Ian Healy
-
రోహిత్‌కు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు: రహానే
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. భారత్ క్రికెట్ జట్టులోని హేమాహేమీలైన స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల పరిస్థితి చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. గత కొంత కాలం వరకు భారత్ క్రికెట్‌ను శాసించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చెప్పటింది. ఆటగాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత్ జట్టులోని క్రికెటర్లు అందరూ దేశవాళీ పోటీల్లో తప్పనిసరిగా ఆడాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులు కారణంగా దేశవాళీ పోటీల్లో ఆడలేనప్పుడు బీసీసీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. రోహిత్ దశాబ్దం తర్వాతగురువారం రంజీ ట్రోఫీ టోర్నమెంట్ రెండో దశ ప్రారంభమైనప్పుడు ఒక అరుదైన సంఘటన జరగనుంది. అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ క్రికెటలందరు తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడనున్నారు. ఇందులో రోహిత్ శర్మ, వైస్-కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్, అజయ్ జడేజా, హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు ఉండటం విశేషం.కెప్టెన్ రోహిత్ శర్మ అయితే దాదాపు ఒక దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీ పోటీల్లో ఛాంపియన్స్ ముంబై తరఫున ఆడనున్నాడు. రోహిత్ మాజీ భారత్ ఆటగాడు అజింక్య రహానే నాయకత్వంలో ముంబై తరపున బరిలో దిగనున్నాడు. జమ్మూ కాశ్మీర్ తో జరగనున్న మ్యాచ్ లో రోహిత్ భారత్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ముంబై బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎలైట్ గ్రూ-‘ఎ’ లో ముంబై 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ 23 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. అయితే ఫిట్ నెస్ లేని కారణంగా విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడకుండా బీసీసీఐ నుంచి మినహాయింపు పొందాడు. మెడ నొప్పి తో బాధపడుతున్న కోహ్లీ కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.రహానే కితాబురోహిత్ మళ్ళీ జట్టులోకి రావడం ఆనందం కలిగిస్తోందని రహానే కితాబిచ్చాడు. "రోహిత్ తన ఫామ్ ని తిరిగి సాధించాలని ధృడ నిశ్చయంతో ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిన్న నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్ అనేది ఆటగాడి కెరీర్లో భాగం. రోహిత్ పై నాకు అపార నమ్మకముంది. రోహిత్ ఎప్పుడూ రిలాక్స్‌గా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు కూడా అతని వైఖరి అలాగే ఉంటుంది. అతనికి తన ఆట గురించి బాగా తెలుసు కాబట్టి, అతను ఏమి చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు," అని రహానే కితాబిచ్చాడు. కాగా రాజ్‌కోట్‌లో జరగనున్న మరో మ్యాచ్ లో ఢిల్లీ రెండుసార్లు విజేతలైన సౌరాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ తన భారత సహచరులు రవీంద్ర జడేజా, మరియు చతేశ్వర్ పుజారాతో తలపడతాడు.ఆస్ట్రేలియా కూడా పాఠాలు నేర్చుకోవాలిఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఇయాన్ హీలీ బీసీసీఐ కొత్త విధానాన్ని సమర్థించాడు. పది పాయింట్ల మార్గదర్శకాలను అమలు చేయడంపై మాట్లాడుతూ.. జట్టులో పెరుగుతున్నసూపర్స్టార్ సంస్కృతిని అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించాడు. భారత క్రికెటర్లలో క్రమశిక్షణ లేకుండా పోయింది.‘‘నిజానికి ఈ సమస్య చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. బీసీసీఐ అధికారులు తీసుకున్న చర్యలు జట్టు క్రమశిక్షణను కాపాడుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాను. అయితే దీని నుంచి ఆస్ట్రేలియా, ఇతర ప్రధాన జట్లు కూడా పాఠం నేర్చుకోవాలి" అని హీలి అన్నాడు. చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
ప్రాక్టీస్ చేయనీకుండా అడ్డుకున్నారు.. ఆసీస్ ఓటమిపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటడంతో ప్రపంచ నంబర్ వన్ జట్టుకు ఘోర పరాభవం తప్పలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీ (120).. జడేజా (5/47, 70, 2/34), అశ్విన్ (3/42, 23, 5/37) అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేయగా, ఆసీస్ చెత్త రికార్డులను మూటగట్టుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా సాధించిన ఘన విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్న ఆసీస్ మాజీ ఆటగాళ్లు పిచ్‌పై విషప్రచారం చేస్తూ ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత జట్టు తమ స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించుకుందని బురదజల్లుతున్నారు. మ్యాచ్ పూర్తై నేటికి రెండ్రోజులవుతన్నా ఆసీస్ మాజీల వాగుడకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. ఆసీస్ ఓటమిని ఆ దేశ మీడియా సైతం అంగీకరించినప్పటికీ కొందరు మాత్రం ఇంకా పేలుతూనే ఉన్నారు. తాజాగా ఆ దేశ దిగ్గజ వికెట్‌కీపర్ ఇయాన్ హీలీ నాగ్‌పూర్ పిచ్‌పై, అక్కడి గ్రౌండ్ సిబ్బందిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లను ప్రాక్టీస్ చేయనీకుండా గ్రౌండ్ సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పించాడు. సిబ్బంది పిచ్‌పై అసందర్భంగా నీళ్లు చల్లి, ప్రాక్టీస్ చేసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించాడు. తద్వారా తమ ప్లాన్లపై, విజయావకాశాలపై నాగ్‌పూర్ గ్రౌండ్ సిబ్బంది నీళ్లు చల్లారని వాపోయాడు. తమ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకుంటామని అడిగినప్పుడే స్టాఫ్ ఇలా చేశారని పేర్కొన్నాడు. ఇది మంచి సంప్రదాయం కాదని, ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలని కోరాడు. హీలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గుతేల్చాలని విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. -
WTC: పిచ్‌లు చెత్తగా ఉంటే.. టీమిండియాదే సిరీస్.. కనీసం ఈసారైనా!
India Vs Australia Test Series 2023: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియా- ఆస్ట్రేలియా మరోసారి టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. భారత్ వేదికగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనున్నాయి. ఆఖరి ముఖాముఖి పోరులో ఆసీస్ గడ్డపై కంగారూలను చిత్తు చేసి 2-1తో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. స్వదేశంలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని ప్యాట్ కమిన్స్ బృందం భావిస్తోంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ చేరిన ఆసీస్.. ఆఖరి సిరీస్‌లోనూ గెలిచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్ చేరాలంటే.. ఇక కంగారూ జట్టుతో సొంతగడ్డపై జరుగనున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా.. టీమిండియా సైతం డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలే సంచలన వ్యాఖ్యలు చేశాడు. రేడియో ప్రోగ్రామ్‌లో అతడు మాట్లాడుతూ.. ‘‘వాళ్లది గొప్ప జట్టే. అయితే, చెత్త పిచ్‌లు రూపొందించనంత వరకు వాళ్ల స్పిన్నర్లకు పెద్దగా భయపడాల్సిన పనిలేదు. పిచ్‌లు అలా ఉంటే టీమిండియాదే సిరీస్ గతంలో మాదిరి ఇప్పుడు కూడా అదే తరహా పిచ్‌లు తయారు చేస్తే మేము(ఆస్ట్రేలియా) గెలవం. ఇది తథ్యం. నాసికరం పిచ్‌ల కారణంగా స్పిన్నర్లు చెలరేగడంలో పెద్దగా వింతేమీ ఉండదు. ఒకవేళ అలా కాకుండా మెరుగైన పిచ్‌లు రూపొందిస్తే.. ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్లపై బౌలింగ్ చేయడానికి బౌలర్లు శ్రమించాల్సి వస్తుంది. అప్పుడు మా పని సులువవుతుంది. స్టార్క్ దూరం కావడం(మొదటి టెస్టు) కచ్చితంగా ప్రభావం చూపుతుంది.. ఇండియా 2-1తో గెలుస్తుందనే నా అంచనా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 9- మార్చి 13 వరకు టీమిండియా- ఆసీస్ టెస్టు సిరీస్ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరు బోర్డులు జట్లను ప్రకటించాయి. ఈసారి ఆస్ట్రేలియా నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగనుంది. ఇక స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. కాగా ఐదేళ్ల క్రితం ఆసీస్ టెస్టు సిరీస్ కోసం భారత పర్యటనకు రాగా2-1తో ఓటమి పాలైంది. చదవండి: స్టీవ్ స్మిత్‌కు పూనకం వచ్చింది.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు Virat Kohli: కోహ్లి అతడి కోసం త్యాగం చేయాలి! గతంలో రాయుడు కోసం ఇలాగే.. -
అతను టీ20లకు పనికిరాడు.. కెప్టెన్ అయితేనేం, సాగనంపండి..!
ఆస్ట్రేలియాకు తొట్ట తొలి టీ20 ప్రపంచకప్ అందించిన ఆ దేశ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై దిగ్గజ వికెట్‌కీపర్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ హీలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా శ్రీలంకతో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఫించ్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు 4-1 తేడాతో గెలుచుకుంది. అయితే సిరీస్ ఆధ్యాంతం పేలవ ప్రదర్శన (5 మ్యాచ్‌ల్లో 78 పరుగులు) కనబర్చి, జట్టుకు భారంగా మారిని ఫించ్‌పై ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ హీలీ మండిపడ్డాడు. Aaron Finch’s batting average in T20 internationals has dropped every year since 2018. 2018 – 40.84 (SR 176.41) 2019 – 35.83 (SR 158.08) 2020 – 33.97 (SR 138.97) 2021 – 28.68 (SR 125.06) 2022 – 15.60 (SR 91.76) More on @newscomauHQ: https://t.co/Qn3GfEEGJI 📸 Getty #AUSvSL pic.twitter.com/SKZ7pZawNO — Nic Savage (@nic_savage1) February 21, 2022 ఫించ్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతుందని.. గడిచిన నాలుగేళ్లలో అతని గణాంకాలే ఇందుకు నిదర్శనమని అన్నాడు. ఫించ్ స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకుంటే మర్యాదగా ఉంటుందని లేదంటే ఫామ్ కోల్పోయినప్పుడు దిగ్గజాలకు సైతం తప్పని అవమానాన్ని ఎదర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కెరీర్ ఆరంభంలో పవర్ హిట్టింగ్తో దుమ్ము లేపిన ఫించ్.. వయో భారంతో పాటు ఫామ్ లేమితో మునుపటి తరహా ఆటతీరును కనబర్చలేకపోతున్నాడని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఫించ్ జట్టులో ఉండటం అవసరమా అని ప్రశ్నించాడు. ఫించ్ లాగే మరో టాపార్డర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా తయారయ్యాడని, అతనిని కూడా జట్టు నుంచి పక్కకు పెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. తుది జట్టులో స్మిత్‌కు చోటు కల్పించడం కోసం మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ లాంటి ఆటగాళ్లపై వేటు వేయరాదని సూచించాడు. ఫించ్, స్మిత్ ఇద్దరూ సామర్ధ్యం మేరకు రాణించలేకపోతున్నారు కాబట్టే ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో వారు అమ్ముడుపోలేదని చురకలంటించాడు. చదవండి: దంచి కొట్టిండు.. దండం పెట్టిండు.. వైరలవుతున్న సూర్యకుమార్ నమస్తే సెలబ్రేషన్స్ ఇయాన్ హీలీ, ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్, స్టీవ్ స్మిత్ -
ఆ వీడియో చూస్తే చాలు.. ఆసిస్ దిగ్గజంపై కోహ్లి ఫైర్!
-
ఆ వీడియో చూస్తే చాలు.. ఆసిస్ దిగ్గజంపై కోహ్లి ఫైర్!
మొదటి టెస్టులో మూడురోజుల్లోనే టీమిండియా ఓటమిపాలైన నేపథ్యంలో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆసిస్ క్రికెట్ దిగ్గజాలు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కోహ్లి వాగ్వాదానికి దిగడాన్ని వారు తప్పుబట్టారు. మొదటి టెస్టులో, రెండో టెస్టులో కోహ్లి తక్కువ స్కోరుకే అవుటవ్వడంపై స్పందిస్తూ కామెంటర్‌గా ఉన్న మాథ్యూ హెడెన్.. కోహ్లి బుర్రలో ఏముందో ఆసిస్ బౌలర్లు పసిగట్టారంటూ కామెంట్ చేశాడు. ఆసిస్ మాజీ బ్యాట్స్‌మన్, జాతీయ సెలక్టర్ మార్క్ వా స్పందిస్తూ మొదటి టెస్టులో కోహ్లి ఔటైన తీరు చూస్తే.. అతని దిమాగ్ కొంత ఖరాబైందేమోననిపిస్తున్నదని పేర్కొన్నాడు. ఇక మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ అయితే ఒక అడుగు ముందుకువేసి.. ఆటలో కోహ్లి తీరు చూస్తుంటే.. అతనిపై తనకు గౌరవం లేకుండాపోయిందని దురుసుగా వ్యాఖ్యానించాడు. బెంగళూరు టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో హేలీ వ్యాఖ్యలపై తాజాగా కెప్టెన్ కోహ్లి స్పందించాడు. 'అతని దృష్టిలో నాపై గౌరవం పోయిం ఉండొచ్చు. కానీ భారత్‌లోని 120 కోట్లమంది గౌరవం మాకుంది. ఆ ఒక్కడి వల్ల నా జీవితంలో పెద్ద మార్పేమీ ఉండదు. సెంచూరియన్ టెస్టులో అతన్ని ఎంపైర్ ఔట్‌గా ప్రకటించినప్పుడు అతడు ఎలా ప్రవర్తించాడో, ఏమన్నాడో తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. మీకే తెలిసిపోతుంది. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడండి' అంటూ కోహ్లి కామెంట్ చేశాడు. 1997లో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఇయాన్ హేలీ అనుచితంగా వ్యవహరించాడు. బ్రేట్ షుల్జ్ బౌలింగ్‌లో బంతిని కీపర్ డేవ్ రిచర్డ్సన్ (ప్రస్తుత ఐసీసీ సీఈవో) అందుకోవడంతో ఎంఫైర్ లెగ్‌సైడ్ క్యాచ్‌గా ప్రకటించాడు. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే తనను ఔట్‌గా ప్రకటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హేలీ మైదానంలోని ఓ ప్రేక్షకుడి వైపు బ్యాటును తుపాకీలా చూపించి బెదిరించాడు. అంతేకాకుండా డ్రేసింగ్ రూమ్ మెట్లు ఎక్కుతూ బ్యాటును కోపంగా విసిరేశాడు. (బు.. షి.. ఎంపైరింగ్) అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఆనాటి ఘటనను తాజాగా కోహ్లి గుర్తుచేశాడు. -
'మమ్మల్ని కోహ్లి కించపరిచాడు'
బెంగళూరు:క్రికెట్ గేమ్‌లో స్లెడ్జింగ్ అనేది భాగమే అయినప్పటికీ తమతో రెండో టెస్టు సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు కించపరిచే విధంగా ఉందని ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ మండిపడ్డాడు. ఒక జట్టుకు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి.. ప్రత్యర్థి ఆటగాడ్ని 'టాయిలెట్' అంటూ స్లెడ్జింగ్ చేయడం అగౌరపరచడమేనని విమర్శించాడు. దాంతో పాటు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పట్ల కోహ్లి వ్యవహరించిన తీరు కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదన్నాడు. ఈ తరహా మాటల యుద్ధానికి విరాట్ ఫుల్ స్టాప్ పెట్టి.. తన సహజసిద్ధమైన ఆటను ప్రదర్శిస్తే బాగుంటుందన్నాడు. 'ఆటలో విరాట్ కోహ్లి దూకుడు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడూ విరాట్ తరహా ఆటను చూడలేదు. గతంలో ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పా. అయితే ఇప్పుడు విరాట్ పై గౌరవం తగ్గిపోతుంది. రెన్ షాను 'టాయిలెట్' అంటూ స్లెడ్జ్ చేయడం ఎంతవరకు సమర్ధనీయం. ఇది మా ఆటగాళ్లను కించపరచడం కాదా. ఇలాగ మమ్మల్ని అగౌరపరచడం విరాట్ కు తగదు. గతంలో ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను విరాట్ ఈ తరహాలో కించపరచలేదు. ఒత్తిడికి లోనవుతున్న విరాట్ గౌరవాన్ని కోల్పోతున్నట్లు కనబడుతుంది.భారత జట్టు కెప్టెన్ కాకముందు అతని దూకుడు భిన్నంగా ఉండేది. అదే సమయంలో చూడ ముచ్చటగా కూడా ఉండేది. ఇప్పుడు మాటలతో దూకుడుగా ఉన్నాడు. విరాట్ మాటల్ని తగ్గించి ఆటతో సమాధానం చెబితే బాగుంటుంది'అని హేలీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆసీస్ ఓపెనర్ రెన్ షాను 'టాయిలెట్' అంటూ విరాట్ స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో రెన్ షా టాయిలెట్ బ్రేక్ తీసుకోవడాన్ని రెండో టెస్టు ఆదివారం నాటి ఆటలో విరాట్ ప్రస్తావించాడు. టాయిలెట్ అంటూ రెన్ షాను కవ్వించే యత్నం చేశాడు.