RJ Mahvash
-
చాహల్.. వావ్ వాట్ ఏ టాలెంట్ మ్యాన్: మహవాష్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో కేకేఆర్‌పై 16 పరుగుల తేడాతో పంజాబ్ చారిత్రత్మక విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్నిడిఫెండ్ చేసుకుని పంజాబ్ చరిత్రను తిరిగ రాసింది. పంజాబ్ విజయంలో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ది కీలక పాత్ర. చాహల్ తన స్పిన్ మ్యాజిక్‌తో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. రహానే, రింకూ సింగ్, రమణ్‌దీప్, రఘువన్షి వంటి కీలక వికెట్లను పడగొట్టి కేకేఆర్‌ను దెబ్బతీశాడు. ఫలితంగా స్వల్ప లక్ష్య చేధనలో కేకేఆర్ 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప టార్గెట్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇక చాహల్ అద్భుత ప్రదర్శనపై అతడి రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహవాష్ స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లెగ్ స్పిన్నర్‌ను ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేసింది. చాహల్‌తో కలిసి ఉన్న ఫోటోను అప్ లోడ్ చేసిన మహవాష్.. ‘వావ్ వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్. అందుకే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచావు. అసంభవ్’ అంటూ క్యాప్షన్ జత చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ధనశ్రీ వర్మతో చాహల్ విడాకులు తీసుకున్న తర్వాత మహవాష్‌తో ప్రేమయాణం కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లను చాహల్, మహ్వశ్ కలిసి వీక్షించడం, అతడు ఆడే మ్యాచ్‌లకు ఆమె హాజరవడం వంటివి ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే వారు మాత్రం తాము కేవలం స్నేహితులు మాత్రమే అని ఓ సందర్భంగా చెప్పకొచ్చారు.చదవండి: శ్రేయస్ అయ్యర్‌పై సర్వత్రా ప్రశంసలు -
చాహల్‌తో డేటింగ్ నిజమేనా? ఆర్జే మహ్వాష్ (ఫోటోలు)
-
చాహల్‌తో ఆర్జే మహ్వశ్ డేటింగ్.. కన్ఫార్మ్ చేసేసింది!
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్వశ్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. వరుస ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కనిపించి తెగ సందడి చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈమె పేరు మరింత హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇటీవల లక్నోలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించిన ముద్దుగమ్మ.. తాజాగా పంజాబ్‌లోని చండీఘర్‌లో జరిగిన మ్యాచ్‌లో మెరిసింది. అయితే ఏకంగా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో సెల్ఫీ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.గత కొద్ది రోజులుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ ఇటీవలే చాలాసార్లు కథనాలొచ్చాయి. ఛాంపియన్ ట్రోఫీ తర్వాతే వీరిపై రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. అయితే ఐపీఎల్ లీగ్‌తో యుజ్వేంద్ర చాహల్ టీమ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్‌కు ఆర్జే మహ్వశ్ హాజరు కావడం చూస్తుంటే వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తాజా పోస్ట్‌లో ఈ మ్యాచ్‌కు నీకోసమే వచ్చానంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే చాహల్‌తో డేటింగ్ ఉన్నమాట నిజమేనని తెలుస్తోంది. ఇక వారి నుంచి అఫీషియల్ ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది.ఆర్జే మహ్వశ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నీ వెనకాల ఉండి మద్దతు ఇచ్చే వారిలో మేము కూడా నీ వెనక రాయిలా నిలబడి ఉన్నాం. నీకు మద్దతు ఇవ్వడం కోసమే మేమంతా ఇక్కడికి వచ్చాం అంటూ పోస్ట్ చేసింది. స్టేడియంలో తన స్నేహితులతో పాటు మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
'అతనే నా భర్త కూడా'.. ఆర్జే మహ్వశ్ వీడియో వైరల్!
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్వశ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మొదలైన చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో దుబాయ్ స్టేడియంలో మెరవడంతో ఒక్కసారిగా వీరిద్దరిపై చర్చ మొదలైంది. ఈ జంట డేటింగ్ ఉన్నారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆర్జే మహ్వశ్ వార్తల్లో నిలిచింది. ఇటీవల లక్నోలోని ఓ హోటల్లో స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే చాహల్ ఐపీఎల్ మ్యాచ్ కోసమే తాను అక్కడికి వెళ్లిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తనపై వస్తున్న డేటింగ్ వార్తల నేపథ్యంలో తాజాగా ఆర్జే మహ్వశ్ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్ చేసిన రీల్లో తన జీవితంలో రాబోయే వ్యక్తి గురించి ప్రస్తావించింది. నా లైఫ్‌లోకి వచ్చిన వ్యక్తే నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌తో పాటు తనే నా భర్త కూడా అవుతాడు.. అంతేకాదు నేను అతని చుట్టూ తిరుగుతానంటూ మాట్లాడింది. అయితే ఈ వీడియోకు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ లైక్ కొట్టాడు. దీంతో మీ జీవితంలో యుజ్వేంద్ర చాహల్ రాబోతున్నారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే చాహల్‌కు తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన మ్యాచ్ కోసం ఆర్జే మహ్వశ్ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్జే వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇలా దొరికిపోయిందేంటి?
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్వశ్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ తర్వాత అందరి దృష్టి ఆమెపైనే పడింది. అంతవరకు ముక్కు మొహం తెలియని ఆమె గురించి నెటిజన్స్ తెగ వెతికారు. ఇంతకీ ఆమె ఎవరంటూ ఆరా తీశారు. దీనికంతటికీ కారణం ఆ టీమిండియా క్రికెటరే. అతనితో కలిసి మ్యాచ్‌లో కనిపించడంతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేసింది. టీమిండియా స్పిన్నర్ చాహల్‌తో కలిసి ఛాంపియన్ ట్రోఫీలో సందడి చేసింది. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక సందర్భంలో టాక్ వినిపిస్తూనే ఉంది. అంతేకాకుండా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి ఆర్జే మహ్వశ్ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి చాహల్‌తో కలిసి మాత్రం కనిపించలేదు. అతని ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం లక్నోలో వాలిపోయింది ముద్దుగుమ్మ. నగరంలో ప్రముఖ హోటల్లో ఆర్జే మహ్వశ్ ఈత కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.అయితే చాహల్‌తో డేటింగ్ రూమర్స్ వస్తున్న వేళ.. ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్జే మహ్వశ్ రావడంతో మరోసారి వీరిద్దరిపై రిలేషన్‌పై టాక్ నడుస్తోంది. నిజంగానే ఈ జంట డేటింగ్లో ఉన్నారా? అనే చర్చ మొదలైంది. కాగా.. చాహల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లీగ్ ఆడుతున్నారు. ఇటీవలే తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు కూడా తీసుకున్నారు. మార్చి 20, 2025న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.లక్నోలో ఆర్జే మహ్వశ్ కనిపించడంతో చాహల్‌తో డేటింగ్ నిజమేనంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్, లక్నో మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఆమె కనిపించడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. మీ రిలేషన్‌షిప్‌ను ఇంకెన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచతారని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.ఎవరీ ఆర్జే మహ్వశ్?ఆర్జే మహ్వశ్ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్జే)గా పని చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది. చాహల్‌తో డేటింగ్ కథనాలు రావడంతో జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల ఒక్కసారిగా అమాంతం పెరిగింది. అంతేకాకుండా నవాజుద్దీన్ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. వీటితో పాటు హీరోయిన్గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. -
ధనశ్రీకి చహల్ కౌంటర్?.. ఆ మాటలకు అర్థం ఏమిటి? మధ్యలో ఆమె!
టీమిండియా స్టార్ క్రికెటర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal)- యూట్యూబర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. గత కొంతకాలంగా వేరుగా ఉంటున్న ఈ జంటకు విడాకులు మంజూరు అయ్యాయి. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం (మార్చి 20) ఈ మేరకు తుదితీర్పును వెల్లడించింది.ఈ నేపథ్యంలో చహల్ - ధనశ్రీ వేర్వేరుగా కోర్టుకు హాజరయ్యారు. విడాకుల అనంతరం వీరిద్దరు బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో చహల్ ధరించిన షర్టుపై ఉన్న సామెత నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.ధనశ్రీకి చహల్ కౌంటర్?'Be your own sugar daddy' అని రాసి ఉన్న నలుపు రంగు కస్టమైజ్డ్ షర్టును చహల్ వేసుకున్నాడు. ఈ సామెతకు.. ‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’’ అనే అర్థం ఉంది. ఈ నేపథ్యంలో చహల్ తన మాజీ భార్య ధనశ్రీకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ షర్టు ధరించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ పాఠాలు నేర్చుకున్న చహల్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో 2020, డిసెంబరులో ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. ధనశ్రీ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తూ ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకుంటోంది.ఈ క్రమంలో వీరిద్దరు రీల్స్‌లో కనిపిస్తూ అభిమానులకు కనువిందు చేయడంతో పాటు.. టీమిండియా, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం చహల్ వెంట వెళ్లిన ఫొటోలు కూడా పంచుకునేది. అయితే, కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ధనశ్రీ ‘చహల్’ పేరును తీసివేసింది. దీంతో విడాకుల వార్తలు తెరమీదకు వచ్చాయి.ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూఆ తర్వాత ఇద్దరూ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించడంతో వీటికి మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో తాజాగా బాంద్రా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేయడంతో.. వదంతులు నిజమేనని తేలాయి. ఇక విడాకుల నేపథ్యంలో ధనశ్రీకి చహల్ రూ. 4.75 కోట్ల భరణం చెల్లించేందుకు అంగీకరించాడు. ఇందులో ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్లకు పైగా ముట్టజెప్పినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో చహల్.. ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూ ధనశ్రీకి హితవు పలికేలా ఈ సామెత ఉన్న షర్టును ధరించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ధనశ్రీ గతంలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు వైరల్ కాగా.. అతడి పేరుతో ఆమెను ముడిపెట్టారు. నిజానికి శ్రేయస్ సోదరి శ్రేష్ట కూడా కొరియోగ్రాఫర్ కావడం.. ధనశ్రీకి ఆమె స్నేహితురాలు కావడం వల్ల శ్రేయస్‌తో ఆమె డాన్స్ చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.మధ్యలో ఆమె!అయితే, చహల్ ప్రస్తుతం ఆర్జే మహవశ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో కలిసి డిన్నర్ పార్టీలకు వెళ్లడం, ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 సమయంలోనూ మహవశ్‌తో జంటగా కనిపించడం ‘ప్రేమ’ వార్తలకు ఊతమిచ్చాయి. ఇక చహల్- ధనశ్రీ విడాకుల వేళ మహవశ్ కూడా.. ‘‘అబద్ధాలు, అత్యాశ, అబద్ధపు ప్రచారాలు.. దేవుడి దయవల్ల వీటన్నింటికీ అతీతంగా నిలబడగలుగుతున్నాం’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇందుకు నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది. చహల్- ధనశ్రీ మధ్య విభేదాలకు కారణం ఏమిటన్నది ఇప్పుడు అర్థమైందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ‘కొత్త వదినతోనైనా జాగ్రత్త’ అంటూ మరికొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు.చదవండి: IPL 2025: ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
వద్దంటున్నా క్రికెటర్ చాహల్‌తో లింక్.. అసలెవరీ ఆర్జే మహ్వశ్?
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal).. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటి, నిర్మాత, ఆర్జే మహ్వశ్ (RJ Mahvash) ప్రేమలో ఉన్నారంటూ కొద్ది నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే డేటింగేనా? ఎందుకిలా తయారయ్యార్రా బాబూ అని మహ్వశ్ తలపట్టుకుంది. కట్ చేస్తే ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు వీరిద్దరూ కలిసి వెళ్లారు.ఓపక్క సంతోషం.. మరోపక్క చికాకుదీంతో లవ్ గాసిప్స్‌కు మరోసారి ఆజ్యం పోసినట్లైంది. తాజాగా మరోసారి ఈ రూమర్స్‌పై మహ్వశ్ ఘాటుగా స్పందించింది. ఈ మధ్యే తనకు ఉత్తమ మెగా ఇన్ఫ్లుయెన్సర్గా అవార్డు వచ్చింది. అందుకు సంతోషపడుతూనే తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్వశ్ ఎంతో గర్విస్తోంది. ఇదే నాకు కావాల్సింది! ఏ తప్పు చేయకుండా, పనికిరాని విషయాలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి అని రాసుకొచ్చింది. డేటింగ్ కథనాలనుద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టిందని తెలుస్తోంది.భార్యకు చాహల్ విడాకులు!కాగా టీమిండియా ఆటగాడు యజువేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్ 20న వీరి వివాహం జరిగింది. కానీ ఐదేళ్లకే వీరు తమ దారులు వేరంటూ విడిపోయారు. వీరు విడిపోయాక చాహల్ ఎక్కువగా మహ్వశ్తో కలిసి కనిపిస్తుండటంతో డేటింగ్ రూమర్స్ పుట్టుకొచ్చాయి.ఎవరీ ఆర్జే మహ్వశ్?మహ్వశ్ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్జే)గా పని చేస్తోంది.సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది.చాహల్‌తో డేటింగ్ కథనాల వల్ల జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల సంఖ్య నేడు 2.3 మిలియన్స్‌కు చేరింది.నవాజుద్దీన్ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.హీరోయిన్గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) చదవండి: కుమారుడితో బ్రహ్మానందం నటించిన సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే?