నన్ను క్షమించండి: ఆస్ట్రేలియా కెప్టెన్ | Steve Smith apologises for losing control over emotions | Sakshi
Sakshi News home page

నన్ను క్షమించండి: ఆస్ట్రేలియా కెప్టెన్

Published Tue, Mar 28 2017 1:16 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

నన్ను క్షమించండి: ఆస్ట్రేలియా కెప్టెన్

నన్ను క్షమించండి: ఆస్ట్రేలియా కెప్టెన్

ధర్మశాల: టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ సందర్భంగా నోరు పారేసుకుని, అనుచితంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. సిరీస్ ఓటమి సందర్భంగా దిగొచ్చాడు. తాను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని, తనను క్షమించాల్సిందిగా స్మిత్ కోరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది.

ధర్మశాలలో కీలక నాలుగో టెస్టులో భారత్‌ చేతిలో ఓటమి అనంతరం స్మిత్ మాట్లాడుతూ.. 'సిరీస్ అంతా గొడవలు, వివాదాలతో సాగింది. నేను ప్రతిసారీ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నా' అని చెప్పాడు. ఈ సిరీస్ భారత క్రికెటర్లు, ముఖ్యంగా బౌలర్లు బాగా రాణించారని స్మిత్ ప్రశంసించాడు.

ధర్మశాల టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్ మురళీ విజయ్‌ను స్మిత్ దూషించాడు. స్మిత్ నోరుపారేసుకున్నప్పటి దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఇక డీఆర్‌ఎస్‌ విషయంలోనూ పలుమార్లు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో గొడవ పెట్టుకున్నాడు. ఇక ఇతర ఆసీస్ ఆటగాళ్లు కూడా కెప్టెన్ స్మిత్ బాటలోనే ఘర్షణ వైఖరి అవలంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement