
వచ్చే ప్రపంచకప్ కు అందుబాటులో ఉంటా:క్లార్క్
మెల్ బోర్న్: వచ్చే ప్రపంచకప్ కు తాను అందుబాటులో ఉంటానని ఆసీస్ క్రికెటర్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. టీమిండియాతో జరిగిన తొలి టెస్ట్ లో అతని గాయం మళ్లీ తిరగబెట్టడంతో సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్లార్క్ భవితవ్యంపై పలు అనుమానాలు తలెత్తడంతో తాజాగా అతను స్పందించాడు.
'నేను వచ్చే సంవత్సరం జరిగే మ్యాచ్ లకు అందుబాటులో ఉంటా. ప్రపంచకప్ లో కూడా ఆడతా' అని ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో వంద శాతం ఫిట్ నెస్ గా లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆసీస్ సెలెక్టర్లు ప్రపంచకప్ ఆటగాళ్ల జాబితాలో తనకు అవకాశం కల్పిస్తారని క్లార్క్ ఆశాభావం వ్యక్తం చేశాడు.