టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనపై ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆశాజనకమైన జోస్యం చెప్పాడు. మెగా టోర్నీలో భారత్ పెను ప్రమాదకారిగా మారబోతుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు టీమిండియా నుంచి ముప్పు పొంచి ఉంటుందని అన్నాడు. భారత్.. ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బ తీయవచ్చని అంచనా వేశాడు. ఓవరాల్‌గా టీమిండియాకే ఈసారి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ బ్యాటర్లలో ట్రవిస్ హెడ్ నుంచి మెరుపు ప్రదర్శనలు ఆశిస్తున్నట్లు తెలిపాడు.
క్లార్క్ ఓ పక్క టీమిండియాను గొప్పగా చూపుతూనే భారత సెలెక్టర్లు ఓ విషయంలో పెద్ద సాహసం చేశారని అన్నాడు. ప్రపంచకప్ జట్టుకు నలుగురు స్పిన్నర్లను (జడేజా, అక్షర్, కుల్దీప్, చహల్) ఎంపిక చేయడం ద్వారా టీమిండియా స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడుతుందన్న సందేశాన్ని పంపారని అన్నాడు. క్లార్క్‌కు ముందు చాలామంది దిగ్గజ క్రికెటర్లు, విశ్లేషకులు ఈ సారి టీమిండియానే టైటిల్ నెగ్గుతుందని జోస్యం చెప్పారు. మరి రియల్టీలో టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.
కాగా, టీ20 ప్రపంచకప్ 2024 ఎడిషన్ జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ-కెనడా జట్లు తలపడనున్నాయి. మెగా టోర్నీలో భారత్ ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరుబోయే మ్యాచ్‌తో మొదలవుతుంది. జూన్ 9న టీమిండియా.. దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. మరోవైపు ఆసీస్ సైతం జూన్ 5నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆసీస్.. ఒమన్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment