సిడ్నీ: ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం గ్రూపు-ఏలో శ్రీలంక తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖలే క్లార్క్, స్టీవెన్ స్మిత్ ఇద్దరూ అర్ధ సెంచరీల అనంతరం స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నంలో ఔటయ్యారు. జట్టు స్కోరు 175 వద్ద క్లార్క్ (68) అవుటవగా, ఆ వెంటనే 177 వద్ద భారీ షాట్ కు ప్రయత్నించిన స్టీవెన్ స్మిత్ (72) దిల్షాన్ బౌలింగ్ లో పెరీరాకు క్యాచ్ ఇచ్చి అవుడయ్యాడు. ఓ దశలో జట్టు స్కోరు 41/2 ఉండగా క్రీజులోకొచ్చిన క్లార్క్, స్మిత్ తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇన్నింగ్స్ ను స్మిత్ తో కలిసి క్లార్క్ మరమ్మతు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 119 బంతుల్లో 100 పరుగులు జోడించారు. 36 ఓవర్లలో 204/4 స్కోరుతో ఆసీస్ బ్యాటింగ్ ను కొనసాగిస్తుంది.