ఫైనల్ తర్వాత వన్డేలకు గుడ్ బై : క్లార్క్
మెల్బోర్న్: న్యూజిలాండ్ తో ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వన్డేల నుంచి రిటైర్ అవ్వనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రకటించారు. 21 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో స్థానం పొంది గత 12 ఏళ్లలో తన బ్యాటింగ్తో ఎన్నో సందర్భాల్లో ఆసిస్ని విజయతీరాలకు చేర్చాడు.
'నారిటైర్మెంట్ ప్రకటనకు ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. రెండు రోజులు కింది ఈ నిర్ణయం తీసుకున్నాను. వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడలేనని నాకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను' అని33 ఏళ్ల క్లార్క్ చెప్పారు.
క్లార్క్ 244 వన్డే మ్యాచ్లు ఆడి 7,907 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 130 పరుగులు చేశాడు. అయితే టెస్ట్ మ్యాచ్లలో కొనసాగనున్నట్లు చెప్పారు. టెస్టుల్లో 108 మ్యాచ్లు ఆడి 8,432 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధికంగా 329 పరుగులు చేశాడు.