అహ్మదాబాద్: అనుకున్నట్లుగానే చక్కని ప్రణాళికతో, స్వల్పకాల రిహార్సల్స్‌తో భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ చేసిన ఏయిర్ షో లక్షమందికి పైగా ప్రేక్షకుల్ని కన్నార్పకుండా చేసింది. తొమ్మిది హాక్ ఎంకే–132 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కూడా బృందం నరేంద్ర మోదీ స్టేడియంపై చరిత్ర సృష్టించింది.
లక్షా 32 వేల మంది జేజేలతో విన్యాసాలను ఆస్వాదించారు. సూర్యకిరణ్ టీమ్ వైమానిక విన్యాసాలు కొత్త కాకపోయినా... ఓ క్రికెట్ స్టేడియంపై ఎయిర్‌షో చేయడమే కొత్త. గతంలో క్రికెట్ అనే కాదు... ఏ ఆటకు అంతెందుకు భారత్ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ గేమ్స్ (2010)లోనూ ఇలాంటి విన్యాసాలు చేయలేదు. తద్వారా ఈ ప్రపంచకప్‌కు ఎయిర్ షో కొత్త శోభ తెచ్చినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment