Right ... Right
-
పక్కింటి అబ్బాయిలా ఉంటాడు
- దాసరి నారాయణరావు ‘‘ఈ చిత్రం పాటలు విన్నా. ఈ మధ్య ఇంత మెలోడీ పాటలున్న సినిమా ఏదీ రాలేదు. సుమంత్ అశ్విన్ పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. కొన్ని సీన్స్ చూశా. బాగున్నాయి. హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ అశ్విన్‌లో ఉన్నాయి. విలన్ పాత్రలో నటించే ప్రభాకర్‌ను చూస్తే చాలా సెన్సిటివ్ అనిపిస్తోంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరి జంటగా ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో మను దర్శకత్వంలో శ్రీసత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం ‘రైట్... రైట్’. జె.బి. స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దాసరి నారాయణరావు బిగ్ సీడీ, పాటల సీడీ ఆవిష్కరించి దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత ఎంఎస్ రాజుకు అందించారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం పోస్టర్ చూస్తుంటే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ గుర్తుకొస్తోంది. సుమంత్ అశ్విన్ బాగా నటిస్తున్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. దర్శకునిగా పరిచయమవుతున్న మనుకు ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘డ్రైవర్‌కు, కండక్టర్‌కు మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఈ కథ మొదట ఎంఎస్ రాజుగారికే చెప్పా. ఆయనకు నచ్చి ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు. నటీనటులు, టెక్నీషియన్లు నాకు బాగా సపోర్ట్ చేశారు’’ అని దర్శకుడు మను తెలిపారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘‘క్షణం’, ‘ఊపిరి’వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులు, కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకముంది’’ అని చెప్పారు. దర్శకులు బి.గోపాల్, కోదండ రామిరెడ్డి, నిర్మాత ‘దిల్’ రాజు, సహ నిర్మాత ఎమ్‌వి నరసింహులు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జె.శ్రీనివాస రాజు, సంగీత దర్శకుడు కోటి, నటుడు సీనియర్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అల్లి బిల్లి చెక్కిలి గిల్లి... చాలా బాగుంది!
- హీరో రామ్ ‘‘‘తొలి చిత్రం నుంచి సుమంత్ అశ్విన్ నటనలో వైవిధ్యం చూపిస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట బాగుంటుంది. ముఖ్యంగా ఈ పాటలో అశ్విన్‌తో పాటు ప్రభాకర్ స్టెప్స్ వేయడం సరదాగా ఉంది’’ అని రామ్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరీ జంటగా ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘రైట్... రైట్’. మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ ఈ చిత్రం నిర్మించారు. జె.బి. స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అల్లి బిల్లి చెక్కిలి గిల్లి.. రెక్కలే విప్పెను లిల్లి’ అనే తొలి పాట వీడియోను సోమవారం హీరో రామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘అప్పుడప్పుడూ లుంగీతో నాన్నగారు ఇంట్లో సరదాగా స్టెప్స్ వేస్తుంటారు. లుంగీలో అంత క్యాజువల్‌గా ఎలా డ్యాన్స్ చేయగలుగుతారా? అనిపించేది. ఇప్పుడీ సినిమాలో నేను కూడా లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేశా. లుంగీలో డ్యాన్స్ ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా అధిక భాగం చిత్రీకరణ అరకులో జరిపాం. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత అరకు అంత అందంగా కనిపించేది ఈ సినిమాలోనే’’ అని చెప్పారు. తొలి సగం వినోదాత్మంగా, మలి సగం మిస్టరీతో ఈ చిత్రం ఉత్కంఠగా సాగుతుందని దర్శకుడు అన్నారు. మే 7న పాటలను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు ‘బాహుబలి’ ప్రభాకర్, సంగీత దర్శకుడు జేబీ, చిత్ర సమర్పకుడు వత్సవాయి వెంకటేశ్వర్లు, సహ నిర్మాత జె.శ్రీనివాసరాజు, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సులో... లవ్.. కామెడీ
అతనో కండక్టర్. ఎస్ కోట నుంచి గవిటికి వెళ్లే బస్సే అతనికి జీవనాధారం. రొటీన్‌గా సాగిపోతున్న అతని జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ యువకుని జీవితం చుట్టూ సాగే కథాంశంతో లవ్, కామెడీ, మిస్టరీ సమాహారంగా రూపొందుతోన్న చిత్రం ‘రైట్...రైట్’. కథానాయకుడు అశ్విన్ ఆర్టీసీ బస్ కండక్టర్‌గా రైట్...రైట్ అంటున్నారు. శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా ఝవేరి నాయిక. ‘బాహుబలి’ ప్రభాకర్ కీలక పాత్రధారి. నిర్మాత మాట్లాడుతూ-‘‘ఈ సినిమాలో ఆర్టీసీ బస్సు కీలకం. ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఈ నెల 20 నుంచి మార్చి 5 వరకు జరుగుతుంది. సమ్మర్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసఫ్, సహ-నిర్మాత: జె.శ్రీనివాసరాజు. -
బస్సులో... లవ్.. కామెడీ
-
బస్సులో మిస్సుతో...
ఓ చలాకీ కుర్రాడు. ఓ అందమైన అమ్మాయి. వీరిద్దరి మధ్యలో ఓ ఆర్టీసీ బస్సు. ఉత్తరాంధ్రలోని ఎస్. కోట నుంచి గవిటికి వెళ్లే ఆ బస్సు వీరిద్దరి మధ్యలో ప్రేమను పుట్టించిందా? ఏమో తెలీదు. తెలియాలంటే ‘రైట్... రైట్’ రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. ఇంతవరకూ సుమంత్ అశ్విన్ చేసినవన్నీ మోడ్రన్ కేరెక్టర్సే. ఇందులోనేమో చాలా సింపుల్‌గా కనిపిస్తున్నాడు. స్టిల్స్ చూస్తుంటే ఇదేదో డిఫరెంట్ ప్యాట్రన్ సినిమా అనిపిస్తోంది. అది నిజమే అంటున్నారు సుమంత్ అశ్విన్. అలాగని వాణిజ్య అంశాలు వదులుకోలేదట. ఓ మలయాళ సూపర్‌హిట్ చిత్రాన్ని తెలుగుకు అనుగుణంగా ఇలా రీ-డిజైన్ చేస్తున్నారు. కొత్త దర్శకుడు మనుతో జె.వంశీకృష్ణ తీస్తున్నారీ సినిమా. ‘బాహుబలి’లో కాలకేయ పాత్రతో భయపెట్టిన ప్రభాకర్ ఇందులో ఫుల్ పాజిటివ్ రోల్ చేస్తున్నారు. పూజా ఝవేరీ కథానాయిక. ఇటీవలే అరకులోయ, ఒరిస్సాల్లో ఓ షెడ్యూలు చేసి వచ్చారు. మిగతా షూటింగ్ హైదరాబాద్, మున్నార్‌లలో చేస్తారు. శేఖర్ వి. జోసఫ్ లాంటి టాప్ కెమెరా మ్యాన్ ఈ సినిమాకి పనిచేస్తు న్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: జె.శ్రీనివాసరాజు.