మెల్‌బోర్న్: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ వేగంగా కోలుకుంటున్నాడు. తాజా వైద్య నివేదికల ప్రకారం అతనికి శస్త్రచికిత్స అవసరం లేదని తేలింది. దాంతో భారత్‌తో వచ్చే నెల 4న బ్రిస్బేన్‌లో ఆరంభం కానున్న తొలి టెస్టు సమయానికి సిద్ధం కావాలని అతను భావిస్తున్నాడు. ప్రస్తుతం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న క్లార్క్ గాయం తీవ్రత తగ్గిందని తెలిసింది.