Australia captain
-
డబ్ల్యూపీఎల్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ అచ్చుగుద్దినట్లు ఒకేలా.. ఇలా ఎలా..!
క్రికెట్ గణాంకాలకు సంబంధించిన ఆట కాబట్టి అప్పుడప్పుడు ఒకే రకమైన గణాంకాలను చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే గణాంకాలు మాత్రం క్రికెట్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ఈ గణాంకాల ముందు యాదృచ్చికం అనే మాట చిన్నబోతుంది. అంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఈ గణాంకాలు.వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్).. తాజాగా నిన్న ముగిసిన ఐపీఎల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి 17న జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆర్సీబీ సైతం తడబడినా మరో మూడు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరగలిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా భారతీయ ప్లేయరైన (టీ20 ఫార్మాట్లో భారత కెప్టెన్) స్మృతి మంధన నేతృత్వంలో ఆర్సీబీ తొలి సారి టైటిల్ కైవసం చేసుకుంది.ఐపీఎల్ 2024 ఫైనల్లోనూ అలాగే..నిన్న జరిగిన పురుషుల ఐపీఎల్ ఫైనల్లోనూ కొన్ని విషయాల్లో అచ్చుగుద్దినట్లు ఇలానే జరగడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) పాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహిళల ఐపీఎల్‌లోనూ ఇలాగే ఆసీస్ కెప్టెన్ (మెగ్ లాన్నింగ్) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ ఫైనల్లో కమిన్స్ ప్రత్యర్ది భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్డెన్ (ఢిల్లీ కెప్టెన్) ప్రత్యర్ది భారత ప్లేయరే (మంధన).2024 WPL Final:- Aussie Captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian captain's team won by 8 wickets.IPL 2024 Final:- Aussie captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian… pic.twitter.com/jH07ZzmAEO— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024ఐపీఎల్ 2024 ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ టాస్ గెలిచిన ఢిల్లీ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్లో భారత ప్లేయర్ అయిన శ్రేయస్.. ఆసీస్ కెప్టెన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడగొట్టగా.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్టెన్ లాన్నింగ్ నేతృత్వంలోని ఢిల్లీని భారత ప్లేయర్ సారథ్యంలోని ఆర్సీబీ అదే 8 వికెట్ల తేడాతోనే ఓడగొట్టింది. ఇన్ని విషయాల్లో ఈ ఏడాది డబ్ల్యూపీఎల్, ఐపీఎల్‌కు పోలికలు ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఆస్ట్రేలియా కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సారధి మెగ్ లాన్నింగ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని లాన్నింగ్ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని పేర్కొంది. 31 ఏళ్ల లాన్నింగ్ ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లాన్నింగ్ తన 13 ఏళ్ల కెరీర్లో 241 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించి, 182 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించింది. ఫుల్‌టైమ్ బ్యాటర్, పార్ట్ టైమ్ బౌలర్ అయిన లాన్నింగ్ తన కెరీర్లో 17 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు, 5 వికెట్లు పడగొట్టింది. లాన్నింగ్ తన కెరీర్లో ఏడు వరల్డ్‌కప్ టైటిళ్లలో భాగమైంది. లాన్నింగ్ మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్
Aaron Finch Retirement: కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు తొలి టీ20 వరల్డ్‌కప్ అందించిన స్టార్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇదివరకే టెస్ట్, వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఫించ్.. పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు కెరీర్‌ను కొనసాగించలేనని తెలిసే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు ఫించ్ వెల్లడించాడు. కెరీర్ ఆసాంతం తనకు మద్దతుగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులకు, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్ ఎత్తుపల్లాల్లో తనకు అండగా నిలిచిన కుటుంబానికి, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. 2015 వన్డే ప్రపంచకప్, 2021లో టీ20 ప్రపంచకప్ గెలవడం తనకు చిరకాలం గుర్తుండిపోతుందని రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా, ఫించ్ సారధ్యంలో ఆసీస్ 2021 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా తరఫున 5 టెస్ట్‌లు, 146 వన్డేలు, 103 టీ20లు ఆడిన ఫించ్.. 17 వన్డే సెంచరీలు, 2 టీ20 సెంచరీలు, 2 టెస్ట్ ఫిఫ్టీలు, 30 వన్డే ఫిఫ్టీలు, 19 టీ20 ఫిఫ్టీల సాయంతో 278 టెస్ట్ పరుగులు, 5406 వన్డే పరుగులు, 3120 టీ20 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (172) ఫించ్ పేరిటే ఉంది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సమయంలో ఫించ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ దేశవాలీ, క్లబ్, ఇతరత్రా లీగ్‌లకు అందుబాటులో ఉంటాడు. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
Border-Gavaskar Trophy 2023: ‘మా వద్దా స్పిన్ అస్త్రాలు ఉన్నాయి’
బెంగళూరు: భారత గడ్డపై టెస్టు సిరీస్ అంటే స్పిన్ బౌలింగ్ ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలుసు. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లాంటి స్పిన్నర్లను ఎదుర్కొని ఆస్ట్రేలియా ఎలా పరుగులు సాధిస్తుందనేది ఆసక్తికరం. అయితే మరోవైపు తమ స్పిన్ కూడా బలమైందేనని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నమ్ముతున్నాడు. ఈ నెల 9 నుంచి బోర్డర్–గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కమిన్స్ శనివారం మీడియాతో మాట్లాడాడు. తమ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని, భిన్నమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని కమిన్స్ అన్నాడు. ఈ సిరీస్‌లో నాథన్ లయన్ ఆసీస్ ప్రధానాస్త్రం కాగా, ఇతర స్పిన్నర్లు అతనికి అండగా నిలవనున్నారు. ‘మా జట్టులోనూ ఆఫ్‌స్పిన్నర్, లెగ్‌స్పిన్నర్, లెఫ్టార్మ్ పేసర్... ఇలా భిన్నమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అయితే పరిస్థితులను బట్టి 20 వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న బౌలింగ్ బృందాన్నే ఎంచుకుంటాం. నాగపూర్‌లో తొలి టెస్టు సమయానికే స్పష్టత వస్తుంది’ అని కమిన్స్ చెప్పాడు. తమ స్పిన్నర్లపై మేనేజ్మెంట్కు గట్టి నమ్మకం ఉందని అతను వెల్లడించాడు. ‘ఆస్టన్ అగర్ మంచి ప్రతిభావంతుడు. గత రెండు విదేశీ పర్యటనల్లో ఆడిన స్వెప్సన్కు అనుభవం వచ్చింది. మర్ఫీ కూడా గత సిరీస్ ఆడాడు. ట్రవిస్ హెడ్ కూడా మంచి ఆఫ్‌స్పిన్ వేయగలడు. కాబట్టి వీరంతా లయన్‌కు సహకరించగలరు’ అని ఆసీస్ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. అయితే స్పిన్‌పై చర్చలో తమ పేస్ బౌలర్ల పదును గురించి ఎవరూ చర్చించడం లేదని కమిన్స్ వ్యాఖ్యానించాడు. ‘అన్ని పరిస్థితుల్లోనూ సత్తా చాటగల పేస్ బౌలర్లు మాకు ఉన్నారు. పేస్‌కు పెద్దగా సహకరించని సిడ్నీ పిచ్‌లపై కూడా వారు చెలరేగారు. గత భారత పర్యటనలో రాంచీ టెస్టులో నేను మంచి ప్రదర్శన కనబర్చడం మరచిపోలేను. ఈసారి నాపై మరింత బాధ్యత ఉంది’ అని కంగారూ టీమ్ సారథి పేర్కొన్నాడు. మరోవైపు వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ తొలి టెస్టు ఆడే అవకాశాలు మెరుగవుతున్నాయి. తాజా సన్నాహక శిబిరంలో అతను బాగా బౌలింగ్ చేశాడని, బ్యాటింగ్‌లో కొంత అసౌకర్యంగా ఉన్నా... మ్యాచ్ సమయానికి కోలుకుంటే తుది జట్టులో స్థానం ఖాయమని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించాడు. గ్రీన్ టీమ్‌లోకి వస్తే అదనపు స్పిన్నర్‌ను ఆడించేందుకు ఆసీస్‌కు అవకాశం ఉంటుంది. ‘రివర్స్ స్వింగ్’ పని చేస్తుంది: క్యారీ భారత్‌లో స్పిన్ బౌలింగ్ ప్రభావం గురించే అంతా మాట్లాడుతున్నారని, అయితే రివర్స్ స్వింగ్ తమను ఇబ్బంది పెట్టవచ్చని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అభిప్రాయపడ్డాడు. 2018లో ఆసీస్ ‘ఎ’ తరఫున ఇక్కడ ఆడినప్పుడు స్పిన్ కోసం సిద్ధమైతే భారత పేసర్లు రివర్స్ స్వింగ్‌తో తమను పడగొట్టారని గుర్తు చేసుకున్నాడు. బుమ్రా, పంత్‌లాంటి ఆటగాళ్లు లేక ప్రస్తుత భారత జట్టు కొంత బలహీనంగా కనిపిస్తోందని, కొద్దిగా కష్టపడితే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గెలిచే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ వ్యాఖ్యానించాడు. టీమిండియా కోహ్లిపై అతిగా ఆధారపడుతోందన్న చాపెల్... ఖాజా, లబుషేన్లాంటి ఆటగాళ్లకు ఇది అతి పెద్ద పరీక్షగా అభివర్ణించాడు. -
Viral Video: ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చెంపలు వాయించిన గర్ల్‌ఫ్రెండ్
Michael Clarke Slapped By Girl Friend: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ (2015) అయిన మైఖేల్ క్లార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనను మోసం చేసి మరో మహిళతో (పిప్ ఎడ్వర్డ్స్) శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. గర్ల్‌ఫ్రెండ్ జేడ్ యాబ్రో బహిరంగంగా క్లార్క్ చెంపులు వాయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. Michael Clarke and Karl Stefanovic have squared off in a wild fracas in a public park, in which Clarke was slapped across the face by his girlfriend and accused of cheating. Michael Clarke Video#YouFuckedHerOnDecember17 pic.twitter.com/pbiLUpLnnc — SuperCoach IQ (@SuperCoachIQ) January 18, 2023 ఈ వీడియోలో క్లార్క్.. జేడ్‌కు సర్ది చెప్పేందుకు విశ్వప్రయాత్నాలు చేసినప్పటికీ, ఆమె ఏమాత్రం కన్విన్స్ కాకపోగా, మరింత రెచ్చిపోయింది. భూతులు తిడుతూ.. పలానా రోజు నువ్వు ఆమెతో గడిపావు, నువ్వో మదమెక్కిన కుక్కవు అంటూ పబ్లిక్‌గా క్లార్క్‌పై దాడికి దిగింది. తానే తప్పు చేయలేదని క్లార్క్ సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. సదరు మహిళతో చేసిన ఫోన్ చాట్‌ను బయటపెట్టాలని జేడ్ గట్టిగా డిమాండ్ చేసింది. ఆ సమయంలో జేడ్ సోదరుడు, అతని భార్య అక్కడే ఉన్నారు. ఆ ముగ్గురు సంఘటన స్థలాన్ని విడిచి వెళ్తుండగా.. క్లార్క్ వారికి అడ్డుతగలడంతో జేడ్ మరింత రెచ్చిపోయింది. దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. క్లార్క్ కుంటుతూ వారి వెంబడి పడే ప్రయత్నం చేశాడు. ఈ ఉదంతంపై క్లార్క్ స్పందిస్తూ.. బహిరంగంగా ఇలా ప్రవర్తించినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. కాగా, క్లార్క్.. తన భార్య కైలీని వదిలేసి గతకొంతకాలంగా ప్రముఖ మోడల్ అయిన జేడ్‌తో సహజీవనం చేస్తున్నాడు. 41 ఏళ్ల క్లార్క్.. ఆసీస్ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో అతను 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీ సాయంతో 8643 పరగులు చేయగా.. వన్డేల్లో 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీల సాయంతో 7981 పరుగులు చేశాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 488 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో క్లార్క్ అత్యధిక స్కోర్ 329 నాటౌట్‌గా ఉంది. -
ఆస్ట్రేలియా కెప్టెన్ సంచలన నిర్ణయం.. వన్డేలకు గుడ్‌బై
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం విలేకరుల సమావేశంలో ఫించ్ వెల్లండించాడు. ఆదివారం కైర్న్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే ఫించ్ అఖరి వన్డే కానుంది. అతడు టీ20లపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. "ఆస్ట్రేలియా వంటి అద్భుతమైన జట్టులో భాగమైనందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఆసీస్ జట్టుతో నా జర్నీలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ రోజు వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని ఫించ్ పేర్కొన్నాడు. కాగా గత కొంత కాలంగా వన్డేల్లో ఫించ్ దారుణంగా విఫలమవుతున్నాడు. అతడు తన ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి. ఇక ఫించ్ 2013 శ్రీలంకపై ఆసీస్ తరపున వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 145 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన ఫించ్.. 5041 పరుగులు సాధించాడు. 54 వన్డేల్లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా ఫించ్ వ్యవహారించాడు. అతడి వన్డే కెరీర్లో ఇప్పటి వరకు 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. A true champion of the white-ball game. Aaron Finch will retire from one-day cricket after tomorrow’s third and final Dettol ODI vs New Zealand, with focus shifting to leading Australia at the #T20WorldCup pic.twitter.com/SG8uQuTVGc — Cricket Australia (@CricketAus) September 9, 2022 చదవండి: Asia Cup 2022: పాక్‌కు షాకిచ్చిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం -
45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన క్రికెట్ దిగ్గజం
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ తన 45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. చాపెల్ తన నిర్ణయాన్ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం ప్రకటించాడు. చాలా కాలం నుంచి కామెంటరీకు గుడ్‌బై చేప్పాలని ఆలోచనలో ఉన్నట్లు చాపెల్ తెలిపాడు. చాపెల్ 75 టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరపున ప్రాతినిథ్యం వహించాడు. వాటిలో 30 మ్యాచ్‌లకు ఆసీస్ కెప్టెన్‌గా చాపెల్ వ్యవహరించాడు. 1977లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన చాపెల్.. అనంతరం కామెంటెటర్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఇక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో చాపెల్ మాట్లాడుతూ.. "క్రికెట్ నుంచి నేను తప్పుకోవాలని అనుకున్న రోజు ఇప్పటకీ నాకు బాగా గుర్తుంది. నా క్రికెట్ కెరీర్లో అఖరి రోజు వాచ్ చూశాను. టైమ్ 11 దాటింది. ఇక చాలు అని డిసైడయ్యాను. ఇక వ్యాఖ్యానం విషయంలోనూ అదే నిర్ణయం తీసుకున్నా. కొన్నేళ్ల కిందట నాకు గుండెపోటు వచ్చింది. నేను అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. కానీ ఆ తర్వాత ఆరోగ్య పరంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకున్న, మెట్లు ఎక్కడంలాంటి పనులు చేసిన అలసట ఎక్కువగా వచ్చేది. అ సమయంలో రగ్బీ లీగ్ వాఖ్యత లెజెండరీ రే వారెన్ చెప్పిన విషయం ఒకటి గుర్తొచ్చింది. ఒక తప్పు చేయడానికి ఒక అడగు దూరంలో మీరుంటారు అని అతడు చెప్పేవాడు. అప్పడే ఇక కామెంటరీని వదిలేయాలని నిర్ణయించుకున్నా" అని చాపెల్ పేర్కొన్నాడు. చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన -
అతను టీ20లకు పనికిరాడు.. కెప్టెన్ అయితేనేం, సాగనంపండి..!
ఆస్ట్రేలియాకు తొట్ట తొలి టీ20 ప్రపంచకప్ అందించిన ఆ దేశ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై దిగ్గజ వికెట్‌కీపర్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ హీలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా శ్రీలంకతో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఫించ్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు 4-1 తేడాతో గెలుచుకుంది. అయితే సిరీస్ ఆధ్యాంతం పేలవ ప్రదర్శన (5 మ్యాచ్‌ల్లో 78 పరుగులు) కనబర్చి, జట్టుకు భారంగా మారిని ఫించ్‌పై ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ హీలీ మండిపడ్డాడు. Aaron Finch’s batting average in T20 internationals has dropped every year since 2018. 2018 – 40.84 (SR 176.41) 2019 – 35.83 (SR 158.08) 2020 – 33.97 (SR 138.97) 2021 – 28.68 (SR 125.06) 2022 – 15.60 (SR 91.76) More on @newscomauHQ: https://t.co/Qn3GfEEGJI 📸 Getty #AUSvSL pic.twitter.com/SKZ7pZawNO — Nic Savage (@nic_savage1) February 21, 2022 ఫించ్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతుందని.. గడిచిన నాలుగేళ్లలో అతని గణాంకాలే ఇందుకు నిదర్శనమని అన్నాడు. ఫించ్ స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకుంటే మర్యాదగా ఉంటుందని లేదంటే ఫామ్ కోల్పోయినప్పుడు దిగ్గజాలకు సైతం తప్పని అవమానాన్ని ఎదర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కెరీర్ ఆరంభంలో పవర్ హిట్టింగ్తో దుమ్ము లేపిన ఫించ్.. వయో భారంతో పాటు ఫామ్ లేమితో మునుపటి తరహా ఆటతీరును కనబర్చలేకపోతున్నాడని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఫించ్ జట్టులో ఉండటం అవసరమా అని ప్రశ్నించాడు. ఫించ్ లాగే మరో టాపార్డర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా తయారయ్యాడని, అతనిని కూడా జట్టు నుంచి పక్కకు పెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. తుది జట్టులో స్మిత్‌కు చోటు కల్పించడం కోసం మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ లాంటి ఆటగాళ్లపై వేటు వేయరాదని సూచించాడు. ఫించ్, స్మిత్ ఇద్దరూ సామర్ధ్యం మేరకు రాణించలేకపోతున్నారు కాబట్టే ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో వారు అమ్ముడుపోలేదని చురకలంటించాడు. చదవండి: దంచి కొట్టిండు.. దండం పెట్టిండు.. వైరలవుతున్న సూర్యకుమార్ నమస్తే సెలబ్రేషన్స్ ఇయాన్ హీలీ, ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్, స్టీవ్ స్మిత్ -
అమ్మో అడిలైడ్!
సిడ్నీ: భారత్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు కొత్త సమస్య వచ్చి పడింది. తొలి టెస్టు మ్యాచ్‌కు వేదికైన అడిలైడ్‌లో సోమవారం ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. దాంతో టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఆదివారం వరకు 4 కేసులు ఉన్న అడిలైడ్‌లో సోమవారం 17 కేసులు నమోదయ్యాయి. దాంతో ఈ నగరం ఉండే సౌత్ ఆస్ట్రేలియాతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తమ సరిహద్దులు మూసివేస్తున్నట్లు పక్క రాష్ట్రాలు వెస్ట్రన్ ఆస్ట్రేలియా, నార్తర్న్ టెరిటరీ, టాస్మేనియా, క్వీన్స్లాండ్ ప్రకటించాయి. అక్కడి నుంచి ఎవరైనా వచ్చినా కచ్చితంగా 14 రోజుల హోటల్ క్వారంటైన్‌కు వెళ్లేలా ఆదేశాలు జారీ చేశాయి. అయితే డిసెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టు (డే–నైట్)కు ఎలాంటి ఆటంకం ఉండబోదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ప్రకటించింది. అప్పటిలోగా పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. తొలి టెస్టుకు స్టేడియంలో సగం మంది ప్రేక్షకులను అనుమతించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే పరిస్థితి మారకపోతే మాత్రం ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరగవచ్చు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక విమానాల ద్వారా ఆస్ట్రేలియా జాతీయ జట్టు, దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాలని సీఏ భావిస్తోంది. కరోనా సమస్య లేని సిడ్నీకి (న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం) అందరినీ తీసుకెళితే అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు అవకాశం ఉంటుందనేది సీఏ ఆలోచన. ప్రస్తుతం భారత జట్టు సిడ్నీలోనే ఉంది. -
మెగ్ లానింగ్ మళ్లీ నంబర్‌వన్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. నాలుగు స్థానాలు ఎగబాకిన మెగ్ లానింగ్ 749 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాణించిన లానింగ్... సెంచరీతో సహా మొత్తం 163 పరుగులు చేసి సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించింది. నంబర్‌వన్ ర్యాంక్‌ను చేజిక్కించుకోవడం లానింగ్‌కు ఇది ఐదోసారి. అంతేకాకుండా ఆమె టాప్ ర్యాంకులో 902 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. లానింగ్ తొలిసారి 2014లో టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. వెస్టిండీస్ ప్లేయర్ స్టెఫానీ టేలర్, అలీసా హీలీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (732 రేటింగ్ పాయింట్లు) నాలుగో స్థానంలో... సారథి మిథాలీ రాజ్ పదో స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో ఆసీస్ స్పిన్నర్ జెస్సికా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండే, దీప్తి శర్మలు వరుసగా ఐదు, ఆరు, ఏడు, పది స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి స్థానంలో కొనసాగుతుంది. భారత్ రెండో స్థానంలో ఉంది. -
నన్ను క్షమించండి: ఆస్ట్రేలియా కెప్టెన్
ధర్మశాల: టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్ సందర్భంగా నోరు పారేసుకుని, అనుచితంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. సిరీస్ ఓటమి సందర్భంగా దిగొచ్చాడు. తాను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని, తనను క్షమించాల్సిందిగా స్మిత్ కోరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. ధర్మశాలలో కీలక నాలుగో టెస్టులో భారత్ చేతిలో ఓటమి అనంతరం స్మిత్ మాట్లాడుతూ.. 'సిరీస్ అంతా గొడవలు, వివాదాలతో సాగింది. నేను ప్రతిసారీ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నా' అని చెప్పాడు. ఈ సిరీస్ భారత క్రికెటర్లు, ముఖ్యంగా బౌలర్లు బాగా రాణించారని స్మిత్ ప్రశంసించాడు. ధర్మశాల టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్ మురళీ విజయ్ను స్మిత్ దూషించాడు. స్మిత్ నోరుపారేసుకున్నప్పటి దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఇక డీఆర్ఎస్ విషయంలోనూ పలుమార్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో గొడవ పెట్టుకున్నాడు. ఇక ఇతర ఆసీస్ ఆటగాళ్లు కూడా కెప్టెన్ స్మిత్ బాటలోనే ఘర్షణ వైఖరి అవలంభించారు. -
ఆస్ట్రేలియా క్రికెటర్లకు జరిమానా
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి, టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ స్థానాన్ని సాధించినందుకు ఆస్ట్రేలియా జట్టు సంబరాలు చేసుకోగా.. అంపైర్‌ను దూషించినందుకు ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, బౌలర్ హాజెల్‌వుడ్‌కు జరిమానా పడింది. ఐసీసీ ఈ ఇద్దరు క్రికెటర్లను మందలించడంతో పాటు జరిమానా విధించింది. స్మిత్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం, హాజెల్‌వుడ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం చొప్పున జరిమానా వేసింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు నాలుగో రోజు ఆట మంగళవారం హాజెల్‌వుడ్ అంపైర్ మార్టినెస్ను దూషించాడు. హాజెల్‌వుడ్‌కు మద్దతుగా కెప్టెన్ స్మిత్ కూడా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ విలియమ్సన్ 88 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. తన బౌలింగ్‌లో విలియమ్సన్ అవుటయినట్టు హాజెల్‌వుడ్ అప్పీలు చేయగా, అంపైర్ తిరస్కరించాడు. స్మిత్ సమీక్ష కోరినా ఫలితం అనుకూలంగా రాలేదు. దీంతో అసహనానికి లోనైన స్మిత్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగగా, హాజెల్‌వుడ్ తిట్లపురాణం అందుకున్నాడు. కాగా తాను అంపైర్‌తో వాగ్వాదానికి దిగలేదని, కేవలం వివరణ అడిగానని స్మిత్ చెప్పాడు. హాజెల్‌వుడ్, స్మిత్ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినట్టు ఐసీసీ నిర్ధారించింది. వీరిద్దరినీ మందలిస్తూ జరిమానా విధించింది. -
ఆసీస్ పుంజుకునేనా!
♦ నేటి నుంచి యాషెస్ నాలుగో టెస్టు ♦ సిరీస్ విజయంపై ఇంగ్లండ్ గురి ♦ మ. గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం నాటింగ్‌హామ్ : యాషెస్ సిరీస్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు గురువారం నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరగనుంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుస్తుంది. మరోవైపు ఒక మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలి. ఈ సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఫలితం ఏకపక్షంగా వచ్చింది. రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధిస్తే... మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది. స్వింగ్ బౌలర్లకు సహకరించే ట్రెంట్‌బ్రిడ్జ్ పిచ్‌పై అండర్సన్ సేవలు అందుబాటులో లేకపోవడం ఇంగ్లండ్‌కు దెబ్బ. అతని స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రిటైర్ కాను: క్లార్క్ వరుసగా మూడు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే తనలో క్రికెట్ ఆడాలన్న తపన తగ్గలేదని, ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదని క్లార్క్ స్పష్టం చేశాడు. -
ఫైనల్ తర్వాత వన్డేలకు గుడ్ బై : క్లార్క్
మెల్బోర్న్: న్యూజిలాండ్ తో ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వన్డేల నుంచి రిటైర్ అవ్వనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రకటించారు. 21 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో స్థానం పొంది గత 12 ఏళ్లలో తన బ్యాటింగ్‌తో ఎన్నో సందర్భాల్లో ఆసిస్‌ని విజయతీరాలకు చేర్చాడు. 'నారిటైర్మెంట్ ప్రకటనకు ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. రెండు రోజులు కింది ఈ నిర్ణయం తీసుకున్నాను. వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడలేనని నాకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను' అని33 ఏళ్ల క్లార్క్ చెప్పారు. క్లార్క్ 244 వన్డే మ్యాచ్‌లు ఆడి 7,907 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 130 పరుగులు చేశాడు. అయితే టెస్ట్ మ్యాచ్‌లలో కొనసాగనున్నట్లు చెప్పారు. టెస్టుల్లో 108 మ్యాచ్‌లు ఆడి 8,432 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధికంగా 329 పరుగులు చేశాడు. -
స్మిత్‌కు కెప్టెన్సీ!
ఆస్ట్రేలియా మాజీల మద్దతు సిడ్నీ: భారత్‌తో తొలి టెస్టులో మైకేల్ క్లార్క్ ఆడేది అనుమానంగా మారడటంతో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీపై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. క్లార్క్ గైర్హాజరీలో సహజంగానే వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే హాడిన్కంటే భవిష్యత్తు కోసం కొత్త తరం ఆటగాడిని ఎంపిక చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అందుకు గాను స్టీవెన్ స్మిత్ సరైన వ్యక్తిగా ఎక్కువ మంది భావిస్తున్నారు. స్మిత్‌కు నాయకత్వ పగ్గాలు ఇవ్వాలంటూ ఆసీస్ మాజీ ఆటగాడు కిమ్ హ్యూస్, మెక్‌గ్రాత్ అభిప్రాయ పడ్డారు.