అల్లి బిల్లి చెక్కిలి గిల్లి... చాలా బాగుంది! | hero ram lunch right right movie song | Sakshi
Sakshi News home page

అల్లి బిల్లి చెక్కిలి గిల్లి... చాలా బాగుంది!

Published Tue, Apr 26 2016 5:06 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

అల్లి బిల్లి చెక్కిలి గిల్లి... చాలా బాగుంది!

అల్లి బిల్లి చెక్కిలి గిల్లి... చాలా బాగుంది!

- హీరో రామ్
‘‘‘తొలి చిత్రం నుంచి సుమంత్ అశ్విన్ నటనలో వైవిధ్యం చూపిస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట బాగుంటుంది. ముఖ్యంగా ఈ పాటలో అశ్విన్‌తో పాటు ప్రభాకర్ స్టెప్స్ వేయడం సరదాగా ఉంది’’ అని రామ్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరీ జంటగా ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘రైట్... రైట్’. మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ ఈ చిత్రం నిర్మించారు.

జె.బి. స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అల్లి బిల్లి చెక్కిలి గిల్లి.. రెక్కలే విప్పెను లిల్లి’ అనే తొలి పాట వీడియోను సోమవారం హీరో రామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘అప్పుడప్పుడూ లుంగీతో నాన్నగారు ఇంట్లో సరదాగా స్టెప్స్ వేస్తుంటారు. లుంగీలో అంత క్యాజువల్‌గా ఎలా డ్యాన్స్ చేయగలుగుతారా? అనిపించేది. ఇప్పుడీ సినిమాలో నేను కూడా  లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేశా. లుంగీలో డ్యాన్స్ ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా అధిక భాగం చిత్రీకరణ అరకులో జరిపాం.

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత అరకు అంత అందంగా కనిపించేది ఈ సినిమాలోనే’’ అని చెప్పారు. తొలి సగం వినోదాత్మంగా, మలి సగం మిస్టరీతో ఈ చిత్రం ఉత్కంఠగా సాగుతుందని దర్శకుడు అన్నారు. మే 7న పాటలను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు ‘బాహుబలి’ ప్రభాకర్, సంగీత దర్శకుడు జేబీ, చిత్ర సమర్పకుడు వత్సవాయి వెంకటేశ్వర్లు, సహ నిర్మాత జె.శ్రీనివాసరాజు, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement