బస్సులో... లవ్.. కామెడీ
అతనో కండక్టర్. ఎస్ కోట నుంచి గవిటికి వెళ్లే బస్సే అతనికి జీవనాధారం. రొటీన్‌గా సాగిపోతున్న అతని జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ యువకుని జీవితం చుట్టూ సాగే కథాంశంతో లవ్, కామెడీ, మిస్టరీ సమాహారంగా రూపొందుతోన్న చిత్రం ‘రైట్...రైట్’. కథానాయకుడు అశ్విన్ ఆర్టీసీ బస్ కండక్టర్‌గా రైట్...రైట్ అంటున్నారు.
శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా ఝవేరి నాయిక. ‘బాహుబలి’ ప్రభాకర్ కీలక పాత్రధారి. నిర్మాత మాట్లాడుతూ-‘‘ఈ సినిమాలో ఆర్టీసీ బస్సు కీలకం. ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఈ నెల 20 నుంచి మార్చి 5 వరకు జరుగుతుంది. సమ్మర్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసఫ్, సహ-నిర్మాత: జె.శ్రీనివాసరాజు.