విమానంలో.. ముంబై ఇండియన్స్ జట్టుతో ఫొటోలతో ఒక్కరోజులోనే ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది ఓ అమ్మాయి. ముఖ్యంగా ముంబై మాజీ సారథి, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో ఆమె ఉన్న ఫొటో విస్తృతంగా వైరల్ అయింది.
దీంతో ఈ మిస్టరీ గర్ల్ ఎవరా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు!.. మరి ఈ బ్యూటీ ఎవరు?!.. ఆమె పేరు సేజల్ జైస్వాల్. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన సేజల్.. మోడల్‌గా రాణిస్తూ నటిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
యే దిల్ మాంగే మోర్ షోతో 2022లో బుల్లితెరపై అరంగేట్రం చేసిన ఆమె.. ధాకడ్ సినిమాలోనూ మెరిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సేజల్‌కు లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ముంబై ఇండియన్స్ జట్టుతో ఫొటోలు వైరల్ అయిన తర్వాతే చాలా మందికి ఈ ముద్దుగుమ్మ గురించి తెలిసింది.
అయితే, తనకు ‘మిస్టరీ గర్ల్’ అనే ట్యాగే నచ్చిందంటోంది సేజల్. ‘‘ఆ మరుసటి రోజు ఉదయం లేవగానే నా ఫోన్ మొత్తం నోటిఫికేషన్లతో నిండిపోయింది. నేనెవరో తెలియజేసే ఓ రీల్ చూడగానే నేను ఆశ్చర్యపోయాను.
ఏదేమైనా మిస్టర్ గర్ల్‌గానే ఉండి ఉంటే మరింత సరదాగా ఉండేది’’ అని సేజల్ జైస్వాల్ చెప్పుకొచ్చింది. ఇక ఆరోజు తనకు ముంబై జట్టుతో ఫొటోలు దిగే అవకాశం రావడం గురించి చెబుతూ.. ‘‘చార్టెర్డ్ ఫ్లైట్స్ పీఆర్ కన్సల్టెంట్‌గా ఉన్నాను.
అందుకే ఐపీఎల్ జట్లతో మమేకం అయ్యే అవకాశం నాకు ఉంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి టీమ్‌లను కలవచ్చు. క్రికెట్ అభిమానిగా.. నేరుగా వాళ్లందరినీ కలుసుకోవడం అద్భుతంగా అనిపిస్తోంది’’ అని సేజల్ పేర్కొంది.
కాగా ఐపీఎల్-2024 ఎడిషన్ మార్చి 22న మొదలైన విషయం తెలిసిందే. అదే రోజు తాను లక్నో జట్టుతో కలిసి ఉన్న ఫొటోలను సేజల్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. అనంతరం మార్చి 26న ముంబై టీమ్‌తో ఉన్న వీడియో పంచుకోగా ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది.
ఆరోజు.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ సహా కోచ్ లసిత్ మలింగ.. ఇలా అందరికతో సేజల్ ఫొటోలు దిగింది. ఇదిలా ఉంటే.. ముంబైకి ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో ఇంత వరకు ఒక్క విజయం కూడా దక్కలేదు.
ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓడి హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. ఫలితంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తోంది. మరోవైపు.. లక్నో జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: నా గురువు.. సర్వస్వం: టీమిండియా మాజీ క్రికెటర్ వల్లే ‘హీరో’గా!
Comments
Please login to add a commentAdd a comment