
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal).. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి, నిర్మాత, ఆర్‌జే మహ్‌వశ్ (RJ Mahvash) ప్రేమలో ఉన్నారంటూ కొద్ది నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే డేటింగేనా? ఎందుకిలా తయారయ్యార్రా బాబూ అని మహ్‌వశ్ తలపట్టుకుంది. కట్ చేస్తే ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు వీరిద్దరూ కలిసి వెళ్లారు.
ఓపక్క సంతోషం.. మరోపక్క చికాకు
దీంతో లవ్ గాసిప్స్‌కు మరోసారి ఆజ్యం పోసినట్లైంది. తాజాగా మరోసారి ఈ రూమర్స్‌పై మహ్‌వశ్ ఘాటుగా స్పందించింది. ఈ మధ్యే తనకు ఉత్తమ మెగా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అవార్డు వచ్చింది. అందుకు సంతోషపడుతూనే తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్‌వశ్ ఎంతో గర్విస్తోంది. ఇదే నాకు కావాల్సింది! ఏ తప్పు చేయకుండా, పనికిరాని విషయాలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి అని రాసుకొచ్చింది. డేటింగ్ కథనాలనుద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టిందని తెలుస్తోంది.

భార్యకు చాహల్ విడాకులు!
కాగా టీమిండియా ఆటగాడు యజువేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్ 20న వీరి వివాహం జరిగింది. కానీ ఐదేళ్లకే వీరు తమ దారులు వేరంటూ విడిపోయారు. వీరు విడిపోయాక చాహల్ ఎక్కువగా మహ్‌వశ్‌తో కలిసి కనిపిస్తుండటంతో డేటింగ్ రూమర్స్ పుట్టుకొచ్చాయి.
ఎవరీ ఆర్‌జే మహ్‌వశ్?
మహ్‌వశ్ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్‌జే)గా పని చేస్తోంది.
సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది.
చాహల్‌తో డేటింగ్ కథనాల వల్ల జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల సంఖ్య నేడు 2.3 మిలియన్స్‌కు చేరింది.
నవాజుద్దీన్ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.
హీరోయిన్‌గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది.
చదవండి: కుమారుడితో బ్రహ్మానందం నటించిన సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment