క్లార్క్ వద్దకు చేరిన ‘గద’ | Michael Clarke gets his hands on the Reliance ICC Test mace | Sakshi
Sakshi News home page

క్లార్క్ వద్దకు చేరిన ‘గద’

Published Thu, Jun 5 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

క్లార్క్ వద్దకు చేరిన ‘గద’

క్లార్క్ వద్దకు చేరిన ‘గద’

దుబాయ్: టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించిన జట్టుకు ఐసీసీ ఇచ్చే ‘గద’ ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ వద్దకు చేరింది. బుధవారం బ్రిస్బేన్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న అతను ఈ గదను అందుకున్నాడు.
 
 2009 తర్వాత ఆసీస్‌కు ఈ పురస్కారం దక్కడం ఇదే తొలిసారి. మే నెల ఒకటో తేదీ నాటికి టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న జట్టుకు ఈ గదను అందజేస్తారు. ప్రస్తుతం ఆసీస్, దక్షిణాఫ్రికా 123 రేటింగ్ పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నా... దశాంశమానం తేడాతో కంగారుల జట్టుకు టాప్ ర్యాంక్ దక్కింది. ఆసీస్ గడ్డపైకి గద తిరిగి రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నామని క్లార్క్ అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement