
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధన శ్రీ వర్మ (Dhanashree Verma) విడిపోతున్నారంటూ ఈ ఏడాది ఆరంభం నుంచి పుకార్లు ఊపందుకున్నాయి. చివరకు ఆ పుకార్లను నిజం చేస్తూ ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఇటీవలే వీరికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ జంట డివోర్స్ తీసుకోనుంది అన్నప్పటినుంచి చాలామంది ధనశ్రీని టార్గెట్ చేశారు.
ప్రతిసారి అమ్మాయిదే తప్పా?
చాహల్‌ను ఒంటరిని చేసిందని, ధనశ్రీ ఏదో తప్పు చేసుంటుందని.. రకరకాలుగా విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో సోషల్ మీడియా సెన్సేషన్, నటి ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) ధనశ్రీకి మద్దతుగా నిలిచింది. చాహల్ జీవితాన్ని ధనశ్రీ నాశనం చేసిందన్న పోస్టుపై ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రికెటర్ బ్రేకప్ చెప్పినప్పుడు, విడాకులు తీసుకుంటున్నప్పుడల్లా అమ్మాయిదే తప్పని ముద్ర వేస్తారు. ఆమెపైనే నిందలేస్తారు. ఎందుకంటే మనకు క్రికెటర్ అంటే హీరో కదా!
మీకు గుర్తుందా?
నిజంగా ఆ జంటల మధ్య ఏం జరిగిందనేది మనకెవరికీ తెలియదు. విరాట్ సరిగా ఆడకపోయినా కూడా అనుష్కదే తప్పన్నారు. మీకు గుర్తుందో, లేదో మరి! అంటే అక్కడ మగవాడు ఏం చేసినా అందుకు మహిళలే కారణం.. ఈ అబ్బాయిలేం చిన్నపిల్లలు కాదు. వాళ్లేం చేస్తున్నారో వారికి అన్నీ బాగా తెలుసు అని రాసుకొచ్చింది.
ధనశ్రీకి సపోర్ట్ చేశానని..
ఈ పోస్ట్ చూసిన ధనశ్రీ తనకు థాంక్స్ చెప్పిందంటోంది ఉర్ఫీ జావెద్. తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఈ విడాకుల వ్యవహారంలో ధనశ్రీని దారుణంగా చిత్రీకరించారు. అప్పుడామెకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశాను. అప్పటికే బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ఆమె అది చూసి నాకు కృతజ్ఞతలు తెలియజేసింది అని తెలిపింది.
చదవండి: దారి తెలీక ఆగిపోయా.. అప్పుడు సమంత సాయం చేయడం వల్లే..: నటుడు
Comments
Please login to add a commentAdd a comment