
ప్రపంచకప్‌తొలి మ్యాచ్‌కు మైకేల్ క్లార్క్ దూరం!
తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్‌కు మరో షాక్ తగిలింది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచకప్‌లో తొలి వన్డేకు అతను దూరం కానున్నాడు.
మెల్‌బోర్న్: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్‌కు మరో షాక్ తగిలింది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచకప్‌లో తొలి వన్డేకు అతను దూరం కానున్నాడు.
ఈ విషయాన్ని స్వయంగా అతనే ధ్రువీకరించాడు. ‘మొదటి మ్యాచ్‌లోగా నేను 100 శాతం ఫిట్‌గా ఉండలేనేమో. అయితే ప్రపంచకప్‌లో ఇతర మ్యాచ్‌లకు నేను అందుబాటులో ఉండగలను’ అని క్లార్క్ చెప్పాడు. ప్రపంచకప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరుగుతుంది.