
నటుడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) భోజన ప్రియుడు. ఎక్కడ ఏ వంటకాలు బాగుంటాయని ఇట్టే చెప్పేస్తాడు. ఫుడ్ వ్లాగింగ్ పేరుతో దేశంలోని ప్రసిద్ధ వంటకాలను అన్వేషించి వాటిని అభిమానులకు పరిచం చేస్తూ ఉంటాడు. తాజాగా అతడు ఓ సరదా వీడియో షేర్ చేశాడు. సినిమా సెట్‌లో ఆశిష్ కోసం నటుడు నానా పటేకర్ వంటమనిషిగా మారిపోయాడు.
ఆమ్లెట్ విరిగిపోకుండా ఎలా తిప్పాడంటే?
ఆశిష్‌కు దగ్గరుండి ఆమ్లెట్ వేసిచ్చాడు. అయితే ఒకవైపు కాలిన ఆమ్లెట్‌ను రెండోవైపు తిప్పడానికి ప్లేటు సాయం తీసుకున్నాడు. మొదటగా పాన్‌లో ఆమ్లెట్ వేసి.. ఒకవైపు కాలిన తర్వాత దాన్ని ప్లేటుపై వేశాడు. తర్వాత ఆ ప్లేటుపై ఉన్నదాన్ని తిరిగి పాన్‌లో వేశాడు. ఆమ్లెట్ ముక్కలుగా విరిగిపోకుండా ఈ టెక్నిక్ ఉపయోగించాడన్నమాట. అది చూసి ఆశిష్ ఆశ్చర్యపోయాడు. మొదట ఇది తప్పు పద్ధతి అనుకున్నా, కానీ ఇది యునిక్ టెక్నిక్ అని కొనియాడాడు.
నీ ప్రేమకు పొంగిపోయా..
నానా పటేకర్ వేసిచ్చిన ఆమ్లెట్ చాలా బాగుందంటూ లొట్టలేసుకుని తిన్నాడు. ఆయన ప్రేమకు పొంగిపోయానని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఆశిష్.. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆయన తెలుగులో ఛత్రపతి, గుడుంబా శంకర్, పోకిరి, అన్నవరం, చిరుత, తులసి, అతిథి, అదుర్స్, అలా మొదలైంది, బాద్‌షా, ఆగడు, కిక్ 2, జనతా గ్యారేజ్.. ఇలా అనేక సినిమాల్లో నటించాడు. చివరగా కిల్ అనే హిందీ చిత్రంలో కనిపించాడు.
చదవండి: ఈ ఫీలింగ్ ఎంత బాగుందో.. నమ్రత నోట కూడా అదే: శిల్ప శిరోద్కర్
Comments
Please login to add a commentAdd a comment