బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు శుక్రవారం(నవంబర్ 22) నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత్ జట్టు ఈ సిరీస్‌ను ఎలా ఆరంభిస్తుందోనని అందరూ అతృతగా ఎదురుచూస్తున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా నేరుగా ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్‌ను 4-1తో ఓడించాలి. మరోవైపు ఈ సిరీస్‌తో భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు భవితవ్యం తేలిపోనుంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాకపోతే ఈ సీనియర్ ద్వయం టెస్టులకు విడ్కోలు పలికే అవకాశముంది.
వీరిద్దరిపైనే కాకుండా భారత హెడ్‌కోచ్‌పై కూడా అందరి కళ్లు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో గంభీర్ కోచింగ్ వ్యూహాలు ఎలా ఉంటాయో అని భారత ప్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో గంభీర్ వైఖరిని క్లార్క్ సమర్థించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్‌ల వల్ల ఆటగాళ్ల మధ్య స్నేహం ఏర్పడి, పోటీతత్వం తగ్గిపోయిందని క్లార్క్ వ్యాఖ్యనించాడు.
"ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు చాలా వచ్చాయి. కాబట్టి వేర్వేరు దేశాల ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలకు ఆడేటప్పుడు ఎక్కువ సమయం కలిసి ఉంటున్నారు. దీంతో ఆటగాళ్ల మధ్య స్నేహం ఏర్పడి, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేటప్పడు ప్రత్యర్ధి ఆటగాళ్లపై దూకుడు చూపలేకపోతున్నారు.
గతంలో మేము ఆడేటప్పుడు ప్రత్యర్ధిలుగానే చూసేవాళ్లం. ఎందుకంటే మేము ఆడేటప్పుడు ఐపీఎల్ వంటి లీగ్‌లు లేవు. ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నప్పటకి దేశం కోసం ఆడేటప్పుడు ఫీల్డ్‌లో దూకుడుగా ఉండాల్సిందే. మైదానంలో మనకు ఎవరూ స్నేహితులు ఉండరు.
ఆఫ్‌ది ఫీల్డ్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఆన్‌ది ఫీల్డ్‌లో మాత్రం ప్రత్యర్థులుగానే చూడాలి. మీరు దేశం కోసం ఆడుతున్నారు, ఒకే ఐపీఎల్ జట్టులో ఆడటం లేదనే సంగతిని గుర్తుంచుకోవాలి. గతంలో భారత జట్టు ఇదే దూకుడు కనబరిచింది. అందుకే గత రెండు పర్యటనలలో ఆస్ట్రేలియాలో భారత్ విజయం సాధించింది. హెడ్ కోచ్ గంభీర్ దూకుడు భారత జట్టుకు మంచిదే. ఆస్ట్రేలియా కూడా అదే మైండ్ సెట్‌తో ఉంది. కాబట్టి ఈ సిరీస్ మరోసారి అభిమానులను మునివేళ్లపై నిలబెట్టనుంది" అని క్లార్క్ పేర్కొన్నాడు.
చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment