భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆసీస్ జట్టు ప్రకటన
మెల్‌బోర్న్: వచ్చే నెలలో భారత్‌తో జరిగే ఏడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా 14 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మైకేల్ క్లార్క్ కెప్టెన్‌గా, బెయిలీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. అయితే వెన్ను నొప్పితో బాధపడుతున్న క్లార్క్ ఈ సిరీస్‌లో పాల్గొనడంపై స్పష్టత లేకపోయినా, గాయం తీవ్రతను బట్టి అతడిని బరిలోకి దించుతామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఎంపిక కాని డేవిడ్ వార్నర్‌కు ఈ సారి కూడా అవకాశం దక్కలేదు.
ఇటీవలి యాషెస్ సిరీస్‌లో మెరుగ్గా రాణించిన 35 ఏళ్ల హాడిన్‌కు వన్డేల్లో మరో అవకాశం దక్కింది. ఫామ్‌లో లేని వికెట్ కీపర్ వేడ్ స్థానంలో వెటరన్ బ్రాడ్ హాడిన్‌కు చోటు కల్పించారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆకట్టుకున్నా...లెగ్‌స్పిన్నర్ ఫవాద్ అహ్మద్‌పై వేటు పడింది. అతని స్థానంలో లెఫ్టార్ స్పిన్నర్ డోహర్తిని సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత్, ఆసీస్ మధ్య అక్టోబర్ 10న ఏకైక టి20 మ్యాచ్, అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఏడు వన్డేలు జరుగుతాయి.
ఆస్ట్రేలియా జట్టు వివరాలు: క్లార్క్ (కెప్టెన్), బెయిలీ (వైస్ కెప్టెన్), వాట్సన్, ఫించ్, హ్యూస్, వోజెస్, హాడిన్ (వికెట్ కీపర్), హెన్రిక్స్, మ్యాక్స్‌వెల్, మిచెల్ జాన్సన్, ఫాల్క్‌నర్, నాథన్ కౌల్టర్, మెక్‌కే, డోహర్తి.