'క్లార్క్ కు రిటైర్మెంట్ చిన్న విషయం'
మెల్ బోర్న్: యాషెస్ సిరీస్ కోల్పోయినంత మాత్రానా మైఖేల్ క్లార్క్ ను తక్కువగా చూడబోమని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ అన్నారు. ఈ సిరీస్ తోనే క్లార్క్ క్రీడా జీవితానికి ముగిసిపోదని పేర్కొన్నారు. మైదానంలో అతడు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ఆటతీరును భవిష్యత్ లో స్మరించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. అతడి తరంలో గొప్ప బ్యాట్స్ మెన్ గా వెలిగొందిన వారిలో క్లార్క్ ఒకడని కొనియాడారు.
రోజురోజుకు రాటుదేలిన క్లార్క్ గొప్ప క్రికెటర్ గా ఎదిగాడని, కెరీర్ లో రిటైర్మెంట్ చిన్న విషయమని జేమ్స్ సదర్లాండ్ పేర్కొన్నారు. 34 క్లార్క్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు శనివారం ప్రకటించాడు. ఇంగ్లండ్ చేతిలో తమ జట్టు ఘోరంగా ఓడిపోవడంతో అతడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ సిరీస్ 8 ఇన్నింగ్స్ లో క్లార్క్ 117 పరుగులు మాత్రమే చేశాడు.