ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశంస
ఆంధ్ర క్రికెటర్ ఆరో స్థానంలోనే రావాలని సూచన
సిడ్నీ: ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొడుతున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ప్రశంసలు కురిపించాడు. మెల్‌బోర్న్ టెస్టులో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో క్లార్క్ మాట్లాడుతూ... ‘నితీశ్ జీనియస్. చిన్న వయసులో అతడి ఆటతీరు అమోఘం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చక్కటి సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అతడికింకా 21 ఏళ్లే. ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ ప్రారంభానికి ముందు అతడి గురించి ఎవరూ పెద్దగా ఆలోచించలేదు. కానీ తన ఆటతీరుతో నితీశ్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లను చూసి అతడు భయపడలేదు. అవసరమైన సమయంలో సంయమనం చూపాడు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ అతడు దాన్ని చేసి చూపాడు.
సమయానుకూలంగా బ్యాటింగ్ చేస్తూ పరిణతి చూపాడు. భవిష్యత్తులో అతడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని భావిస్తున్నా. అదే అతడికి మంచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో ఇలాంటి చురుకైన కుర్రాడు లభించడం భారత క్రికెట్‌కు మంచి చేస్తుంది. సిడ్నీ టెస్టులో అందరి దృష్టి అతడిపైనే ఉంటుంది’ అని అన్నాడు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఫామ్ దొరకబుచ్చుకోలేక తంటాలు పడుతున్న టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మను ఉద్దేశించి కూడా క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
జట్టుకు భారమైనట్లు అనిపిస్తే తప్పుకోవడమే మంచిదని అన్నాడు. ‘సిడ్నీ టెస్టు నుంచి రోహిత్‌ను తప్పిస్తారని అనుకోవడం లేదు. కానీ అతడి ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ఈ సిరీస్‌లో అతడి టెస్టు కెరీర్ ముగుస్తుందని అనుకోవడం లేదు. అయితే జట్టును ఇబ్బంది పెడుతూ భారంగా కొనసాగాలని ఏ ఆటగాడు కోరుకోడు’ అని క్లార్క్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment