యంగ్ హీరో రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోను సంప్రదించారట. పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌కి తండ్రిగా ప్రముఖ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇక హీరో రామ్ కూడా ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం.
ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది.రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు పాత్రల్లో వేరియేషన్స్ కోసం రామ్ కొత్తగా మేకోవర్ అవనున్నారట.కాగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందులోనూ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment