టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. పృథ్వీ షా.. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి అద్భుతమైన ఆటగాడని మైకేల్ క్లార్క్ కొనియాడాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్ షాపై నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వాలని అతడు తెలిపాడు. పృథ్వీ షా.. సెహ్వాగ్ లాంటి అద్భుతమైన ఆటగాడు.ఒక జెండరీ క్రికెటర్. అతడు క్రీజులో ఉంటే స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. నాకు సెహ్వాగ్ లాంటి క్రికెటర్‌లు అంటే చాలా ఇష్టం. పృథ్వీ షా కూడా సెహ్వాగ్ లాంటి దూకుడు గల బ్యాటర్. కాబట్టి టీమిండియా, అతనిపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇస్తే చాలా బాగుంటుంది.
అతడికి ఇంకా చాలా కేరిర్ ఉంది. అతనికి కాస్త సమయం కావాలి. ఆస్ట్రేలియా టూర్‌లో అతను ఒకే మ్యాచ్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడని అతడికి మళ్లీ ఇవ్వలేదు. అతడికి అదే తొలి ఆస్ట్రేలియా పర్యటన. అతడి భారత జట్టులోకి తిరిగి వస్తాడనడంలో సందేహం లేదు" అని క్లార్క్ పేర్కొన్నాడు. కాగా గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన షా ఒకే ఒక టెస్ట్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
చదవండి: IPL 202 Mega Auction: "వేలంలో అతడి కోసం 10 జట్లు పోటీ పడడం ఖాయం"
Comments
Please login to add a commentAdd a comment