ఆస్ట్రేలియాకు తొట్ట తొలి టీ20 ప్రపంచకప్ అందించిన ఆ దేశ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై దిగ్గజ వికెట్‌కీపర్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ హీలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా శ్రీలంకతో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఫించ్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు 4-1 తేడాతో గెలుచుకుంది. అయితే సిరీస్ ఆధ్యాంతం పేలవ ప్రదర్శన (5 మ్యాచ్‌ల్లో 78 పరుగులు) కనబర్చి, జట్టుకు భారంగా మారిని ఫించ్‌పై ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ హీలీ మండిపడ్డాడు.
Aaron Finch’s batting average in T20 internationals has dropped every year since 2018.
— Nic Savage (@nic_savage1) February 21, 2022
2018 – 40.84 (SR 176.41)
2019 – 35.83 (SR 158.08)
2020 – 33.97 (SR 138.97)
2021 – 28.68 (SR 125.06)
2022 – 15.60 (SR 91.76)
More on @newscomauHQ: https://t.co/Qn3GfEEGJI
📸 Getty #AUSvSL pic.twitter.com/SKZ7pZawNO
ఫించ్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతుందని.. గడిచిన నాలుగేళ్లలో అతని గణాంకాలే ఇందుకు నిదర్శనమని అన్నాడు. ఫించ్ స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకుంటే మర్యాదగా ఉంటుందని లేదంటే ఫామ్ కోల్పోయినప్పుడు దిగ్గజాలకు సైతం తప్పని అవమానాన్ని ఎదర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కెరీర్ ఆరంభంలో పవర్ హిట్టింగ్‌తో దుమ్ము లేపిన ఫించ్.. వయో భారంతో పాటు ఫామ్ లేమితో మునుపటి తరహా ఆటతీరును కనబర్చలేకపోతున్నాడని తెలిపాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ఫించ్ జట్టులో ఉండటం అవసరమా అని ప్రశ్నించాడు. ఫించ్ లాగే మరో టాపార్డర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా తయారయ్యాడని, అతనిని కూడా జట్టు నుంచి పక్కకు పెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. తుది జట్టులో స్మిత్‌కు చోటు కల్పించడం కోసం మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ లాంటి ఆటగాళ్లపై వేటు వేయరాదని సూచించాడు. ఫించ్, స్మిత్ ఇద్దరూ సామర్ధ్యం మేరకు రాణించలేకపోతున్నారు కాబట్టే ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో వారు అమ్ముడుపోలేదని చురకలంటించాడు.
చదవండి: దంచి కొట్టిండు.. దండం పెట్టిండు.. వైరలవుతున్న సూర్యకుమార్ నమస్తే సెలబ్రేషన్స్
ఇయాన్ హీలీ, ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్, స్టీవ్ స్మిత్
Comments
Please login to add a commentAdd a comment