారు. ‘‘మౌత్ పబ్లిసిటీతో ముందుకు వెళ్తున్నందువల్లే మా సినిమా సక్సెస్‌మీట్‌ను ఎమోషనల్ హిట్ అంటున్నాం. ‘మార్నింగ్ సినిమా చూశాను... ఈవెనింగ్ మా ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్లి సినిమా చూపించాను’ అని ఒకరు ఫోన్ చేసి చెప్పారు’’ అన్నారు గురు. ‘‘ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. సినిమా చూసినవారు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు జి. మహేశ్. చదవండి: ‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ -
Idhe Maa Katha Review: ‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇదే మా కథ నటీనటులు : శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తాన్యా హోప్ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ నిర్మాత : జీ మహేష్ దర్శకత్వం : గురు పవన్ సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ : రాంప్రసాద్ ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ విడుదల తేది : అక్టోబర్ 2,2021 సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జి. మహేష్ నిర్మించిన ఈ సినిమా శనివారం (అక్టొబర్ 2)న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలా ఎందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? మహేంద్ర(శ్రీకాంత్) క్యాన్సర్ బారిన పడిన ఓ బైక్ రైడర్. తన చివరి లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం బైక్‌పై లడఖ్‌కి బయలుదేరుతాడు. లక్ష్మీ (భూమిక) సాధారణ గృహిణి. భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నా ఆమె.. తన తండ్రి చివరి కోరికను తీర్చడం కోసం భర్తను ఎదురించి లడఖ్‌కి బయలుదేరుతుంది. మరోవైపు యూట్యూబర్ కమ్ బైక్ రైడర్ అజయ్(సుమంత్ అశ్విన్) ఛాంపియన్ షిప్ సాధించాలని లడఖ్ బయలు దేరుతాడు. ప్రేమ పేరుతో మోసానికి గురైన మేఘన (తాన్యా హోప్) బైక్ రైడింగ్‌కి వెళ్తుంది. వీరంతా అనుకోకుండా మార్గమధ్యలో కలుసుకుంటారు. చావు, బతుకులతో పోరాడుతున్న మహేంద్ర.. బైక్‌పైనే లడఖ్‌కి ఎందుకు వెళ్తాడు? అనుకోకుండా కలిసే ఈ నలుగురు బైక్ రైడర్స్ వారి కష్టాలను ఎలా పంచుకున్నారు? ఎలా పరిష్కరించుకున్నారు? అన్నదే ‘ఇదే మా కథ’ స్టోరీ. ఎవరెలా చేశారంటే.. భగ్న ప్రేమికుడు మహేంద్ర పాత్రలో శ్రీకాంత్ అద్భుతంగా నటించాడు. సినిమా భారాన్ని మొత్తం తన భూజాన వేసుకొని నడిపించాడు. సాధారణ గృహిణి లక్ష్మీ పాత్రలో భూమిక ఒదిగిపోయింది. కుటుంభ బాధ్యతలు మోస్తూనే.. తండ్రి ఆశయం కోసం మోటార్ రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధించే మహిళగా భూమిక తనదైన నటనతో మెప్పించింది. ఇక బైక్ రైడర్ అజయ్‌గా సుమంత్ అశ్విన్ అదరగొట్టేశాడు. చాలా హూషారైన పాత్ర తనది. కొత్తలుక్‌తో చాలా కాన్ఫిడెన్స్‌గా నటించాడు. ఇక మేఘనగా తాన్యా హూప్ పర్వాలేదనిపించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. సప్తగిరి, పృథ్వీ, జబర్దస్త్ రాంప్రసాద్ తమదైన కామెడీతో నవ్వించారు. శ్రీకాంత్ అయ్యంగార్,సుబ్బరాజు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? నలుగురు బైక్ రైడర్స్ జీవితాలకు సంబంధించిన ఎమోషనల్ కథే ‘ఇదే మా కథ’మూవీ. నలుగురు వ్యక్తుల జీవితంతో చోటు చేసుకున్న సమస్యలు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఎలా తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారనే నేపథ్యంలో కథ నడుస్తుంది. కంప్లీట్ రోడ్ జర్నీగా సాగే ఈ కథకి ఎమోషనల్ టచ్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గురు పవన్. రొటీన్ కథే అయినప్పటికీ.. కథనాన్ని ఇంట్రెస్టింగ్ నడిపించాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. ఫస్టాఫ్‌లో పాత్రలను పరిచయం చెయ్యడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. నలుగురు కలిశాక కానీ సినిమాపై ఆసక్తి పెరగదు. మధ్యలో వచ్చే సప్తగిరి, రాంప్రసాద్, పృథ్వీ ల కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సప్తగరి పంచ్‌లు.. నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ కంటెంట్‌ని ఇంకా ఎలివేట్ చేసి ఉంటే ఈ మూవీ మరోస్థాయికి వెళ్లేది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భోచితంగా వస్తాయి. సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫి సినిమాకు హైలెట్. బైక్ విన్యాసాలతో పాటు సానా సన్నివేశాలను బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
చెన్నై నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వచ్చేవాణ్ణి
‘జీవితం అంటే ఏంటి? మన లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతలా కష్టపడాలి? అనేది ‘ఇదే మా కథ’ చిత్రంలోని సందేశం’’ అని శ్రీకాంత్ అన్నారు. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జి. మహేష్ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా కలిసే నలుగురు బైక్ రైడర్స్ వారి కష్టాలను ఎలా పంచుకున్నారు? ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది ‘ఇదే మా కథ’లో ఆసక్తిగా ఉంటుంది. ఇందులో మహేంద్ర పాత్ర చేశాను. 24 ఏళ్ల క్రితం మిస్ అయిన అమ్మాయిని కలుసుకునేందుకు లడఖ్‌కి వెళ్లే పాత్ర నాది. బైక్‌లోనే ఎందుకు వెళ్తాడు? అనేదానికి కూడా ఓ కథ ఉంటుంది. కులుమనాలి నుంచి లడఖ్ వరకు బైక్ మీద షూటింగ్ చేశాం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్ మీదే తిరిగేవాణ్ణి. చెన్నై నుంచి హైదరాబాద్‌కు కూడా బైక్ మీదే వచ్చేవాణ్ణి. మామూలుగా బైకర్స్ అంతా ఢిల్లీలో కలుస్తుంటారు. ఈ గ్రూపుల్లో కలిసినవాళ్లు జీవితాంతం ఫ్రెండ్స్‌గా ఉంటుంటారు. వారి జీవిత కష్టాలను కూడా ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘సాయితేజ్ క్షేమంగా ఉన్నారు. ఈ రోజు (గురువారం) కూడా తనతో మాట్లాడాను. తను నటించిన ‘రిపబ్లిక్’ పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు శ్రీకాంత్. -
నిర్మాతల కష్టం బాగా తెలిసింది
‘‘యాక్టర్‌గా నా జర్నీ పట్ల సంతృప్తిగానే ఉన్నాను. ప్రతి సినిమా ఓ కొత్త అనుభూతే. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాను. ప్రొడ్యూసర్ అంటే అంతా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. నిర్మాతల కష్టం ఏంటో ఇప్పుడు నాకు ఇంకా బాగా తెలుస్తోంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. గురు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. మనోరమ సమర్పణలో మహేశ్ గొల్లా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో సుమంత్ అశ్విన్ చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ ఉంటుంది. శ్రీకాంత్‌గారికి లడక్‌లో ఓ స్టోరీ ఉంటుంది. పాత్ర ప్రకారం ఆయన కోరుకుంటే ప్రైవేట్ జెట్ ఫ్లయిట్లో వెళ్లొచ్చు. కానీ బైక్ రైడ్ అంటే ఇష్టంతో బైక్‌లో స్టార్ట్ అవుతారు. తండ్రి ఆశయాన్ని పూర్తి చేయడం కోసం భూమికగారు, మా గోల్స్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం నేను, తాన్య రోడ్ జర్నీని బైక్‌పై మొదలుపెడతాం. మేమంతా ఎక్కడ కలుసుకున్నాం? మా జర్నీ ఏమైంది? గోల్స్ రీచ్ అయ్యామా లేదా? అనేది కథ. ► తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ. క్లైమాక్స్‌లో మంచుపై రైడ్ సీన్స్ ఉంటాయి. రోడ్డుపై అంటే ఓకే.. కానీ మంచుపై కష్టం. అందుకే బాగా ప్రాక్టీస్ చేశాం. భూమికగారు ధైర్యవంతురాలు. డూప్స్‌ను పెట్టుకునే వీలు ఉన్నప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ► తాన్యాతో నా లవ్‌ట్రాక్ న్యాచురల్‌గా ఉంటుంది. డైరెక్టర్ గురు ఈ సినిమా కోసం బైక్స్‌పై చాలా పరిశోధన చేశారు. ఏ బైక్‌కు ఎంత సీసీ ఉంటుంది? బైక్ గేర్లు ఇలాంటివాటిపై ఆయనకు అవగాహన ఉంది. ► ఒకే రకమైన సినిమాలు తీయడం నాన్నగారి (నిర్మాత, దర్శకుడు ఎమ్ఎస్ రాజు)కి నచ్చదు. సినిమాకు చెందిన అన్ని కోణాలను టచ్ చేయాలనుకుంటారు. ఆయన డైరెక్షన్లో నేను హీరోగా నటించిన ‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ పూర్తయింది. -
'ఇదే మా కథ' కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేసిన వెంకటేశ్
సుమంత్ అశ్విన్, తాన్యా హోప్ జంటగా నటించిన చిత్రం 'ఇదే మా కథ' రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను హీరో విక్టరీ వెంకటేశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాంత్, భూమికా చావ్లా ముఖ్య పాత్రలు పోషించారు. మతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా నిర్మించిన ఈ సినిమాను నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. చదవండి: నేను ఇన్స్టాల్మెంట్స్లో ప్రేమించను: నటి -
‘‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ పూర్తి..ఎం.ఎస్ రాజు ఎమోషనల్
‘‘7 డేస్ 6 నైట్స్’ చిత్రంతో మా అబ్బాయి సుమంత్ అశ్విన్‌ని నిర్మాతగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ఆకట్టుకునే సీన్స్, అద్భుతమైన విజువల్స్‌తో హృదయాన్ని హత్తుకునేలా ఈ కథ ఉంటుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌కి ఈ చిత్రంతో పూర్వ వైభవం వస్తుంది’’ అన్నారు ఎంఎస్ రాజు. సుమంత్ అశ్విన్, మెహర్ చావల్, రోహన్, క్రితికా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్ప ణలో ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘‘నిర్మాణం– దర్శకత్వం ఏదయినా నాన్నగారు ఎంతో పట్టుదలతో, ఇష్టంతో చేస్తారు’’ అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో–డైరెక్టర్: యూవీ సుష్మ, సహనిర్మాతలు: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము. చదవండి : ఆ స్టార్ హీరో సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న రకుల్! అఫీషియల్ ప్రోమో: అమెజాన్‌లో 'టక్ జగదీష్' -
7 డేస్ 6 నైట్స్: గోవాలో 100 మంది.. 4 కెమెరాలు..
‘డర్టీ హరి’ తర్వాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, క్రితికి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎం. సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ నిర్మిస్తున్నారు. గోవా షెడ్యూల్ ముగించుకున్న చిత్రబృందం హైదరాబాద్ వచ్చేసింది. ఈ సందర్భంగా ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ.. ‘విభిన్నమైన కథనం, సన్నివేశాలతో ‘7 డేస్ 6 నైట్స్’ కథ ఆసక్తికరంగా ఉంటుంది. సుమంత్ తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారా 16 మంది కొత్తవారిని పరిచయం చేస్తున్నాం. గోవాలో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించాం. గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నా, కరోనా నియమాలు కఠినంగా అమలవుతున్నప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ...100 మంది బృందంతో, 4 కెమెరాలతో తెరకెక్కించాం. తర్వాతి షెడ్యూల్‌ను మంగళూరు, ఉడుపిలో ప్లాన్ చేశాం’ అన్నారు. అలాగే సహా నిర్మాత జె శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. చిత్రీకరణ చివరి దశలో ఉండగానే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. -
‘7 డేస్ 6 నైట్స్’ ఫస్ట్ లుక్ విడుదల
'డర్టీహరి'తో డైరెక్టర్‌గా మారిన ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్న మరో చిత్రం '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ అశ్విన్, ఎం. రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. అశ్విన్ సరసన మెహర్ చావల్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా పరిచయం కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తర్వాతి షెడ్యూల్ ఈ నెల 28 నుంచి ఉంటుందని డైరెక్టర్ ఎమ్మెస్ రాజు తెలిపారు. ఇక రోహన్, కృతికా శెట్టి సైతం ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తున్నారు. Here's the first look of a refreshing tale of love n life #7Days6Nights Stay tuned for an @MSRajuOfficial directorial @SumanthArtPro @MSumanthAshwin @RajnikantSOffl @SamarthGollapu5 @EditorJunaid @WildHoneyPro #WintagePictures @AbgCreations @PulagamOfficial pic.twitter.com/C4Z1RRMbeu — BARaju's Team (@baraju_SuperHit) July 22, 2021 -
7 డేస్ 6 నైట్స్... షూటింగ్ మొదలైంది
'డర్టీ హరి' చిత్రం తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ అశ్విన్, ఎం. రజనీకాంత్ ఎస్. నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. 'ఇదొక కూల్ అండ్ న్యూ ఏజ్ ఎంటర్టైన్మెంట్ సర్. వినోదానికి మంచి అవకాశం ఉంది. నటీనటుల వివరాల్ని గోప్యంగా ఉంచాం' అన్నారు. 'జూలై 10 వరకు హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్- నికోబార్ దీవుల్లో చిత్రీకరిస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్ ప్రొడ్యూసర్: జె.శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: ఎం.రాము. చదవండి: '7 డేస్ 6 నైట్స్'.. డర్టీ హరీని మించి ఉంటుంది -
'7 డేస్ 6 నైట్స్'.. డర్టీ హరీని మించి ఉంటుంది
‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఎంఎస్ రాజు పుట్టినరోజు నేడు (మే 10). ఈ సందర్భంగా దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘జూన్ 7న ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. హైదరాబాద్, గోవా, మంగుళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో షూటింగ్ చేయనున్నాం. ప్రస్తుతానికి నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం’’ అన్నారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘డర్టీ హరి’ని మించి ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము. -
నిర్మాతగా మారిన యంగ్ హీరో.. తండ్రితో తొలి సినిమా!
ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ కొత్త జర్నీని మొదలుపెట్టబోతున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఆయన నటనకి కాస్త విరామం ఇచ్చి నిర్మాతగా రాణించాలనుకుంటున్నాడు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మించబోతున్నాడు. తన తొలి సినిమాకి తండ్రి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించబోతున్నారట. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి 7 డేస్… 6 నైట్స్ టైటిల్ ఫిక్స్ చేశారట. కాగా, నిర్మాత ఎంఎస్ రాజు ఇటీవల 'డర్టీ హరి' సినిమాతో దర్శకుడిగా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్‌తోనే కొడుకు నిర్మాణ సంస్థలో కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తర్వలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నట్లు సమాచారం. ఇక సుమంత్ విషయానికి వస్తే.. తూనీగ తూనీగ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కేరింత, కొలంబస్, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథ చిత్రం 2 చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. -
సుమంత్ పెళ్లి: ప్రభాస్ సర్ప్రైజ్ గిఫ్ట్
'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'' వంటి హిట్ చిత్రాల నిర్మాత ఎమ్ఎస్ రాజు ఏకైక కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న అత్యంత దగ్గరి బంధువుల సమక్షంలో దీపిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను ఇల్లాలిని చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారు. అయితే నెట్టింట మాత్రం విషెస్ తెలిపారు. ఈ క్రమంలో తాజాగా బాహుబలి ప్రభాస్.. సుమంత్‌కు పెళ్లి శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేక బహుమతి పంపాడు. ఇందులో ఓ పుష్పగుచ్ఛంతో పాటు పట్టు వస్త్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. "కొత్త జీవితాన్ని ఆరంభించిన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభాస్ బొకేతో పాటు కానుకలు పంపాడు" అని చెప్తూ ఎమ్ఎస్ రాజు ఈ గిఫ్ట్ ఫొటోలను ట్విటర్లో షేర్ చేశాడు. #Prabhas sends gifts to #SumanthAshwin, wishing on his marriage with Deepika. Thank You for ur wishes Darling ❤️ pic.twitter.com/PVx14g9YGb — MS Raju (@MSRajuOfficial) February 17, 2021 కాగా నిర్మాతగా ఎమ్ఎస్ రాజు వర్షం సినిమాతో ప్రభాస్‌కు బ్లాక్‌బస్టర్ హిట్‌నిచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత పౌర్ణమి సినిమాను కూడా ఎమ్ఎస్ రాజే నిర్మించాడు. ఈ రెండు సినిమాలు ప్రభాస్ సినీ కెరీర్లోనే ప్రత్యేకమైనవి కావడం విశేషం. చదవండి: -
ఎమ్ఎస్ రాజు కుమారుడు హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి ఫోటోలు
-
ఇంటివాడైన యంగ్ హీరో సుమంత్.. ఫోటోలు వైరల్
ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్ కు చెందిన దీపికతో అతని వివాహం నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు మాత్రమే ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. 'తూనీగ తూనీగ' సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. ఆతర్వాత ‘కేరింత’, ‘లవర్స్’, ‘ప్రేమకథా చిత్రం-2’ సినిమాల్లో నటించాడు. తాజాగా సుమంత్ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది -
హీరో సుమంత్ అశ్విన్ హల్దీ ఫంక్షన్.. ఫొటోలు వైరల్
ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు ఎకైక కూమారుడు, యువ హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయి మెడలో శనివారం(ఫిబ్రవరి 13)సుమంత్ మూడుముళ్లు వేయనున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఈ కొత్త జంట హల్దీ ఫంక్షన్ వేడుకను జరుపుకుంది. ఈ ఫంక్షన్లో సుమంత్ ‘కేరింత’ మూవీ సహా నటుడు విశ్వంత్, మరికొందరు నటీనటులు సందడి చేశారు. (చదవండి: దీపికతో సుమంత్ అశ్విన్ వివాహం) ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్ పట్టణ శివారులోని వారి ఫాంహౌజ్‌లో సుమంత్-దీపికల వివాహ మహోత్సవం జరగనుంది. ‘తూనిగ తూనిగ’ మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఆ తర్వాత ‘కేరింత’, ‘లవర్స్’, ‘ప్రేమకథా చిత్రం-2’ లలో హీరోగా నటించాడు. తాజాగా సుమంత్ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది. (చదవండి: ‘నలుగురు అపరిచితులు.. గమ్యం ఒకటే’)