ప్రపంచ క్రికెట్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ జట్టు ఫార్మాట్లకతీతంగా వరుస టైటిల్స్ సాధిస్తూ ప్రపంచ క్రికెట్‌ను శాశిస్తుంది. ఇటీవలికాలంలో జరిగిన అన్ని మెగా ఈవెంట్ల ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా హవా పురుషుల క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు.
మహిళ క్రికెట్‌లోనూ ఈ జట్టు డామినేషనే నడుస్తుంది. తాజాగా ఆస్ట్రేలియన్లు జూనియర్ విభాగంలోనూ సత్తా చాటారు. ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో యువ ఆసీస్ జట్టు యంగ్ ఇండియాను చిత్తు చేసి ఈ విభాగంలో నాలుగోసారి జగజ్జేతగా అవతరించింది. అండర్ 19 టైటిల్‌తో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో (పురుషులు, మహిళలు, జూనియర్ లెవెల్) వరల్డ్ ఛాంపియన్‌గా (వన్డే ఫార్మాట్‌లో) అవతరించింది.
- వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా
- అండర్ 19 వరల్డ్‌కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా
- మహిళల వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా
- మహిళల టీ20 ఛాంపియన్-ఆస్ట్రేలియా
- వరల్డ్ టెస్ట్ ఛాంపియన్-ఆస్ట్రేలియా
ఇదిలా ఉంటే, అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో కుర్ర ఆస్ట్రేలియా జట్టు యంగ్ ఇండియాను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యంగ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు గుండెకోతను మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment