పట్టు బిగించకుండా చూస్తాను
ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్య
మెల్‌బోర్న్: భారత వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని, ఈసారి అతడు మ్యాచ్‌పై పట్టు బిగించకుండా చేస్తానని ఆ్రస్టేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కంగారూ గడ్డపై అశ్విన్‌కు మంచి రికార్డు లేదు. స్వదేశంలో 21.57 సగటు నమోదు చేస్తే ఆసీస్‌లో అది 42.15 మాత్రమే. అయితే గత రెండు బోర్డర్–గావస్కర్ సిరీస్‌లలో ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను అదే పనిగా అవుట్ చేసి పైచేయి సాధించాడు.
ఈ రెండు సిరీస్‌లలో అశ్విన్ అతన్ని క్రీజులో పాతుకుపోనీయకుండా ఐదుసార్లు పెవిలియన్ చేర్చాడు. దీనిపై ఆసీస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ ‘ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి. అయితే అశ్విన్ మాత్రం ఉత్తమ స్పిన్నర్. తప్పకుండా తన ప్రణాళికలు తనకు ఉంటాయి. గతంలో అతని ఎత్తుగడలకు బలయ్యాను. నాపై అతనే ఆధిపత్యం కనబరిచాడు.
ఇప్పుడలా జరగకుండా చూసుకోవాలంటే ఆరంభంలోనే అతను పట్టు బిగించకుండా దీటుగా ఎదుర్కోవాలి’ అని అన్నాడు. గత కొన్నేళ్లుగా తమ ఇద్దరి మధ్య ఆసక్తికర సమరమే జరుగుతోందన్నాడు. ఒకరు పైచేయి సాధిస్తే, మరొకరు డీలా పడటం జరుగుతుందని... ఐదు టెస్టుల్లో పది ఇన్నింగ్స్‌ల్లో ఇప్పుడు ఎవరూ ఆధిపత్యం కనబరుస్తారో చూడాలని స్మిత్ తెలిపాడు.
అతన్ని బ్యాట్‌తో పాటు మానసికంగానూ దెబ్బకొట్టాలంటే ఆరంభంలోనే మంచి షాట్లతో ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. 35 ఏళ్ల స్మిత్ టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి 315 పరుగుల దూరంలో ఉన్నాడు. త్వరలో జరిగే ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అతను తనకెంతో ఇష్టమైన, అచ్చొచి్చన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇటీవలి కాలంలో స్మిత్ తరచూ ఓపెనర్‌గా బరిలోకి దిగి పూర్తిగా విఫలమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment