
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలు గత రెండు రోజులుగా ముస్సోరిలోని ఐటీసీ హోటల్‌లో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సతీసమేతంగా హాజరయ్యాడు. ధోని.. భార్య సాక్షి ధోనితో కలిసి మెహంది, సంగీత్, హల్దీ ఫంక్షన్లలో సందడి చేశాడు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
ఇందులోని ఓ వీడియో నిన్న ఇంటర్నెట్‌ను మొత్తం షేక్ చేసింది. ఇందులో ధోని, పంత్, రైనా కలిసి గ్రూప్‌గా డ్యాన్స్ చేశారు. ధోనిని చాలాకాలం తర్వాత డ్యాన్స్ చేసిది చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఇదే ఫంక్షన్‌కు సంబంధించిన మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోలో ధోని.. భార్య సాక్షితో కలిసి రణబీర్ కపూర్ 2009 బ్లాక్ బస్టర్ "అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ"లోని "తు జానే నా" అనే పాట పాడుతూ కనిపించాడు. పాట పాడుతున్న సమయంలో మ్యూజిక్‌కు తగ్గట్టుగా ఆడాడు. ఆ సమయంలో ధోని ముఖం ఆనందంతో వెలిగిపోతూ కనిపించింది. పక్కనే ధోని భార్య సాక్షి కూడా పాటలో లీనమైపోయి కనిపించింది.
This was my all time favourite song 😭😭.. I was listening this morning also 😭💛!!
Tu Jaane naa 🫶🏻!!pic.twitter.com/Wb3wulVjVL— 𝑻𝑯𝑨𝑳𝑨 (@Vidyadhar_R) March 12, 2025
ధోని దంపతులు లైవ్ మ్యూజిక్ ప్లే అవుతుండగా పెద్ద సంఖ్యలో జనసమూహంతో కలిసి ఆడిపాడారు. ఈ వీడియోను లక్షల సంఖ్యలో లైక్‌లు వస్తున్నాయి. పంత్ సోదరి వివాహ వేడుకల్లో ధోని జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ వేడుకలకు సురేశ్ రైనా కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. వీరిద్దరు సతీసమేతంగా ప్రతి ఈవెంట్‌లో పాల్గొని తెగ హడావుడి చేశారు. ధోని అయితే తమ ఇంట్లో ఫంక్షన్ అన్నట్లు లీనమైపోయి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
Rishabh Pant, MS Dhoni and Suresh Raina dancing at Rishabh Pant's sister's sangeet ceremony 🕺🏻❤️ pic.twitter.com/pw232528w8
— Sandy (@flamboypant) March 11, 2025
ఈ వేడుకలకు ధోని, రైనాతో పాటు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్ హీరోలైన ఈ ఇద్దరూ పంత్ మరియు కొత్తగా పెళ్లైన దంపతులతో కలిసి ఫోటోలకు పోజిచ్చారు. ఈ ఫోటోలు కూడా సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ ఫోటోలో ధోని, గంభీర్ నలుపు రంగు టీ షర్ట్‌లు ధరించి కనిపించారు. ఎప్పడూ రిజర్వగా ఉండే గంభీర్ ఈ వివాహ వేడుకల్లో చాలా ఆనందంగా కనిపించాడు.
గంభీర్.. తాజాగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2013లో ధోని నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు.. 12 ఏళ్ల తర్వాత గంభీర్ ఆథ్వర్యంలో మరోసారి టైటిల్ చేజిక్కించుకుంది. 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా గెలుపులో ధోని, గంభీర్ కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
కాగా, పంత్ సోదరి సాక్షి పంత్ తన చిరకాల ప్రియుడు అంకిత్ చౌదరీని నిన్న (మార్చి 12) ఉదయం మనువాడింది. సాక్షి-అంకిత్ పదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గతేడాది జనవరి 6న వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. సాక్షి ఎంబీఏ పూర్తి చేసి నేషనల్ ఫార్మసీ అసోసియేషన్‌లో పని చేస్తుంది.
ఆమె భర్త అంకిత్ లండన్‌లో వ్యాపారం చేస్తున్నాడు. సాక్షికి సోదరుడు రిషబ్‌తో చాలా బాండింగ్ ఉంది. పంత్‌కు కారు ప్రమాదం జరిగినప్పుడు సాక్షి అన్నీ తానై చూసుకుంది. పంత్ కోలుకుని తిరిగి క్రికెట్ బరిలోకి దిగేందుకు సాక్షి ఎంతో తోడ్పడింది.
Comments
Please login to add a commentAdd a comment