టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (PC: PTI)
India Vs Australia Test Series 2023: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియా- ఆస్ట్రేలియా మరోసారి టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. భారత్ వేదికగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనున్నాయి. ఆఖరి ముఖాముఖి పోరులో ఆసీస్ గడ్డపై కంగారూలను చిత్తు చేసి 2-1తో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.
మరోవైపు.. స్వదేశంలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని ప్యాట్ కమిన్స్ బృందం భావిస్తోంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ చేరిన ఆసీస్.. ఆఖరి సిరీస్‌లోనూ గెలిచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
ఫైనల్ చేరాలంటే..
ఇక కంగారూ జట్టుతో సొంతగడ్డపై జరుగనున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా.. టీమిండియా సైతం డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలే సంచలన వ్యాఖ్యలు చేశాడు. రేడియో ప్రోగ్రామ్‌లో అతడు మాట్లాడుతూ.. ‘‘వాళ్లది గొప్ప జట్టే. అయితే, చెత్త పిచ్‌లు రూపొందించనంత వరకు వాళ్ల స్పిన్నర్లకు పెద్దగా భయపడాల్సిన పనిలేదు.
పిచ్‌లు అలా ఉంటే టీమిండియాదే సిరీస్
గతంలో మాదిరి ఇప్పుడు కూడా అదే తరహా పిచ్‌లు తయారు చేస్తే మేము(ఆస్ట్రేలియా) గెలవం. ఇది తథ్యం. నాసికరం పిచ్‌ల కారణంగా స్పిన్నర్లు చెలరేగడంలో పెద్దగా వింతేమీ ఉండదు. ఒకవేళ అలా కాకుండా మెరుగైన పిచ్‌లు రూపొందిస్తే.. ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్లపై బౌలింగ్ చేయడానికి బౌలర్లు శ్రమించాల్సి వస్తుంది. అప్పుడు మా పని సులువవుతుంది. స్టార్క్ దూరం కావడం(మొదటి టెస్టు) కచ్చితంగా ప్రభావం చూపుతుంది..
ఇండియా 2-1తో గెలుస్తుందనే నా అంచనా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 9- మార్చి 13 వరకు టీమిండియా- ఆసీస్ టెస్టు సిరీస్ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరు బోర్డులు జట్లను ప్రకటించాయి. ఈసారి ఆస్ట్రేలియా నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగనుంది. ఇక స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. కాగా ఐదేళ్ల క్రితం ఆసీస్ టెస్టు సిరీస్ కోసం భారత పర్యటనకు రాగా2-1తో ఓటమి పాలైంది.
చదవండి: స్టీవ్ స్మిత్‌కు పూనకం వచ్చింది.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు
Virat Kohli: కోహ్లి అతడి కోసం త్యాగం చేయాలి! గతంలో రాయుడు కోసం ఇలాగే..
Comments
Please login to add a commentAdd a comment