అతియా శెట్టి ప్రెగ్నెంట్‌? హింటిచ్చిన తండ్రి! | Athiya Shetty, KL Rahul to be parents? Suniel Shetty Hints | Sakshi
Sakshi News home page

Athiya Shetty-KL Rahul: త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్‌? ఆ కామెంట్స్‌ అర్థమదేనా..?

Published Sun, Mar 31 2024 9:23 PM | Last Updated on Mon, Apr 1 2024 10:08 AM

Athiya Shetty, KL Rahul to be parents? Suniel Shetty Hints - Sakshi

బాలీవుడ్‌ నటి అతియా శెట్టి, క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పెళ్లి చేసుకుని ఏడాది కావస్తోంది. ఉన్నపళంగా అతియా త్వరలో తల్లి కాబోతోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికిప్పుడు ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్‌ ఎలా పుట్టుకొచ్చాయనుకుంటున్నారా? దానికి కారణం అతియా తండ్రి, నటుడు సునీల్‌ శెట్టి!

నెక్స్ట్‌ సీజన్‌కు తాతయ్యగా..
సునీల్‌ శెట్టి డ్యాన్స్‌ దీవానె డ్యాన్స్‌ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఓ ఎపిసోడ్‌కు గ్రాండ్‌ మస్తి విత్‌ గ్రాండ్‌ పేరెంట్స్‌ అనే థీమ్‌ పెట్టారు. ఈ షోలో కమెడియన్‌ భారతీ సింగ్‌.. సునీల్‌ సర్‌.. మీకు మనవడో, మనవరాలో పుట్టి తాతయ్యవి అయిపోయాక ఎలా ఉంటావ్‌? అని అడిగింది. అందుకు నటుడు.. నెక్స్ట్‌ సీజన్‌లో నేను తాతయ్యనయ్యాక ఇదే స్టేజీపై నడుస్తాను అని చెప్పాడు.

త్వరలోనే గుడ్‌న్యూస్‌!
ఆయన సరదాగా అన్నారో, సీరియస్‌గా అన్నారో కానీ చాలామంది నిజంగానే ఈ నటుడు తాతగా ప్రమోషన్‌ పొందబోతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే అతియా- రాహుల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పనున్నారని, ఆరోజు కోసం కోసం వెయిటింగ్‌ అంటూ ఎవరికి తోచినట్లు వారు ఊహించేసుకుంటున్నారు. ప్రస్తుతం అతియా ప్రెగ్నెంట్‌ కావచ్చని భావిస్తున్నారు. కాగా అతియా- రాహుల్‌ గతేడాది జనవరి 23న పెళ్లి చేసుకున్నారు.

చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌కు అమ్మ నగలు గిఫ్టిచ్చేవాడిని.. పెళ్లిలో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement