Michael Clarke
-
'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న భారత జట్టు.. తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.అనంతరం రోహిత్ సేన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో తలపడే అవకాశముంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలుస్తుందని క్లార్క్ జోస్యం చెప్పాడు."ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడతాయని భావిస్తున్నాను. ఆసీస్ ఛాంపియన్స్‌గా నిలవాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కానీ టీమిండియాకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంటుంది నేను అనుకుంటున్నాను. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 వన్డే జట్టుగా ఉంది. వారిని ఓడించడం అంత ఈజీ కాదు. భారత్, ఆసీస్ మధ్య తుది పోరు హోరహోరీగా జరుగుతుంది. కానీ టీమిండియా ఒక్క పరుగు తేడాతో విజయం సాధిస్తుంది" అని రేవ్ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లార్క్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ మెగా టోర్నీ టాప్ స్కోరర్‌గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిలుస్తాడని క్లార్క్ అంచనా వేశాడు."రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడు కటక్‌లో భారీ సెంచరీ సాధించాడు. అద్భుతమైన షాట్లతో అందరిని అలరించాడు. అతడు ఈ మెగా ఈవెంట్లో కూడా మంచి టచ్‌లో కన్పిస్తున్నాడు. రోహిత్ భారత్‌కు కీలకంగా మారనున్నాడు. అతడు తన దూకుడును కొనసాగించాలి. పవర్ ప్లేలో పరుగులు రాబట్టాలన్న అతడి ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేదు. రోహిత్ అద్భుతమైన ఆటగాడు. రోహిత్ శర్మ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు" అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌పై 40 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. పాకిస్తాన్ 20 పరుగులతో క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: జోస్ బట్లర్ రాజీనామా.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ అతడే!? -
CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్‌గా అతడే: ఆసీస్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ఎనిమిది జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆతిథ్య వేదికలకు చేరుకుని ఐసీసీ టోర్నమెంట్‌కు సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఇక ఈ మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్(Pakistan) దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్(Dubai)లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు, విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ టీమిండియాను టైటిల్ ఫేవరెట్‌గా పేర్కొనగా.. పాకిస్తాన్ లెజెండరీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ ఈసారి కూడా భారత్- పాక్ ఫైనల్లో తలపడతాయని జోస్యం చెప్పాడు.ఇక ఓవరాల్‌గా మెజారిటీ మంది భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-4కు చేరతాయని అంచనా వేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్(Michael Clarke) సైతం ఈ ఐసీసీ ఈవెంట్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో అత్యధిక పరుగుల, వికెట్ల వీరులు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, టోర్నీ విజేతపై తన అంచనాలు తెలియజేశాడు.టాప్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్‌గా వారే‘‘ఈసారి టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవబోతోంది. వాళ్ల కెప్టెన్ ఫామ్‌లోకి వచ్చాడు. అంతేకాదు.. ఈసారి అతడే చాంపియన్స్ ట్రోఫీలో టాప్ రన్‌స్కోరర్ కాబోతున్నాడు. అతడు మునుపటి లయను అందుకోవడం సంతోషంగా ఉంది. టీమిండియాకు అతడి సేవలు అవసరం.ఇక ఈసారి ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవబోతున్నాడు. అయితే, ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై మాత్రం నేను ఎక్కువగా అంచనాలు పెట్టుకోలేదు. అయితే, ఆర్చర్ మాత్రం ఓ సూపర్‌స్టార్. అందుకే అతడే ఈసారి లీడింగ్ వికెట్ టేకర్ అని చెప్పగలను.‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా హెడ్ఇక ఈ టోర్నమెంట్లో ట్రవిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవుతాడు. ప్రస్తుతం అతడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో గతేడాది అదరగొట్టాడు. ఇటీవల టెస్టుల్లోనూ దుమ్ములేపాడు. అయితే, శ్రీలంక పర్యటనలో కాస్త వెనుకబడినట్లు అనిపించినా మళ్లీ త్వరలోనే బ్యాట్ ఝులిపించగలడు.అయితే, ట్రవిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ స్థాయిలో ప్రదర్శన ఇచ్చినా.. ఈసారి ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్లో ఓడిపోతుందని అనిపిస్తోంది. ఏదేమైనా హెడ్ మాత్రం హిట్టవ్వడం ఖాయం. నిజానికి అతడి బౌలింగ్ కూడా బాగుంటుంది. కానీ.. బౌలింగ్‌లో అతడి సేవలను ఆస్ట్రేలియా ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు’’ అని మైకేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో అతన అభిప్రాయాలు పంచుకున్నాడు. క్లార్క్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. విరాట్ కోహ్లి అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈసారి కింగ్ కోహ్లినే టాప్ రన్‌స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పాల్గొంటున్నాయి.చదవండి: ఐపీఎల్ 2025లో SRH షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే..! -
అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ బౌలర్: ఆసీస్ మాజీ కెప్టెన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా కోల్పోయినప్పటికి.. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన అద్బుత ప్రదర్శనతో ప్రత్యర్ధిలను సైతం ఆకట్టుకున్నాడు. పెర్త్ నుంచి సిడ్నీ వరకు మొత్తం 5 టెస్టుల్లోనూ బుమ్రా సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో చాలా సందర్భాల్లో బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు.బుమ్రా మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. బుమ్రా మరో రెండు వికెట్లు సాధించి ఉంటే, ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పర్యాటక బౌలర్‌గా రికార్డులెక్కెవాడు.ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లండ్ బౌలింగ్ దిగ్గజం సిడ్నీ బర్న్స్ పేరిట ఉంది. బర్న్స్ 1911-12 సిరీస్‌లో ఏకంగా 34 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆల్ ఫార్మాట్లలో బుమ్రాను మించిన బౌలర్ లేడని క్లార్క్ కొనియాడాడు."బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తర్వాత బుమ్రా ప్రదర్శన గురించి నేను ఆలోచించాను. నా వరకు అయితే అన్ని ఫార్మాట్లలో బుమ్రానే అత్యుత్తమ బౌలర్. చాలా మంది గొప్ప ఫాస్ట్ బౌలర్లు నాకు తెలుసు. కర్ట్లీ ఆంబ్రోస్, గ్లెన్ మెక్‌గ్రాత్ దిగ్గజ బౌలర్లు ఉన్నా, వారు టీ20 క్రికెట్ ఆడలేదు.కాబట్టి బుమ్రాను ఆల్‌ఫార్మాట్ బెస్ట్ బౌలర్‌గా ఎంచుకున్నాను. ఆడే ఫార్మాట్, కండీషన్స్‌తో సంబంధం లేకుండా బుమ్రా అద్బుతంగా రాణించగలడు. అదే అతడి అత్యుత్తమ బౌలర్‌గా మార్చింది. సిడ్నీ టెస్టులో భారత్ మరో 20 పరుగులు ఎక్కువగా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది.బుమ్రా జట్టులో ఉంటే సిడ్నీ టెస్టు భారత్ గెలుస్తుందని నేను అనుకున్నాను. జట్టులోని ఇతర బౌలర్ల కంటే బుమ్రా చాలా బెటర్‌గా ఉన్నాడు" అని క్లార్క్ ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. అతడు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. బుమ్రా తిరిగి మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం? -
‘నితీశ్.. జీనియస్’
సిడ్నీ: ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొడుతున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ప్రశంసలు కురిపించాడు. మెల్బోర్న్ టెస్టులో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో క్లార్క్ మాట్లాడుతూ... ‘నితీశ్ జీనియస్. చిన్న వయసులో అతడి ఆటతీరు అమోఘం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చక్కటి సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతడికింకా 21 ఏళ్లే. ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ ప్రారంభానికి ముందు అతడి గురించి ఎవరూ పెద్దగా ఆలోచించలేదు. కానీ తన ఆటతీరుతో నితీశ్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లను చూసి అతడు భయపడలేదు. అవసరమైన సమయంలో సంయమనం చూపాడు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ అతడు దాన్ని చేసి చూపాడు. సమయానుకూలంగా బ్యాటింగ్ చేస్తూ పరిణతి చూపాడు. భవిష్యత్తులో అతడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని భావిస్తున్నా. అదే అతడికి మంచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో ఇలాంటి చురుకైన కుర్రాడు లభించడం భారత క్రికెట్‌కు మంచి చేస్తుంది. సిడ్నీ టెస్టులో అందరి దృష్టి అతడిపైనే ఉంటుంది’ అని అన్నాడు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఫామ్ దొరకబుచ్చుకోలేక తంటాలు పడుతున్న టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మను ఉద్దేశించి కూడా క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు భారమైనట్లు అనిపిస్తే తప్పుకోవడమే మంచిదని అన్నాడు. ‘సిడ్నీ టెస్టు నుంచి రోహిత్‌ను తప్పిస్తారని అనుకోవడం లేదు. కానీ అతడి ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ఈ సిరీస్‌లో అతడి టెస్టు కెరీర్ ముగుస్తుందని అనుకోవడం లేదు. అయితే జట్టును ఇబ్బంది పెడుతూ భారంగా కొనసాగాలని ఏ ఆటగాడు కోరుకోడు’ అని క్లార్క్ అన్నాడు. -
BGT: అతడిపైనే వేటు వేస్తారా?.. సెలక్టర్లపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఫైర్
ఆస్ట్రేలియా సెలక్టర్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియాతో మిగిలిన రెండు టెస్టులకు నాథన్ మెక్‌స్వీనీని తప్పించడాన్ని తప్పుబట్టాడు. కేవలం మూడు మ్యాచ్‌ల ఆధారంగా అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా అని మండిపడ్డాడు. కాగా భారత్‌తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో చివరి రెండు టెస్టులకు ఆసీస్ తమ జట్టులో ఒక మార్పు చేసిన విషయం తెలిసిందే.టీనేజ్ సంచలనం ఎంట్రీమూడు టెస్టుల్లోనూ విఫలమైన టాపార్డర్ బ్యాటర్ మెక్స్వీనీనిపై కంగారూ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. 25 ఏళ్ల ఈ యువ ఓపెనర్ వరుస ఇన్నింగ్స్‌ల్లో 10, 0, 39, 10 నాటౌట్, 9, 4 పరుగులే చేసి నిరాశపరిచాడు. దీంతో అతడి స్థానంలో టీనేజ్ సంచలనం సామ్ కొన్‌స్టాస్‌ను జాతీయ టెస్టు జట్టులోకి ఎంపిక చేసింది.సీనియర్ల మాటేమిటి?ఈ విషయంపై మైకేల్ క్లార్క్ స్పందించాడు. ‘‘నాథన్ మెక్‌స్వీనీ కాకుండా.. 30 ఏళ్లు, ఆపై వయసున్న వాళ్ల పట్ల మన విధానం ఎలా ఉంది? యువకులకు ఒకటీ అరా అవకాశాలు ఇచ్చి.. వెంటనే జట్టు నుంచి తప్పిస్తారా? అనుభవం ఉన్నా విఫలమవుతున్న, వయసు పైబడుతున్న వాళ్లను మాత్రం కొనసాగిస్తారా?ఒకవేళ రెండు టెస్టుల వ్యవధిలో ఉస్మాన్ ఖవాజా రిటైర్ అయితే ఏం చేస్తారు? మళ్లీ మెక్‌స్వీనీని వెనక్కి తీసుకువస్తారా? అసలు సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారు? ‘అతడిని ఎంపిక చేసి తప్పుచేశాం’ అని అనుకుంటున్నారా?ఇది నాథన్ మెక్‌స్వీనీ కెరీర్. దానితో మీరు ఆటలాడవద్దు. అతడు మరిన్ని అవకాశాలకు అర్హుడు. ఈ సమ్మర్లో మిగిలిన టెస్టులన్నింటిలోనూ అతడిని ఆడించాలి. ఉస్మాన్ ఖవాజాకు 38 ఏళ్లు. అతడొక సీనియర్ ప్లేయర్. మరి ఓపెనర్‌గా ఈ సిరీస్‌లో పరుగులు రాబట్టలేదు కదా!.. అతడిని కొనసాగించినపుడు మెక్‌స్వీనీని ఎందుకు తప్పించారు?’’ అని క్లార్క్ ఓ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించాడు.వార్నర్ రిటైర్మెంట్ తర్వాతకాగా డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ స్థానం ఖాళీ అయింది. స్టీవ్ స్మిత్‌ను ఓపెనర్‌గా పంపిన ప్రయోగం విఫలం కావడంతో.. ఈసారి మెక్‌స్వీనీకి అవకాశం వచ్చింది. అయితే, తొలి మూడు టెస్టుల్లో అతడు విఫలం కావడం వల్ల.. 19 ఏళ్ల సామ్ కాన్స్టాస్కు సువర్ణావకాశం దక్కింది.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇరుజట్లు చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. ఇరుజట్ల మధ్య డిసెంబరు 26-30 వరకు మెల్బోర్న్లో నాలుగో టెస్టు జరుగుతుంది. ఆఖరి టెస్టుకు సిడ్నీ వేదిక.చదవండి: ముంబై ప్లేయర్‌గా అతడికి ఇదే లాస్ట్ సీజన్: భారత మాజీ సెలక్టర్ -
మైదానంలో ఫ్రెండ్స్ ఉండరు.. గంభీర్ దూకుడు సరైనదే: ఆసీస్ లెజెండ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు శుక్రవారం(నవంబర్ 22) నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత్ జట్టు ఈ సిరీస్‌ను ఎలా ఆరంభిస్తుందోనని అందరూ అతృతగా ఎదురుచూస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా నేరుగా ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్‌ను 4-1తో ఓడించాలి. మరోవైపు ఈ సిరీస్‌తో భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు భవితవ్యం తేలిపోనుంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాకపోతే ఈ సీనియర్ ద్వయం టెస్టులకు విడ్కోలు పలికే అవకాశముంది.వీరిద్దరిపైనే కాకుండా భారత హెడ్‌కోచ్‌పై కూడా అందరి కళ్లు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో గంభీర్ కోచింగ్ వ్యూహాలు ఎలా ఉంటాయో అని భారత ప్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో గంభీర్ వైఖరిని క్లార్క్ సమర్థించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్‌ల వల్ల ఆటగాళ్ల మధ్య స్నేహం ఏర్పడి, పోటీతత్వం తగ్గిపోయిందని క్లార్క్ వ్యాఖ్యనించాడు."ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు చాలా వచ్చాయి. కాబట్టి వేర్వేరు దేశాల ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలకు ఆడేటప్పుడు ఎక్కువ సమయం కలిసి ఉంటున్నారు. దీంతో ఆటగాళ్ల మధ్య స్నేహం ఏర్పడి, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేటప్పడు ప్రత్యర్ధి ఆటగాళ్లపై దూకుడు చూపలేకపోతున్నారు. గతంలో మేము ఆడేటప్పుడు ప్రత్యర్ధిలుగానే చూసేవాళ్లం. ఎందుకంటే మేము ఆడేటప్పుడు ఐపీఎల్ వంటి లీగ్‌లు లేవు. ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నప్పటకి దేశం కోసం ఆడేటప్పుడు ఫీల్డ్‌లో దూకుడుగా ఉండాల్సిందే. మైదానంలో మనకు ఎవరూ స్నేహితులు ఉండరు.ఆఫ్‌ది ఫీల్డ్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఆన్ది ఫీల్డ్‌లో మాత్రం ప్రత్యర్థులుగానే చూడాలి. మీరు దేశం కోసం ఆడుతున్నారు, ఒకే ఐపీఎల్ జట్టులో ఆడటం లేదనే సంగతిని గుర్తుంచుకోవాలి. గతంలో భారత జట్టు ఇదే దూకుడు కనబరిచింది. అందుకే గత రెండు పర్యటనలలో ఆస్ట్రేలియాలో భారత్ విజయం సాధించింది. హెడ్ కోచ్ గంభీర్ దూకుడు భారత జట్టుకు మంచిదే. ఆస్ట్రేలియా కూడా అదే మైండ్ సెట్‌తో ఉంది. కాబట్టి ఈ సిరీస్ మరోసారి అభిమానులను మునివేళ్లపై నిలబెట్టనుంది" అని క్లార్క్ పేర్కొన్నాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
T20 WC 2024: ఆసీస్, ఇంగ్లండ్ కాదు.. ఆ జట్టే పెను ప్రమాదకారి..!
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనపై ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆశాజనకమైన జోస్యం చెప్పాడు. మెగా టోర్నీలో భారత్ పెను ప్రమాదకారిగా మారబోతుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు టీమిండియా నుంచి ముప్పు పొంచి ఉంటుందని అన్నాడు. భారత్.. ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బ తీయవచ్చని అంచనా వేశాడు. ఓవరాల్‌గా టీమిండియాకే ఈసారి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ బ్యాటర్లలో ట్రవిస్ హెడ్ నుంచి మెరుపు ప్రదర్శనలు ఆశిస్తున్నట్లు తెలిపాడు.క్లార్క్ ఓ పక్క టీమిండియాను గొప్పగా చూపుతూనే భారత సెలెక్టర్లు ఓ విషయంలో పెద్ద సాహసం చేశారని అన్నాడు. ప్రపంచకప్ జట్టుకు నలుగురు స్పిన్నర్లను (జడేజా, అక్షర్, కుల్దీప్, చహల్) ఎంపిక చేయడం ద్వారా టీమిండియా స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడుతుందన్న సందేశాన్ని పంపారని అన్నాడు. క్లార్క్‌కు ముందు చాలామంది దిగ్గజ క్రికెటర్లు, విశ్లేషకులు ఈ సారి టీమిండియానే టైటిల్ నెగ్గుతుందని జోస్యం చెప్పారు. మరి రియల్టీలో టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.కాగా, టీ20 ప్రపంచకప్ 2024 ఎడిషన్ జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్ఏ-కెనడా జట్లు తలపడనున్నాయి. మెగా టోర్నీలో భారత్ ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరుబోయే మ్యాచ్‌తో మొదలవుతుంది. జూన్ 9న టీమిండియా.. దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. మరోవైపు ఆసీస్ సైతం జూన్ 5నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆసీస్.. ఒమన్‌తో తలపడుతుంది. -
డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే..
Rohit Sharma Captaincy: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ మద్దతుగా నిలిచాడు. కేవలం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఓడినంత మాత్రాన అతడిని తొలగించాలనే డిమాండ్లు సరికావంటూ హిట్‌మ్యాన్‌ను సమర్థించాడు. కాగా డబ్ల్యూటీసీ సైకిల్ 2019-21లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లో జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టగా 2021-23 సీజన్లోనూ ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ ఈసారి కూడా గతం మాదిరే చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. దారుణ ఓటమి ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 209 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఆసీస్ సంప్రదాయ క్రికెట్లోనూ చాంపియన్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించగా.. టీమిండియా రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. టాస్ విషయంలో, ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడంపై మాజీలు సైతం పెదవి విరిచారు. ఈ క్రమంలో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. నాకు నమ్మకం ఉంది ఈ విషయంపై స్పందించిన మైకేల్ క్లార్క్ రోహిత్‌కు అండగా నిలిచాడు. ‘‘రోహిత్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను గొప్ప కెప్టెన్. అతడి దూకుడైన ఆట తీరు, కెప్టెన్సీ నాకు నచ్చుతాయి. ఎల్లవేళలా అతడు సానుకూల దృక్పథంతోనే కనిపిస్తాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ రికార్డు అమోఘం. నాయకుడిగా తను విజయవంతమయ్యాడు. ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవలేదన్న ఒకే ఒక్క కారణంగా రోహిత్ కెప్టెన్‌గా పనికిరాడనడం సరికాదు. నిజానికి ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టీమిండియా వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. టెస్టు క్రికెట్లో వారి రికార్డు బాగుంది. టీమిండియా నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. ఇక వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లో వారు ఎలా ఆడతారో చూడాల్సి ఉంది’’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. రోహిత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! ‘మొదటి బంతి’కే రూట్ అలా! పంత్‌ను లాగిన ఫ్యాన్స్.. వీడియో వైరల్ -
ఆస్ట్రేలియా చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయింది! అలా చేసి ఉంటే?
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పుడు ఢిల్లీ టెస్టులోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. కేవలం రెండున్నర రోజులలోనే మ్యాచ్‌ను భారత్ ముగిసింది. భారత స్పిన్నర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు మరోసారి విలవిల్లాడారు. జడేజా, అశ్విన్ దెబ్బకు ఒక సెషన్లోనే ఆసీస్ 9 వికెట్లు కోల్పోవడం గమానార్హం. జడేజా బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొవాలో తలలు పట్టుకున్న కంగారూలు.. ఆఖరికి స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడి తమ వికెట్లను కోల్పోయారు. ఇక తొలి రెండు టెస్టుల్లో కంగరూల ఘోర ప్రదర్శనపై ఆ జట్టు ఆ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పందించాడు. ఈ సిరీస్‌కు ముందు భారత గడ్డపై ఎటవంటి వార్మప్ మ్యాచ్‌లు ఆడకపోవడం ఆస్ట్రేలియా చేసిన అతి పెద్ద తప్పు అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. కాగా వార్మప్ మ్యాచ్‌లకు బదులుగా పాట్ కమ్మిన్స్ బృందం బెంగళూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఓ స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో ప్రాక్టీస్ చేసింది. ఆస్ట్రేలియా చేసిన తప్పులు ఇవే.. "తొలి రెండు టెస్టుల్లో మా జట్టు ప్రదర్శన చూసి నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అడలేదు. అదే వారు చేసిన పెద్ద తప్పు. భారత పరిస్థితులకు అలవాటు పడాలంటే అక్కడ కనీసం ఒక్క వార్మప్ మ్యాచ్ అయినా ఆడాలి. కానీ మా జట్టు అది చేయలేదు. అదే విధంగా మొదటి టెస్టులో మా జట్టు ఎంపిక కూడా సరిగ్గా లేదు. అది వారు చేసిన రెండో తప్పు. తర్వాత రెండో టెస్టులో అనవసర స్వీప్ షాట్లు ఆడి పెవిలియన్‌కు చేరారు. ఇక్కడ పరిస్థితులు స్వీప్ షాట్లు ఆడడానికి సరికావు . అది ఇన్నింగ్స్ ఆరంభంలోనే మనకు ఆర్ధమైంది. కానీ అది మా బ్యాటర్లకు ఎందుకు ఆర్ధంకాలేదో తెలియడంలేదు. కనీసం ఆఖరి రెండు టెస్టులోనైనా మా జట్టు పోటీ ఇస్తుంది అని ఆశిస్తున్నాను" అని బిగ్ స్పోర్ట్స్ బ్రేక్‌ఫాస్ట్ పోడ్కాస్ట్తో క్లార్క్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానంంది. చదవండి: ind Vs Aus: స్వదేశానికి పయనం.. అవమానించారు కాబట్టే అంటున్న గిల్‌క్రిస్ట్!! -
Viral Video: ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చెంపలు వాయించిన గర్ల్‌ఫ్రెండ్
Michael Clarke Slapped By Girl Friend: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ (2015) అయిన మైఖేల్ క్లార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనను మోసం చేసి మరో మహిళతో (పిప్ ఎడ్వర్డ్స్) శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. గర్ల్‌ఫ్రెండ్ జేడ్ యాబ్రో బహిరంగంగా క్లార్క్ చెంపులు వాయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. Michael Clarke and Karl Stefanovic have squared off in a wild fracas in a public park, in which Clarke was slapped across the face by his girlfriend and accused of cheating. Michael Clarke Video#YouFuckedHerOnDecember17 pic.twitter.com/pbiLUpLnnc — SuperCoach IQ (@SuperCoachIQ) January 18, 2023 ఈ వీడియోలో క్లార్క్.. జేడ్‌కు సర్ది చెప్పేందుకు విశ్వప్రయాత్నాలు చేసినప్పటికీ, ఆమె ఏమాత్రం కన్విన్స్ కాకపోగా, మరింత రెచ్చిపోయింది. భూతులు తిడుతూ.. పలానా రోజు నువ్వు ఆమెతో గడిపావు, నువ్వో మదమెక్కిన కుక్కవు అంటూ పబ్లిక్‌గా క్లార్క్‌పై దాడికి దిగింది. తానే తప్పు చేయలేదని క్లార్క్ సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. సదరు మహిళతో చేసిన ఫోన్ చాట్‌ను బయటపెట్టాలని జేడ్ గట్టిగా డిమాండ్ చేసింది. ఆ సమయంలో జేడ్ సోదరుడు, అతని భార్య అక్కడే ఉన్నారు. ఆ ముగ్గురు సంఘటన స్థలాన్ని విడిచి వెళ్తుండగా.. క్లార్క్ వారికి అడ్డుతగలడంతో జేడ్ మరింత రెచ్చిపోయింది. దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. క్లార్క్ కుంటుతూ వారి వెంబడి పడే ప్రయత్నం చేశాడు. ఈ ఉదంతంపై క్లార్క్ స్పందిస్తూ.. బహిరంగంగా ఇలా ప్రవర్తించినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. కాగా, క్లార్క్.. తన భార్య కైలీని వదిలేసి గతకొంతకాలంగా ప్రముఖ మోడల్ అయిన జేడ్‌తో సహజీవనం చేస్తున్నాడు. 41 ఏళ్ల క్లార్క్.. ఆసీస్ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో అతను 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీ సాయంతో 8643 పరగులు చేయగా.. వన్డేల్లో 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీల సాయంతో 7981 పరుగులు చేశాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 488 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో క్లార్క్ అత్యధిక స్కోర్ 329 నాటౌట్‌గా ఉంది. -
'అతడు సెహ్వాగ్ లాంటి ఆటగాడు.. ఒక్క అవకాశం ఇవ్వండి'
టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. పృథ్వీ షా.. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి అద్భుతమైన ఆటగాడని మైకేల్ క్లార్క్ కొనియాడాడు. భారత జట్టు మేనేజ్మెంట్ షాపై నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వాలని అతడు తెలిపాడు. పృథ్వీ షా.. సెహ్వాగ్ లాంటి అద్భుతమైన ఆటగాడు.ఒక జెండరీ క్రికెటర్. అతడు క్రీజులో ఉంటే స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. నాకు సెహ్వాగ్ లాంటి క్రికెటర్లు అంటే చాలా ఇష్టం. పృథ్వీ షా కూడా సెహ్వాగ్ లాంటి దూకుడు గల బ్యాటర్. కాబట్టి టీమిండియా, అతనిపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇస్తే చాలా బాగుంటుంది. అతడికి ఇంకా చాలా కేరిర్ ఉంది. అతనికి కాస్త సమయం కావాలి. ఆస్ట్రేలియా టూర్లో అతను ఒకే మ్యాచ్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడని అతడికి మళ్లీ ఇవ్వలేదు. అతడికి అదే తొలి ఆస్ట్రేలియా పర్యటన. అతడి భారత జట్టులోకి తిరిగి వస్తాడనడంలో సందేహం లేదు" అని క్లార్క్ పేర్కొన్నాడు. కాగా గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన షా ఒకే ఒక టెస్ట్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చదవండి: IPL 202 Mega Auction: "వేలంలో అతడి కోసం 10 జట్లు పోటీ పడడం ఖాయం" -
'అంత తక్కువ ధర.. ఐపీఎల్ ఆడకపోవచ్చు'
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకెల్ క్లార్క్ స్టీవ్ స్మిత్‌ను ఉద్దేశించి ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలంలో స్టీవ్ స్మిత్‌ను రూ. 2.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్లార్క్ స్మిత్ కొనుగోలుపై స్పందించాడు. 'ఇంత తక్కువ ధర పలికిన స్మిత్ ఐపీఎల్ 14వ సీజన్లో ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇండియా ఫ్లైట్ ఎక్కే తరుణంలో ఏదో ఒక కారణం చెప్పి స్మిత్ దూరంగా ఉంటాడు. గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను వేలంలో ఇప్పుడొచ్చిన ధరతో అవమానంగా ఫీలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తరంలో ఉత్తమ బ్యాట్స్మన్లలో స్మిత్ పేరు కచ్చితంగా ఉంటుంది. తక్కువ ధరకు అమ్ముడుపోయిన స్మిత్ 11 వారాల పాటు తన కుటుంబానికి దూరంగా ఉంటాడని మాత్రం అనుకోవట్లేదు. ఒకవేళ అతను ఐపీఎల్ ఆడాలని భావించినా మధ్యలోనే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో స్మిత్ సారధ్యంలోని రాజస్తాన్ రాయల్స్ టోర్నీలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. 14 మ్యాచ్‌లాడి 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అటు స్మిత్ బ్యాట్స్‌మన్‌గా 14 మ్యాచ్‌ల్లో 311 పరుగుల సాధించి విఫలమయ్యాడు, దీంతో రాయల్స్ స్మిత్‌ను రిలీజ్ చేసి అతని స్థానంలో సంజూ శామ్సన్ను కెప్టెన్‌గా ఎంపికచేసింది. చదవండి: వేలంలో అమ్ముడుపోలేదు.. దానికే బాధపడాలా! -
'పైన్‌ను తీసేయండి.. అతన్ని కెప్టెన్ చేయండి'
సిడ్నీ: టీమిండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో ఆసీస్ 2-1 తేడాతో ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌పై నోరు పారేసుకొని కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయాలంటూ సీఏకు సూచించాడు. ప్రస్తుతం కమిన్స్ టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.చదవండి: టాప్‌లో కోహ్లి.. రెండుకే పరిమితమైన రోహిత్ 'ఆసీస్ జట్టులో ప్రస్తుతం కమిన్స్‌కు కెప్టెన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అతను ఫాంలో ఉంటే ఎంతలా రెచ్చిపోతాడనేది టీమిండియాతో జరిగిన సిరీస్ అందుకు నిదర్శనం. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన కమిన్స్ తన ప్రవర్తనతోనూ ఆకట్టుకున్నాడు. టిమ్ పైన్ కెప్టెన్సీని నేను తప్పుబట్టలేను.. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో మాత్రం అతను ఒక కెప్టెన్‌గా తన చర్యలతో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే కమిన్స్ కెప్టెన్‌ను చేయాలంటే స్మిత్, వార్నర్, హాజిల్‌వుడ్, నాథన్ లయన్ లాంటి ఉన్న సీనియర్ ఆటగాళ్ల మద్దతు కావాల్సిందే.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్ జట్టుకు పరిమిత ఓవర్లతో పాటు టీ20ల్లో ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో ప్రపంచ నెంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతున్న కమిన్స్ 34 టెస్టుల్లో 164, 69 వన్డేల్లో 111, 30 టీ20ల్లో 37 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ బౌలర్‌గా మంచి క్రేజ్ ఉన్న కమిన్స్‌ను 2019 డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్ జట్టు రూ. 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. చదవండి: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం -
‘అది జరిగితే మాత్రం ఏడాదంతా సంబరాలే’
సిడ్నీ: ప్రస్తుతం జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై ఏ ఒక్క సిరీస్‌ను టీమిండియా గెలుచుకునే పరిస్థితే లేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇప్పటికే ఎద్దేవా చేయగా, అసలు విరాట్ కోహ్లి లేకుండా ఆసీస్‌పై ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలుస్తుందా అంటూ ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సందేహం వ్యక్తం చేశాడు. ఒకవేళ విరాట్ కోహ్లి లేకుండా తమ దేశంలో సిరీస్ గెలిస్తే టీమిండియా సెలబ్రేషన్స్‌ను ఊహించడమే కష్టమన్నాడు. కోహ్లి లేకుండా ఆస్ట్రేలియా గడ్డపై మమ్మల్ని ఓడించినట్లయితే ఆ జట్టు ఏడాదంతా సంబరాలు చేసుకుంటుందన్నాడు. ఇండియా టుడేతో ఇన్సిరేషన్ ఎపిసోడ్లో క్లార్క్ మాట్లాడుతూ.. ‘టీమిండియాకు విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటే కెప్టెన్సీ పరంగా, బ్యాటింగ్ పరంగా బలంగా ఉంటుంది. కోహ్లి స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారు. రాహుల్ అయితేనే కరెక్ట్. అతనొక టాలెంటెడ్ క్రికెటర్. అందులో ఎటువంటి సందేహం లేదు. (చదవండి: కోహ్లి 2020) ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్. కానీ కోహ్లి లేని లోటు మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు. కెప్టెన్‌గా కోహ్లి బాధ్యతలను రహానే తీసుకుంటాడు. రహానే మంచి ప్లేయరే కాకుండా కెప్టెన్సీ స్కిల్స్ కూడా బాగానే ఉన్నాయి. టీమిండియాను నడిపించే సామర్థ్యం రహానేలో ఉంది. అతనికి మంచి అవకాశం ముందుంది. రహానేకు కొత్త చరిత్రను సృష్టించే అవకాశం ఉంది. ఒకవేళ రహానే సారథ్యంలోనే టెస్టు సిరీస్‌ను గెలిస్తే టీమిండియా సెలబ్రేషన్స్ ఆకాశాన్ని తాకుతాయి. కచ్చితంగా ఏడాదంతా ఆ సెలబ్రేషన్స్ మునిగితేలుతారు. ఎందుకంటే కోహ్లి లేకుండా ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఓడించడమంటే అది కచ్చితంగా అసాధారణమే. టీమిండియా పటిష్టంగా ఉంది. ఆసీస్‌ను ఓడించగలం అనే విశ్వాసాన్ని వారు కోల్పోకూడదు’ అని క్లార్క్ పేర్కొన్నాడు.(చదవండి: ‘బుమ్రాను ఎలా వాడాలో తెలియని కెప్టెన్సీ ఇది’) -
రానున్న రోజుల్లో స్మిత్‌తో కష్టమే : క్లార్క్
సిడ్నీ: రానున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని మంచి ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్‌ను తొందరగా ఔట్ చేస్తేనే భారత్‌కు ఫలితం ఉంటుందని ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. భారత్- ఆసీస్ జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ డిసెంబర్ 17నుంచి జరగనుంది. ఈ సందర్భంగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లార్క్.. స్మిత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'టెస్టుల్లో స్మిత్ బ్యాటింగ్ విభాగంలో నెంబర్1 స్థానంలో కొనసాగుతున్నాడు. మంచి ఫామ్ కనబరుస్తున్న స్మిత్‌ను ఎంత తొందరగా పెవిలియన్ పంపిస్తే భారత్‌కు అంత ప్రయోజనం ఉంటుంది. ఈ మధ్యనే సచిన్ స్మిత్ గురించి చేసిన వ్యాఖ్యలను నేను సమర్థిస్తాను. స్మిత్‌ను తాను ఎదుర్కొనే తొలి 20 బంతుల్లోనే ఔట్ చేస్తే ప్రయోజనం ఉంటుందని సచిన్ తెలిపాడు. ఇది అక్షరాల నిజం. ఫామ్‌లో ఉన్న ఏ బ్యాట్స్‌మెన్ అయినా ఇదే వర్తిస్తుంది. అది సచిన్, డొనాల్డ్ బ్రాడ్‌మన్.. స్మిత్ ఇలా ఎవరైనా సరే వారు ఫామ్‌లో ఉన్నారంటే మనకు కష్టాలు తప్పవు. అందుకే ఎల్బీడబ్యూ, బౌల్డ్, స్లిప్ క్యాచ్ ఇలా ఏదో ఒక దానితో ఔట్ చేసేందుకు ప్రయత్నించాలి. ఇక స్మిత్ విషయంలో స్టంప్ లైన్‌పై బౌలింగ్ చేస్తే అతను వికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సచిన్ చెప్పిన మాటలకు నేను కట్టుబడి ఉంటున్నా. అసలే అద్బుతఫామ్లో ఉన్న స్మిత్ రానున్న రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారనున్నాడు.' అని తెలిపాడు. (చదవండి : రెండో వన్డే : ఆసీస్ ఓపెనర్ల జోరు) ఇరు జట్ల మధ్య ఇప్పటికే ప్రారంభమైన వన్డే సిరీస్ ద్వారా స్మిత్ తానేంత ప్రమాదకారో చెప్పకనే చెప్పాడు. తొలి వన్డేలో ఆసీస్ 66 పరుగులతో విజయం సాధించడం వెనుక వన్‌డౌన్‌లో స్మిత్ ఆడిన ఇన్నింగ్స్ ప్రధానమని చెప్పొచ్చు. రానున్న మూడు నెలల్లో నాలుగు టెస్టులు, మూడు టీ20లు ఆడాల్సి ఉన్న భారత్‌కు స్మిత్ కొరకరాని కొయ్యగా తయారవుతాడనంలో సందేహం లేదు. ఇక సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ఆసీస్ మరోసారి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌లు జట్టుకు శుభారంబాన్ని అందించారు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 95 పరుగులు సాధించింది. వార్నర్ 55 పరుగులతో, ఫించ్ 36 పరుగులతో దాటిగా ఆడుతున్నారు. -
మాటలు రావట్లేదు: క్లార్క్
సిడ్నీ: ఆసీస్ ప్రపంచకప్ విజయ సారథి మైకేల్ క్లార్క్ ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఇది మన భారత్‌లో పద్మ పురస్కారాల్లాగే ఆస్ట్రేలియాలో ఇచ్చే అవార్డు. క్రికెట్‌కు అందించిన విశేష సేవలకుగాను క్లార్క్‌కు ఈ పురస్కారం దక్కింది. ఆసీస్‌లో ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనేది ఆ దేశ మూడో అత్యున్నత పురస్కారం. గతంలో దిగ్గజ క్రికెటర్లయిన అలెన్ బోర్డర్, బాబ్ సింప్సన్, స్టీవ్ వా, మార్క్ టేలర్, రికీ పాంటింగ్‌లకు ఈ అవార్డు లభించింది. క్లార్క్ 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌ను విజేతగా నిలిపాడు. తాజాగా లభించిన హోదాపై క్లార్క్ మాట్లాడుతూ ‘నిజాయితీగా చెబుతున్నా... ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని నమ్మలేకున్నా. దీన్నెలా వర్ణించాలో మాటలు రావట్లేదు. ఈ అవార్డుతో ఆసీస్ దిగ్గజాలు, నేనెంతో అభిమానించే హీరోల సరసన నిలవడం చాలా సంతోషంగా ఉంది. అంతే గర్వంగా ఉంది. క్రికెట్ వల్లే ఇది సాకారమైంది’ అని అన్నాడు. టి20 ప్రపంచకప్‌పై అనుమానాలున్నప్పటికీ ఈ మెగా టోర్నీతోనే మళ్లీ తమ దేశంలో క్రికెట్ మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 39 ఏళ్ల క్లార్క్ తన కెరీర్లో 115 టెస్టులాడి 8643 పరుగులు చేశాడు. 245 వన్డేల్లో 7981 పరుగులు, 34 టి20ల్లో 488 పరుగులు చేశాడు. -
‘టెక్నికల్‌గా ఆ భారత్ లెజెండ్ చాలా స్ట్రాంగ్’
న్యూఢిల్లీ: తన కెరీర్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అత్యుత్తమ బ్యాట్స్మెన్లను చూసినా టెక్నికల్‌గా అత్యంత పటిష్టమైన ఆటగాడు మాత్రం ఒక్కడే ఉన్నాడని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తెలిపాడు. తన హయాంలో బ్రియాన్ లారా, కుమార సంగక్కరా, రాహుల్ ద్రవిడ్, జాక్వస్ కల్లిస్‌లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు కాగా, ఇక్కడ భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రం చాలా స్పెషల్ అని క్లార్ పేర్కొన్నాడు. ద్రవిడ్, సంగక్కరా, బ్రియాన్ లారాలు తమ ఆట తీరుతో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరినప్పటికీ, సచిన్ మాత్రం చాలా కఠినమైన బ్యాట్స్‌మన్ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. సాంకేతికంగా తాను చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మన్ మాత్రం సచిన్ ఒక్కడేనన్నాడు.(‘అలాంటి అవసరం మాకు లేదు’ ) ‘సచిన్‌ను ఔట్ చేయాలంటే అంత ఈజీగా ఉండేది కాదు. టెక్నికల్‌గా సచిన్ చాలా స్ట్రాంగ్. అతను ఏమైనా పొరపాటు చేసి వికెట్ సమర్పించుకోవాలి తప్పితే ఎవ్వరికీ తేలిగ్గా లొంగేవాడు కాదు. సచిన్ తప్పులు చేసేలా బంతులు వేసి బౌలర్లు పైచేయి సాధించేవారి తప్పితే, సాంకేతికంగా చూస్తే అతని కంటే బెస్ట్ బ్యాట్స్‌మన్‌ను ఇప్పటివరకూ నేను చూడలేదు. నాకు తెలిసి సచిన్‌ను టెక్నికల్‌గా గమనిస్తే బలహీనతలు ఏమీ కనబడేవికావు. నా వరకూ సచిన్ అందరికంటే అత్యుత్తమం’ అని క్లార్క్ పేర్కొన్నాడు. ప్రస్తుత శకంలో అన్ని ఫార్మాట్ల పరంగా చూస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బెస్ట్ బ్యాట్స్‌మన్ అని స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనకంటూ ఒక మార్కును సంపాదించుకున్న కోహ్లి.. టెస్టు క్రికెట్లో కూడా తన జోరును కొనసాగిస్తుండటమే ఇందుకు ఉదాహరణగా క్లార్క్ తెలిపాడు. అయితే సచిన్, కోహ్లిల్లో సాధారణంగా కనిపించే లక్షణాల్లో భారీ సెంచరీలు చేయడాన్ని ఎక్కువగా ఆస్వాదించడమే వారిలో ప్రధానంగా కనబడే విషయమన్నాడు. (మా దగ్గర సరిపడా డబ్బు ఉంది! ) -
‘అలాంటి అవసరం మాకు లేదు’
హోబర్ట్: ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసమే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పట్ల మైదానంలో తమ ఆటగాళ్లు మెతక వైఖరిని అవలంబించారని మాజీ సారథి మైకేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలను ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ ఖండించాడు. 2018–19లో జరిగిన టెస్టు సిరీస్‌లో తమ ఆటగాళ్లెవరూ అలా చేయలేదని అతను అన్నాడు. కేప్‌టౌన్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోలుకున్న వైనంతో రూపొందించిన అమెజాన్ డాక్యుమెంటరీలో కోహ్లితో మాటల యుద్ధం చేయవద్దని పైన్ చెబుతున్నట్లుగా ఉంది. కోహ్లి దృష్టిలో మంచిగా ఉంటే ఐపీఎల్ ద్వారా ఆరు వారాల్లో మిలియన్ డాలర్లు పొందవచ్చనేది తమ ఆటగాళ్ల ఆలోచన అంటూ క్లార్క్ విమర్శించాడు. ‘కోహ్లిని ఎలా నిలువరించాలనే విషయంలో జరిగిన చర్చలో భాగంగానే అతడిని ఎక్కువగా రెచ్చగొట్టవచ్చని చెప్పాను. అలా చేస్తే అతను మరింత ప్రమాదకరంగా మారతాడనేది నా ఉద్దేశం, వ్యూహం తప్ప మరొకటి కాదు. అయినా టెస్టు సిరీస్‌లో మా జట్టు సభ్యులు ఎవరూ కావాలని కోహ్లి పట్ల మెతకగా వ్యవహరించడం నేను ఎప్పుడూ చూడలేదు. బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా ఆస్ట్రేలియా విజ యం కోసమే వారు వంద శాతం శ్రమించారు. ఆ సిరీస్ చూస్తే ఇరు జట్ల మధ్య ఢీ అంటే ఢీ ఘటనలు ఎన్నో జరిగాయి కూడా. నేనెవరినీ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ఐపీఎల్లో ఏమాత్రం అవకాశం లేదు. అలాంటప్పుడు నేను పోగొట్టుకునేది ఏముంటుంది’ అని పైన్ ఘాటుగా సమాధానమిచ్చాడు. -
క్లార్క్‌కు వచ్చిన నష్టం ఏంటో ?
ఆక్లాండ్ : ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరగనున్న చాపెల్- హాడ్లీ ట్రోఫీని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ టోకెన్ గేమ్స్‌గా అభివర్ణించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తీరిక లేకుండా షెడ్యూల్ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'తీరికలేని షెడ్యూల్‌తో వరుసగా జరుగుతున్న మ్యాచ్‌లను ఎవరు చూస్తారు. ఈ సిరీస్ ద్వారా జరిగే మ్యాచ్‌లు ఒక టోకెన్ గేమ్స్ లాంటివి. నేను క్రికెట్ అభిమానినే. కానీ వన్డే సిరీస్‌లు జరపడానికి ఇది అనువైన సీజన్ కాదు. మహిళల ప్రపంచకప్ గెలుపుతో క్రికెట్ సీజన్ ముగిసింది. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు జరిగాయి. మాకు ఇన్ని మ్యాచ్‌లు అవసరం లేదు'అని క్లార్క్ పేర్కొన్నాడు. (మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు) అయితే న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బోల్ట్ మైకేల్ క్లార్క్ కు తనదైన శైలిలో స్పందించాడు.'రసవత్తకరమైన సిరీస్ అతనికి టోకెన్ గేమ్స్‌గా ఎందుకు అనిపించిందో అర్థం కావడం లేదన్నాడు. అతని సమస్య ఏంటో నాకు తెలియదు. ఈ సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ కూడా జరిగే అవకాశం ఉండటంతో ప్రేక్షకులకు కావాల్సిన మజా లభిస్తుందన్నాడు. క్రికెట్ ఆడటానికి ఆస్ట్రేలియా అద్భుతమైన ప్రదేశం. న్యూజిలాండ్ కన్నా అక్కడి మైదానాలు పెద్దవి. ఈ సిరీస్ మ్యాచ్‌లకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరవుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్‌తో ఈ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. కొంతమంది మాట్లాడే మాటల్లో అర్థమే లేదు ' అని చెప్పుకొచ్చాడు. గెలుపే లక్ష్యంగా తాము ఈ సిరీస్‌లో బరిలోకి దిగనున్నట్లు బౌల్ట్ పేర్కొన్నాడు.(కోహ్లి, రోహిత్‌లు కాదు.. రాహులే గ్రేట్!) కాగా వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేల్లో ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి.ఈ సీజన్లో ఆస్ట్రేలియా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సిరీస్‌లు ఆడింది. భారత్‌తో 1-2, సౌతాఫ్రికాతో 0-3తో వన్డే సిరీస్‌లు కోల్పోయింది. అంతకు ముందు సౌతాఫ్రికాపైనే 2-1తో టీ20 సిరీస్ గెలిచింది. మార్చి 7నే సౌతాఫ్రికా పర్యటనను ముగించుకున్న ఆసీస్.. 5 రోజుల గ్యాప్‌తోనే 13 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్దమైంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ క్లార్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు
మెల్బోర్న్ : ఆసీస్ సారథిగా స్టీవ్ స్మిత్ సరైన వ్యక్తి కాదంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో ఆసీస్ కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల మీడియా సమావేశంలో మైకేల్ క్లార్క్ పాల్గొనగా.. ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను మళ్లీ నియమించాలంటారా? అని ఒక విలేకరి ప్రశ్నించాడు. 'ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతమంది కెప్టెన్లు అవసరం లేదు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక కెప్టెన్ ఉండడం కన్నా.. మూడు ఫార్మాట్లకూ కలిపి ఒకే కెప్టెన్ ఉండటం మంచిది' అని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్ తర్వాత కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. (భార్యకు విడాకులు.. భరణంగా రూ.285 కోట్లు!) 'పాట్ కమిన్స్ ఆటను బాగా అర్ధం చేసుకుంటాడు. అతను ఓపెనింగ్ బౌలర్ మాత్రమే గాక బ్యాటింగ్ కూడా చేయగలడు. మైదానంలోనూ కమిన్స్ చాలా చురుకుగా ఉంటాడు. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పటి పరిస్థితుల్లో ఆసీస్ జట్టుకు ఉత్తమ కెప్టెన్ అవసరం. స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్‌మన్.. అది నేనూ ఒప్పుకుంటా.. కానీ కెప్టెన్సీ చేయడానికి సరైన వ్యక్తి మాత్రం కాదనుకుంటున్నా. ఇక టిమ్ పైన్ ఇప్పటికే కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పైన్ వీడ్కోలు చెప్పేవరకు ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కొనసాగే హక్కు అతనికి ఉంది. టిమ్ ఇప్పుడు 35 ఏళ్లు ఉన్నాడు. ఈ వేసవి తర్వాత అతను వీడ్కోలు గురించి ఆలోచిస్తాడని అనుకుంటున్నా. హోమ్ సిరీస్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిస్తే టిమ్ పైన్ వీడ్కోలు పలకడానికి అదే అనువైన సమయం అంటూ' మైకేల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు. (మైకేల్ క్లార్క్ భావోద్వేగ సందేశం) కాగా బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిషేధం కారణంగా స్మిత్ తన కెప్టెన్సీని కోల్పోయాడు. దీంతో పరిమిత ఓవర్లకు ఆరోన్ ఫించ్, టెస్ట్ ఫార్మాట్‌కు టిమ్ పైన్ కెప్టెన్లుగా ఉన్నారు. స్మిత్ పునరాగమనం చేసి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆసీస్ మాజీలు మళ్లీ స్మిత్‌కు పగ్గాలు ఇవ్వాలంటున్న తరుణంలో క్లార్క్ మాత్రం స్మిత్ కెప్టెన్‌గా సరైన వ్యక్తి కాదంటూ తేల్చి చెప్పాడు.(జర్నలిస్టుపై కోహ్లి ఆగ్రహం) -
క్లార్క్ పెళ్లి పెటాకులు!
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వివాహ బంధానికి ముగింపు పలికాడు. తాము త్వరలోనే విడాకులు తీసుకుంటున్నట్టుగా క్లార్క్, కైలీ దంపతులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతకాలం ఇద్దరం విడివిడిగా జీవించిన తర్వాత.. స్నేహపూర్వకంగా విడిపోవాలనే ఉద్దేశంతో ఈ కష్టమైన నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాగా, 2012లో మాజీ మోడల్, టీవీ ప్రజెంటర్ కైలీతో క్లార్క్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కెల్సే ఉన్నారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ.. తమ కుమార్తెను ఇద్దరం చూసుకోవడానికి కట్టుబడి ఈ నిర్ణయానికి వచ్చామని క్లార్క్ దంపతులు చెప్పారు. అలాగే తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే క్లార్క్, కైలీ దంపతులు కోర్టు వెలుపలే తమ విడాకుల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, 5 నెలల కిత్రం క్లార్క్ దంపతులు విడిపోయారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కైలీ ఆ వార్తలను ఖండించారు. తమ బంధం బలంగా ఉందని తెలిపారు. కైలీతో పెళ్లికి ముందు మోడల్ లారా బింగిల్‌తో క్లార్క్‌కు నిశ్చితార్థం జరిగింది. కానీ వారిద్దరు 2010లో విడిపోయారు. ఆ తర్వాత బింగిల్.. నటుడు, అవతార్ హీరో సామ్ వర్తింగ్టన్ను 2014లో వివాహం చేసుకున్నారు. 2011లో రికీ పాంటింగ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న క్లార్క్ ఆసీస్ క్రికెట్ జట్టును నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. పాంటింగ్‌కు సరైన వారసుడిగా ఆసీస్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను క్లార్క్ అందించాడు. తన 12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో 115 టెస్టులు, 245 వన్డేలతో పాటు 34 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన యాషెస్ సిరీస్ అనంతరం క్లార్క్ క్రికెట్ గుడ్ బై చెప్పాడు. -
మైకేల్ క్లార్క్ భావోద్వేగ సందేశం
సిడ్నీ: గత కొన్నేళ్లుగా క్యాన్సర్ కౌన్సిల్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. తాను స్కిన్ క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని గుర్తు చేస్తూ యువ క్రికెటర్లకు భావోద్వేగ సందేశం ఇచ్చాడు. యువకులు ఎవరూ స్కిన్ బారిన పడకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. దానిలో భాగంగా క్యాన్సర్ బారిన పడి చికిత్స చేయించుకున్న తర్వాత తన నుదుటిపై ఉన్న కుట్లును చూపిస్తూ ఒక ఫోటో షేర్ చేశాడు. ఇందుకు ఒక సందేశాత్మక క్యాప్షన్‌ను జోడించాడు. ‘మరొక రోజు.. నా ముఖానికి మరో స్కిన్ క్యాన్సర్ సర్జరీ జరిగింది. యువకులకు నేనిచ్చే సందేశం ఒక్కటే. మీరు మీ శరీరాన్ని క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకుంటారనే అనుకుంటున్నా’ అని క్లార్క్ పేర్కొన్నాడు. 2006లో క్లార్క్‌కు తొలిసారి స్కిన్ క్యాన్సర్ రావడంతో అప్పట్లోనే చికిత్స చేయించుకున్నాడు. తాజాగా అతని నుదుటిపై క్యాన్సర్ కణుతులు రావడంతో వాటిని సర్జరీ ద్వారా తొలగించుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాడు క్లార్క్. ఆసీస్ యువకులు తమ శరీరాన్ని వారే సూర్యకాంతి నుంచి రక్షించుకోవాలని స్మిత్ ప్రధానంగా సూచించాడు. ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ శాతం చాలా ఎక్కువ. 2016లో స్కిన్ క్యాన్సర్ బారిన పడి 1960 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011లో రికీ పాంటింగ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న క్లార్క్ ఆసీస్ క్రికెట్ జట్టును నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. పాంటింగ్‌కు సరైన వారసుడిగా ఆసీస్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను క్లార్క్ అందించాడు. తన 12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో 115 టెస్టులు, 245 వన్డేలతో పాటు 34 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన యాషెస్ సిరీస్ అనంతరం క్రికెట్ గుడ్ బై చెప్పాడు క్లార్క్. View this post on Instagram Another day, another skin cancer cut out of my face... youngsters out there make sure you are doing all the right things to protect yourself from the sun ☀️🕶🎩 A post shared by Michael Clarke (@michaelclarkeofficial) on Sep 6, 2019 at 4:49pm PDT -
భారత్ ఫైనల్ చేరింది.. ఇక మా వాళ్లే..
లండన్ : ప్రస్తుత ఫామ్ చూస్తుంటే భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరినట్టేనని, తమ ఆటగాళ్లే కష్టపడాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. దూకుడు మీదున్న కోహ్లిసేనను న్యూజిలాండ్ అడ్డుకోలేదని తెలిపాడు. భారత ఆటగాళ్ల ఫామే ఆ జట్టును హాట్ ఫేవరేట్‌గా చేసిందని చెప్పుకొచ్చాడు. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగే తొలి సెమీస్‌లో భారతే విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు. సెమీస్ మ్యాచ్ నేపథ్యంలో ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘భారత్ ఫైనల్‌కు చేరుతుంది. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. క్రికెట్లో ఎవరూ ఇలా ఖచ్చితంగా చెప్పరు. భారత ఆటగాడినైతే నేను కూడా ఇలా ఆలోచించను. కానీ భారత్ ఫామ్ చూస్తుంటే ఆ జట్టు కసి తెలుస్తోంది. నమ్మశక్యం కానీ ప్రదర్శనను వారు కనబరుస్తున్నారు. ఇప్పటికే వారికి ఫైనల్ బెర్త్ ఖరారైంది. ప్రస్తుతం న్యూజిలాండ్ బలహీనంగా కనిపిస్తోంది. వరుస ఓటములతో వారి ఆత్మవిశ్వాసం లోపించింది. ఇది వారికి కష్టాలను తేనుంది. ఇక వరుస విజయాల ఉత్సాహం భారత్‌ను ఫైనల్‌కు చేరేలా చేస్తుంది. మంచి ఊపుమీదున్న రోహిత్‌ను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. అతను, డేవిడ్ వార్నర్ టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడారు.’ అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. -
పంత్.. నీ ఆట ఎంతో ఘనం: క్లార్క్
బర్మింగ్‌హామ్ : టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్‌పై ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాజా ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించాడు. పంత్ భారీ ఇన్నింగ్స్‌లు నిర్మించక పోయినప్పటికీ.. అతడి షాట్ల ఎంపిక నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ఇక పంత్ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగిలాని.. అది టీమిండియాకు ఎంతో లాభం చేకురుతుందని పేర్కొన్నాడు. దినేశ్ కార్తీక్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగేందుకు అన్ని విధాల అర్హుడని అభివర్ణించాడు. ‘ధావన్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన పంత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పర్వాలేదనిపించాడు. అతడి షాట్ల ఎంపిక నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. టీమిండియాకు లాభం చేకూరాలంటే పంత్ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రావాలి. అలా వస్తేనే మిడిల్ ఓవర్లలో భారీ పరుగులు రాబట్టగలడు. పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తే మరింత రాటుదేలుతాడు. ఎంతో అనుభవం కలిగిన దినేశ్ కార్తీక్ ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగడం టీమిండియాకు ఎంతో ఉపయోగకరం. అతడి అనుభవంతో లోయరార్డర్లో బలమైన భాగస్వామ్యాలను నమోదు చేసే అవకాశం ఉంది. ఇక రోహిత్, విరాట్ కోహ్లిలు అధ్బుత ఫామ్‌లో ఉన్నారు. కోహ్లి ఈ ప్రపంచకప్‌లో ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు’అంటూ క్లార్క్ వ్యాఖ్యానించాడు. -
‘ప్రపంచ గొప్ప ఆల్‌రౌండర్ అతడే’
లండన్ : ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రపంచకప్ తెరలేవగా.. పాకిస్తాన్-వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్ కీలకపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫాఫ్ డూప్లెసిస్, మార్కరమ్ అద్భుత క్యాచ్‌లు అందుకోగా.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అయితే ఒంటి చేత్తో బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకొని ఔరా అనిపించాడు. ఈ క్యాచ్ ప్రపంచకప్ టోర్నీలోనే వన్ ఆఫ్‌ది బెస్ట్‌గా నిలిచింది. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మాత్రం భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజానే గొప్ప ఫీల్డర్ అంటున్నాడు. ‘ప్రస్తుత క్రికెట్లో జడేజాను మించిన ఆల్‌రౌండర్, ఫీల్డర్ లేడు. అతను ఔట్ ఫీల్డ్‌లో పరుగులను అడ్డుకోవడం కానీ, కష్టమైన క్యాచ్ అందుకోవడం.. గురిచూసి నేరుగా వికెట్లకు కొట్టడం కానీ అద్భుతం.’ అని ప్రపంచకప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్లార్క్ కొనియాడాడు. పరిస్థితులకు తగ్గట్లు జడేజా మైదానంలో కదులుతాడని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా భారత బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయగా.. జడేజా ఒక్కడే(54) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అయినా అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లు జట్టులో ఉండటంతో జడేజా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇక భారత తన ఆరంభ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఈ నెల 5న ఆడనుంది. -
అతడు పాకిస్తాన్ ‘విరాట్ కోహ్లి’
అడిలైడ్: పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్‌పై ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచకప్‌లో పాక్‌కు అతడే కీలకమవుతాడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. మంచి క్లాసిక్ ప్లేయర్ అని కొనియాడిన క్లార్క్.. అతడు పాక్ కోహ్లి అంటూ కితాబిచ్చాడు. బాబర్ ఆజాం బ్యాటింగ్ శైలి కూడా అచ్చం కోహ్లిలానే ఉంటుందన్నాడు. ఇక ప్రపంచకప్‌లో పాక్ గెలవాలంటే ఈ ఆటగాడిపై ఆధారపడాల్సిందేనని పేర్కొన్నాడు. అతితక్కువ కాలంలోనే బాబర్ తన ఖాతాలో అరుదైన రికార్డులను నమోదు చేశాడని క్లార్క్ కొనియాడాడు. వార్మప్ మ్యాచ్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బాబర్ శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ 108 బంతుల్లో 112 పరుగులు సాధించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో 262 పరుగులకే పాక్ ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్ హాష్మతుల్లా షాహిది(74 నాటౌట్), హజ్రతుల్లా జజాయి(49) బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించారు. ప్రపంచకప్‌లో భాగంగా మే31న పాక్ తన తొలిపోరులో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌తో తలపడనుంది. -
‘ధోని ప్రాముఖ్యతను తగ్గించవద్దు’
మెల్బోర్న్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రాముఖ్యతను తక్కువ చేయొద్దని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. ఇటీవల కాలంలో ధోని జట్టులో కొనసాగడంపై పలువురు విమర్శలు ఎక్కు పెట్టిన నేపథ్యంలో క్లార్క్ స్పందించాడు. ధోనిపై విమర్శలు చేసి అతని ప్రాధాన్యతను తగ్గించడం తగదన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌కు అతడి అవసరం ఎంతైనా ఉందన్నాడు. (ఇక్కడ చదవండి:కోహ్లి.. వీటికి సమాధానం ఏది?) ‘ఎంఎస్ ధోనిని తక్కువ అంచనా వేయకండి. మధ్య ఓవర్లలో అతడి అనుభవం అత్యంత కీలకం. త్వరలో వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ధోని ప్రాధాన్యతను తగ్గిస్తూ విమర్శలు చేయడం శ్రేయస్కరం కాదు’ అని క్లార్క్ పేర్కొన్నాడు. భారత్‌కు రెండుసార్లు వరల్డ్‌కప్ సాధించిన ఘనత ధోనిది. 2007లో టీ20 వరల్డ్‌కప్‌ను భారత జట్టు ధోని కెప్టెన్సీలో గెలవగా, 2011 వన్డే వరల్డ్‌కప్ కూడా ధోని సారథ్యంలోనే వచ్చింది. -
వన్డే మొనగాడు కోహ్లినే: క్లార్క్
సిడ్నీ: ఇప్పటివరకు 219 వన్డేల్లో 59కి పైగా సగటుతో 39 సెంచరీలతో 10,385 పరుగులు చేసిన విరాట్ కోహ్లియే ఆల్‌టైమ్ నెంబర్ వన్ వన్డే బ్యాట్స్‌మన్ అని ఆస్ట్రేలియా మాజీ సారథి మైఖెల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. గొప్ప ఆటగాడిగానే కాకుండా తెలివైన సారథి అంటూ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆసీస్ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ గెలిచిన ఏకైక భారత, ఆసియా సారథిగా రికార్డు నెలకొల్పడం సాదారణ విషయం కాదన్నాడు. కోహ్లి వయసు ముప్పైయేనని మరింత క్రికెట్ ఆడే అవకాశం ఉన్నందున్న మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం ఉందన్నాడు. ఇక టెస్టుల్లోనూ ప్రస్తుతం కోహ్లి అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నప్పటికీ మరింత రాటు దేలాల్సిన అవసర ముందన్నాడు. ప్రపంచంలోని అన్ని అత్యున్నత మైదానాలలోనూ గొప్పగా రాణించాల్సిన అవసరముందన్నాడు. అలా అయితేనే టెస్టుల్లో కూడా ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడని పేర్కొన్నాడు. ఇక కోహ్లి సేన ఆస్ట్రేలియాపై చారిత్రక సిరీస్‌లు గెలిచిన అనంతరం ఐదు వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు బయలుదేరింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 23 తొలి వన్డే జరగనుంది. -
పాండ్యా ప్రపంచకప్ ఆడుతాడు: ఆసీస్ మాజీ కెప్టెన్
సిడ్నీ : మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో సస్పెన్షన్‌కు గురైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కచ్చితంగా 2019 ప్రపంచకప్ ఆడుతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. పాండ్యా భారత జట్టులో కీలక ఆటగాడని, జట్టు సమతూకంగా ఉండాలంటే పాండ్యా ఉండాల్సిందేనని క్లార్క్ చెప్పుకొచ్చాడు. కాఫీ విత్ కరణ్ షోలో పాండ్యా, రాహుల్‌లు ఒళ్లు మరిచి మహిళల పట్ల అశ్లీలంగా మాట్లాడటంతో తీవ్రదుమారం రేగడం.. బీసీసీఐ వారిపై నిషేధం విధించడం తెలిసిందే. ఈ వ్యవహారంపై క్లార్క్ నేరుగా మాట్లాడకుండా పరోక్షంగా ప్రస్తావిస్తూ పాండ్యాకు మద్దతు తెలిపాడు. ‘టాలెంటెడ్ ఆటగాడైన పాండ్యా భారత జట్టుకు చాలా అవసరం. ఒంటరిగా మ్యాచ్‌లను గెలిపించే సత్తా పాండ్యాకు ఉంది. అతను ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడుతాడు. ఎంత డబ్బు సంపాదించావనేది అనవసరం. గౌరవ, మర్యాదలే ముఖ్యం. పెద్దలను గౌరవించడం నుంచే ఇది అలవాటవుతోంది. ఇక ఫ్రొఫెషనల్ ఆటగాళ్లు చాలా మందికి రోల్ మోడల్స్. వారిని అందరు గుర్తుపడుతారు. కావున వారంతా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. కానీ ఆ తప్పును గణపాఠంగా తీసుకొని ముందుకు సాగడమే చాలా అవసరం.’ అని పాండ్యా వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించాడు. ఇక ఈ వివాదాన్ని పరిష్కరించడంలో బీసీసీఐ తాత్సారం చేయడంపై మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచకప్ ముందు ఈ యువ ఆటగాళ్లకు ప్రాక్టీస్ చాలా అవసరమని, వెంటనే ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ యువ ఆటగాళ్లపై విధించిన నిషేధాన్ని విచారణ పూర్తయ్యే వరకు ఎత్తివేయాల్సిందిగా బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా... క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ)కి లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్‌నకు నాలుగు నెలలే ఉన్నందున వీరికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని, వర్ధమాన ఆటగాళ్లైనందున ఓ అవకాశం ఇద్దామని ఖన్నా విజ్ఞప్తి చేశారు. వారు ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పారని, విచారణ కొనసాగిస్తూనే, రాహుల్, పాండ్యాలను తక్షణమే జాతీయ జట్టులోకి తీసుకోవాలని సీఓఏ, బీసీసీఐ అధికారులను ఆయన కోరారు. -
ఇప్పుడిది అవసరమా : ఆసీస్ మాజీ క్రికెటర్
మెల్బోర్న్ : ట్యాంపరింగ్ వివాదంతో ఆటకు దూరమైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖెల్ క్లార్క్ మండిపడ్డాడు. ఇటీవల ఫాక్స్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లు మాట్లాడింది సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పునరాగమనంపై దృష్టి పెట్టాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని హితవు పలికాడు. క్రికెట్ ఆస్ట్రేలియా అప్పటి సీఈఓ జేమ్స్ సథర్‌ల్యాండ్, ఫర్ఫామెన్స్ కోచ్ ప్యాట్ హోవర్డ్లను విమర్శించడం, నిందించడంపై కూడా మండిపడ్డాడు. ట్యాంపరింగ్ ఘటనలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకలేదని, అనవసరంగా మాట్లాడుతూ రచ్చచేసుకోవద్దని సూచించాడు. సరైన సమాధానాలు రాబట్టలేనప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు చేయవద్దని పరోక్షంగా వీరిని ఇంటర్వ్యూ చేసిన ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు చురకలంటించాడు. అలాగే తప్పంతా వార్నర్‌పైనే నెట్టేయడం ఏంటని మండిపడ్డాడు. ఇద్దరు ఆటగాళ్లు ట్యాంపరింగ్ సూత్రదారి వార్నర్ అని చెప్పడంతో అతని పునరాగమనంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే సీఏ సీఈవో కెవిన్ రాబర్ట్స్ మాత్రం.. స్మిత్, బాన్క్రాప్ట్ల వ్యాఖ్యలు వార్నర్ అడ్డుకుంటాయని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఎంపికకు అర్హత సాధించగానే జట్టు ప్రణాళికలో భాగమవ్వడం గురించి అడితో చర్చినట్లు స్పష్టం చేశాడు. ఇక ఇంటర్వ్యూల్లో స్మిత్, బాన్‌క్రాప్ట్‌లు మాట్లాడుతూ.. వార్నర్ ప్రోద్భలంతోనే ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు చెప్పడమే కాకుండా.. గతంలో జట్టు వరుస ఓటములు ఎదుర్కొన్నప్పుడు సథర్ ల్యాండ్, హై ఫర్ఫామెన్స్ కోచ్ ప్యాట్ హోవర్డ్ గెలిచేందుకు డబ్బులిస్తున్నామని, ఆడేందుకు కాదు అని అన్నారని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
క్లార్క్ తుస్సుమనిపించేశాడు
సాక్షి, ముంబై : స్మిత్, వార్నర్‌లపై వేటు వ్యవహారంతో ఆస్ట్రేలియా జట్టు ఢీలా పడిపోయింది. ఈ దశలో జట్టుకు నైతిక బలం ఇచ్చేలా మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్ బంపరాఫర్ ప్రకటించాడన్న వార్త ఒకటి చక్కర్లు కొట్టింది. టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటే తాను తిరిగి మైదానంలోకి దిగుతానని క్లార్క్ చెప్పినట్లు సిడ్నీ సండే టెలిగ్రాఫ్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఐపీఎల్ కోసం భారత పర్యటనలో ఉన్న క్లార్క్ ఆ కథనంపై స్పందించాడు. ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ట్విటర్లో ప్రకటించాడు. ‘జట్టుకు తిరిగి ఆడతానని నేనేం ఆహ్వానం పంపలేదు. ఆ కథనం నిజంకాదు. క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సుథర్ల్యాండ్కు ఓ స్నేహితుడిగా సందేశం పంపాను. అవసరమైతే జట్టుకు ఏ రూపంలో అయినా సాయం అందిస్తానని చెప్పాను. అంతేగానీ తిరిగి ఆడతానని నేను అనలేదు’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. ఆసీస్ జట్టు టెస్ట్ ర్యాంక్ కోల్పోవటంపై స్పందిస్తూ.. ‘ఆస్ట్రేలియా పరిస్థితి.. వెస్టిండీస్‌లాగా మారాలని నేను కోరుకోవటం లేదు. తొందర్లోనే తిరిగి పుంజుకుంటుందని ఆశిస్తున్నా’ అని మాత్రం తాను చెప్పినట్లు క్లార్క్ వెల్లడించాడు. 37 ఏళ్ల మైకేల్ క్లార్క్ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మొత్తం 245 వన్డేలు, 115 టెస్టులు, 34 టీ20లు అడిన అనుభవం క్లార్క్ సొంతం. 2015లో రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కామెంటేటర్ అవతారం ఎత్తాడు. This article is out of control! Let me make very clear that I have not sent any formal offer to James Sutherland to come back and play cricket. I sent him a message as a friend offering to help Australian cricket in ANY way I could (this could mean mentoring the under 14s) — Michael Clarke (@MClarke23) 8 April 2018 I won’t be batting in the nets in India in preparation for a comeback 😂😂😂 and as I have always said the game owes me nothing, I owe it everything. Have a great Sunday 👍🏏 — Michael Clarke (@MClarke23) 8 April 2018 -
అయ్యో స్మిత్.. నిన్ను చూస్తే గుండె తరుక్కుపోతోంది!
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో జరిగిన తప్పును ఒప్పుకుంటూ స్టీవ్ స్మిత్ కంటతడి పెట్టాడు. ఈ తప్పిదానికి తనదే పూర్తి బాధ్యత అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎగదన్నుకొని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. మాట్లాడానికి ప్రయత్నించాడు. మీడియా సమావేశంలో ఉద్విగ్నుడై.. మాటలు వెతుక్కుంటూ వెక్కీ వెక్కీ ఏడ్చాడు. బాల్ ట్యాంపరింగ్ తప్పిదం తనను ఎంతో బాధకు గురిచేసిందని కన్నీరు కార్చాడు. సిడ్నీలో స్టీవ్ స్మిత్ నిర్వహించిన మీడియా సమావేశం ఆయన అభిమానుల్నే కాదు తోటి క్రికెటర్లను కదిలించింది. అతను వ్యక్తం చేసిన బాధను చూసి.. అయ్యో స్మిత్ అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో మంచి బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్ స్మిత్ ఒకరని, అతను తప్పకుండా తిరిగొచ్చి.. మళ్లీ క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంటాడని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. స్టీవ్ స్మిత్ ప్రెస్‌మీట్ తర్వాత.. గుండె పగిలిపోయిందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ట్వీట్ చేశాడు. స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్ మీడియా సమావేశాలను చూడలేకపోయానని, వారు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్‌లో మరింత ఉత్తమంగా తిరిగొస్తారని మరో ఆటగాడు మిట్చెల్ జాన్సన్ ట్వీట్ చేశాడు. ‘స్టీవ్ స్మిత్ బాధ నన్ను కదిలిస్తోంది. మళ్లీ క్రికెట్లోకి తిరిగొచ్చి తన సుప్రీం బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానల్ని అలరిస్తాడని ఎదురుచూస్తున్నా.. షేన్ వార్న్ కూడా ఇలాగే ఏడాది నిషేధం ఎదుర్కొని.. తిరిగొచ్చి శ్రీలంకపై మూడు టెస్టుల్లో 26 వికెట్లు తీశాడు’ అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశారు. -
క్లార్క్.. మళ్లీ బ్యాట్ పట్టు: హర్భజన్ సింగ్
ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు లేరని భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఆ జట్టు తిరిగి గాడిలో పడాలంటే మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తిరిగి రావాల్సిందేనని పిలుపునిచ్చాడు. ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఇప్పటికే 0–3తో సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ‘క్లార్క్ తిరిగి నీవు జట్టులోకి రావాల్సిన సమయం వచ్చింది. రిటైర్మెంట్కు గుడ్‌బై చెప్పి ఆసీస్ తరఫున బరిలోకి దిగు. మీ జట్టు నుంచి టాప్ ఆటగాళ్లు తయారవడం ఆగిపోయింది. ఇప్పటి బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి నాణ్యత లేదు’ అని క్లార్క్‌ను ఉద్దేశించి భజ్జీ ట్వీట్ చేశాడు. -
'ధోని 2023 ప్రపంచ కప్ కూడా ఆడతాడు'
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మరోసారి ప్రశంసల జల్లులు కురిపించారు. శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేతో కెరీర్లో 300వ మ్యాచ్ ఆడిన ధోనిని 'అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు' అని పేర్కొన్న క్లార్క్.. దిగ్గజ ఆటగాడైన ధోని కచ్చితంగా 2019 వన్డే ప్రపంచ కప్ జట్టులోనే కాదు 2023లో జరిగే వరల్డ్ కప్ జట్టులోనూ సభ్యుడిగా ఉంటాడంటూ జోస్యం చెప్పారు. ఇందుకు మిస్టర్ కూల్ ధోని ఫిల్‌నెస్ లెవల్స్ కారణమని క్లార్క్ చెప్పారు. ధోని ప్రతిభ, ఆటతీరుపై తనకేమాత్రం సందేహం లేదన్నారు. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే కోల్‌కతాలో జరగనున్న రెండో వన్డేతోనూ సిరీస్ ఫలితం తేలిపోతుందని క్లార్క్ భావిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ ధోని అద్భుత ఆటతీరుతో రాణించి లంకపై 5-0తో టీమిండియాను గెలిపించాడన్నారు. లంకతో వన్డే సిరీస్ ఫలితమే ధోని నైపుణ్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. వచ్చే వరల్డ్ కప్ జట్టులో ధోని ఉంటాడో లేదోనని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ధోని రాణించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. టాపార్డర్ వికెట్లు త్వరగా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (66 బంతుల్లో 83) సాయంతో ధోని (88 బంతుల్లో 79) ముందుకు నడిపించి తొలి వన్డే నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడని ఆసీస్ మాజీ దిగ్గజం మైఖెల్ క్లార్క్ కొనియాడాడు. -
స్టీవ్ స్మిత్.. మార్గాలు వెతుకు: క్లార్క్
కోల్‌కతా:ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ అసలైన సవాల్‌ను ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే రాబోయే కొన్ని నెలలు ఆస్ట్రేలియా జట్టుకు కూడా ముఖ్యమేనన్నాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టును విజయాల బాట పట్టించడానికి స్మిత్ మార్గాలు కనుగోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. గత కొంతకాలంగా బ్యాట్స్‌మన్ గా ఆసీస్‌కు వెన్నుముక నిలుస్తున్న స్మిత్ పై సందేహాలు లేకపోయినప్పటికీ కెప్టెన్ గా మరింత బాధ్యత తీసుకోవాలని క్లార్క్ సూచించాడు. 'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆసీస్ ను విజయాల బాట పట్టించడం స్మిత్ మొదటి బాధ్యత. జట్టులో ఆత్మవిశ్వాసం రావాలంటే గెలుపుకు మార్గాలు వెతకాలి. నా దృష్టిలో విరాట్ కోహ్లి(భారత కెప్టెన్)-స్టీవ్ స్మిత్‌లే వరల్డ్ అత్యుత్తమ ఆటగాళ్లు. కాకపోతే ఆసీస్ విజయాల కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఆసీస్ ను విజయాలవైపు నడిపించడమే స్మిత్ ముందున్న సవాల్'అని క్లార్క్ పేర్కొన్నాడు.ఈడెన్ గార్డెన్ లో జరిగే రెండో వన్డేలో ఆసీస్ విజయం సాధిస్తే కనుక 3-2 తో సిరీస్ ను గెలుచుకోవడం ఖాయమని క్లార్క్ జోస్యం చెప్పాడు. ఒకవేళ ఆ మ్యాచ్ లో ఓడిపోతే ఏమి జరుగుతుందనే దానిపై అంచనా వేయలేనన్నాడు. -
ధోనికి మైఖేల్ క్లార్క్ ప్రత్యేక సందేశం..
సాక్షి, హైదరాబాద్: శ్రీలంకతో జరిగే నాలుగో వన్డేతో కెరీర్లో 300వ మ్యాచ్ ఆడబోతున్న భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రత్యేక సందేశాన్ని పంపించాడు. ‘ శ్రీలంకపై రెండు ఫార్మట్లలో అసాధారణ ఆటతో అదర గోట్టారు. ఎంఎస్ ధోని అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు’ అని ట్వీట్ చేశాడు. లంకతో రెండో వన్డేలో ధోని భువీతో కలిసి 8 వికెట్‌కు అత్యధికంగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఓటమి అంచున ఉన్న భారత్‌ను గట్టెక్కించిన విషయం తెలిసిందే. అలాగే మూడో వన్డేలో కూడా ధోని రోహిత్ తో కలిసి భారత్‌కు 6 వికెట్ల తేడాతో విజయాన్నిందించి కష్టపరిస్థితుల్లో తన అవసరం ఏమిటో చూపించాడు. ఇక శ్రీలంకతో ప్రేమదాసు స్టేడియంలో జరిగే నాలుగో వన్డేతో ధోని 300 క్లబ్లో చేరనున్నాడు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ (463), రాహుల్ ద్రవిడ్(344), మహ్మద్ అజారుద్దీన్(334), సౌరవ్ గంగూలీ(311), యువరాజ్ సింగ్(304) ల సరసన నిలవనున్నాడు. 🇮🇳 playing some outstanding cricket in both forms against 🇱🇰 @msdhoni has been on 🔥 — Michael Clarke (@MClarke23) 29 August 2017 -
సొంతగడ్డపై భారత్ చాలా బలమైన జట్టు
భారత్‌లో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆస్ట్రేలియాకు పెద్ద సవాల్ ఎదురు కానుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. టెస్టులతో పోలిస్తే వన్డేల్లో పిచ్‌లు కాస్త మెరుగ్గా ఉంటాయి కాబట్టి హోరాహోరీ పోరు సాగవచ్చన్న క్లార్క్... సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం అంత సులువు కాదని అన్నాడు. కోహ్లి నాయకత్వంలో అన్ని రంగాల్లో ఈ జట్టు పటిష్టంగా కనిపిస్తోందని చెప్పాడు. అశ్విన్‌లో అపార ప్రతిభ ఉంది కాబట్టి ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్లో కూడా రాణించగలడని క్లార్క్ అన్నాడు. -
'మా స్ఫూర్తి కోహ్లిలో ఉంది'
సిడ్నీ: ప్రపంచ క్రికెట్ లో పరుగుల మెషీన్ గా దూసుకుపోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని చూస్తే తనకు ఆస్ట్రేలియా క్రికెటర్లే గుర్తుకువస్తారని అంటున్నాడు ఆ దేశ క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. ప్రధానంగా పోరాట స్ఫూర్తిలో ఆసీస్ క్రికెటర్లను విరాట్ మైమరిపిస్తూ ఉంటాడని ప్రశంసించాడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కోహ్లిని ఫీల్డ్ లో ఎప్పుడూ చూసినా అక్కడ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉన్నట్లు కనబడుతుందని క్లార్క్ కొనియాడాడు. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో కోహ్లికి ఎక్కువ శాతంలో అభిమానులు లేరంటూ వస్తున్న వార్తలను క్లార్క్ ఖండించాడు. అందులో ఎటువంటి వాస్తవం లేదని, ఆ వార్తలతో తాను ఎంతమాత్రం ఏకీభవించనన్నాడు. 'ఆస్ట్రేలియాలో కోహ్లికి ఎక్కువ శాతం అభిమానులు లేరనే వార్తలతో నేను ఆమోదించను. ఆస్ట్రేలియాలో విరాట్ కు చాలా ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారనే అనుకుంటున్నా. నిజాయితీగా చెప్పాలంటే.. కఠినమైన క్రికెట్ గేమ్ లో విరాట్ ఫీల్డ్‌లో చురుగ్గా కదిలే తీరు ఆసీస్ ఆటగాళ్లనే జ్ఞప్తికి తెస్తుంది. ఆసీస్ క్రికెటర్ల లక్షణాలు విరాట్ లో మెండుగా ఉన్నాయి. నాకు విరాట్ తో మంచి సంబంధాలున్నాయి. అతనంటే నాకు చాలా గౌరవం. విరాట్ కు ఆసీస్ లో అత్యధిక ఫ్యాన్స్ లేరంటూ చెప్పడం కరెక్ట్ కాదు. విరాట్ పై వ్యతిరేక కథనం రాసే క్రమంలో మా మీడియా అలా చెప్పి ఉండొచ్చు. అయితే అది నిజం కాదు'అని ప్రస్తుతం పుణెలో ఉన్న క్లార్క్ పేర్కొన్నాడు. -
కోహ్లి గొప్ప నాయకుడు
ఆసీస్ మాజీ ఆటగాళ్ల ప్రశంసలు మెల్బోర్న్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై కక్ష కట్టిన ఆస్ట్రేలియా మీడియా తమ అసత్య కథనాలతో విమర్శిస్తున్నా ఆ దేశ మాజీ క్రికెటర్లు మాత్రం అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మైకేల్ క్లార్క్ ఇప్పటికే తన మద్దతు ప్రకటించగా తాజాగా దిగ్గజ ఆటగాళ్లు స్టీవ్ వా, ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ఇదే బాటలో పయనించారు. ‘కోహ్లి అద్భుత నాయకుడు. తనతోపాటుగా జట్టును, దేశాన్ని నడిపిస్తున్నాడు. ధర్మశాలలో తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తాడేమోనని భయంగా ఉంది. ప్రస్తుత వివాదాన్ని ఇరు జట్లు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. 2008 మంకీగేట్లా ఇది కాకూడదనే అనుకుంటున్నాను. 2001 అనంతరం జరుగుతున్న అద్భుత సిరీస్ ఇదేనని చాలామంది చెబుతున్నారు’ అని గిల్లీ తెలిపారు. మరోవైపు కోహ్లి కెప్టెన్సీలో తనతోపాటు రికీ పాంటింగ్ లక్షణాలు కనిపిస్తున్నాయని మాజీ కెప్టెన్ స్టీవ్ వా కొనియాడారు. ‘భారత క్రికెట్‌కు అతడు కొత్త ముఖచిత్రం. దూకుడైన కెప్టెన్‌గా చెప్పవచ్చు. జట్టు ఆటగాళ్లతో నిరంతం సంభాషిస్తూ ముందుకెళతాడు. సానుకూల దృక్పథంలో నన్ను గుర్తు చేస్తున్నాడు. పాంటింగ్లోనూ ఇలాంటి లక్షణాలే కనిపించేవి’ అని వా అన్నారు. -
మంకీగేట్: భజ్జీ ఏం తిట్టాడో 'ఆయన'కే తెలుసట!
కోల్‌కతా: 2007-08లో భారత్-ఆస్ట్రేలియా సిరీస్ రెండో టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న 'మంకీగేట్' వివాదం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో తనను ఉద్దేశించి భారత బౌలర్ హర్భజన్ సింగ్ 'మంకీ' (కోతి) అన్నాడని, ఇవి జాతివిద్వేషపూరితమైన వ్యాఖ్యలని ఆసీస్ బ్యాట్స్‌మన్ ఆండ్రూ సిమండ్స్ అప్పట్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం చినికిచినికి ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై ప్రభావం చూపించేంతగా దుమారం రేపింది. అయితే, ఈ వివాదానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖేల్ క్లార్ తాజాగా స్పందించారు. క్లార్క్ ఆత్మకథ 'మై స్టోరీ' పుస్తకాన్ని కోల్‌కతాలో ఆవిష్కరించిన సందర్భంగా 'మంకీగేట్' వివాదాన్ని సరదాగా గంగూలీ ప్రస్తావించారు. 'కొన్నిసార్లు అసలైన నిజమేమిటో ప్రపంచానికి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పుస్తకంలో 'మంకీగేట్' అధ్యాయం గురించి పూర్తి వాస్తవాలు మీకు లభించకపోవచ్చు' అని పేర్కొన్నారు. ఇంతకూ సిమండ్స్‌ను భజ్జీ 'మంకీ' అన్నాడా? లేక ఇంకా ఏదైనా తిట్టాడా? అన్నది ఇప్పటికీ మిస్టరీనే.. దీనిపై స్పందిస్తూ.. అప్పుడు హర్భజన్ ఏం అనాలనుకున్నాడో కేవలం 'సర్దార్జీ'కి మాత్రమే తెలుసునని గంగూలీ చమత్కరించారు. ఈ వివాదాన్ని మీరు 'మంకీగేట్' లేదా, 'హనుమాన్ గేట్' అని ఎలాగైనా పిలుచుకోవచ్చునని సలహా ఇచ్చారు. సిమండ్స్ ఈ వివాదాన్ని మరీ ఇంతదూరం లాగి ఉండాల్సింది కాదని క్లార్క్ పేర్కొన్నారు. -
వివాదాన్ని ముగించడం సంతోషంగా ఉంది: క్లార్క్
బెంగళూరు టెస్టులో చోటు చేసుకున్న డీఆర్ఎస్ వివాదాన్ని ఇరు దేశాల బోర్డులు త్వరగా ముగించి మంచి పని చేశాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంతోషం వ్యక్తం చేశాడు. 2007–08 ఆస్ట్రేలియా పర్యటనలో ‘మంకీగేట్’ వివాదాన్ని ఆండ్రూ సైమండ్స్ అంతగా సాగదీయాల్సింది కాదని అతను అభిప్రాయపడ్డాడు. క్లార్క్ ఆటోబయోగ్రఫీ ‘మై స్టోరీ’ని భారత మాజీ కెప్టెన్ గంగూలీ కోల్‌కతాలో మంగళవారం విడుదల చేశాడు. -
రాంచీలో కోహ్లీతోనే ముప్పు: మైకేల్ క్లార్క్
రాంఛీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరును ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మైకేల్ క్లార్క్ ప్రశంసించాడు. కోహ్లీకి దూకుడే ప్రధాన ఆయుధమని, బలమని అభిప్రాయపడ్డాడు. అతడు తనకు నచ్చిన శైలిలో ఆడేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నిస్తాడని, ఆ కారణాల వల్లనే కోహ్లీ విజయాలబాటలో నడుస్తున్నాడని ఆసీస్ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు. తొలి రెండు టెస్టుల్లో తన మార్క్ పరుగులు రాబట్టని భారత కెప్టెన్ మూడో టెస్టు (రాంచీ)లో ప్రమాదకారి కాగలడని ముఖ్యంగా ఆ విషయంపై దృష్టిసారించాలని ఆసీస్ బౌలర్లను హెచ్చరించాడు. డీఆర్ఎస్ విషయంలో తలెత్తిన డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదంలో తప్పంతా తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్దేనని చెప్పిన క్లార్క్.. ఈ విషయంలో విరాట్‌కే మద్దతుగా నిలిచాడు. ఇప్పటికే గాయం కారణంగా ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ ఈ టెస్ట్ సిరీస్ కు దూరం కాగా, తాజాగా ఆ జట్టు ప్రధాన పేసర్ గాయం కారణంగా మిచెల్ స్టార్క్ కూడా సిరీస్ నుంచి వైదొలిగాడు. రాంఛీలో ఆసీస్ జట్టుకు కష్టకాలమేనని, స్టార్క్ లేకపోవడం జట్టుపై ప్రభావం చూపిస్తుందన్నాడు. స్టార్క్ కుడి కాలికి బెంగళూరు టెస్టులో గాయం కావడంతో మిగతా రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఇదివరకే తెలిపింది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో 1-1తో భారత్, ఆసీస్‌లు సమ ఉజ్జీగా ఉన్నాయి. దీంతో ప్రత్యర్ధిపై ఆధిప్యతం చెలాయించి సిరీస్ నెగ్గాలంటే మాత్రం మూడో టెస్టు ఇరు జట్లకు కీలకం కానుంది. అయితే సిరీస్ తమ జట్టుదేనని మైకేల్ క్లార్క్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. -
'విరాట్ కు పరుగుల బాకీ ఉంది'
రాంచీ: తమతో జరిగిన రెండు టెస్టుల్లో విఫలమైన టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి తదుపరి టెస్టుల్లో పరుగుల దాహాన్ని తీర్చుకునే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. వచ్చే టెస్టులపై విరాట్ సీరియస్ గా దృష్టి సారించి పరుగుల బాకీని తీర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. ఈ సిరీస్ ను తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన క్లార్క్.. కడవరకూ హోరాహోరీ పోరు ఖాయంగా పేర్కొన్నాడు. స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్స్ రూమ్ రివ్యూ వివాదం దాదాపు సద్దుమణగడంతో ఇరు జట్లు మూడో టెస్టుపై సీరియస్ గా దృష్టి నిలుపుతాయని క్లార్క్ తెలిపాడు. ఈ మేరకు ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో అనేక విషయాల్ని క్లార్క్ షేర్ చేసుకున్నాడు. 'రాంచీ టెస్టులో విరాట్ పరుగుల దాహాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. ఈ సిరీస్ లో ఇంకా ఆకట్టుకోని కోహ్లి.. మూడో టెస్టులో చెలరేగే అవకాశం ఉంది. వచ్చే టెస్టులో గెలుపు ఇరు జట్లకు కీలకం. దాంతో రసవత్తర పోరు ఖాయం. అయితే మేమే సిరీస్ ను మాత్రం గెలుస్తాం. ఎప్పుడూ ఆసీస్‌కే నా మద్దతు. వారి విజయాల్నే నేను చూడాలనుకుంటా. ఇప్పుడు కూడా అదే జరగాలని కోరుకుంటున్నా. ఈ సిరీస్ ను ఆసీస్ 2-1తో గెలిచే అవకాశం ఉంది' అని క్లార్క్ జోస్యం చెప్పాడు. ఇదిలా ఉంచితే విరాట్ కోహ్లిపైనే ఆసీస్ జట్టు ఎక్కువ ఫోకస్ చేసిందన్న దానితో క్లార్క్ విబేధించాడు. అది కేవలం విరాట్ పట్ల అప్రమత్తంగా ఉండటమే తప్పితే, అతనిపై ఫోకస్ పెట్టడం ఎంతమాత్రం కాదన్నాడు. -
ఆటోవాలా క్లార్క్!
బెంగళూరు: భారత పర్యటనకొచ్చిన విదేశీ క్రికెటర్లు ఇక్కడి ఇరుకైన వీధుల్లో సరదాగా ఆటోల్లో షికారు చేసిందే చూశాం... కానీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఏకంగా ఆటోవాలాగా మారాడు. బెంగళూరు వీధుల్లో ఆటో నడిపాడు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా సిరీస్ కోసం టీవీ వ్యాఖ్యాతగా వచ్చిన క్లార్క్ తన డ్రైవింగ్ ముచ్చట ఆటోరిక్షాతో తీర్చుకున్నాడు. ఆటో డ్రైవర్‌తో ఎలా నడపాలో నేర్చుకున్న ఈ ఆస్ట్రేలియన్... కాసేపటికే ఒంటరిగా డ్రైవర్ సీట్లో కూర్చొని ఆటోను రయ్ రయ్‌మంటూ పోనిచ్చాడు. దీనికి సంబంధించిన 21 సెకన్ల నిడివి గల వీడియోను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 2004లో బెంగళూరులో జరిగిన తొలి టెస్టుతోనే అరంగేట్రం చేసిన క్లార్క్ ఆ మ్యాచ్‌లో వీరోచిత శతకం (151) సాధించి జట్టును నాలుగు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. -
ఆటో నడిపిన మాజీ క్రికెటర్!
-
ఆటో నడిపిన మాజీ క్రికెటర్!
బెంగళూరు:ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆటో రిక్షాను నడపడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న క్లార్క్ కు ఆటో నడపాలనే సరదా పుట్టిందట. ఇంకేముందే బెంగళూరులోని ఓ ఆటో వాలా దగ్గరకు వెళ్లి కొన్ని నిమిషాలు పాటు శిక్షణకు తీసుకుని మరీ డ్రైవ్ చేశాడు క్లార్క్. భారత్ -ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో క్లార్క్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిపో్వడంతో మిగతా పనులపై దృష్టి పెట్టాడు క్లార్క్. దీనిలో భాగంగానే ఆటో రిక్షాను నేర్చుకోవడం, నడపడం చేశాడు క్లార్క్. 'మేము టక్ టక్ అని పిలుచుకునే ఆటో రిక్షాను భారతీయ రోడ్లపై నడపాలనుకున్నా. అందుకు ముందుగా కొద్ది నిమిషాలు పాటు శిక్షణ తీసుకున్నా. టక్ టక్ ను నడపడం చాలా సరదాగా ఉంది. నేను ఇక్కడే క్రికెట్ కెరీర్ ను ఆరంభించా. మళ్లీ బెంగళూరుకు వచ్చినందుకు ఆనందంగా ఉంది' అని క్లార్క్ తెలిపాడు. ఈ మేరకు ఆటో రిక్షాను నడిపిన వీడియోను క్లార్క్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. -
'కోహ్లిని సవాల్ చేయలేరు'
పుణె: తమతో తొలి టెస్టులో ఓటమి తరువాత భారత్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఒత్తిడి పెరిగిపోయిందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలను హర్భజన్ సింగ్ తిప్పికొట్టాడు. ఒక చాంపియన్ ఆటగాడైన విరాట్ ను ఛాలెంజ్ చేయడం అంత తేలిక కాదనే విషయం తదుపరి టెస్టుల్లో మీరే చూస్తారంటూ భజ్జీ కౌంటర్ ఇచ్చాడు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడిని జయించడం విరాట్ కు వెన్నతో పెట్టిన విద్య అనే విషయం ఆసీస్ గ్రహిస్తే మంచిదన్నాడు. 'విరాట్ ఒక చాంపియన్ ప్లేయర్. అతన్ని ఒత్తిడిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆ ఛాలెంజ్ ను ఒక చేత్తో విసిరేస్తాడు. మిగతా టెస్టుల్లో సరికొత్త కోహ్లిని ఆసీస్ చూడటం ఖాయం. అదే సమయంలో భారీ పరుగుల వరద సృష్టిస్తాడు. భారత క్రికెట్ జట్టుకు విరాట్ ఒక వెన్నుముక. ఏదో ఒక టెస్టులో విరాట్ ను స్వల్ప స్కోరుకు అవుటైనంత మాత్రానా అతన్ని తక్కువ అంచనా వేయకండి. అతని ఆట ఎప్పుడు చాలా ఎత్తులో ఉంటుంది' అని హర్భజన్ సింగ్ తెలిపాడు. తొలి టెస్టులో భారత్ ఓడిపోవడంతో ఆటగాడిగా, కెప్టెన్ గా కోహ్లిపై విపరీతమైన భారం పడిందనే క్లార్క్ వ్యాఖ్యలపై హర్భజన్ పైవిధంగా స్పందించాడు. -
'మన పేస్ బౌలింగే కీలకం'
సిడ్నీ: భారత్ పర్యటనలో ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే పేస్ బౌలర్లు కీలక పాత్ర పోషించాల్సి న అవసరం ఉందని ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. భారత్ పై స్పష్టమైన ఆధిక్యం సాధించి వారిని వెనక్కునెట్టాలంటే పేస్ బౌలర్లు సాధ్యమైనన్ని ఎక్కువ వికెట్లు తీయక తప్పదన్నాడు. 'భారత్ లో పిచ్ లపై స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆసీస్ నమ్ముతుంది. కానీ తొందరగా బ్యాట్స్మన్లను పెవిలియన్ కు చేరడం కూడా ఫలితంపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ మన పేస్ బౌలర్లు ఆకట్టుకుంటే భారత్ పై ఒత్తిడి పెంచవచ్చు. ఆస్ట్రేలియా సిరీస్ విజయం సాధించాలంటే స్టార్క్, హజల్ వుడ్లు ముఖ్య పాత్ర పోషించాలి. కొత్త బంతితో స్వింగ్ చేయడంతో పాటు, రివర్స్ స్వింగ్ కూడా చేయడం ఆస్ట్రేలియాకు ముఖ్యం. ఆసీస్ విజయం సాధించాలంటే ప్రతీ ఒక్కరూ తమ పాత్రను సమర్ధవంతంగా పోషించక తప్పదు'అని క్లార్క్ తెలిపాడు. -
భారత్‌లో చాలా కఠినం: క్లార్క్
సిడ్నీ: భారత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనిపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ధోని కచ్చితంగా అత్యుత్తమ నాయకుడని కితాబిచ్చాడు. అతని నాయకత్వ లక్షణాలతో భారత ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడంటూ కొనియాడాడు. మ్యాచ్‌లో విజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఆడే ధోని స్వభావం తనకు ఎంతో ఇష్టమన్నాడు. అటు వన్డేల్లో, ఇటు టెస్టుల్లో ధోని ఒక చరిత్ర సృష్టించాడని క్లార్క్ పేర్కొన్నాడు. ఒక దేశానికి క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉండాలంటే అది చాలా కష్టమన్నాడు. అందులోనూ క్రికెట్ ను ఒక మతంలా భావించే భారత్‌లో ఒత్తిడితో కూడుకున్నదని క్లార్క్ విశ్లేషించాడు. భారత్‌లో క్రికెట్ గేమ్ పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో తాను ఊహించగలనని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లార్క్ పేర్కొన్నాడు. ఒక కెప్టెన్ ఎంత వరకూ చేయాలో అంతకంటే ఎక్కువే ధోని చేశాడన్న క్లార్క్.. అతను ఎప్పుడూ సరైన మార్గంలోనే క్రికెట్ ను ఆడుతూ జట్టుకు చిరస్మరణీయమైన సేవలందించాడని ర్కొన్నాడు. అయితే రాబోవు రోజుల్లో భారత విజయాల్లో ధోని పాత్ర ఉంటేనే అతను 2019 వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగుతాడని, కాని పక్షంలో అతని క్రికెట్ కెరీర్‌ను పెంచుకునే అవకాశం ఉండదని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత భారత జట్టులో చాలామంది యువకులు ఉన్నారని ఈ సందర్భంగా క్లార్క్ గుర్తు చేశాడు. కచ్చితంగా విరాట్ కోహ్లికి బాధ్యతలు అప్పగించే సమయం ఆసన్నమైందని భావించే ధోని ఆ నిర్ణయం తీసుకున్నాడని క్లార్క్ అన్నాడు. -
ధోనీ, నేను ఆ విషయాలు మాట్లాడుకున్నాం
సిడ్నీ: టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. కెప్టెన్‌గా జట్టును గెలిపించేందుకు ధోనీ నిరంతరం ప్రయత్నించేవాడని, దూకుడుగా వ్యవహరించేవాడని చెప్పాడు. ఈ లక్షణాలే అతణ్ని గొప్ప కెప్టెన్‌ను చేశాయని అభిప్రాయపడ్డాడు. ధోనీలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని, విరాట్ కోహ్లీకి అతని మద్దతు ఉంటుందని క్లార్క్ అన్నాడు. మహీ కెప్టెన్‌గా కొనసాగినా విజయవంతమయ్యేవాడని, కేవలం ఆటగాడిగా ఉండాలని భావిస్తున్నాడని, బ్యాట్‌తో రాణిస్తాడని చెప్పాడు. ధోనీతో తనకున్న అనుబంధాన్ని క్లార్క్ గుర్తు చేసుకున్నాడు. 'ధోనీ, భారత్‌లపై చాలా మ్యాచ్‌లు ఆడాను. చెన్నైలో డబుల్ సెంచరీ చేశాను. ఆ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోను. చాలాసార్లు క్లిష్ట సమయాల్లో ధోనీ భారత జట్టును గెలిపించాడు. మ్యాచ్‌ను ప్రత్యర్థి జట్టు చేతుల్లోంచి లాగేసుకున్నాడు. ధోనీకి, నాకు మోటార్ బైకులు అంటే చాలా ఇష్టం. అతని దగ్గర చాలా బైకులు ఉన్నాయి. మేమిద్దరం బైక్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ధోనీ అద్భుతమైన వ్యక్తి. గొప్ప క్రికెటర్. అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నా. చాలాకాలం క్రికెట్ ఆడుతాడని భావిస్తున్నా' అని క్లార్క్ అన్నాడు. -
'వాట్సన్ క్యాన్సర్ కణితి లాంటి వాడు'
సిడ్నీ:తనతో పాటు చాలాకాలం క్రికెట్ ఆడిన షేన్ వాట్సన్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ క్యాన్సర్ కణితితో పోల్చాడు. గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో చోటు చేసుకున్న విభేదాలను క్లార్క్ మరోసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. తన ఆటో బయోగ్రఫీ విడుదలకు సంబంధించి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లార్ పలు విషయాలను వెల్లడించాడు. తాను జట్టుకు కెప్టెన్ గా ఉన్న సమయంలో చాలా మంది ఆటగాళ్లు సెపరేట్ గ్రూప్ గా ఉండేవారనే సంగతిని పేర్కొన్నాడు. వారంతా ఒక కణితి లాంటి వారని, ఆ గ్రూప్ ను అలానే వదిలేస్తే క్యాన్సర్ తరహాలో ప్రమాదకరంగా మారిపోతారన్నాడు. ఆ గ్రూప్ లో వాట్సన్ కూడా ఉన్నాడంటూ మరోసారి అడిగిన ప్రశ్నకు క్లార్క్ అవుననే సమాధానం ఇచ్చాడు. దీనిలో భాగంగానే మూడు సంవత్సరాల క్రితం భారత్ లో టెస్టు సిరీస్ లో మొహాలీలో జరిగిన మూడో మ్యాచ్ నుంచి పలువురు ఆటగాళ్లపై వేటు వేసినట్లు పేర్కొన్నాడు. మరోవైపు 2009లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా టెస్టు విజయం సాధించిన తరువాత అప్పటి వైస్ కెప్టెన్ గా ఉన్న సైమన్ కాటిచ్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని పాడు చేశాడన్నాడు. -
35 అయినా 20లో ఉన్నట్టుంది..
హాంకాంగ్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్ చివరి అంతర్జాతీయ టి-20 మ్యాచ్ ఆడి దాదాపు ఆరేళ్లు కావస్తోంది. గత తొమ్మిది నెలల నుంచి క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. అయితే 35 ఏళ్ల క్లార్క్ 20 ఏళ్ల నవ యువకుడిలా భావిస్తున్నాడు. హాంకాంగ్ టి-20 బ్లిట్జ్‌లో ఆడేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. 'నా వయసు కంటే 15 ఏళ్లు చిన్నవాడిలా భావిస్తున్నా. ప్రస్తుతం నా వయసు 35 ఏళ్లయినా, 20వ ఏట ఉన్నట్టుంది' అని క్లార్క్ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన క్లార్క్ తన కెరీర్లో 115 టెస్టులు, 245 వన్డేలు, 34 అంతర్జాతీయ టి-20లు ఆడాడు. కాగా ఇటీవల క్లార్క్ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. ఆస్ట్రేలియా బిగ్ బాష్‌తో పాటు హాంకాంగ్ ఈవెంట్లో ఆడనున్నాడు. -
'హ్యూస్.. ఇంకా నీ జ్ఞాపకాలతోనే'
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణించి దాదాపు ఏడాది కావొస్తోంది. గత సంవత్సరం సిడ్నీలో స్థానిక జట్టుతో క్రికెట్ ఆడుతూ బౌలర్ సియాన్ అబోట్ వేసిన బౌన్సర్ కు గాయపడిన హ్యూస్.. కొన్ని రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. ఆస్ట్రేలియా క్రికెట్ లో చోటు చేసుకున్న ఆ విషాదకర జ్ఞాపకాలు ఆటగాళ్లను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. శుక్రవారం ఫిల్ హ్యూస్ మొదటి వర్థంతి సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆనాటి చేదు జ్ఞాపకాలు తనను ఇంకా కలచి వేస్తూనే ఉన్నాయని తెలిపాడు. ఒకపక్క కూతురు రాకతో తన జీవితంలోకి ఆనంద క్షణాలు రాగా, మరోపక్క తన ప్రియ మిత్రుడు, 'తమ్ముడు' హ్యూస్ వర్థంతి రావడం తీరని బాధను మోసుకొచ్చిందన్నాడు. హ్యూస్ జ్ఞాపకాలు ఎప్పటికీ తనతో ఉంటాయన్నాడు. హ్యూస్ అర్థాంతరంగా మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం గురించే ప్రతీ రోజు మదన పడుతూనే ఉంటానని క్లార్క్ తెలిపాడు. హ్యూస్ మరణాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియా తరపున 25 టెస్టు మ్యాచ్ లు ఆడిన ఫిల్ హ్యూస్ గతేడాది నవంబర్ 27 వ తేదీన తుదిశ్వాస విడిచాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో అబాట్ వేసిన కారణంగా హ్యూస్ కుప్పుకూలిపోయాడు. ఆ తరువాత హ్యూస్ ను బ్రతికేంచేందుకు డాక్టర్లు చేసిన ప్రయోగాలు ఫలించలేదు. -
'సరైన సమయంలో అతడికి కెప్టెన్సీ'
సిడ్నీ : తన తర్వాత జట్టు బాధ్యతలు స్వీకరించిన స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా సక్సెస్ సాధిస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో టాపార్డర్ స్థానాలలో స్మిత్ రావడం అతడి ఆటతీరును దెబ్బతీయదన్నాడు. కెప్టెన్‌గా నిరూపించుకోవడానికి అతడికిదే మంచి తరుణమని క్లార్క్ పేర్కొన్నాడు. బంగ్లాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో జట్టులో చాలా మంది కొత్తవాళ్లకు అవకావం లభించింది. యాషెస్ సిరీస్ ఓటమి అనంతరం బ్రాడ్ హడిన్, క్రిస్ రోజర్స్, ర్యాన్ హ్యారిస్, షేన్ వాట్సన్ టెస్టులకు వీడ్కోలు పలికారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్ జట్టుపై లార్డ్స్ లో చేసిన 215 పరుగుల ఇన్నింగ్స్ అద్బుతమని ప్రశంసించాడు. బంగ్లా సిరీస్‌లో జట్టును మరింత ముందుకు నడిపిస్తాడని క్లార్క్ వ్యాఖ్యానించాడు. కెరీర్ లోనే స్మిత్ ఉన్నత దశలో ఉన్నప్పుడు అతని చేతికి పగ్గాలు రావడం సంతోషకర అంశమన్నాడు. యాషెస్ టెస్ట్ సిరీస్ జరుగుతుండగానే టెస్టులకు క్లార్క్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే. -
వాట్సన్ వీడ్కోలు
లండన్ : యాషెస్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టుకు మరో స్టార్ ఆటగాడు దూరమయ్యాడు. ఇప్పటికే మైకేల్ క్లార్క్, క్రిస్ రోజర్స్ రిటైర్మెంట్ ప్రకటించగా... తాజాగా సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. యాషెస్ తొలి టెస్టులో విఫలమైన 34 ఏళ్ల వాట్సన్‌కు మిగిలిన మ్యాచ్ ల్లో చోటు దక్కలేదు. దీనికి తోడు నిరంతరం వెంటాడుతున్న గాయాల కారణంగా తన పదేళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లండ్‌తో శనివా రం జరిగిన రెండో వన్డేలో వాట్సన్ గాయపడడంతో ఈ సిరీస్ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ‘టెస్టులకు గుడ్‌బై చెప్పాల్సిన సమయమిదేనని నాకు తెలుసు. ఈ నిర్ణయం అంత సులువుగా తీసుకోలేదు. గత నెలంతా దీర్ఘంగా ఆలోచించాను. అయితే వన్డే, టి20 ఫార్మాట్లో మాత్రం కొనసాగుతాను. ఇన్నాళ్లుగా జట్టు కోసం నా శాయశక్తులా సేవలందిం చాను’ అని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్లో పేర్కొన్నాడు. వన్డేల్లో విలువైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నా సుదీర్ఘ ఫార్మాట్లో వాట్సన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 2005లో అరంగేట్రం చేసిన తను 59 టెస్టులు ఆడాడు. ఓ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరిం చాడు. 3,731 పరుగుల్లో నాలుగు సెంచరీలుండగా, బౌలింగ్‌లోనూ రాణించి 75 వికెట్లు తీశాడు. -
కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల వర్షం
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ప్రశంసల జల్లులు కురిపించాడు. చాలా రోజుల తర్వాత టీమిండియా విదేశీ గడ్డపై విజయం సాధించిందని, కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్లనే గెలుపు సాధ్యమయిందని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ సహజసిద్ధమై దూకుడుతోనే భారత జట్టుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నాడు. నాయకత్వ లక్షణాలను కూడా కోహ్లీ మరిన్ని నేర్చుకోవాలని సూచించాడు. 9 టెస్టుల తర్వాత శ్రీలంకతో కొలంబోలో టెస్టు మ్యాచ్ లో టీమిండియాను కోహ్లీ విజయాన్ని అందించాడని ప్రశంసించాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలలో ఆ జట్లపై సిరీస్ గెలవాల్సి ఉందన్నాడు. ఇంకా చెప్పాలంటే విరాట్, ఆస్ట్రేలియా ఆటగాడు మైకెల్ క్లార్క్ లాంటి వాడని కితాబిచ్చాడు. కోహ్లీ కూడా క్లార్క్ లాగానే సవాళ్లను సమర్థంగా ఎదర్కొంటాడన్నాడు. క్లార్క్ రిటైర్మెంట్ తర్వాత స్టీవ్ స్మిత్ ఆసీస్ టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. అతడు జట్టును విజయపథంలో నడిపస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్ లో ఆసీస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
విజయంతో ఒకరు.. పరాజయంతో మరొకరు
ప్రపంచ క్రికెట్లో ఇద్దరు యోధుల శకం ముగిసింది. అత్యుత్తమ కెప్టెన్‌గా, బాట్స్‌మన్‌గా మన్నలందుకున్న ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. నిన్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్.. ఈ రోజు శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర. తమ చివరి టెస్టు మ్యాచ్‌లో క్లార్క్ విజయంతో.. సంగా పరాజయంతో నిష్ర్కమించారు. చివరి మ్యాచ్ ఫలితాలను పక్కనబెడితే.. ఈ ఇద్దరూ తమ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా చెరగని ముద్ర వేశారు. చివరి మ్యాచ్‌లో ఈ ఇద్దరూ దిగ్గజాలకు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో స్వాగతం పలికారు. ఇంతకుముందే పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి వైదొలిగిన సంగా, క్లార్క్‌లు.. టెస్టు క్రికెట్లోనూ బ్యాట్‌ను పక్కనపెట్టేశారు. కాకతాళీయమే అయినా అంతర్జాతీయ క్రికెట్‌కు ఒకేసారి వీడ్కోలు చెప్పేశారు. పోరాట యోధుడు సంగా: సంగా ఒక పరుగుల యంత్రం. 38 ఏళ్ల సంగా దశాబ్దమన్నర కాలంగా శ్రీలంక క్రికెట్‌కు వెన్నె ముకగా నిలిచాడు. 134 టెస్టుల్లో 12,400 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 38 సెంచరీల్లో 11 డబుల్ సెంచరీలుగా మలచడం విశేషం. ఇక 404 వన్డేల్లో 14,234 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో అతను ఐదో స్థానంలో ఉన్నాడు. సచిన్ (15921) అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సుదీర్ఘకాలంపాటు నంబర్‌వన్‌గా కొనసాగాడు. మహేళ జయవర్ధనేతో కలిసి ఎన్నో రికార్డు భాగస్వామ్యాలు కూడా నెలకొల్పాడు. తన కెరీర్లో ఒక టి20 ప్రపంచకప్ గెలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో రెండు ఫైనల్స్ ఆడినా టైటిల్ లేకపోవడం కెరీర్లో లోటు. వన్డేల నుంచి తప్పుకునే ముందు చివరి ఐదు ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. మేటి సారథి మైకేల్ క్లార్క్: అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాక స్వల్ప కాలంలోనే క్లార్క్ తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. 12 ఏళ్ల పాటు జట్టుకు సేవలందించాడు. 34 ఏళ్ల క్లార్క్ 115 టెస్టుల్లో 8643 పరుగులు చేశారు. ఇందులో 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 329 (నాటౌట్). ఇక 245 వన్డేలాడిన క్లార్క్ 7981 పరుగులు చేశాడు. వీటిలో 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్లార్క్ తన కెరీర్లో రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు యాషెస్ సిరీస్ విజయాల్లో భాగస్వామి అయ్యాడు. పాంటింగ్ తర్వాత ఆసీస్ సారథిగా బాధ్యతలు తీసుకున్న క్లార్క్.. సొంతగడ్డపై ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ను అందుకోవడం తన కెరీర్లో అత్యంత మధుర క్షణం. -
విజయంతో ముగింపు
చివరి టెస్టులో ఆసీస్ గెలుపు క్లార్క్, రోజర్స్ రిటైర్ ఓవల్: యాషెస్ సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఆస్ట్రేలియా తమ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌కు విజయంతో వీడ్కోలు పలికింది. ఆదివారం ఇక్కడి ముగిసిన చివరి టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఐదు టెస్టుల ఈ యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-2తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో రెండవ, ఐదో టెస్టులను ఆసీస్ నెగ్గగా... మిగతా మూడు టెస్టులను కుక్ సేన గెలుచుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 203/6తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో సిడిల్‌కు 4 వికెట్లు దక్కాయి. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా... క్రిస్ రోజర్స్ (ఆసీస్), రూట్ (ఇంగ్లండ్)లు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు. ఇరు జట్ల మధ్య ఈ నెల 31న ఏకైక టి20 మ్యాచ్, అనంతరం వచ్చే నెల 3 నుంచి ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది. అంతకుముందు ఆసీస్ గురువారం ఐర్లాండ్‌తో ఏకైక వన్డే ఆడుతుంది. ఈ టెస్టుతో ఆసీస్ కెప్టెన్ క్లార్క్, ఓపెనర్ రోజర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు వీరికి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇచ్చి గౌరవించారు. మొత్తం కెరీర్లో క్లార్క్ 115 టెస్టుల్లో 49.10 సగటుతో 8643 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు ఉన్నాయి. రోజర్స్ 25 టెస్టుల్లో 42.87 సగటుతో 5 సెంచరీలు సహా 2015 పరుగులు సాధించాడు. -
'అలా చేస్తే చూడాలనుకుంటున్నా'
లండన్: చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న మైఖేల్ క్లార్క్ కు 'గార్డ్ ఆఫ్ హానర్' తెలిపిన ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు. కొలంబో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న శ్రీలంక దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార సంగక్కరకు భారత ఆటగాళ్లు ఇలాగే గౌరవించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చాడు. ఓవల్ టెస్టుతో కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్న క్లార్క్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లు గురువారం ఊహించని విధంగా స్వాగతం పలికారు. అతను క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇరు వైపులా నిలబడి చప్పట్లతో అభినందలు తెలిపారు. ఈ గౌరవానికి క్లార్క్ అన్నివిధాలా అర్హుడని వార్నర్ అన్నాడు. క్లార్క్ గొప్ప కెప్టెన్, నాయకుడు, జట్టు సభ్యుడని ప్రశంసించాడు. గత కొన్నేళ్లుగా క్లార్క్ క్రీడాజీవితంలో కెరీర్ లో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. సంగక్కరకు టీమిండియా ప్లేయర్స్ 'గార్డ్ ఆఫ్ హానర్' తెలిపితే చూడాలనుకుంటున్నామని వార్నర్ చెప్పాడు. -
చరిత్రపై ఇంగ్లండ్ గురి
♦ నేటి నుంచి యాషెస్ ఆఖరి టెస్టు ♦ క్లార్క్, రోజర్స్‌లకు చివరి మ్యాచ్ లండన్ : ఇప్పటి వరకూ ఇంగ్లండ్ జట్టు సొంతగడ్డపై యాషెస్ సిరీస్‌లో ఎప్పుడూ నాలుగు టెస్టులు గెలవలేదు. ఈ అరుదైన ఘనతను సాధించి చరిత్రలో నిలిచి పోవాలని అలిస్టర్ కుక్ సారథ్యంలోని యువ జట్టు ఆశపడుతోంది. యాషెస్‌ను ఇప్పటికే 3-1తో సొంతం చేసుకున్న ఇంగ్లండ్... గురువారం నుంచి జరిగే ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించాలనే తపనతో ఉంది. మరోవైపు వరుస ఘోర పరాభవాల నేపథ్యంలో టెస్టు క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. అలాగే ఓపెనర్ రోజర్స్‌కు కూడా ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ దిగ్గజ క్రికెటర్ క్లార్క్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలనేది ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆలోచన. మ. గం. 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
వీడ్కోలు వేళ..!
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న క్లార్క్, సంగక్కర ♦ వీళ్లతో పాటు రోజర్స్ కూడా ♦ రేపటి నుంచి ఈ ముగ్గురి ఆఖరి టెస్టులు కాకతాళీయమే అయినా... ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్‌కు ఒకేసారి వీడ్కోలు చెబుతున్నారు. దశాబ్దానికి పైగా తమ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించి... అంతర్జాతీయ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించిన మైకేల్ క్లార్క్, కుమార సంగక్కర ఇద్దరూ బ్యాట్‌ను పక్కనపెట్టేస్తున్నారు. వీళ్లతో పాటు రోజర్స్ కూడా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. రేపటి నుంచి జరిగే టెస్టుల్లో ఈ దిగ్గజాల ఆటను చివరిసారి చూడొచ్చు. సాక్షి క్రీడావిభాగం : క్లార్క్ జట్టులో ఉంటే ఆస్ట్రేలియాకు అదో ధైర్యం... అలాగే సంగక్కర ఆడుతున్నాడంటే శ్రీలంక ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరూ ఇద్దరే. సమకాలీన క్రికెట్లో సంచలనాలు సృష్టించిన వారే. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో రేపటి నుంచి జరిగే ఆఖరి టెస్టుతో క్లార్క్ పూర్తిగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాడు. అలాగే ఇదే మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ కూడా అస్త్రసన్యాసం చేయబోతున్నాడు. ఇక ఇటు సొంతగడ్డపై సంగక్కర భారత్‌తో రేపటి నుంచి జరిగే రెండో టెస్టు ద్వారా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ నేపధ్యంతో ఈ ముగ్గురి ఘనతల గురించి క్లుప్తంగా... కుమార సంగక్కర బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా త్రిపాత్రాభినయం చేసిన సంగక్కర లంక జట్టులో అత్యంత కీలక ఆటగాడు. దశాబ్దానికి పైగా ఒంటిచేత్తో జట్టును నడిపించిన సంగ...వన్డే ప్రపంచకప్ తర్వాత ఆట నుంచి తప్పుకుందామని భావించినా, లంక జట్టు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మరికొన్నాళ్లు క్రికెట్లో కొనసాగాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత ‘వివేకపూరితమైన’ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సుదీర్ఘకాలంపాటు నంబర్‌వన్‌గా కొనసాగాడు. మహేళ జయవర్ధనేతో కలిసి ఎన్నో రికార్డు భాగస్వామ్యాలు కూడా నెలకొల్పాడు. ఇటీవల ఫామ్‌తో ఇబ్బందులుపడుతున్న సంగక్కర పాక్‌తో జరిగిన రెండు టెస్టుల్లో మామూలుగా ఆడాడు. భారత్‌తో జరిగిన తొలి టెస్టులోనూ విఫలమైన అతను రెండో టెస్టులో ఓ భారీ ఇన్నింగ్స్‌తోనైనా కెరీర్‌కు గుడ్‌బై చెబుతాడేమో చూద్దాం. తన కెరీర్లో ఒక టి20 ప్రపంచకప్ గెలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో రెండు ఫైనల్స్ ఆడినా టైటిల్ లేకపోవడం కెరీర్లో లోటు. మైకేల్ క్లార్క్ ఆడిన తొలి మ్యాచ్‌తోనే భవిష్యత్ సారథిగా పేరు తెచ్చుకున్న క్లార్క్... స్వల్ప కాలంలోనే తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. అయితే తన కెరీర్ ఆసాంతం గాయాలతో ఇబ్బందిపడ్డాడు. అయినా 12 ఏళ్ల పాటు జట్టుకు సేవలందించాడు. రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు యాషెస్ సిరీస్ విజయాల్లో భాగమయ్యాడు. పాంటింగ్ రిటైరైన తర్వాత సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు. సొంతగడ్డపై ఈ ఏడాదే జరిగిన వన్డే ప్రపంచకప్‌ను సారథిగా అందుకోవడం తన కెరీర్లో అత్యంత మధుర క్షణం. మరికొంత కాలం టెస్టులు ఆడాలనే కోరిక ఉన్నా... యాషెస్‌లో ఎదురైన ఘోర పరాభవాల నేపథ్యంలో ఆట నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎంత గొప్ప క్రికెటర్ అయినా కెరీర్ చివరి దశలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని, నిలకడగా ఆడలేకపోతే తప్పుకుని కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని తన నిర్ణయం ద్వారా క్లార్క్ క్రికెట్ ప్రపంచానికి చెప్పాడు. క్రిస్ రోజర్స్ చాలా ఆలస్యంగా 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన క్రికెటర్ రోజర్స్. దాదాపు 250 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో నిలకడగా ఆడినా ఆసీస్ క్రికెట్లో ఉండే పోటీ దృష్ట్యా తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఒక్కసారి అవకాశం దొరికాక మాత్రం వదల్లేదు. అయితే తన ఏడేళ్ల కెరీర్లో కేవలం 24 టెస్టులు మాత్రమే ఆడటం లోటు. వరుసగా 7 టెస్టుల్లో అర్ధసెంచరీలు చేసిన ఘనత రోజర్స్ది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో సహచర బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డ చోట కూడా తను రాణించాడు. అయితే ఈ యాషెస్ ఆరంభానికి ముందే తాను చివరి సిరీస్ ఆడబోతున్నానని ప్రకటించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజర్స్ రిటైర్మెంట్ ఆస్ట్రేలియా క్రికెట్‌కు పెద్ద లోటు. -
ఓటమికి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ కారణం కాదు!
సిడ్నీ: యాషెస్ సిరీస్ ను కోల్పోయిన అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జట్టు ఓటమికి పలు కారణాలను ఎత్తిచూపుతూ అటు మాజీలు, విశ్లేషకులు మండిపడుతున్నారు. అసలు ఆసీస్ ఓటమికి భార్యలను, గర్లఫ్రెండ్స్ లను వెంట తీసుకెళ్లడంతో పాటు, జట్టులో సమిష్టితత్వం లోపించడమే ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు తమ భార్యలను విదేశీ టూర్లకు తీసుకువెళ్లి.. జట్టుతో కాకుండా వేరేగా ఉండటమేనని ఆస్టేలియన్ పత్రిక సిడ్నీ డైలీ టెలీగ్రాఫ్ పేర్కొంది. అయితే దీనిపై ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ తీవ్రంగా మండిపడ్డాడు. ఆ వార్తలను ఖండించిన క్లార్క్.. అందులో వాస్తవం ఎంతమాత్రం లేదన్నాడు. తాను చేసిన 28 సెంచరీల్లో.. 10 టెస్టు సెంచరీలు భార్యను వెంట తీసుకువెళ్లి చేసినవేనంటూ తిరిగి కౌంటర్ ఇచ్చాడు. అసలు తాను జట్టు తో ఉండకుండా ఆఫ్ ఫీల్డ్ రిలేషన్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొనడం తగదన్నాడు. ప్రతీ రోజు ఆట ముగిసిన తరువాత ఎలా ఆడాం?ఎలా ఆడాలి?అనే దానిపై జట్టు సభ్యులు అంతా కలిసి చర్చించుకుంటామని ఈ సందర్భంగా క్లార్క్ పేర్కొన్నాడు. యాషెస్ సిరీస్ నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఓటమి పాలై.. సిరీస్ ను 3-1 తేడాతో కోల్పోయింది. దీంతో క్లార్క్ తన టెస్టు కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. తాను యాషెస్ లో ఐదో టెస్ట్ అనంతరం టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పనున్నట్లు ప్రకటించాడు. -
'క్లార్క్ కు రిటైర్మెంట్ చిన్న విషయం'
మెల్ బోర్న్: యాషెస్ సిరీస్ కోల్పోయినంత మాత్రానా మైఖేల్ క్లార్క్ ను తక్కువగా చూడబోమని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ అన్నారు. ఈ సిరీస్ తోనే క్లార్క్ క్రీడా జీవితానికి ముగిసిపోదని పేర్కొన్నారు. మైదానంలో అతడు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ఆటతీరును భవిష్యత్ లో స్మరించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. అతడి తరంలో గొప్ప బ్యాట్స్ మెన్ గా వెలిగొందిన వారిలో క్లార్క్ ఒకడని కొనియాడారు. రోజురోజుకు రాటుదేలిన క్లార్క్ గొప్ప క్రికెటర్ గా ఎదిగాడని, కెరీర్ లో రిటైర్మెంట్ చిన్న విషయమని జేమ్స్ సదర్లాండ్ పేర్కొన్నారు. 34 క్లార్క్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు శనివారం ప్రకటించాడు. ఇంగ్లండ్ చేతిలో తమ జట్టు ఘోరంగా ఓడిపోవడంతో అతడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ సిరీస్ 8 ఇన్నింగ్స్ లో క్లార్క్ 117 పరుగులు మాత్రమే చేశాడు. -
టెస్టులకు ఆసీస్ కెప్టెన్ క్లార్క్ గుడ్ బై
నాటింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. యాషెస్ సిరీస్ తర్వాత టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు 34 ఏళ్ల క్లార్క్ ప్రకటించాడు. క్లార్క్ సుధీర్ఘకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గాయాల కారణంగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. దీనికి తోడు యాషెస్ సిరీస్ పరాజయం అతనిపై ప్రభావం చూపినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-3తో ఓడిపోయింది. శనివారం ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం క్లార్క్ రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. ఈ సిరీస్‌లో నామమాత్రమైన చివరి, ఐదో టెస్టు ఆడాల్సివుంది. క్లార్క్‌కు ఇదే చివరి టెస్టు. 2004లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన క్లార్క్ తన కెరీర్లో 114 మ్యాచ్‌లు ఆడాడు. 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 8605 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 329 (నాటౌట్). -
టెస్ట్క్రికెట్కు క్లార్క్ గుడ్‌బై!
-
ఆసీస్ పుంజుకునేనా!
♦ నేటి నుంచి యాషెస్ నాలుగో టెస్టు ♦ సిరీస్ విజయంపై ఇంగ్లండ్ గురి ♦ మ. గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం నాటింగ్‌హామ్ : యాషెస్ సిరీస్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు గురువారం నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరగనుంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుస్తుంది. మరోవైపు ఒక మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలి. ఈ సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఫలితం ఏకపక్షంగా వచ్చింది. రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధిస్తే... మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది. స్వింగ్ బౌలర్లకు సహకరించే ట్రెంట్‌బ్రిడ్జ్ పిచ్‌పై అండర్సన్ సేవలు అందుబాటులో లేకపోవడం ఇంగ్లండ్‌కు దెబ్బ. అతని స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రిటైర్ కాను: క్లార్క్ వరుసగా మూడు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే తనలో క్రికెట్ ఆడాలన్న తపన తగ్గలేదని, ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదని క్లార్క్ స్పష్టం చేశాడు. -
మళ్లీ నోరు జారిన ఆసీస్ కెప్టెన్
లండన్: ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ మరోసారి నోరు జారి అంతలోనే నాలుక్కరుచుకున్నాడు. 'సక్సెస్' అనే మాట బదులు 'సెక్స్' పదాన్ని ఉచ్చరించిన క్లార్క్ వెంటనే తప్పును సరిదిద్దుకుని బిగ్గరగా నవ్వేశాడు. విషయం ఏంటంటే.. ఇంగ్లండ్‌తో జరగనున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టు ముందు క్లార్క్ మీడియాతో మాట్లాడాడు. లార్డ్స్‌లో జరిగే ఈ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా పుంజుకోవాలన్నది క్లార్క్ అభిప్రాయం. అయితే 'నైపుణ్యం ప్రదర్శిస్తేనే.. సెక్స్' అంటూ క్లార్క్ నోరు జారాడు. వెంటనే సక్సెక్స్ సాధించగలమని సరిచేశాడు. క్లార్క్ మాటలకు అక్కడనున్నవారందరూ కాసేపు షాక్ అయినా ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ విషయం గమనించిన క్లార్క్ తనతో మరోసారి ఇబ్బంది పడ్డారంటూ వ్యాఖ్యానించాడు. ఇటీవల ప్రపంచ కప్ సందర్భంగా కూడా క్లార్క్ ఇలాగే మాట్లాడి ఆనక సరిచేసుకున్నాడు. -
నేను తండ్రికాబోతున్నానోచ్!
సిడ్నీ: ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ తండ్రి కాబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా క్లార్కే బుధవారం ట్విట్టర్లో వెల్లడించారు. యాషెస్ సిరీస్ గెలుచుకోవాలన్న పంతంతో ఉన్న ఆసీస్ సారధి.. తనకు తండ్రిగా ప్రమోషన్ వస్తున్న విషయాన్ని వెల్లడించారు. పెళ్లయిన మూడేళ్ళ తర్వాత తమ కుటుంబంలోకి తొలి పాప రాబోతోందంటూ ట్విట్ చేశాడు. భార్య కిలీతో ఉన్న ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. బుధవారం కార్డిఫ్‌లో ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై యాషెస్ సిరీస్ గెలుచుకునేందుకు ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. -
నా తర్వాత టార్గెట్ అదే: క్లార్క్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ సాధించిపెట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తదుపరి లక్ష్యంపై గురిపెట్టాడు. టెస్టుల్లో తన టీమ్ ను 'టాప్'కు తీసుకురావాలన్న పట్టుదలతో 'పప్' ఉన్నాడు. చివరి వన్డేలో చెలరేగి ఆడి జట్టుకు ప్రపంచకప్ అందించాడు క్లార్క్. మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో క్లార్క్ 74 పరుగుల చేసి వన్డే కెరీర్ కు ఘనంగా వీడ్కోలు పలికాడు. ఇప్పుడు టెస్టులపై దృష్టి పెట్టాడు. టెస్టుల్లో రెండో ర్యాంకులో ఉన్న ఆసీస్ టీమ్ ను అగ్రస్థానానికి తీసుకురావడమే తన ముందున్న టార్గెట్ అని క్లార్క్ వెల్లడించాడు. వెస్టిండీస్, ఇంగ్లండ్ తో జరగనున్న టెస్టు సిరీస్ లలో విజయం సాధిస్తామన్న దీమాను వ్యక్తం చేశాడు. వన్డేల నుంచి వైదొలగడంతో తన టెస్టు కెరీర్ పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. టెస్టు కమిట్ మెంట్ కారణంగా టి20 లీగ్ ల్లో ఆడే విషయం ఇప్పుడే చెప్పలేన్నాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ధోనితో గొంతు కలిపిన క్లార్క్
మెల్ బోర్న్: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ గళం కలిపాడు. వన్డేల్లో ప్రస్తుతమున్న 'నలుగురు ఫీల్డర్ల' నిబంధన మార్చాలన్న ధోని అభిప్రాయంతో క్లార్క్ ఏకీభవించాడు. అతడు కూడా ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు ఉంటే బాగుంటుందని, ఫలితంగా బౌలర్లకు మరింత మేలు జరుగుతుందని అన్నాడు. వన్డేలకు గుడ్ బై చెప్పిన క్లార్క్ చివరిసారిగా స్వదేశంలో ఆసీస్ జట్టుకు వరల్డ్ కప్ ఫైనల్లో నాయకత్వం వహించి టైటిల్ సాధించిపెట్టాడు. సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను ఉంచితే స్పిన్నర్లు మరింత రాణించే అవకాశముందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. 'నలుగురు ఫీల్డర్ల' నిబంధన మారిస్తే పరుగుల ప్రవాహం తగ్గుతుందని, బౌలర్లకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నాడు. ఈ నిబంధన మార్చాలని ధోని కూడా అభిప్రాయపడ్డాడు. -
మిస్ యూ ‘పప్’
మైకేల్ క్లార్క్... ఆస్ట్రేలియా క్రికెట్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. ఆటగాడిగా, నాయకుడిగా, స్నేహితుడిగా మైదానంలో, బయటా కూడా అందరి మనసులు దోచుకున్న వ్యక్తి. మైదానంలో ఈల వేసి సహచరులను సరదాగా పిలుస్తాడు... మైదానం వెలుపల కష్టమొస్తే పెద్దన్నలా అండగా నిలబడతాడు. అందుకే తను ఆటగాళ్లు మెచ్చిన కెప్టెన్ అయ్యాడు. 2011లో పాంటింగ్ రిటైర్మెంట్ తర్వాత సారథిగా బాధ్యతలు తీసుకున్న ‘పప్’... 33 ఏళ్లకే వన్డేలకు వీడ్కోలు చెపుతాడని ఆనాడు ఊహించి ఉండడు. అయితేనేం... తన కల సాకారం చేసుకుని సగర్వంగా వీడ్కోలు పలికాడు. గత రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతూ, వన్డేల్లో తమ జట్టులోనే పెరిగిన పోటీలో అడపాదడపా వెనకబడుతున్నాడనే విమర్శలను మోస్తూ... అతి కష్టమ్మీద ప్రపంచకప్ ఆడాడు. నిజానికి ఈ టోర్నీకి ముందు తను బరిలోకి దిగుతాడో లేదో తెలియని సందిగ్దం. భారత్‌తో తొలి టెస్టు తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రపంచకప్ సమయానికి కోలుకుంటానని హామీ ఇచ్చి జట్టు సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. అయినా టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే ఎలాగైనా ప్రపంచకప్ ఆడాలి, స్వదేశంలో టైటిల్ గెలవాలనే తపనతోనే చాలా వేగంగా గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగాడు. భారత్‌తో సెమీస్ ముగియగానే తాను వన్డేలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. తన శరీరం అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సహకరించడం లేదని, టెస్టుల్లో ఎక్కువ కాలం ఆడాలనే కోరికతో వన్డేల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. దీంతో ఫైనల్‌కు ముందే సహచరుల్లో పట్టుదల పెంచాడు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా తన కెప్టెన్సీ ముద్రను స్పష్టంగా చూపించాడు. ప్రతి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌కు ఎలాంటి ఫీల్డింగ్ ఉండాలో సిద్ధమై వచ్చాడు. అలాగే తన వనరులను అత్యంత సమర్థంగా వాడుకుని తానెందుకు అద్భుతమైన కెప్టెనో మరోసారి నిరూపించాడు. -సాక్షి క్రీడా విభాగం -
ఫైనల్ తర్వాత వన్డేలకు గుడ్ బై : క్లార్క్
మెల్బోర్న్: న్యూజిలాండ్ తో ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వన్డేల నుంచి రిటైర్ అవ్వనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రకటించారు. 21 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో స్థానం పొంది గత 12 ఏళ్లలో తన బ్యాటింగ్‌తో ఎన్నో సందర్భాల్లో ఆసిస్‌ని విజయతీరాలకు చేర్చాడు. 'నారిటైర్మెంట్ ప్రకటనకు ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. రెండు రోజులు కింది ఈ నిర్ణయం తీసుకున్నాను. వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడలేనని నాకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను' అని33 ఏళ్ల క్లార్క్ చెప్పారు. క్లార్క్ 244 వన్డే మ్యాచ్‌లు ఆడి 7,907 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 130 పరుగులు చేశాడు. అయితే టెస్ట్ మ్యాచ్‌లలో కొనసాగనున్నట్లు చెప్పారు. టెస్టుల్లో 108 మ్యాచ్‌లు ఆడి 8,432 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధికంగా 329 పరుగులు చేశాడు. -
సెమీస్‌లో టాస్ కీలకం!
సిడ్నీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్ సమరం కోసం భారత్, ఆస్ట్రేలియా కఠిన సాధన చేశాయి. రెండు జట్లు వ్యూహాలు రచించాయి. గురువారం జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిడ్నీలో రెండ్రోజులగా వర్షం పడుతోంది. మంగళవారం వర్షం కారణంగా ఎస్సీజీ పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. కాగా గురువారం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే పరిస్థితులు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. పిచ్, వాతావరణ పరిస్థితులు దృష్ట్యా టాస్ కీలక పాత్ర పోషిస్తుందని చాలా మంది క్రీడా పండితులు భావిస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. టాస్ గెలిచిన జట్టును బ్యాటింగ్ ఎంచుకోవడం మంచిదని వాన్ సూచించాడు. -
టీమిండియావైపే సిడ్నీ పిచ్ మొగ్గు!
సిడ్నీ: క్రికెట్ ప్రపంచం చూపంతా సిడ్నీవైపే. ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ విజేత ఎవరు? డిఫెండింగ్ చాంపియన్ టీమిండియానా? ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియానా? ఏ ఇద్దరు క్రికెట్ అభిమానులు కలిసినా ఇదే చర్చ. గురువారం జరిగే ఈ బిగ్ ఫైట్ కోసం భారత్, ఆసీస్ సన్నద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో పిచ్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ పిచ్ ఆస్ట్రేలియా కంటే టీమిండియాకు ఎక్కువగా అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. సిడ్నీ వికెట్ పేస్ కంటే స్పిన్‌కు బాగా సహకరించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే కంగరూలకు కష్టాలు తప్పవు. ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా.. టీమిండియాకు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. ఆసీస్ జట్టులో ఈ స్థాయి స్పిన్నర్లు లేరు. ఇరు జట్లకు ఇదే ప్రధానమైన తేడా. సెమీస్‌లో అశ్విన్, జడేజా బౌలింగ్ కీలకంకానుంది. సిడ్నీ పిచ్ గతంలో కూడా స్పిన్‌కు సహకరించిన సందర్భాలున్నాయి. ఈ వేదికపై భారత బ్యాట్స్‌మెన్ రాణించారు. ఈ నేపథ్యంలో అశ్విన్, జడేజా బంతికి పనిచెబితే ఆసీస్ కంగారెత్తిపోవడం ఖాయం. ప్రపంచ కప్‌లో 12 వికెట్లు తీసిన అశ్విన్‌పై భారీ అంచనాలున్నాయి. జడేజాతో కలసి అశ్విన్ కంగారూలను కట్టడి చేస్తారని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు. ఈ వేదికపై దక్షిణాఫ్రికా, శ్రీలంకల మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో వాడిన పిచ్‌నే ఉపయోగించనున్నారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్, డుమినీ కీలక పాత్ర పోషించారు. ఇమ్రాన్ నాలుగు, డుమినీ మూడు వికెట్లు పడగొట్టారు. ప్రపంచ కప్‌లో భారత్ క్వార్టర్స్‌తో పాటు ఆరు లీగ్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు ఏడూ మ్యాచ్‌ల్లోనూ ఆలౌట్ చేసి మొత్తం 70కి 70 వికెట్లు పడగొట్టారు. భారత స్పిన్నర్లు రాణిస్తే సిడ్నీలోనూ ఆలౌట్ చేసే అవకాశాలున్నాయి. -
క్లార్క్ కు అగ్ని పరీక్ష!
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అసలు సిసలు పరీక్ష ఎదుర్కొబోతున్నాడు. ప్రపంచకప్ నాకౌట్ పోరులో కెప్టెన్ గా తొలిసారి లిట్మస్ టెస్ట్ పేస్ చేయబోతున్నాడు. 2011 వరల్డ్ కప్ లో ఇండియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో క్లార్క్ ఆడాడు. అయితే అప్పుడు అతడు కెప్టెన్ కాదు. అహ్మదాబాద్ లో జరిగిన ఆ మ్యాచ్ లో ఆసీస్ ఓడిపోడంతో అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తాజా ప్రపంచకప్ లో జరగనున్న రెండో సెమీఫైనల్లో టీమిండియాతో క్లార్క్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఓడితే క్లార్క్ భవితవ్యం ప్రమాదం పడే అవకాశముంది. మరోవైపు యువ ఆటగాడు స్టీవ్ స్మిత్ నుంచి క్లార్క్ గట్టిపోటీ ఎదుర్కొంటున్నాడు. గాయంతో క్లార్క్ జట్టుకు దూరమైనప్పుడు కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన స్మిత్ ఊహించిన దానికంటే ఎక్కువగా రాణించి మన్ననలు అందుకున్నాడు. క్లార్క్ విఫలమైతే నాయకత్వ బాధ్యతలు స్మిత్ కు అప్పగించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు. మిగతా ఆటగాళ్ల సంగతి ఎలా ఉన్నా గురువారం ధోని సేనతో జరిగే మ్యాచ్ క్లార్క్ కెప్టెన్సీకి అగ్నిపరీక్ష లాంటిదేనని చెప్పక తప్పదు. -
క్లార్క్, స్మిత్ వెనువెంటనే ఔట్
సిడ్నీ: ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం గ్రూపు-ఏలో శ్రీలంక తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖలే క్లార్క్, స్టీవెన్ స్మిత్ ఇద్దరూ అర్ధ సెంచరీల అనంతరం స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నంలో ఔటయ్యారు. జట్టు స్కోరు 175 వద్ద క్లార్క్ (68) అవుటవగా, ఆ వెంటనే 177 వద్ద భారీ షాట్ కు ప్రయత్నించిన స్టీవెన్ స్మిత్ (72) దిల్షాన్ బౌలింగ్ లో పెరీరాకు క్యాచ్ ఇచ్చి అవుడయ్యాడు. ఓ దశలో జట్టు స్కోరు 41/2 ఉండగా క్రీజులోకొచ్చిన క్లార్క్, స్మిత్ తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇన్నింగ్స్ ను స్మిత్ తో కలిసి క్లార్క్ మరమ్మతు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 119 బంతుల్లో 100 పరుగులు జోడించారు. 36 ఓవర్లలో 204/4 స్కోరుతో ఆసీస్ బ్యాటింగ్ ను కొనసాగిస్తుంది. -
క్లార్క్, స్మిత్ వెనువెంటనే ఔట్
సిడ్నీ: ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం గ్రూపు-ఏలో శ్రీలంక తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖలే క్లార్క్, స్టీవెన్ స్మిత్ ఇద్దరూ అర్ధ సెంచరీల అనంతరం స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నంలో ఔటయ్యారు. జట్టు స్కోరు 175 వద్ద క్లార్క్ (68) అవుటవగా, ఆ వెంటనే 177 వద్ద భారీ షాట్ కు ప్రయత్నించిన స్టీవెన్ స్మిత్ (72) దిల్షాన్ బౌలింగ్ లో పెరీరాకు క్యాచ్ ఇచ్చి అవుడయ్యాడు. ఓ దశలో జట్టు స్కోరు 41/2 ఉండగా క్రీజులోకొచ్చిన క్లార్క్, స్మిత్ తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇన్నింగ్స్ ను స్మిత్ తో కలిసి క్లార్క్ మరమ్మతు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 119 బంతుల్లో 100 పరుగులు జోడించారు. 36 ఓవర్లలో 204/4 స్కోరుతో ఆసీస్ బ్యాటింగ్ ను కొనసాగిస్తుంది. -
క్లార్క్ పునరాగమనానికి వాయు'గండం'
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ పునరాగమనానికి ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారనుంది. ప్రస్తుతం జరుగుతున్న 11వ ప్రపంచకప్ లో ఆడేందుకు క్లార్క్ సిద్ధమయ్యాడు. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో శనివారం బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా తలపడనుంది. గాయం నుంచి కోలుకున్న క్లార్క్ ఈ మ్యాచ్ తో వరల్డ్ కప్ బరిలోకి దిగాలని భావించాడు. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే అవకాశముంది. వాయుగుండం కారణంగా ఇక్కడ 30 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం 80 శాతముందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణంతో క్లార్క్ పునరాగమనంపై ప్రతిష్టంభన నెలకొంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకుంటే ఈనెల 28న న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచ్ వరకు క్లార్క్ వేచిచూడాల్సి వుంటుంది. -
'టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు'
సిడ్నీ: వచ్చే ప్రపంచకప్ లో టీమిండియాను తక్కు వ అంచనా వేయొద్దని ఆసీస్ మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ హెచ్చరించాడు. ఈ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆసీస్ 2-0 తేడాతో గెలిచినా.. టీమిండియా ఆటను తక్కువగా చూడొద్దని ఆసీస్ కు స్పష్టం చేశాడు. త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్ లో టీమిండియా రాణించే అవకాశం ఉందన్నాడు.టీమిండియా రెండు నెలలపాటు ఆస్ట్రేలియాలో ఉన్న సంగతిని హస్సీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ లోని పిచ్ లను భారత్ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్ట్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆటపై ఒక అభిప్రాయానికి రావొద్దని ఆసీస్ కు సూచించాడు. డిఫెండింగ్ చాంఫియన్ షిప్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా అంచనాలు మించి రాణించే అవకాశం లేకపోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
'క్లార్క్ కు కోలుకోవడానికి ఎక్కువ సమయం కావాలి'
సిడ్నీ: ఆసీస్ ఆటగాడు మైకేల్ క్లార్క్ గాయం నుంచి తిరిగి కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం కావాలిని మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ అభిప్రాయపడ్డాడు. క్లార్క్ కు మరో రెండు నుంచి మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని హస్సీ ఈ సందర్భంగా తెలిపాడు. ప్రపంచకప్ ఆరంభంలో పెద్దగా అద్బుతాలు ఏమీ ఉండవని.. అసలైన పోటీ క్వార్టర్ ఫైనల్ మరియు సెమీ ఫైనల్లోనే ఉంటుందని స్పష్టం చేశాడు. ఆసీస్ క్రికెటర్లు మరింత మంచి క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు హస్సీ తెలిపాడు.' క్లార్క్ కచ్చితంగా కీలక ఆటగాడు. కెప్టెన్ కూడా. ఆసీస్ కు అతని అవసరం చాలా ఉంది. అందువల్ల క్లార్క్ ఎక్కువ సమయం విశ్రాంతి కల్పిస్తే ప్రధాన మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తాడు' అని హస్సీ తెలిపాడు. తొలి నాలుగు మ్యాచ్ లకు అందుబాటులోకి రాకపోయినా పెద్దగా ఇబ్బందేమీ లేదన్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్ కు ఎంపికైన క్లార్క్ ఫిబ్రవరి 21 లోపు తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాలి. 15 మందితో కూడిన జట్టు సభ్యుల జాబితాను ఆదివారం ప్రకటించారు. అదే నెల 14న వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అదే రోజు తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా ఆడుతుంది. ప్రస్తుతం క్లార్క్ ఫిట్ నెస్ ఆసీస్ డైలామాలో పడింది. ఒకవేళ క్లార్క్ ఫిట్ నెస్ ను నిరూపించుకోకపోతే ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరం కావాల్సి వస్తుంది. టీమిండియాతో డిసెంబర్ 9 వ తేదీన జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో క్లార్క్ గాయం తిరగబెట్టడంతో టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిన సంగతి తెలిసిందే. -
టీమిండియాకు కెప్టెన్సీ కష్టతరమైనది: క్లార్క్
సిడ్నీ: టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్నిభర్తీ చేయడం చాలా కష్టతరమైనదని ఆసీస్ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ క్రికెట్ నుంచి ధోనీ వైదొలగడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. శనివారం హెరాల్డ్ సన్ కు రాసిన కాలమ్ లో క్లార్క్ పై విధంగా స్పందించాడు. అంతర్జాతీయ ఆటల్లో ఉండే చాలా ఉద్యోగాలు కంటే టీమిండియాకు కెప్టెన్సీ చేయడం చాలా క్లిష్టమైనదిగా పేర్కొన్నాడు ఒక ప్రక్క మూడు ఫార్మెట్లలో కెప్టెన్ గా ఉంటూ.. వికెట్ల వెనుక తన బాధ్యతను ధోనీ అత్యంత సమర్ధవంతంగా నిర్వర్తించాడని క్లార్క్ కొనియాడాడు.ఆ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని తన మనుసులో మాటను బయటపెట్టాడు. గత కొంతకాలంగా ధోనీతో తన సంబంధాలు బాగున్నాయన్నాడు. ప్రత్యేకంగా ధోనీని మోటార్ బైక్స్ గురించి అడిగి తెలుసుకోనేవాడినని క్లార్క్ తెలిపాడు. -
ప్రపంచకప్‌తొలి మ్యాచ్‌కు మైకేల్ క్లార్క్ దూరం!
మెల్బోర్న్: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్‌కు మరో షాక్ తగిలింది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచకప్‌లో తొలి వన్డేకు అతను దూరం కానున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే ధ్రువీకరించాడు. ‘మొదటి మ్యాచ్‌లోగా నేను 100 శాతం ఫిట్‌గా ఉండలేనేమో. అయితే ప్రపంచకప్‌లో ఇతర మ్యాచ్‌లకు నేను అందుబాటులో ఉండగలను’ అని క్లార్క్ చెప్పాడు. ప్రపంచకప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరుగుతుంది. -
వచ్చే ప్రపంచకప్ కు అందుబాటులో ఉంటా:క్లార్క్
మెల్ బోర్న్: వచ్చే ప్రపంచకప్ కు తాను అందుబాటులో ఉంటానని ఆసీస్ క్రికెటర్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. టీమిండియాతో జరిగిన తొలి టెస్ట్ లో అతని గాయం మళ్లీ తిరగబెట్టడంతో సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్లార్క్ భవితవ్యంపై పలు అనుమానాలు తలెత్తడంతో తాజాగా అతను స్పందించాడు. 'నేను వచ్చే సంవత్సరం జరిగే మ్యాచ్ లకు అందుబాటులో ఉంటా. ప్రపంచకప్ లో కూడా ఆడతా' అని ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో వంద శాతం ఫిట్ నెస్ గా లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆసీస్ సెలెక్టర్లు ప్రపంచకప్ ఆటగాళ్ల జాబితాలో తనకు అవకాశం కల్పిస్తారని క్లార్క్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
ఆసీస్ టెస్ట్ కెప్టెన్ గా స్మిత్!
బ్రిస్బేన్:టీమిండియాతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ కు ఆస్ట్రేలియా కెప్టెన్ గా స్టీవ్ స్మిత్(25) బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ గా మైకేల్ క్లార్క్ కు గాయం మళ్లీ తిరగబెట్టడంతో స్మిత్ రెండో టెస్ట్ కు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఒకవేళ టీమిండియాతో మిగతా మ్యాచ్ లకు కూడా క్లార్క్ అందుబాటులోకి రాకపోతే స్మిత్ కెప్టెన్ గా కొనసాగుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ప్రస్తుతం ఆసీస్ టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న స్మిత్.. అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 162 పరుగులు చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా నియమితులైన స్మిత్ 45వ ఆసీస్ కెప్టెన్. -
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా; రోజర్స్ ఔట్
-
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్, వార్నర్ అర్థ సెంచరీ
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ కోనసాగుతోంది. తొలుత బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. 18 ఓవర్లు ముగిసేసరికి 58 బంతుల్లో 10 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. వార్నర్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 33 బంతుల్లో 3 ఫోర్లుతో 14 పరుగులు చేసిన వాట్సన్ ఆరోన్ బౌలింగ్ లో దావన్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ బాటపట్టాడు. -
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా; రోజర్స్ ఔట్
అడిలైడ్: 50 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో తొలుత ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, రోజర్స్ శుభారంభం చేశారు. ఓపెనర్ డెవిడ్ వార్నర్ భాగస్వామ్యంతో బరిలోకి దిగిన రోజర్స్ 22 బంతుల్లో 4 ఫోర్లు కొట్టి 9 పరుగులు చేశాడు. భారత్ బౌలర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ధావన్ క్యాచ్ పట్టడంతో ఔటైయ్యాడు. ప్రస్తుతం డెవిడ్ వార్నర్, వాట్సన్ క్రీజులో ఉన్నారు. -
తొలి టెస్ట్ సిరీస్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్ ఫిట్ అని తేలడంతో.. భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగించారు. గాయం నుంచి కోలుకున్నా మరింత విశ్రాంతి కావాలని ధోని భావించడంతో అడిలైడ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో కోహ్లికి మార్గం సుగమమైంది. టెస్టుల్లో తొలిసారి ఈ స్టార్ క్రికెటర్ భారత్‌కు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ కోలుకుని తొలి టెస్టులో ఆడుతున్నాడు. ఆస్ర్టేలియా ఓపెనర్లు రోజర్స్, వార్నర్ శుభారంభం చేశారు. -
షాన్ మార్ష్‌కు చోటు
తొలి టెస్టుకు ఆసీస్ జట్టు అడిలైడ్: కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఫిట్నె స్ ఇంకా సందేహంగానే ఉన్న నేపథ్యంలో భారత్‌తో జరిగే తొలి టెస్టుకు షాన్ మార్ష్‌ను ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకున్నారు. ఈనెల 9 నుంచి అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. అదనపు బ్యాట్స్‌మన్‌గా మార్ష్‌ను తీసుకోవాల్సిందిగా జాతీయ సెలక్షన్ ప్యానెల్ సూచించిందని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఇప్పటికే 13 మందితో కూడిన జట్టులో షాన్ సోదరుడు మిచెల్ మార్ష్ కూడా ఉన్నాడు. 2002 అక్టోబర్‌లో వా సోదరులు కలిసి చివరిసారిగా టెస్టు ఆడారు. ఆ తర్వాత జట్టులో స్థానం దక్కించుకుంది మార్ష్ సోదరులు కావడం విశేషం. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న క్లార్క్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయంలో ఇంకా స్పష్టత లేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ హ్యూస్ మరణానంతరం అతడు చికిత్స తీసుకోలేదు. మరోవైపు హ్యూస్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆసీస్ జట్టు గురువారం అడిలైడ్‌కు చేరుకుంది. ఆసీస్ జట్టు: క్లార్క్ (కెప్టెన్), హాడిన్, హ్యారిస్, హాజెల్‌వుడ్, జాన్సన్, లియోన్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, రోజర్స్, సిడిల్, స్మిత్, వార్నర్, వాట్సన్. హ్యూస్ గౌరవార్థంగా టెస్టు ఆడాలి: లీమన్ ఫిలిప్ హ్యూస్ స్మృతులు వెంటాడుతుండగానే టెస్టు మ్యాచ్ ఆడాల్సి రావడం కాస్త కష్టమేనని ఆసీస్ జట్టు కోచ్ డారెన్ లీమన్ అంగీకరించారు. అయితే అడిలైడ్ మ్యాచ్‌ను అతడి గౌరవార్థంగా భావించాలని తమ ఆటగాళ్లకు సూచించారు. -
ఆసీస్ టెస్టు జట్టులో షాన్ మార్ష్
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా టెస్టు జాబితాలో లెఫ్ట్ హ్యాండెడ్ ఆటగాడు షాన్ మార్ష్ కు స్థానం దక్కింది. టీమిండియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా తొలి టెస్టుకు తిరిగి షాన్ మార్ష్ కు స్థానం కల్పిస్తూ సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) నిర్ణయం తీసుకుంది. మైకేల్ క్లార్క్ ఫిట్ నెస్ పై ఇంకా స్పష్టత రాకపోవడంతో అదనపు ఆటగాడిగా మార్ష్ ను ఎంపిక చేసినట్లు సెలెక్షన్ ప్యానెల్ తెలిపింది. ఈ నెల 9 వ తేదీ నుంచి అడిలైడ్ లో జరిగే తొలిటెస్టుకు సంబంధించి గురు, శుక్రవారాల్లో ఆస్ట్రేలియా టెస్ట్ స్వ్కాడ్ సమావేశమయ్యే అవకాశం ఉంది. -
'నీ గురించి మాట్లాడేందుకు గర్వపడుతున్నా'
మాక్స్‌విలేలో హ్యూస్ అంత్యక్రియల కార్యక్రమంలో అందరికంటే ముందుగా దేశం తరఫున, కుటుంబం తరఫున ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రసంగించాడు. పంటి బిగువన కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేసినా... మధ్యలో తట్టుకోలేక ఏడుస్తూ క్లార్క్ చేసిన ప్రసంగం సంక్షిప్తంగా... 'హ్యూస్... నీ గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నా. నిన్ను చూసి మాక్స్‌విలే గర్విస్తోంది. చిన్న వయసులో ఆటకు, కుటుంబానికి దూరమైనందుకు బాధగా ఉంది. అయితే ఆటపై నీవు వేసిన ముద్ర ఎప్పటికీ చెదిరిపోదు. గత గురువారం రాత్రి సిడ్నీ మైదానంలో నడుచుకుంటూ వెళ్తుంటే అదే పచ్చిక నా పాదాలను తాకింది. గతంలో నీవు, నేను, మన సహచరులు ఎంతో మంది ఇక్కడ భాగస్వామ్యాలను నెలకొల్పాం. మన కలలను సాకారం చేసుకున్నాం. నీవు పడిపోయిన ప్రదేశంలో మోకాళ్లపై వంగి పచ్చికను తాకా. ప్రమాణం చేసి చెబుతున్నా.. నీవు మాతోనే ఉన్నావనే అనుభూతి కలిగింది. నేను ఆడిన చెత్త షాట్ గురించి మాట్లాడటం, రాత్రి పూట చూసిన సినిమాల గురించి చర్చించడం, అప్పుడప్పుడు నీ ఆవుల గురించి కొన్ని పనికి రాని నిజాలు నాతో పంచుకోవడం.. వీటిని ఎన్నటికీ మర్చిపోలేను. ఈ మైదానం నాకెప్పటికీ ఓ పవిత్ర భూమిగానే ఉంటుంది. ఇక్కడ నీ ఉనికిని నేను ఆస్వాదిస్తా. క్రికెట్‌ను అభిమానించే ప్రతి ఒక్కరు హ్యూస్కు నివాళులు అర్పిస్తూనే ఉంటారు. ఫొటోలు, మాటలు, ప్రార్థనలు, చర్చల ద్వారా ప్రపంచం మొత్తం స్ఫూర్తిని చాటింది. కరాచీలో ఓ బాలిక క్యాండిల్‌తో నివాళి అర్పిస్తే, ఆటకే మాస్టర్లు అయిన సచిన్, వార్న్, లారా ప్రపంచానికి తమ శోకాన్ని చూపించారు. ఈ క్రికెట్ స్ఫూర్తి మా అందర్ని కట్టిపడేసింది. క్రికెట్ బంధం ప్రపంచం మొత్తం తమ బ్యాట్లను బయటపెట్టి నివాళులు అర్పించేలా చేసింది. అందుకే ప్రపంచంలో క్రికెట్ గొప్ప ఆటగా మారిపోయింది. నా తమ్ముడి ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నా. ఆటలో నిన్ను ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటాం' -
అబాట్‌ను ఎవరూ నిందించలేదు: క్లార్క్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అబాట్‌కు ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ పూర్తి మద్దతు ప్రకటించాడు. ఫిలిప్ హ్యూస్ విషాద మరణం ఘటనలో అబాట్‌ను ఎవరూ నిందించడం లేదని, అందులో అతని తప్పు లేనేలేదని క్లార్క్ అన్నాడు. ఆసీస్ క్రికెట్ జట్టు అబాట్‌కు అండగా ఉంటుందని చెప్పాడు. దేశవాళీ మ్యాచ్‌లో అబాట్ వేసిన బౌన్సర్ తలకు తగిలి యువ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో షాక్‌కు గురైన అబాట్‌కు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. హ్యూస్ సోదరి కూడా అబాట్‌ను కలసి ఓదార్చారు. -
బిస్బేన్ టెస్టునుంచి క్లార్క్ అవుట్!
అడిలైడ్: భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్ దగ్గర పడుతున్నా ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆడేది లేనిది ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం క్లార్క్ బ్రిస్బేన్ టెస్టుకు దూరం కావడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. వచ్చే నెల 4నుంచి జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు క్లార్క్ కనీసం రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాలని భావించాడు. అయితే తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగని అతను బుధవారంలోగా ఫిట్నెస్ నిరూపించుకునే అవకాశం లేదు. కాబట్టి బ్రిస్బేన్ టెస్టులో ఆడకపోవచ్చు. మొదటి టెస్టు కోసం జట్టులో క్లార్క్‌కు సెలక్టర్లు స్థానం కల్పించినా...ఫిట్నెస్ నిరూపించుకోవాలనే షరతు పెట్టారు. ‘ఇన్నేళ్ల నా కెరీర్లో 100 శాతం ఫిట్‌గా లేకుండా నేనెప్పుడు మైదానంలోకి దిగలేదు’ అని క్లార్క్ చెప్పడం కూడా అతని గైర్హాజరీకి సంకేతంగా కనిపిస్తోంది. -
క్లార్క్‌కు చోటు
తొలి టెస్టుకు ఆసీస్ జట్టు ప్రకటన అడిలైడ్: భారత్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా సెలక్టర్లు 12 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా మైకేల్ క్లార్క్‌కు ఇందులో అవకాశం కల్పించారు.అయితే బుధవారం లోగా అతను ఫిట్నెస్ నిరూపించుకుంటేనే జట్టులో స్థానం ఖరారవుతుంది. షేన్ వాట్సన్, ర్యాన్ హారిస్‌లకు కూడా టీమ్‌లో చోటు లభించింది. మోకాలి ఆపరేషన్ తర్వాత హారిస్ మళ్లీ టీమ్‌లోకి వస్తుండగా... యువ పేసర్ జోష్ హాజల్‌వుడ్‌కు తొలిసారి అవకాశం కల్పించారు. మరో వైపు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్‌లు జట్టులో స్థానం కోల్పోయారు. వచ్చే నెల 4నుంచి బ్రిస్బేన్‌లో మొదటి టెస్టు జరుగుతుంది. జట్టు వివరాలు: మైకేల్ క్లార్క్ (కెప్టెన్), వార్నర్, రోజర్స్, వాట్సన్, స్మిత్, హాడిన్, మిచెల్ మార్ష్, హారిస్, హాజల్‌వుడ్, జాన్సన్, లియోన్, సిడిల్. -
స్టీవెన్ స్మిత్ కు ఆస్టేలియా క్రికెట్ పగ్గాలు?
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ మొదటి టెస్టులో మైఖేల్ క్లార్క్ ఆడడం అనుమానంగా మారడంతో ఆస్ట్రేలియా జట్టుకు యువ ఆటగాడు స్టీవెన్ స్మిత్ నాయకత్వం వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ క్లార్క్ ఆడకపోతే వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ ఛాన్సు దక్కుతుందని భావించినప్పటికీ అనూహ్యంగా స్మిత్ పేరు తెరపైకి వచ్చింది. క్లార్క్ వారసుడిగా స్మిత్ పనికొస్తాడో, లేదో తేల్చడానికి ఇదే సరైన సమయమని మాజీ క్రికెటర్లు అంటున్నారు. భారత్ తో జరగనున్న మొదటి టెస్టుకు క్లార్క్ దూరమైతే స్మిత్ కు జట్టు పగ్గాలు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు మాజీ కెప్టెన్ కిమ్ హగీస్ సూచించారు. ఆసీస్ క్రికెట్ దిగ్గజం మెక్ గ్రాత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి టెస్టు డిసెంబర్ 4న బ్రిస్బేన్ లో ప్రారంభంకానుంది. -
తొలి టెస్టుకు క్లార్క్ సిద్ధం!
మెల్బోర్న్: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ వేగంగా కోలుకుంటున్నాడు. తాజా వైద్య నివేదికల ప్రకారం అతనికి శస్త్రచికిత్స అవసరం లేదని తేలింది. దాంతో భారత్‌తో వచ్చే నెల 4న బ్రిస్బేన్‌లో ఆరంభం కానున్న తొలి టెస్టు సమయానికి సిద్ధం కావాలని అతను భావిస్తున్నాడు. ప్రస్తుతం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న క్లార్క్ గాయం తీవ్రత తగ్గిందని తెలిసింది. -
మళ్లీ ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కు గాయం
పెర్త్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్టేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ గాయపడ్డాడు. గత కొన్ని నెలలుగా గాయం కారణంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న క్లార్క్ మరోసారి గాయపడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం దక్షిణాఫ్రికా-ఆసీస్ ల మధ్య అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్లార్క్ ఎడమ తొడకండరాలు పట్టేసినట్లు క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో క్లార్క్ మిగతా మ్యాచ్ ల్లో పాల్గొనేది అనుమానంగా మారింది. శనివారం నాటి స్కానింగ్ రిపోర్ట్ వచ్చిన తరువాత గానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్ పీటర్ బ్రుక్నర్ తెలిపాడు. నేటి మ్యాచ్ లో క్లార్క్ 20 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. -
సరైన జట్టును ఎంపిక చేస్తే గెలుపు మాదే: వార్న్
సిడ్నీ: వచ్చే ప్రపంచ కప్ క్రికెట్ ఛాంపియన్ షిప్ టోర్నిలో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలుస్తుందని స్పిన్ మాంత్రికుడు, మాజీ క్రికెటర్ షేన్ వార్న్ జోస్యం చెప్పారు. ప్రస్తుత బ్యాటింగ్ తీరు ఆందోళన కలిగిస్తోందని ఓ ప్రశ్నకు సమాధానిమిచ్చారు. సరియైన జట్టును ఎంపిక చేస్తే.. ప్రపంచకప్ ను గెలుచుకోవడానికి అవసరమైన అద్బుతమైన ఆటగాళ్లు ఆసీస్ లో ఉన్నారని వార్న్ అన్నారు. ప్రస్తుతం కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఫామ్ లో లేరని, త్వరలోనే మునపటి ఫామ్ లోకి క్లార్క్ వచ్చి పరుగులు వరదను పారిస్తారని షేన్ వార్న్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
వరల్డ్ కప్ పైనే.. ర్యాంకింగ్స్ పై కాదు!
మెల్ బోర్న్:వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియా ఫస్ట్ ర్యాంక్ లో కొనసాగుతున్నా.. ఆ ర్యాంకింగ్స్ కు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తమ లక్ష్యం వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవడంపైనే ఉందని, ర్యాంకులపై కాదన్నాడు. త్వరలో జరగబోయే వరల్డ్ కప్ ను గెలిస్తే అది అన్నింటికీ పరిష్కారం చూపుతుందన్నాడు.'వన్డే ర్యాంకింగ్ లో ఆస్ట్రేలియా తరువాత దక్షిణాఫ్రికా, టీమిండియాలు ఉన్నాయి. వచ్చే వారం దక్షిణాఫ్రికా-జింబాబ్వేల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా జట్టు వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నా.. వరల్డ్ కప్ ను కూడా గెలిచి నిరూపించుకోవాలన్నాడు. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఒక్క వరల్డ్ కప్ ను గెలుచుకోలేదన్న విషయాన్ని క్లార్క్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆస్టేలియా-న్యూజిలాండ్ లు సంయుక్తంగా నిర్వహించే వరల్డ్ కప్ పైనే దృష్టి సారించమన్నాడు. మరో ఆరు నెలల్లో ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుందని.. అప్పుడే నంబర్ వన్ ఎవరో తెలుస్తుందని క్లార్క్ తెలిపాడు. -
క్లార్క్ వద్దకు చేరిన ‘గద’
దుబాయ్: టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించిన జట్టుకు ఐసీసీ ఇచ్చే ‘గద’ ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ వద్దకు చేరింది. బుధవారం బ్రిస్బేన్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న అతను ఈ గదను అందుకున్నాడు. 2009 తర్వాత ఆసీస్‌కు ఈ పురస్కారం దక్కడం ఇదే తొలిసారి. మే నెల ఒకటో తేదీ నాటికి టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న జట్టుకు ఈ గదను అందజేస్తారు. ప్రస్తుతం ఆసీస్, దక్షిణాఫ్రికా 123 రేటింగ్ పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నా... దశాంశమానం తేడాతో కంగారుల జట్టుకు టాప్ ర్యాంక్ దక్కింది. ఆసీస్ గడ్డపైకి గద తిరిగి రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నామని క్లార్క్ అన్నాడు. -
క్లార్క్ అజేయ సెంచరీ
కేప్‌టౌన్: కెప్టెన్ మైకేల్ క్లార్క్ (301 బంతుల్లో 161 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ సెంచరీ నమోదు చేయడంతో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 331/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్... వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 7 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది. తొడ కండరాల గాయంతో తొలిరోజు అర్ధంతరంగా మైదానం వీడిన దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ స్టెయిన్ ఆదివారం కూడా బౌలింగ్‌కు దిగకపోవడంతో ఈ అవకాశాన్ని ఆసీస్ చక్కగా సొమ్ము చేసుకుంది. అర్ధసెంచరీ సాధించిన స్టీవెన్ స్మిత్ (84; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి నాలుగో వికెట్‌కు క్లార్క్ 184 పరుగులు జోడించాడు. ఎల్గర్ బౌలింగ్‌లో స్మిత్ ఔటయ్యాక వాట్సన్ (40) దూకుడుగా ఆడగా, డుమిని (4/73) వరుసగా మూడు వికెట్లు పడగొట్టాడు. టీ విరామం తరువాత వర్షం ప్రారంభమై ఎంతకీ తగ్గకపోవడంతో ఆ తరువాత ఆట సాధ్యం కాలేదు. -
ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా పుజారా
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌ను వరించింది. దీంతోపాటు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా క్లార్క్కే దక్కింది. ఇక టీమిండియాలో సంచలనాలు సృష్టిస్తున్న ఛటేశ్వర్ పుజారాను ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఐసీసీ ప్రకటించింది. దాదాపు ఏడాది క్రితమే పూజా పాబ్రీతో పుజారాకు ఎంగేజ్మెంట్ అయ్యిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీలంకకు చెందిన కుమార సంగక్కరను ఐసీసీ ఓడీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లకు మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది. ఇది ఈసారి గిల్లీకి రావడం గమనార్హం. -
క్లార్క్, హాడిన్ సెంచరీలు
అడిలైడ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. కెప్టెన్ క్లార్క్ (245 బంతుల్లో 148; 17 ఫోర్లు), హాడిన్ (177 బంతుల్లో 118; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో శుక్రవారం రెండో రోజు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను 158 ఓవర్లలో 9 వికెట్లకు 570 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హారిస్ (55 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. కార్‌బెరీ (20 బ్యాటింగ్), రూట్ (9) క్రీజులో ఉన్నారు. కుక్ (3)ను జాన్సన్ దెబ్బతీశాడు. అంతకుముందు 273/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన క్లార్క్, హాడిన్‌లు నిలకడగా ఆడారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. క్లార్క్ భారీ షాట్లు ఆడకపోయినా.. హాడిన్ మాత్రం స్పిన్నర్ల బౌలింగ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షార్ట్ లెగ్‌లో బెల్ క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న క్లార్క్... క్రమంగా కెరీర్లో 26వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు స్టోక్ బౌలింగ్‌లో అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఆరో వికెట్‌కు నెలకొన్న 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జాన్సన్ (5), సిడిల్ (2) వెంటవెంటనే అవుటైనా... హారిస్ సమయోచితంగా ఆడాడు. హాడిన్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాడిన్ 4వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత వచ్చిన లియోన్ (17 నాటౌట్) నెమ్మదిగా ఆడుతూ పదో వికెట్‌కు హారిస్‌తో కలిసి అజేయంగా 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్రాడ్ 3, స్వాన్, స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ ఇన్నింగ్స్‌లో కొట్టిన 12 సిక్సర్లు యాషెస్‌లో ఆసీస్ తరఫున రికార్డు. 2005 ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై 10 సిక్సర్లు కొట్టారు. మండేలాకు నివాళి: శుక్రవారం తెల్లవారుజామున మరణించిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు ఇరుజట్లు నివాళులు అర్పించాయి. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించి నల్ల బ్యాండ్లను ధరించి బరిలోకి దిగారు. -
భారత్‌తో సిరీస్‌కు క్లార్క్ దూరం
మెల్బోర్న్: వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ భారత పర్యటననుంచి తప్పుకున్నాడు. కొంత కాలంగా గాయంతో బాధ పడుతున్న క్లార్క్ ఈ టూర్‌కు రావడం మొదటినుంచీ అనుమానంగానే ఉంది. అతని ఫిట్నెస్ను బట్టే తుది నిర్ణయం తీసుకుంటామని గతంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇప్పుడు ఆసీస్ సెలక్టర్లు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. క్లార్క్ స్థానంలో వన్డే జట్టులో కాలమ్ ఫెర్గూసన్‌ను, టి20 మ్యాచ్ కోసం నిక్ మాడిసన్‌ను ఎంపిక చేశారు. జార్జ్ బెయిలీ ఆసీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టూర్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఒక టి20, ఏడు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. -
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆసీస్ జట్టు ప్రకటన
మెల్బోర్న్: వచ్చే నెలలో భారత్‌తో జరిగే ఏడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా 14 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మైకేల్ క్లార్క్ కెప్టెన్‌గా, బెయిలీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. అయితే వెన్ను నొప్పితో బాధపడుతున్న క్లార్క్ ఈ సిరీస్‌లో పాల్గొనడంపై స్పష్టత లేకపోయినా, గాయం తీవ్రతను బట్టి అతడిని బరిలోకి దించుతామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఎంపిక కాని డేవిడ్ వార్నర్‌కు ఈ సారి కూడా అవకాశం దక్కలేదు. ఇటీవలి యాషెస్ సిరీస్‌లో మెరుగ్గా రాణించిన 35 ఏళ్ల హాడిన్‌కు వన్డేల్లో మరో అవకాశం దక్కింది. ఫామ్‌లో లేని వికెట్ కీపర్ వేడ్ స్థానంలో వెటరన్ బ్రాడ్ హాడిన్‌కు చోటు కల్పించారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆకట్టుకున్నా...లెగ్‌స్పిన్నర్ ఫవాద్ అహ్మద్‌పై వేటు పడింది. అతని స్థానంలో లెఫ్టార్ స్పిన్నర్ డోహర్తిని సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత్, ఆసీస్ మధ్య అక్టోబర్ 10న ఏకైక టి20 మ్యాచ్, అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఏడు వన్డేలు జరుగుతాయి. ఆస్ట్రేలియా జట్టు వివరాలు: క్లార్క్ (కెప్టెన్), బెయిలీ (వైస్ కెప్టెన్), వాట్సన్, ఫించ్, హ్యూస్, వోజెస్, హాడిన్ (వికెట్ కీపర్), హెన్రిక్స్, మ్యాక్స్‌వెల్, మిచెల్ జాన్సన్, ఫాల్క్‌నర్, నాథన్ కౌల్టర్, మెక్కే, డోహర్తి. -
సెంచరీ దిశగా షేన్ వాట్సన్, ఆసీస్ 121/2
యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి ఐదవ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు ధాటిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. లంచ్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. జట్టు స్కోరు 11 పరుగులు ఉండగా 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్ లో ఓపెనర్ వార్నర్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ రోజర్స్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఆతర్వాత క్రీజులో వచ్చిన షేన్ వాట్సన్ ఇన్నింగ్స్ ను ఆరంభించి మూడవ సెంచరీ సాధించే దిశగా ఆటను కొనసాగిస్తున్నాడు. వాట్సన్ 84 పరుగులతో, క్లార్క్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. స్వాన్, అండర్సన్ లకు చెరో వికెట్ లభించింది. ఐదు టెస్టులో సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో వెనుకంజలో ఉంది. 1977 తర్వాత ఒక్క టెస్ట్ లో కూడా విజయం సాధించకుండా సిరీస్ కోల్పోలేదు. చివరి టెస్ట్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా చూస్తొంది. -
సౌరవ్ గంగూలీ గ్రేట్ కెప్టెన్: స్టీవ్ వా
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టును పటిష్టం తీర్చి దిద్దడంలో గంగూలీ పాత్ర అమోఘమని స్టీవ్ వా అన్నాడు. భారత జట్టులో గంగూలీ 'గ్రేట్ కెప్టెన్' అని వ్యాఖ్యానించారు. భారత జట్టును గొప్ప జట్టుగా తీర్చిదిద్దిన ఘనత గంగూలీదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనిలలో ఎవరూ గొప్ప కెప్టెన్లు అని పోల్చమనగా 'ఇద్దరు మంచి కెప్టెన్లే' అని స్టీవ్ వా అన్నాడు. అయితే ఇద్దరు కూడి విభిన్నమైన కెప్టెన్లు అని తెలిపాడు. ప్రస్తుత జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఓ అద్బుతమైన ఫలితాలు వస్తాయని అన్నాడు. ఒకవేళ 2-2 తో సిరీస్ సమానమైతే ఇరు జట్లకు కఠిన పరీక్షగా మారవచ్చు అని తెలిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఆటుపోట్లను ఎదుర్కొంటున్న మైఖెల్ క్లార్క్ కు స్టీవ్ వా బాసటగా నిలిచాడు. ఆసీస్ జట్టులో యువకుల టాలెంట్ కు కొరత లేదని, త్వరలోనే అద్బుతమైన జట్టుగా అవతరిస్తుందని.. అందుకు కొంత సమయం పడుతుంది అని అన్నాడు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉదయన్ సేవాసంస్థ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో స్టీవ్ మాట్లాడారు. కోల్ కతాకు 25 కిల్లో మీటర్ల దూరంలో ఉన్న బరాక్ పూర్ లోని ఉదయన్ నిర్వహణలో స్టీవ్ వా ప్రధాన నిర్వహకుడిగా సేవలందిస్తున్నారు. ఉదయన్ పిల్లలు స్టీవ్ వాను స్టీవ్ దా లేదా స్టీవ్ అంకుల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. 1998 లో కొల్ కతాలో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఉదయన్ కు ఆర్ధికంగా తోడ్పాటును అందిస్తున్నారు. అప్పటి నుంచి ఉదయన్ కు తన సోదరుడు మార్క్, కుటుంబంతో కలిసి ఉదయన్ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నాడు.