చరిత్రపై ఇంగ్లండ్ గురి | On the history aim England | Sakshi
Sakshi News home page

చరిత్రపై ఇంగ్లండ్ గురి

Published Thu, Aug 20 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

చరిత్రపై ఇంగ్లండ్ గురి

చరిత్రపై ఇంగ్లండ్ గురి

♦ నేటి నుంచి యాషెస్ ఆఖరి టెస్టు 
♦ క్లార్క్, రోజర్స్‌లకు చివరి మ్యాచ్
 
 లండన్ : ఇప్పటి వరకూ ఇంగ్లండ్ జట్టు సొంతగడ్డపై యాషెస్ సిరీస్‌లో ఎప్పుడూ నాలుగు టెస్టులు గెలవలేదు. ఈ అరుదైన ఘనతను సాధించి చరిత్రలో నిలిచి పోవాలని అలిస్టర్ కుక్ సారథ్యంలోని యువ జట్టు ఆశపడుతోంది. యాషెస్‌ను ఇప్పటికే 3-1తో సొంతం చేసుకున్న ఇంగ్లండ్... గురువారం నుంచి జరిగే ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించాలనే తపనతో ఉంది. మరోవైపు వరుస ఘోర పరాభవాల నేపథ్యంలో టెస్టు క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. అలాగే ఓపెనర్ రోజర్స్‌కు కూడా ఇదే చివరి మ్యాచ్.  ఈ మ్యాచ్‌లో గెలిచి తమ దిగ్గజ క్రికెటర్ క్లార్క్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలనేది ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆలోచన.
 
 మ. గం. 3.30 నుంచి  స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement