వివాదాన్ని ముగించడం సంతోషంగా ఉంది: క్లార్క్
బెంగళూరు టెస్టులో చోటు చేసుకున్న డీఆర్‌ఎస్ వివాదాన్ని ఇరు దేశాల బోర్డులు త్వరగా ముగించి మంచి పని చేశాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంతోషం వ్యక్తం చేశాడు. 2007–08 ఆస్ట్రేలియా పర్యటనలో ‘మంకీగేట్’ వివాదాన్ని ఆండ్రూ సైమండ్స్ అంతగా సాగదీయాల్సింది కాదని అతను అభిప్రాయపడ్డాడు. క్లార్క్ ఆటోబయోగ్రఫీ ‘మై స్టోరీ’ని భారత మాజీ కెప్టెన్ గంగూలీ కోల్‌కతాలో మంగళవారం విడుదల చేశాడు.